![Baby Girl Dies After Falling Down OnThe Sound Box - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/10/1_0.jpg.webp?itok=zgedGMTJ)
దేవరకద్ర రూరల్: నిద్రిస్తున్న సమయంలో ఓ చిన్నారి తలపై సౌండ్‌బాక్స్ పడడంతో తీవ్రగాయాలుకాగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. ఈ ఘటన దేవరకద్ర మండలం డోకూర్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా.. డోకూర్‌కి చెందిన సురేందర్, అంజలి దంపతులు తమ కూతురు తన్మయి(2)తో కలిసి రోజులానే 5వ తేదీన ఇంట్లో నిద్రించారు.
రాత్రివేళ సామాన్లు భద్రపర్చే సజ్జపై ఉన్న సౌండ్ బాక్స్ అకస్మాత్తుగా జారి.. కింద నిద్రిస్తున్న చిన్నారి తన్మయిపై పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే జిల్లా ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ సంఘటనతో తల్లిదండ్రుల శోకానికి అంతులేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment