పనికొచ్చే పేటిక | That son does not tell the future view | Sakshi
Sakshi News home page

పనికొచ్చే పేటిక

Published Sat, Feb 3 2018 12:12 AM | Last Updated on Sat, Feb 3 2018 12:12 AM

That son does not tell the future view - Sakshi

కొండ శిఖరానికి చేరుకున్నాక,  ఉన్నట్టుండి ఆ పేటికలోంచి  ఏదో వెలుగు వచ్చింది. 

ఒక జెన్‌ కథ ఇలా సాగుతుంది. ఒక రైతు ముసలివాడయ్యాడు. ఒంట్లో శక్తి ఉడిగింది. పొలానికి వెళ్లడం మానేశాడు. ఊరికే ఇంటి అరుగు మీద కూర్చుని ఉండేవాడు. ఇది ఆ రైతు కుమారుడికి నచ్చేది కాదు. తండ్రి వల్ల ఏం ఉపయోగం? పైగా తిండి దండగ. ఈ ఆలోచన రావడంతోనే చెక్కతో ఒక శవపేటిక తయారుచేశాడు. దాన్ని ముందర పెట్టి, అందులోకి వెళ్లమని తండ్రిని ఈడ్చాడు. మారు మాట్లాడకుండా ఆ వృద్ధుడు శవపేటికలోకి వెళ్లి పడుకున్నాడు.  మూత బిగించి, ఆ పేటికను ఒక కొండ దగ్గరకు మోసుకెళ్లాడు కొడుకు. కొండ శిఖరానికి చేరుకున్నాక, ఉన్నట్టుండి ఆ పేటికలోంచి ఏదో వెలుగు వచ్చింది.

చూద్దామని మూత తీశాడు కొడుకు. లోపల ప్రశాంతంగా పడుకుని వున్న తండ్రి, ‘నాయనా, ఎటూ ఈ కొండ అంచు నుంచి నన్ను తోస్తావు; కానీ చనిపోయేముందు నీకో సలహా ఇవ్వనా?’ అన్నాడు. ‘ఏమిటది?’ అడిగాడు కొడుకు. ‘కావాలంటే నన్ను తోసెయ్‌; కానీ ఇంత కొత్త పేటికను ఎందుకు వృథా చేస్తావు? ఇది రేపు నీ కొడుకులకు పనికి రావొచ్చుగదా’ అన్నాడు.  కథ ఇంతే. ఆ తండ్రి ఇచ్చిన వెలుగు ఆ కొడుకు హృదయంలోని చీకటిని తొలగించిందో లేదో కథ చెప్పదు. ఆ కొడుక్కు భవిష్యత్‌ దర్శనం కలిగిందో చెప్పదు. కానీ ఒక పరంపర పట్ల చూపాల్సిన మర్యాదను చెబుతుంది. చేసినదానికి చూపాల్సిన కృతజ్ఞతను చెబుతుంది. ఈ గుణాలే కదా, మన లోపలిని వెలిగించేవి! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement