
కర్ణాటక: శివమొగ్గ నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లో ఆదివారం రెండు పెట్టెలు కలకలం సృష్టించాయి. రేకు పెట్టెలను విడివిడిగా జనపనార సంచిలో కట్టి ఉంచారు. ఆ పెట్టెల దగ్గర ఎవరూ లేకపోవడంతో రైల్వే సిబ్బందికి అనుమానం వచ్చి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వేస్టేషన్‌లోని పార్కింగ్ ప్రదేశం కాంపౌండ్ వద్ద రెండు పెట్టెలు కనిపించాయి.
గంటలు గడిచినా ఎవరూ తీసుకోకపోవడంతో స్థానికులకు, రైల్వే సిబ్బందికి అనుమానం వచ్చింది. అలాగే జయనరగ పోలీసులకు కూడా కాల్ చేశారు. పోలీసులు జాగిలాలు, బాంబు తనిఖీ సిబ్బందితో వచ్చి పెట్టెలను తెరవకుండానే పరిశీలించారు. తరువాత వాటిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఒక చిన్న కారులో వచ్చి ఆ పెట్టెలను అక్కడ పెట్టి వెళ్లినట్లు సీసీ కెమెరాలలో రికార్డయింది.
Comments
Please login to add a commentAdd a comment