ఇంటి తవ్వకాల్లో పురాతన బాక్సు.. తెరిచి చూడగానే.. | Workers shocked after they found box in old house | Sakshi
Sakshi News home page

ఇంటి తవ్వకాల్లో పురాతన బాక్సు.. తెరిచి చూడగానే..

Published Tue, Sep 12 2023 11:04 AM | Last Updated on Tue, Sep 12 2023 11:24 AM

workers shocked after found box in old house - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక పురాతన ఇంటి తవ్వకాలు స్థానికంగా కలకలం రేపాయి. గతంలో ఈ ఇంటిలో ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ నరేష్‌ అగర్వాల్‌ ఉండేవారు. తాజాగా ఈ ఇంటి తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు లభించాయి. అయితే ఇవి ఎవరివనే విషయం ఇప్పటి వరకూ వెల్లడికాలేదు. 

కాగా ఇంటి తవ్వకాల్లో అస్థిపంజరాలు లభించాయని తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంటిని సీల్‌ చేశారు. అస్థిపంజరాలను పరిశీలనకు ల్యాబ్‌కు పంపారు. ఇంటిలో అస్థిపంజరాలు దొరికాయన్న విషయం స్థానికంగా దావానలంలా వ్యాపించింది. దీంతో అవి ఎవరివంటూ స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్‌ నరేష్‌ అగర్వాల్‌ ఈ ఇంటిని అశోక్‌ అగర్వాల్‌ అనే వ్యక్తికి విక్రయించారు. తాజాగా అశోక్‌ అగర్వాల్‌ ఈ ఇంటిని పడగొట్టి నూతన భవనం నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఇంటి కూల్చివేతలు జరుగుతుండగా, కూలీలకు ఒక పెద్ద పురాతన బాక్సు లభించింది. 

ఆ బాక్సుకు ఉన్న తాళం బద్దలుగొట్టి లోపల ఏముందో చూసి, హడలెత్తిపోయారు. బాక్సులోపల మానవ అస్థిపంజరాలు ఉండటంతో వారు భయపడిపోయారు. పనులను ఎక్కడివక్కడ వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ బాక్సును పరిశోధనాశాలకు తరలించారు. అక్కడి నుంచి రిపోర్టు రాగానే దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. అలాగే ఇంటి యజమానిని విచారిస్తున్నామన్నారు. 
ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షులపై స్మార్ట్‌ గాడ్జెట్‌ల నిషేధం ఎందుకు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement