క్వార్టర్స్‌లో వైఎంసీఏ | ymca enters quarters in basket ball tourny | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో వైఎంసీఏ

Published Sat, Aug 20 2016 12:23 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

ymca enters quarters in basket ball tourny

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో సికింద్రాబాద్ క్లబ్, సికింద్రాబాద్ వైఎంసీఏ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ 74- 62తో సెయింట్ మార్టిన్స్ క్లబ్‌పై విజయం సాధించింది.

 

మరో మ్యాచ్‌లో సికిం ద్రాబాద్ వైఎంసీఏ జట్టు 81-70తో సిటీ కాలేజ్ క్లబ్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టు తరఫున పృథ్వీ (30), డేవిడ్ (11) రాణించగా, సిటీ కాలేజ్ జట్టులో ఫణి (26) ఆకట్టుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement