సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో నిజాం బాస్కెట్‌బాల్ అకాడమీ, సెయింట్ జోసెఫిన్ క్లబ్ జట్లు నాకౌట్ పోరుకు అర్హత సాధించాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో నిజాం బాస్కెట్‌బాల్ జట్టు 51-21తో ఆర్బీవీఆర్ రెడ్డి హాస్టల్ జట్టును ఓడించగా... సెయింట్ జోసెఫిన్ జట్టు 38-19తో సిటీ యూత్ జట్టుపై గెలిచింది. నిజాం అకాడమీ తరఫున శామ్సన్ (15), బాలాజీ (10)... ఆర్బీవీఆర్ రెడ్డి హాస్టల్ జట్టులో వెంకటేశ్ (10) ప్రతిభ కనబరిచారు. సెయింట్ జోసెఫిన్ జట్టులో అవ్నీత్ (9), అగ్నివేశ్ (8)... సిటీ యూత్ తరఫున అశ్విన్ (8) రాణించారు.
బీహెచ్ఈఎల్ ‘ఎ’ జట్టు 35-27తో నెహ్రునగర్ ప్లేగ్రౌండ్ జట్టుపై విజయం సాధించింది. బీహెచ్ఈఎల్ తరఫున శ్రీకాంత్ (10), తులసి (8)... నెహ్రునగర్ జట్టులో వరుణ్ (10), వసీమ్ (8) మెరిశారు. మరో మ్యాచ్‌లో హాస్టలర్స్ జట్టు 44-32తో సైనిక్‌పురి బాస్కెట్‌బాల్ క్లబ్‌ను ఓడించింది. లవదీప్ (12), నిషిత్ (16) హాస్టలర్స్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా... సైనిక్‌పురి జట్టులో ప్రశాంత్ (14), పాల్ (14) పోరాడారు.