basket ball tourny
-
సెమీస్‌లో బీహెచ్ఈఎల్, ఈగల్స్
సాక్షి, హైదరాబాద్: నవాబ్ షుజాత్ అహ్మద్ ఖాన్ స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో ఈగల్స్, బీహెచ్ఈఎల్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సిటీ కాలేజ్ గ్రౌండ్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో బీహెచ్ఈఎల్ జట్టు 57– 47తో షార్ప్ షూటర్స్ జట్టుపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ షార్ప్ షూటర్స్ యువ ఆటగాళ్లు అద్భుత పోరాట పటిమతో ఆకట్టుకున్నారు. బీహెచ్ఈఎల్ జట్టులో రాజు, రాహుల్ చెలరేగడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 29–22తో ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత అదే జోరును కొనసాగిస్తూ మూడో క్వార్టర్లో 48–30తో ఏకంగా 18 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించింది. చివరిదైన నాలుగో క్వార్టర్లో షార్ప్ షూటర్స్ దీటుగా పోరాడినప్పటికీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. చివరికి 10 పాయింట్ల తేడాతో బీహెచ్ఈఎల్ గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో బీహెచ్ఈఎల్ తరఫున రాజు (13), పాల్ (13) ఆకట్టుకున్నారు. షార్ప్ షూటర్స్ జట్టులో అశ్విన్ 17 పాయింట్లు స్కోర్ చేయగా.. ఒమేర్ 12 పాయింట్లు చేశాడు. ఈగల్స్ జోరు రాజేంద్రనగర్ బాస్కెట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో ఈగల్స్ జట్టు 52– 28తో ఘనవిజయం సాధించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజేంద్రనగర్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఈగల్స్ జట్టులో రోహన్ (21), అమన్ (15) అద్భుత ప్రదర్శన కనబరిచారు. రాజేంద్రనగర్ జట్టు తరఫున సలీమ్ (16) ఒక్కడే చివరి వరకు పోరాడాడు. -
హైదరాబాద్ స్కై ఓటమి
చెన్నై: యూబీఏ బాస్కెట్‌బాల్ లీగ్ నాలుగో సీజన్లో హైదరాబాద్ స్కై జట్టు పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. గురువారం ఇక్కడ జరిగిన హోరాహోరీ పోరులో హైదరాబాద్ స్కై 113–116 స్కోరుతో బెంగళూరు బీస్ట్ చేతిలో పోరాడి ఓడింది. మ్యాచ్ ఆరంభం నుంచే బెంగళూరు ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఈ జట్టు తరఫున విశేష్ (57 పాయింట్లు) చెలరేగాడు. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇతని జోరుతో తొలి రెండు క్వార్టర్లలో బెంగళూరే ఆధిక్యంలో నిలిచింది. మొదట 27–24తో తొలి క్వార్టర్‌ను, తర్వాత 60–53తో రెండో క్వార్టర్‌ను ముగించింది. అయితే హైదరాబాద్ ఎట్టకేలకు మూడో క్వార్టర్లో దూకుడు పెంచింది. దీంతో స్కై 74–68 పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చింది. చివరి క్వార్టర్లో ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో ఉత్కంఠ పెరిగింది. చివరకు మూడు పాయింట్ల తేడాతో బెంగళూరు బీస్ట్ జయకేతనం ఎగురవేసింది. బెంగళూరు జట్టులో విశేష్‌తో పాటు పల్‌ప్రీత్ బ్రార్ (27) రాణించాడు. హైదరాబాద్ తరఫున టెవిన్ కెల్లీ 40 పాయింట్లు చేశాడు. -
బాస్కెట్‌బాల్ విజేత లయోలా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ ఇంటర్ కాలేజ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో లయోలా డిగీ కాలేజ్ (అల్వాల్) విజేతగా నిలిచింది. సిటీ కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించిన ఈ టోర్నీ ఫైనల్లో లయోలా 75-40 స్కోరుతో భవాన్‌స డిగ్రీ కాలేజ్ (సైనిక్‌పురి) పై విజయం సాధించింది. సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సి. మంజులత విజేతలకు బహుమతులు అందజేశారు. నిర్వాహక కార్యదర్శి నర్సింగరావు, సునీల్ కుమార్, జేసీ బాబు, రవిప్రసాద్, వెంకటేశ్వరరావు, రాజేశ్ కుమార్ తదితరులు బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. బాలుర గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 42-21తో బిహార్‌ను ఓడించగా... బాలికల గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 29-46తో ఉత్తర్ ప్రదేశ్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ బాలబాలికల జట్లు శుభారంభం చేశాయి. ఇక్కడి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం మొదలైన ఈ టోర్నమెంట్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. బాలికల గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 41-16తో చండీగఢ్‌ను ఓడించింది. ఆంధ్రప్రదేశ్ తరపున వెంకటలక్ష్మి (17 పాయింట్లు), జాస్మిన్ (10), అంజలి (8) రాణించారు. బాలుర విభాగం గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 58-56తో ఉత్తర్ప్రదేశ్పై గెలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఉపాధ్యక్షులు అజయ్ సూద్, షఫీఖ్ షేక్, తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ నార్మన్ ఐజాక్, హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు ఆర్.శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి జాతీయ సబ్ జూ. బాస్కెట్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి జరిగే ఈ ఈవెం ట్‌కు నగరం ఆతిథ్యమివ్వనుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించేందుకు హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం ఏర్పాట్లు చేసింది. బాలుర కేటగిరీలో 27 జట్లు, బాలికల విభాగంలో 24 జట్లు బరిలోకి దిగనున్నారుు. బాలుర జట్లను ఆరు గ్రూపులుగా విభజించారు. ఇందులో తెలంగాణ గ్రూప్-ఎఫ్‌లో, ఆంధ్రప్రదేశ్ గ్రూప్-ఎలో ఉన్నాయి. బాలికల జట్లను కూడా ఆరు గ్రూపులుగా విభజించగా... తెలంగాణ గ్రూప్-బిలో, ఏపీ గ్రూప్-ఎఫ్‌లో తలపడనున్నారుు. ఏడు రోజుల పాటు జరిగే ఈ పోటీలు 7న జరిగే ఫైనల్స్‌తో ముగుస్తాయి. శనివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో తెలంగాణ బాలుర జట్టు బీహార్‌తో... బాలికల జట్టు ఉత్తరప్రదేశ్‌తో తలపడతాయి. బాలుర జట్లు గ్రూప్-ఎ: మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఓడిశా, కేరళ; గ్రూప్-బి: చత్తీస్‌గఢ్, రాజస్తాన్, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక; గ్రూప్-సి: చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్; గ్రూప్-డి: పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్; గ్రూప్-ఇ: పంజాబ్, గోవా, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్; గ్రూప్-ఎఫ్: తెలంగాణ, బీహార్, ఢిల్లీ, తమిళనాడు. బాలికల జట్లు గ్రూప్-ఎ: చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హరియాణా, రాజస్తాన్; గ్రూప్-బి: తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ; గ్రూప్-సి: ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గ్రూప్-డి: పశ్చిమ బెంగాల్, గోవా, జమ్మూకశ్మీర్; గ్రూప్-ఇ: పంజాబ్, బీహార్, జార్ఖండ్; గ్రూప్-ఎఫ్: చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, ఓడిశా, ఉత్తరాఖండ్. -
విజేత సెయింట్ పాల్
బాస్కెట్ బాల్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సెయింట్ ట్ పాల్ జట్టు విజేతగా నిలిచింది. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో శనివారం జరిగిన ఫైనల్స్‌లో సెయింట్ పాల్ జట్టు 21-06 తేడాతో ఓబుల్ రెడ్డి జట్టును చిత్తుగా ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో సెయింట్ పాల్ జట్టు 8-3తో జెడ్పీహెచ్ఎస్ జట్టుపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో ఓబుల్ రెడ్డి జట్టు 10-6తో డాన్ బాస్కో జట్టుపై నెగ్గింది. -
క్వార్టర్స్‌లో వైఎంసీఏ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సికింద్రాబాద్ క్లబ్, సికింద్రాబాద్ వైఎంసీఏ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ 74- 62తో సెయింట్ మార్టిన్స్ క్లబ్‌పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో సికిం ద్రాబాద్ వైఎంసీఏ జట్టు 81-70తో సిటీ కాలేజ్ క్లబ్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టు తరఫున పృథ్వీ (30), డేవిడ్ (11) రాణించగా, సిటీ కాలేజ్ జట్టులో ఫణి (26) ఆకట్టుకున్నాడు. -
ప్రిక్వార్టర్స్‌లో బాయ్స్ స్పోర్ట్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘బి’ జట్టు ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన లీగ్ మ్యాచ్‌లో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ (బీఎస్సీ) ‘బి’ జట్టు 51-50తో హైదరాబాద్ వైఎంసీఏ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బీఎస్సీ జట్టు తరఫున విఘ్నేశ్ 25 పాయింట్లు, అమన్ 15 పాయింట్లు సాధించారు. హైదరాబాద్ వైఎంసీఏ జట్టులో వినయ్ (22), నరేశ్ (7) పోరాడారు. ఇతర మ్యాచ్‌ల్లో సనత్‌నగర్ క్లబ్ 41-23తో సెయింట్ జోసెఫిన్ క్లబ్‌పై గెలుపొందింది. సనత్‌నగర్ క్లబ్ తరఫున నవీద్ (13), సాయి ప్రకాశ్ (11)... సెయింట్ జోసెఫిన్ క్లబ్ జట్టులో అశుతోష్ (10), దత్త (4) ఆకట్టుకున్నారు. ఎన్పీఏ క్లబ్ 43-39తో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘ఎ’ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఎన్పీఏ తరఫున మనోజ్ (20), భూపేందర్ (15)... బీఎస్సీ ‘ఎ’ జట్టులో ప్రశాంత్ (15), ప్రదీప్ (10) రాణించారు. మరో మ్యాచ్‌లో హూప్‌స్టర్స్ జట్టు 63- 53తో బీహెచ్ఈఎల్ ‘ఎ’ జట్టుపై గెలుపొందింది. హూప్‌స్టర్స్ జట్టు తరఫున రామకృష్ణారెడ్డి (23), వెంకటేశ్ (15)... బీహెచ్ఈఎల్ ‘ఎ’ జట్టులో చైతు (17), తులసి (12) ప్రతిభ కన బరిచారు. -
సికింద్రాబాద్ క్లబ్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సికింద్రాబాద్ క్లబ్ విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ 44-37తో ఒమెగా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సికింద్రాబాద్ తరఫున అమన్ 12 పాయింట్లు, రోహన్ 11 పాయింట్లు సాధించగా... ఒమెగా జట్టు తరఫున అరుణ్ 17 పాయింట్లు, సాయి కుమార్ 12 పాయింట్లతో ఆక ట్టుకున్నారు. ఇతర మ్యాచ్ ల్లో హూప్‌స్టర్స్ క్లబ్ 55-44తో వైఎంసీఏ సికింద్రాబాద్ జట్టును ఓడించింది. హూప్‌స్టర్స్ జట్టు తరఫున వెంకటేశ్ (16), రామకృష్ణా రెడ్డి (21)... వైఎంసీఏ సికింద్రాబాద్ జట్టులో విశాల్ (11), రాజారెడ్డి (10), సోహైల్ ఖాన్ (10) రాణించారు. మరో మ్యాచ్‌లో ఎన్పీఏ జట్టు 52- 36తో జింఖానా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. ఎన్పీఏ జట్టు తరఫున రాహుల్ (15), భూపేందర్ (11), ప్రశాంత్ (10)... జింఖానా జట్టులో ఆమీర్ (17), రెహమాన్ (10) ప్రతిభ కనబరిచారు. 22 నుంచి ఇంటర్ స్కూల్ చాంపియన్‌షిప్ తెలంగాణ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 29 వరకు ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ జరుగనుంది. కులీ కుతుబ్ షా స్టేడియంలో పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అండర్ 8, 10, 12, 14, 16 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు జరుగుతాయి. ఇందులో నగరానికి చెందిన అన్ని పాఠశాలలు పాల్గొనవచ్చు. ఆగస్టు 20లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 9700008253 నంబర్లో సంప్రదించవచ్చు. -
నిజాం బాస్కెట్‌బాల్ అకాడమీ గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో నిజాం బాస్కెట్‌బాల్ అకాడమీ, సెయింట్ జోసెఫిన్ క్లబ్ జట్లు నాకౌట్ పోరుకు అర్హత సాధించాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో నిజాం బాస్కెట్‌బాల్ జట్టు 51-21తో ఆర్బీవీఆర్ రెడ్డి హాస్టల్ జట్టును ఓడించగా... సెయింట్ జోసెఫిన్ జట్టు 38-19తో సిటీ యూత్ జట్టుపై గెలిచింది. నిజాం అకాడమీ తరఫున శామ్సన్ (15), బాలాజీ (10)... ఆర్బీవీఆర్ రెడ్డి హాస్టల్ జట్టులో వెంకటేశ్ (10) ప్రతిభ కనబరిచారు. సెయింట్ జోసెఫిన్ జట్టులో అవ్నీత్ (9), అగ్నివేశ్ (8)... సిటీ యూత్ తరఫున అశ్విన్ (8) రాణించారు. బీహెచ్ఈఎల్ ‘ఎ’ జట్టు 35-27తో నెహ్రునగర్ ప్లేగ్రౌండ్ జట్టుపై విజయం సాధించింది. బీహెచ్ఈఎల్ తరఫున శ్రీకాంత్ (10), తులసి (8)... నెహ్రునగర్ జట్టులో వరుణ్ (10), వసీమ్ (8) మెరిశారు. మరో మ్యాచ్‌లో హాస్టలర్స్ జట్టు 44-32తో సైనిక్‌పురి బాస్కెట్‌బాల్ క్లబ్‌ను ఓడించింది. లవదీప్ (12), నిషిత్ (16) హాస్టలర్స్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా... సైనిక్‌పురి జట్టులో ప్రశాంత్ (14), పాల్ (14) పోరాడారు. -
సీసీఓబీపై వైఎంసీఏ గెలుపు
సాక్షి, హైదారాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో గ్రూప్ ‘ఇ’ విభాగంలో హైదరాబాద్ వైఎంసీఏ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో బుధవారం ఆసక్తి రేకెత్తించిన మ్యాచ్‌లో వైఎంసీఏ జట్టు 49-40తో సీసీఓబీ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో వైఎంసీఏ తరఫున లలిత్ రెడ్డి 20 పాయింట్లు, వినయ్ 10 పాయింట్లు చేయగా... సీసీఓబీ జట్టులో ఫణి 12, నాగరాజ్ 10 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘ఎ’ 42-27తో ఎన్బీఏ ‘బి’ జట్టుపై గెలిచింది. బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ తరఫున ప్రదీప్ సింగ్ (16), విపిన్ (15) అద్భుతంగా రాణించగా... ఎన్బీఏ జట్టులో శేరు (15) ప్రతిభ కనబరిచాడు.