
అట్టపెట్టెలో మృతశిశువు
బూర్గంపాడు : బూర్గంపాడు–కుక్కునూరు రహదారిలో కిన్నెరసాని బ్రిడ్జి సమీపంలో ఓ అట్టపెట్టెలో మృతశిశువును స్థానికులు గురువారం ఉదయం గమనించారు. వారిచ్చిన సమాచారంతో బూర్గంపాడు పోలీసులు అక్కడకు వెళ్లారు. ఆ ప్రాంతం ఏపీలో విలీనమైనదిగా గుర్తించి, కుక్కునూరు పోలీసులకు సమాచారమిచ్చారు. మృత శిశువును ఎవరో బూర్గంపాడు నుంచి తీసుకెళ్లి ఇక్కడ ఇలా పెట్టారని స్థానికంగా చర్చ సాగుతోంది. బుధవారం రాత్రి బూర్గంపాడు నుంచి ఓ వ్యక్తి అట్టపెట్టెతో నడుచుకుంటూ వెళుతుండడాన్ని చూసినట్టుగా కొందరు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment