Box
-
ఈ పెట్టెల్లో ఏముందో?
కర్ణాటక: శివమొగ్గ నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లో ఆదివారం రెండు పెట్టెలు కలకలం సృష్టించాయి. రేకు పెట్టెలను విడివిడిగా జనపనార సంచిలో కట్టి ఉంచారు. ఆ పెట్టెల దగ్గర ఎవరూ లేకపోవడంతో రైల్వే సిబ్బందికి అనుమానం వచ్చి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వేస్టేషన్‌లోని పార్కింగ్ ప్రదేశం కాంపౌండ్ వద్ద రెండు పెట్టెలు కనిపించాయి. గంటలు గడిచినా ఎవరూ తీసుకోకపోవడంతో స్థానికులకు, రైల్వే సిబ్బందికి అనుమానం వచ్చింది. అలాగే జయనరగ పోలీసులకు కూడా కాల్ చేశారు. పోలీసులు జాగిలాలు, బాంబు తనిఖీ సిబ్బందితో వచ్చి పెట్టెలను తెరవకుండానే పరిశీలించారు. తరువాత వాటిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఒక చిన్న కారులో వచ్చి ఆ పెట్టెలను అక్కడ పెట్టి వెళ్లినట్లు సీసీ కెమెరాలలో రికార్డయింది. -
విశాఖ బీచ్‌లో భారీ చెక్కపెట్టె.. ఇంతకీ ఆ బోషాణంలో ఏముంది?
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సాగర తీరానికి భారీ బోషాణం (చెక్క పెట్టె) కొట్టుకు రావడం కలకలం రేపింది. ఆ పెట్టెలో ఏముందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందులో భారీ ఎత్తున నిధులు ఉండే అవకాశం ఉందని కొందరు.. స్మగ్లర్లు విలువైన వస్తువుల్ని అందులో దాచి ఉంటారని ఇంకొందరు.. శత్రు దేశాలు విధ్వంసం సృష్టించేందుకు పంపించిన బాక్స్ అని మరికొందరు పేర్కొనడంతో శుక్రవారం రాత్రంతా బాంబ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు పహారా కాశారు. శనివారం ఉదయానికి ఈ సమాచారం ఆ నోటా.. ఈ నోటా ప్రచారం కావడంతో భారీ పెట్టెను చూసేందుకు వేలాదిగా జనం ఎగబడ్డారు. చివరకు అది సముద్రం మధ్య నౌకల లంగర్ వేసేందుకు వినియోగించే స్లీపర్ బార్జ్ (చెక్క దిమ్మె)గా నిర్థారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అలల ఒడిలో.. భారీ వస్తువు! విశాఖ సాగర తీరంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అలల మధ్య భారీ వస్తువేదో కదులుతున్నట్టు సందర్శకులు గుర్తించారు. తొలుత అది భారీ సముద్ర జంతువు అని భయాందోళన చెందారు. ఒడ్డుకు పరుగులు తీశారు. రాత్రి పహారాకు బీట్ కానిస్టేబుళ్లకు కొందరు సమాచారం అందించగా.. అది ఒక భారీ చెక్క పెట్టె అని గుర్తించారు. చైనా, పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఏవైనా పేలుడు పదార్థాలున్నాయా అని భయాందోళనలకు గురయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలెర్ట్ అయిన సిటీ సెక్యూరిటీ వింగ్ పొక్లెయిన్ల సాయంతో బాక్స్‌ను ఒడ్డుకు తీసుకొచ్చింది. అది పురాతన బాక్స్‌గా కనిపించడంతో అందరి అనుమానాలు మరింత బలపడ్డాయి. కొందరు బాంబులు ఉన్నాయేమో అని భయపడగా.. భారీ నిధితో కూడిన పెట్టె ఒడ్డుకు వచి్చందని మరికొందరు భావించారు. భద్రతా బలగాలు బీచ్‌కు చేరుకుని ప్రజల్ని అప్రమత్తం చేశాయి. బీచ్ రోడ్డుని క్లియర్ చేశాయి. శనివారం ఉదయం ఆ భారీ పెట్టె మిస్టరీని ఛేదించేందుకు బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. చేతులతో దానిని తెరిచేందుకు బాంబ్ డిస్పోజల్ టీమ్ ప్రయత్నించగా.. సాధ్యం కాలేదు. బాంబ్ స్క్వాడ్ జాగిలాలతో చెక్ చేశారు. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని గుర్తించారు. జీవీఎంసీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న రెండు పొక్లెయిన్లను పోలీసులు రంగంలోకి దించారు. 14 గంటల నిరీక్షణ తరువాత.. సమాచారం అందుకున్న ఆర్కియాలజీ బృందం చేరుకుని బాక్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. ఇది పురాతన కాలం నాటి పెట్టె కాదని.. రెండు నుంచి నాలుగేళ్ల క్రితం బర్మా టేకుతో తయారు చేసిన పెట్టె అని నిర్థారించింది. 10 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు గల దానిని విడదీసేందుకు ప్రయత్నించగా.. చివరకు అది కేవలం చెక్క దిమ్మెగా గుర్తించారు. ఆర్కియాలజీ బృందంతో పాటు మత్స్యకారులు, పోర్టు అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరపగా.. అది నౌకల్లో వినియోగించే స్లీపర్ బార్జ్ అని స్పష్టమైంది. చిన్న సైజు నౌకలు అలల తాకిడికి గురైనప్పుడు అవి దెబ్బ తినకుండా కర్రలతో చేసిన స్లీపర్ బార్జ్‌లను ఒక బ్లాక్‌గా బిగించి వినియోగిస్తారని తేలింది. సముద్రం మధ్యలో షిప్‌లని లంగరు వేసేందుకు వీటిని ఉపయోగిస్తారని తెలిసింది. కంటైనర్ కార్గో వెసల్స్ నుంచి కంటైనర్లను దించే సమయంలోనూ ఈ తరహా బార్జ్‌లను వినియోగిస్తుంటారనీ.. వాటిలో ఒకటి షిప్ నుంచి విడిపోయి ఇలా కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మొత్తానికి విశాఖ నగరానికి 14 గంటల పాటు కంటిమీద కునుకు లేకుండా.. ఓవైపు ఆందోళనల్ని.. మరోవైపు ఉత్కంఠని కలిగిస్తూ.. యాక్షన్ సినిమా తలపించిన భారీ చెక్క కథ సుఖాంతమవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: మత్స్యకారులకు కష్టాలుండవిక -
చెక్కపెట్టెలో అసలు ఏముందంటే..?
-
తీరానికి కొట్టుకొచ్చిన పెట్టె..భారీగా సంపద ఉండొచ్చని అంచనా
-
తీరానికి కొట్టుకొచ్చిన పెద్ద పెట్టె..పెట్టెలో బంగారు నిధి ?
-
విశాఖ బీచ్‌కు కొట్టుకొచ్చిన బాక్స్ ఓపెన్.. వీడిన సస్పెన్స్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకుని వచ్చింది. శుక్రవారం రాత్రి కొందరు పర్యాటకులు, మత్స్యకారులు ఈ పెట్టెను గమనించారు. దీంతో, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా, అధికారులు రెండు ప్రొక్లెయినర్ సాయంతో భారీ పెట్టెను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో అది చెక్కలతో చేసిన దిమ్మెగా అధికారులు తెల్చారు. కాగా, బీచ్‌లో పడవలకు లంగర్ వేసేందుకు ఉపయోగించే చెక్క దిమ్మె అని ఖరారు చేశారు. అంతకుముందు.. విశాఖలోని వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకుని వచ్చింది. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకున్నారు. పురాతమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. అలాగే, రాత్రంతా పెట్టెకు పోలీసులు కాపలాగా ఉన్నారు. బీచ్‌లో పెట్టె సమాచారం స్థానికులకు తెలియడంతో దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బందిపడాల్సి వచ్చింది. పోలీసులు పెట్టెను.. బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు. పురాతన పెట్టె ఇలా ఒడ్డుకు వచ్చిందని ఆర్కియాలజీ విభాగానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇది కూడా చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు... -
వైఎంసిఏ బీచ్ లోకి కొట్టుకువచ్చిన అరుదైన పెట్టె
-
ఇనుపరేకు బాక్సులో యువతి మృతదేహం.. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు!
ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ జిల్లాలో ఇటీవల పోలీసులకు ఒక ఇనుపరేకు బాక్సులో 16 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఆమె ఎవరు? ఆమెను హత్య చేసింది ఎవరు? అనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర శ్రీవాస్తవ ఈ యువతిని హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. మృతురాలితో గతంలో ఉపేంద్రకు అఫైర్ నడిచిందని, అయితే ఆమె మరొక యువకునితో సన్నిహితంగా ఉంటుండంతో ఉపేంద్ర ఆమెను హెచ్చరించాడని పోలీసుల విచారణలో తేలింది. ఆమె ఉపేంద్ర మాటలను పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర ఆమెను హత్య చేశాడు. తరువాత బజారుకు వెళ్లి, ఒక ఐరన్ బాక్సు కొనుగోలు చేశాడు. ఆమె మృతదేహాన్ని ఆ బాక్సులో ఉంచి, దానిని బైక్‌కు కట్టి 40 కిలోమీటర్ల దూరంలోని అడవిలో ఆ బాక్సును వదిలేసి వచ్చాడు. ఈ సంగతి ఇక పోలీసులకు తెలియదని ఉపేంద్ర భావించాడు. అయితే అతను ఊహించని విధంగా పోలీసులు అతనిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉపేంద్ర శ్రీవాస్తవ తాను ఉంటున్న ఇంటికి సమీపంలోని 16 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరువాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర వారణాసిలోని మహామాన్పురి కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. దానిలో వారిద్దరూ ఉండసాగారు. సాయంత్రం కాగానే ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయేవారు. ఇంతలో ఉపేంద్రకు ఆ యువతి ఎవరితోనే మాట్లాడుతున్నదనే అనుమానం వచ్చింది. ఆమెను ఈ విషయమై నిలదీశాడు. దీంతో ఇద్దరిమధ్య వివాదం నెలకొంది. ఈ నేపధ్యంలో ఆగ్రహానికి గురైన ఉపేంద్ర ఆమెను గొంతునొక్కి హత్య చేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని బాక్సులో పెట్టి, దానిని బైక్‌కు కట్టి వారణాసికి 40 కిలోమీటర్ల దూరంలోని బదోహీ నేషనల్ హైవే మీదుగా లాలానగర్ సమీపంలోని అడవులలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాక్సును కిందకు దించి, బైక్ ట్యాకులోని పెట్రోల్ బయటకు తీసి, దానితో బాక్సుకు నిప్పంటించాడు. ఇలా చేయడం ద్వారా తన నేరాన్ని ఎవరూ గ్రహించలేరని ఉపేంద్ర భావించాడు. అయితే స్థానికులు ఈ అనుమానాస్పద బాక్సును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా పోలీసులు హైవేలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. వాటిలో నిందితుడు తన బైక్‌కు ఈ బాక్సును కట్టి ప్రయాణిస్తున్న దృశ్యం కనిపించింది. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడు ఉపేంద్ర శ్రీవాస్తవ్‌ను అరెస్టు చేశారు. అతని దగ్గరి నుంచి బైక్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు తదపరి చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్‌లో మహిళల కోసం ఎందుకు పోరాడారు? -
ఇంటి తవ్వకాల్లో పురాతన బాక్సు.. తెరిచి చూడగానే..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక పురాతన ఇంటి తవ్వకాలు స్థానికంగా కలకలం రేపాయి. గతంలో ఈ ఇంటిలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నరేష్ అగర్వాల్ ఉండేవారు. తాజాగా ఈ ఇంటి తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు లభించాయి. అయితే ఇవి ఎవరివనే విషయం ఇప్పటి వరకూ వెల్లడికాలేదు. కాగా ఇంటి తవ్వకాల్లో అస్థిపంజరాలు లభించాయని తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంటిని సీల్ చేశారు. అస్థిపంజరాలను పరిశీలనకు ల్యాబ్‌కు పంపారు. ఇంటిలో అస్థిపంజరాలు దొరికాయన్న విషయం స్థానికంగా దావానలంలా వ్యాపించింది. దీంతో అవి ఎవరివంటూ స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ నరేష్ అగర్వాల్ ఈ ఇంటిని అశోక్ అగర్వాల్ అనే వ్యక్తికి విక్రయించారు. తాజాగా అశోక్ అగర్వాల్ ఈ ఇంటిని పడగొట్టి నూతన భవనం నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఇంటి కూల్చివేతలు జరుగుతుండగా, కూలీలకు ఒక పెద్ద పురాతన బాక్సు లభించింది. ఆ బాక్సుకు ఉన్న తాళం బద్దలుగొట్టి లోపల ఏముందో చూసి, హడలెత్తిపోయారు. బాక్సులోపల మానవ అస్థిపంజరాలు ఉండటంతో వారు భయపడిపోయారు. పనులను ఎక్కడివక్కడ వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ బాక్సును పరిశోధనాశాలకు తరలించారు. అక్కడి నుంచి రిపోర్టు రాగానే దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. అలాగే ఇంటి యజమానిని విచారిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షులపై స్మార్ట్ గాడ్జెట్ల నిషేధం ఎందుకు? -
బైడెన్‌కు దశ దానం.. దాని ప్రాముఖ్యత తెలుసా?
అమెరికా పర్యటనలో భాగంగా.. వైట్‌హౌజ్ విందుకు హాజరైన ప్రధాని మోదీ.. సతీసమేతంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో పరస్పరం కానుకలు ఇచ్చి గౌరవించుకున్నారు. మోదీ టేస్ట్‌కి తగ్గట్లే కెమెరాలను బైడెన్ ఇవ్వగా.. భారత సంప్రదాయానికి తగ్గట్లు ఉపనిషత్తుల కాపీని, ఆయన సతీమణి జిల్ బైడెన్‌కు గ్రీన్ డైమండ్‌కు బహుకరించారు. అదే సయమంలో మోదీ బహుకరించిన గంధపు చెక్కతో కూడిన పెట్టె ఒకటి బైడెన్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ పెట్టెను.. అందులో ఉన్న దశ దానం ప్రశస్తిని స్వయంగా మోదీనే బైడెన్‌కు వివరించారు. హిందూ జీవన విధానంలో ‘‘దశ దానం’’ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న అంశం. హిందూ ఆచారాలకు ప్రతీక కూడా. ► ప్రాచీన భారతీయ గ్రంథం కృష్ణ యజుర్వేదంలో వైఖానస గృహ్య సూత్రం ప్రకారం.. ఒక వ్యక్తి దాదాపు 29,530 రోజులు.. మరోలా చెప్పాలంటే ఎనభై సంవత్సరాల ఎనిమిది నెలల వయస్సును పూర్తి చేసినప్పుడు ‘దృష్ట సహస్రచంద్రుడు’ అంటే వెయ్యి పౌర్ణమిలను చూసిన వ్యక్తి అవుతాడు. ► హిందూ జీవన విధానంలో.. ప్రతీ వ్యక్తికి ఇదొక ముఖ్యమైన మైలురాయి లాంటిది. జీవితంలో ఆ దశ పూర్తైన వాళ్లను.. వాళ్ల పరిపూర్ణ అనుభవానికి గుర్తుగా గౌరవించబడతారు. శాస్త్రోక్తంగా.. వినాయక పూజలతో మొదలవుతుంది. పూర్ణహారతి, శతాభిషేకం.. చివరకు సహస్ర చంద్ర దర్శనంతో ముగుస్తుంది. ► సహస్ర పూర్ణ చంద్రోదయం సమయంలో.. దశ దానం చేయడం ఆనవాయితీ. గోదానం, భూదానం, తిలదానం(నువ్వులు) , హిరణ్యదానం(బంగారం), ఆజ్యదానం(నెయ్యిగానీ.. వెన్నగానీ), ధాన్యదానం, వస్త్రదానం, గుడ(బెల్లం) దానం, రౌప్యదానం(వెండి), లవణదానం(ఉప్పు) చేస్తారు. ► బైడెన్ కిందటి ఏడాది నవంబర్‌తోనే 80 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అందుకే ఆయనకు మోదీ దశ దానం సమర్పించారు. ► జైపూర్(రాజస్థాన్)కు చెందిన ఓ కళాకారుడు ఆ ప్రత్యేకమైన చందనపు పెట్టెను రూపొందించారు. అందుకు కావాల్సిన చెక్కలను మైసూర్ నుంచి తెప్పించారు. తరతరాలుగా ఇలా గంధపు పెట్టెల తయారీ రాజస్థాన్‌లో కుల వృత్తిగా నడుస్తోంది. ► బాక్స్‌లో గణేషుడి ప్రతిమ ఉంది. దీనిని కోల్‌కతాకు చెందిన ఓ స్వర్ణకారుడు తయారు చేశారు. ఆయన కుటుంబం ఐదు తరాలుగా విగ్రహాలను తయారు చేస్తోంది. ► ప్రతిమతో పాటు ప్రమిదను కూడా ఉంచారు. ఇది కూడా కోల్‌కతాకు చెందిన స్వర్ణకారుల కుటుంబమే చేసింది. ► ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కళాకారులు రూపొందించిన రాగి తామ్ర పాత్ర.. దాని మీద శ్లోకం చెక్కి ఉంది. The box gifted by PM Modi to US President Joe Biden contains ten donations- a delicately handcrafted silver coconut by the skilled artisans of West Bengal is offered in place of a Cow for Gaudaan (donation of cow). A fragrant piece of sandalwood sourced from Mysore, Karnataka… pic.twitter.com/I8ujKCoiK1 — ANI (@ANI) June 22, 2023 ఇక అసలైన దశ దానం.. వెండి పెట్టెల్లో ఉంది. ఆవు స్థానంలో బుల్లి వెండి కొబ్బరికాయ ప్రతిమను, భూదానం స్థానంలో మైసూర్ నుంచి తెప్పించిన సువాసనభరితమైన గంధపు చెక్క ముక్కను, తమిళనాడు నుంచి తెప్పించిన నువ్వులను, హిరణ్యదానం కోసం రాజస్థౠన్ నుంచి తెప్పించిన 24 క్యారెట్ల బంగారపు కాయిన్‌ను, పంజాబ్ నుంచి నెయ్యిని, జార్ఖండ్ నుంచి తెప్పించిన గుడ్డ ముక్కను, ధాన్యదానంలో భాగంగా యూపీ నుంచి బియ్యం, మహారాష్ట్ర నుంచి బెల్లం ముక్కను, రాజస్థాన్ నుంచి వెండి నాణేన్ని, అలాగే గుజరాత్ నుంచి తెప్పించిన ఉప్పును లవణ దానంలో భాగంగా.. చిన్న వెండి పెట్టెల్లో ఉంచి బైడెన్‌కు మోదీ దశ దానంలో భాగంగా అందించారు. The box contains the idol of Ganesha, a Hindu deity considered as the destroyer of obstacles and the one who is worshipped first among all gods. The idol has been handcrafted by a family of fifth-generation silversmiths from Kolkata. The box also contains A diya (oil lamp) that… pic.twitter.com/23eV5ZsWfC — ANI (@ANI) June 22, 2023 -
పేటీఎం రీ‘సౌండ్’! భారీగా పెరిగిన సౌండ్ బాక్స్ సబ్స్క్రైబర్లు
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ పేమెంట్ పరికరాల (సౌండ్ బాక్స్‌లు) ఆదాయంలో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మే నెల చివరి నాటికి సౌండ్‌బాక్స్ సబ్స్క్రైబర్ల సంఖ్యను ఏకంగా 118 శాతం పెంచుకుంది. సౌండ్‌బాక్స్, పాయింట్-ఆఫ్-సేల్ (పీవోఎస్) మెషీన్ల వంటి పరికరాల కోసం చందా చెల్లించే వ్యాపారుల సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలలలో 75 లక్షలకు పెరిగినట్లు ఓ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వన్97 సంస్థ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే ఏప్రిల్, మే నెలల్లో సబ్స్క్రైబర్ల సంఖ్య 34 లక్షలు ఉండేది. ఈ సంవత్సరం మే నెలలోనే 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు కొత్తగా చేరడం గమనార్హం. మార్చి త్రైమాసికంతో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో 68 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించిన పేటీఎం అంతకుముందు ఆర్థక సంవత్సరంలో 29 లక్షల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉండేది. అంటే 134 శాతం వృద్ధిని సాధించింది. మర్చంట్ డిస్కౌంట్ రేటు కాకుండా అదనపు చెల్లింపు మానిటైజేషన్ ఛానెల్‌ని ప్రారంభించడంపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో పేటీఎం ఈ వృద్ధిని సాధించింది. మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే వివిధ చెల్లింపు పద్ధతుల ద్వారా డిజిటల్ చెల్లింపులను అంగీకరించినందుకు వ్యాపారుల నుంచి వసూలు చేసే రేటు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పేటీఎం మర్చంట్ చెల్లింపులు 35 శాతం వృద్ధితో రూ. 2.65 లక్షల కోట్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇవి రూ. 1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో పేటీఎం అందించిన రుణాలు రూ. 9,618 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇవే నెలల్లో రూ. 3,576 కోట్లు ఉండగా 169 శాతం పెరిగాయి. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
సౌండ్ బాక్స్ మీదపడి చిన్నారి మృతి
దేవరకద్ర రూరల్: నిద్రిస్తున్న సమయంలో ఓ చిన్నారి తలపై సౌండ్‌బాక్స్ పడడంతో తీవ్రగాయాలుకాగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. ఈ ఘటన దేవరకద్ర మండలం డోకూర్లో చోటుచేసుకుంది. వివరాలిలా.. డోకూర్కి చెందిన సురేందర్, అంజలి దంపతులు తమ కూతురు తన్మయి(2)తో కలిసి రోజులానే 5వ తేదీన ఇంట్లో నిద్రించారు. రాత్రివేళ సామాన్లు భద్రపర్చే సజ్జపై ఉన్న సౌండ్ బాక్స్ అకస్మాత్తుగా జారి.. కింద నిద్రిస్తున్న చిన్నారి తన్మయిపై పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే జిల్లా ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ సంఘటనతో తల్లిదండ్రుల శోకానికి అంతులేకుండా పోయింది. చదవండి: వైరల్: నల్లపులి, చిరుతల ఫైటింగ్! -
విషాదం: కాటుక డబ్బా గొంతులో ఇరుక్కుని..
కన్నవారి కంటిపాపకు.. ఇంటిని వెలిగించే చంటిపాపకు ఆ దేవుని చల్లని చూపులే శ్రీరామరక్ష. కానీ కంటిని కాపాడాల్సిన కాటుక కాలకూట విషమై విషాదాన్ని కుమ్మరిస్తే.. చంటిపాపను చల్లగా చూడాల్సిన దైవం ఉదాసీనతతో ఉపేక్షిస్తే.. ఎంతో ఘోరం జరిగిపోతుంది! చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది! కొద్దిగంటల వ్యవధిలో మొదటి పుట్టిన రోజు జరుపుకోబోతున్న ఆ పసివాడి జీవితంలో అదే జరిగింది. ఏడాది నిండబోతున్న ఆనందకర తరుణంలో ఆ బుజ్జాయికి నూరేళ్లూ నిండడంతో కుటుంబం కంటికీ.. మింటికీ ఏకధారగా విలపిస్తోంది. ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మండలం రత్తకన్న గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. చిన్న కాటుక డబ్బాను మింగేసిన రిహాన్స్ దొళాయి అనే చిన్నారి ఊపిరాడక మృతి చెందాడు. నవంబర్ 4 చిన్నారి పుట్టిన రోజు కావడం గమనార్హం. రత్తకన్న గ్రామంలోని ఒడియా వీధికి చెందిన గీత బిసాయి, కంచిలి మండలం కొక్కిలి పుట్టుగ గ్రామానికి చెందిన కుమార్ దొళాయిలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. గత ఏడాది నవంబర్ 4న వీరికి రిహాన్స్ దొళాయి జన్మించాడు. మరో రెండు రోజుల్లో బాబు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కుమారుడికి కొత్తబట్టలు తొడిగిన తల్లి.. మందు గదిలో ఉంచి.. దేవుడికి నమస్కరించేందుకు తరువాత గదిలోకి వెళ్లింది. బాబు ఆడుకుంటూ దగ్గరలో ఉన్న కాటుక డబ్బాను మింగేశాడు. నోటి నుంచి రక్తరావడంతో కుటుంబ సభ్యులు భయపడ్డారు. గొంతులో ఏదో ఉండిపోయిందని గ్రహించి బయటకు తీయడానికి ప్రయతి్నంచారు. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. (చదవండి: ప్రియుడితో రాసలీలలు.. భర్త రెడ్‌హ్యాండెడ్‌గా..) -
డబ్బా ఇసుక రూ.10
మంథని: ఇసుక బంగారమైంది. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో సోమవారం డబ్బా ఇసుకను రూ.10 చొప్పున విక్రయించారు దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే కేదారేశ్వర వ్రతానికి కొత్త ఇసుక అవసరం. గద్దెల నిర్మాణంతోపాటు ఇతర అవసరాలకు ఇసుక వినియోగిస్తారు. గోదావరిలో స్నానం చేసి నదిలో కాసింత ఇసుకను భక్తులు ఏటా తీసుకెళ్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మంథని వద్ద గోదావరి నిండుగా ఉండి ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఇదే అదనుగా గోదావరి అవతలి వైపు మంచిర్యాల జిల్లా శివ్వారం నుంచి కొంతమంది సంచుల్లో ఇసుకను తీసుకొచ్చి స్నాన ఘట్ల వద్ద ఇలా విక్రయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో భక్తులు కొనుక్కుని వెళ్లారు. -
విజయవాడలో కలకలం రేపిన బాక్స్ తెరిచిన పోలీసులు
-
విజయవాడలో కలకలం రేపిన ఇరీడియం బాక్స్
-
అట్టపెట్టెలో మృతశిశువు
బూర్గంపాడు : బూర్గంపాడు–కుక్కునూరు రహదారిలో కిన్నెరసాని బ్రిడ్జి సమీపంలో ఓ అట్టపెట్టెలో మృతశిశువును స్థానికులు గురువారం ఉదయం గమనించారు. వారిచ్చిన సమాచారంతో బూర్గంపాడు పోలీసులు అక్కడకు వెళ్లారు. ఆ ప్రాంతం ఏపీలో విలీనమైనదిగా గుర్తించి, కుక్కునూరు పోలీసులకు సమాచారమిచ్చారు. మృత శిశువును ఎవరో బూర్గంపాడు నుంచి తీసుకెళ్లి ఇక్కడ ఇలా పెట్టారని స్థానికంగా చర్చ సాగుతోంది. బుధవారం రాత్రి బూర్గంపాడు నుంచి ఓ వ్యక్తి అట్టపెట్టెతో నడుచుకుంటూ వెళుతుండడాన్ని చూసినట్టుగా కొందరు చెబుతున్నారు. -
పనికొచ్చే పేటిక
కొండ శిఖరానికి చేరుకున్నాక, ఉన్నట్టుండి ఆ పేటికలోంచి ఏదో వెలుగు వచ్చింది. ఒక జెన్ కథ ఇలా సాగుతుంది. ఒక రైతు ముసలివాడయ్యాడు. ఒంట్లో శక్తి ఉడిగింది. పొలానికి వెళ్లడం మానేశాడు. ఊరికే ఇంటి అరుగు మీద కూర్చుని ఉండేవాడు. ఇది ఆ రైతు కుమారుడికి నచ్చేది కాదు. తండ్రి వల్ల ఏం ఉపయోగం? పైగా తిండి దండగ. ఈ ఆలోచన రావడంతోనే చెక్కతో ఒక శవపేటిక తయారుచేశాడు. దాన్ని ముందర పెట్టి, అందులోకి వెళ్లమని తండ్రిని ఈడ్చాడు. మారు మాట్లాడకుండా ఆ వృద్ధుడు శవపేటికలోకి వెళ్లి పడుకున్నాడు. మూత బిగించి, ఆ పేటికను ఒక కొండ దగ్గరకు మోసుకెళ్లాడు కొడుకు. కొండ శిఖరానికి చేరుకున్నాక, ఉన్నట్టుండి ఆ పేటికలోంచి ఏదో వెలుగు వచ్చింది. చూద్దామని మూత తీశాడు కొడుకు. లోపల ప్రశాంతంగా పడుకుని వున్న తండ్రి, ‘నాయనా, ఎటూ ఈ కొండ అంచు నుంచి నన్ను తోస్తావు; కానీ చనిపోయేముందు నీకో సలహా ఇవ్వనా?’ అన్నాడు. ‘ఏమిటది?’ అడిగాడు కొడుకు. ‘కావాలంటే నన్ను తోసెయ్; కానీ ఇంత కొత్త పేటికను ఎందుకు వృథా చేస్తావు? ఇది రేపు నీ కొడుకులకు పనికి రావొచ్చుగదా’ అన్నాడు. కథ ఇంతే. ఆ తండ్రి ఇచ్చిన వెలుగు ఆ కొడుకు హృదయంలోని చీకటిని తొలగించిందో లేదో కథ చెప్పదు. ఆ కొడుక్కు భవిష్యత్ దర్శనం కలిగిందో చెప్పదు. కానీ ఒక పరంపర పట్ల చూపాల్సిన మర్యాదను చెబుతుంది. చేసినదానికి చూపాల్సిన కృతజ్ఞతను చెబుతుంది. ఈ గుణాలే కదా, మన లోపలిని వెలిగించేవి! -
కేబుల్ ఆపరేటర్లను అనుమానిస్తున్నారు
సెటాప్ బాక్సుల ధరలు ఒకేలా ఉండాలి కేబుల్ టీవీ ఆపరేటర్ల జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు పి.గన్నవరం : ఒకొక్క కంపెనీ సెటాప్ బాక్సు ఒక్కో రకంగా ఉండడం వల్ల, కేబుల్ ఆపరేటర్లను వినియోగదారులు అనుమానిస్తున్నారని కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు అడపా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలపై ఈ నెలాఖరులో విజయవాడలో రాష్ట్ర స్థాయి సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో పి.గన్నవరం నియోజకవర్గ కేబుల్ టీవీ ఆపరేటర్ల సమావేశం జరిగింది. సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు ఉలిశెట్టి బాబీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి వెంకట్రావు మాట్లాడుతూ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్పొరేట్ కంపెనీలు విక్రయిస్తున్న సెటాప్ బాక్సుల ధరలన్నీ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి, భద్రత కల్పించాలని, రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని కోరారు. కేబుల్ ఆపరేటర్లతో పే చానల్స్ నిర్వాహకులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని విడనాడాలని సమావేశం డిమాండ్ చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని తీర్మానించింది. సమావేశంలో సంఘ నాయకులు ఎస్.సూర్యనారాయణ, ఇడుపుగంటి రామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కార్న్ ఫ్లోర్ తినకుంటే కోమాలోకి...
ఆ చిన్నారిని ప్రాణాంతక వ్యాధి పీడిస్తోంది. ఆ వింత వ్యాధి అతడిని రోజురోజుకూ చావుకు దగ్గర చేస్తోంది. తమ బిడ్డకు సంక్రమించిన వ్యాధికి మందులు లేకపోవడంతో తల్లిదండ్రులు అనుక్షణం ఆందోళనకు గురౌతున్నారు. బిడ్డ ప్రాణాలు రక్షించుకోడానికి లక్షల్లో డబ్బు ఖర్చు చేస్తున్నారు. లండన్ కు చెందిన ఆరేళ్ల జార్జి మొర్రిసన్ ను అరుదైన గ్లికోజెన్ స్టోరేజ్ వ్యాధి (GSD) వేధిస్తోంది. అయితే ఆ కొత్తరకం వ్యాధికి ఇప్పటిదాకా మందులే లేకపోవడంతో వైద్యులు ప్రత్యామ్నాయంగా కార్న్ ఫ్లోర్ ఇవ్వాలని సూచించారు. ప్రతిరోజూ సుమారు ఓ బాక్స్ కార్న్ ఫ్లోర్ తినకుంటే ఆ బాలుడు కోమాలోకి వెళ్ళిపోతున్నాడు. జార్జి మొర్రిసన్ కు ఎనిమిది నెలల వయసున్నపుడే వైద్యులకు కూడా అంతు చిక్కని ఓ వింత వ్యాధి సోకింది. ప్రాణాంతకమైన ఆ వ్యాధికి మందుల్లేకపోవడంతో కార్న్ ఫ్లోర్ వినియోగిస్తున్నారు. రోజుకో కార్న్ ఫ్లోర్ డబ్బా తినకపోతే చిన్నారి చనిపోయే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. లండన్ లోని మిగతా పిల్లల్లో మరెక్కడా కనిపించని ప్రాణాంతక గ్లైకోజెన్ లోపంతో మొర్రిసన్ బాధపడుతున్నాడు. రాత్రి సమయంతో సహా ప్రతి మూడు గంటలకు ఓసారి కార్న్ ఫ్లోర్ తినిపిస్తూ ఆ బాలుడ్ని ప్రమాదానికి దూరంగా ఉంచాల్సి వస్తోంది. ఎనిమిదేళ్ళు దాటని పసివాడు కావడంతో అన్నిరకాల పరీక్షలు చేసే అవకాశం లేదు. అందుకే అతడి లోపానికి ఫార్మసిస్టులు ప్రత్యామ్నాయాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా బ్రిటిష్ నేషనల్ ఫార్ములరీ జాబితాలోని మందుల్లో ఎక్కడా కార్న్ ఫ్లోర్ ను వాడే పద్ధతి అమల్లో లేదు. అయితే ఓ ఫార్మాసూటికల్ రిఫరెన్స్ పుస్తకంలో ఉన్న సలహాల మేరకు బాలుడి లోపానికి కార్న్ ఫ్లోర్ ను వాడుతున్నారు. తమ బిడ్డకు వచ్చిన వ్యాధికి మందులు లేకపోవడంతో జార్జి తల్లిదండ్రులు సామ్, పెటె మొర్రిసన్ లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిగిలిన పిల్లల్లా తమ చిన్నారికి మందులు ఎందుకు ఇవ్వరంటూ నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ను వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కార్న్ ఫ్లోర్ వాడే పద్ధతి ఎంతో కష్టంగా ఉండటంతోపాటు ఖర్చు కూడ ఎక్కువగా ఉందని, దానికి బదులుగా మందులు సూచించమని ఎన్ హెచ్ ఎస్ ను కోరుతున్నారు. జార్జికి కేవలం ఎనిమిది నెలల వయసున్నపుడే ఈ వ్యాధి ఉన్నట్లుగా వైద్యులు నిర్థారించారని, అప్పట్నుంచీ మందుల్లేకుండా పిల్లాడి ప్రాణాలు కాపాడుకోవడం ఎంతో కష్టంగా మారిందని సామ్ ఆవేదన చెందుతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వింత వ్యాధికి మందు కనిపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తాము ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమౌతున్నట్లు చెప్తున్నాడు. ఇప్పటికే భారీ మొత్తంలో ఖర్చు కావడంతో ఇకపై జార్జికి వైద్య సహాయంకోసం స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నాడు. -
పోరాటం
సంగకుమార్, సునయ జంటగా యం.యస్. వాసు దర్శకత్వంలో పుల్లూరి నవీన్‌కుమార్, బండారి కృపాల్ నిర్మించిన చిత్రం, ‘బాక్స్’. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘న్యాయంగా వ్యవహరించే విక్రమ సింహ అనే పోలీసాఫీసర్ విధి నిర్వహణలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? సంఘ విద్రోహులపై అతను ఎలాంటి పోరాటం చేశాడు? అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మహీశర్ల, సంగీతం: నాగవంశీ. -
ఎప్పటికప్పుడు... వేడివేడిగా..!
ఇంట్లో ఉండేవాళ్లు రెండు పూటలా పొగలు కక్కే వేడి వేడి భోజనం లాగిస్తారు. కానీ ఉద్యోగాలను చేసుకునేవాళ్లకి ఆ అదృష్టం ఒక్కపూటే. పొద్దున్నే లేచి, భోజనాన్ని బాక్సులో సర్దుకుని ఆఫీసుకు పరుగులు పెడతారు. తీరా తినే సమయానికి అది కాస్తా చల్లబడిపోయి, చప్పబడిపోయి నోటికి రుచించదు. అదే ఈ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్ కొనుక్కున్నారనుకోండి, ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా చక్కగా వేడి వేడి భోజనం లాగించవచ్చు. అన్నం, కూర పెట్టుకోవడానికి వీలుగా రెండు అరలతో ఉండే ఈ లంచ్‌బాక్సు కరెం టుతో పని చేస్తుంది. దీనికున్న వైరును కరెంటుకు కనెక్ట్ చేస్తే... ఐదు నిమిషాల్లో బాక్సులో ఉన్న ఆహారం వేడెక్కిపోతుంది. కాబట్టి తినే సమయానికి భోజనం చల్లారిపోయినా బెంగపడక్కర్లేదు. చద్ది తిండీ తినక్కర్లేదు. వచ్చింది చలికాలం కాబట్టి ఇది చాలా అవసరం కూడాను. ప్రయాణాలప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది. వెల పెద్ద ఎక్కువేం కాదు.1600 రూపాయల వరకూ ఉంది. ఆన్లైన్లో ప్రయత్నిస్తే రూ.1300 లోపే కొనుక్కోవచ్చు! -
‘బాక్స్’ చిత్రం ప్రారంభం
-
బాటిల్ బాక్సులా..
ఇన్నాళ్లూ వాటర్ బాటిల్ అంటే మనం చూసింది వేరు. ఇది వేరు.. చూశారుగా.. బాటిల్ బాక్సులా మారిపోయింది. దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన డిజైనర్లు జెస్సీ లీవర్తీ, జోనాథన్లు తయారుచేశారు. ‘మెమోబాటిల్’లో మూడు సైజులున్నాయి. అవి ఏ5, ఏ4, లెటర్. వీటిల్లో ఏ5 సామర్థ్యం 750 మి.లీ. కాగా.. ఏ4, లెటర్ల సామర్థ్యం 1.25 లీటర్లు. వీటిని బ్యాగులో లేదా వెనుక జేబులో ఈజీగా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లేవారి కోసం వీటిని తయారుచేశారట. పాశ్చాత్య దేశాల్లో యూజ్ అండ్ త్రో టైపు వాటర్ బాటిళ్ల వినియోగం ఎక్కువ. వీటిల్లో 20 శాతం మాత్రమే రీసైకిలింగ్ చేస్తున్నారట. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు ఇది చెక్ పెడుతుందని జెస్సీ, జొనాథన్లు చెబుతున్నారు. దీన్ని ఎన్నిసార్లైనా వినియోగించుకోవచ్చని.. శుభ్రపరచడం కూడా చాలా ఈజీ అని అంటున్నారు. మెమోబాటిళ్లు ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్నాయి.