సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకుని వచ్చింది. శుక్రవారం రాత్రి కొందరు పర్యాటకులు, మత్స్యకారులు ఈ పెట్టెను గమనించారు. దీంతో, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కాగా, అధికారులు రెండు ప్రొక్లెయినర్ సాయంతో భారీ పెట్టెను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో అది చెక్కలతో చేసిన దిమ్మెగా అధికారులు తెల్చారు. కాగా, బీచ్‌లో పడవలకు లంగర్ వేసేందుకు ఉపయోగించే చెక్క దిమ్మె అని ఖరారు చేశారు.
అంతకుముందు.. విశాఖలోని వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకుని వచ్చింది. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకున్నారు. పురాతమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. అలాగే, రాత్రంతా పెట్టెకు పోలీసులు కాపలాగా ఉన్నారు. బీచ్‌లో పెట్టె సమాచారం స్థానికులకు తెలియడంతో దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బందిపడాల్సి వచ్చింది. పోలీసులు పెట్టెను.. బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు. పురాతన పెట్టె ఇలా ఒడ్డుకు వచ్చిందని ఆర్కియాలజీ విభాగానికి పోలీసులు సమాచారం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు...
Comments
Please login to add a commentAdd a comment