born child
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ కూతురు
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తాతయ్య అయ్యారు. ఆయన రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ రెండవసారి తల్లయ్యారు. ఆదివారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దేవుని దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్ కృష్ణ తమ్ముడికి స్వాగతం పలుకుతున్నాం. ఆదివారం(సెప్టెంబర్ 11) వీర్ రజనీకాంత్ వనంగమూడి మా జీవితాల్లోకి వచ్చాడని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ ఆమె శుభవార్త పంచుకున్నారు. చదవండి: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా? అంతేకాదు చిన్నారికి వీర్ రజనీకాంత్ వనంగమూడిగా పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. కాగా గ్రాఫిక్ డిజైనర్, నిర్మాతగా సౌందర్య కోలీవుడ్‌లో రాణిస్తున్నారు. ఓచెర్ పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థ ద్వారా పలు సినిమాలను తెరకెక్కిస్తున్న ఆమె తన తండ్రి రజనీకాంత్ విక్రమసింహ సినిమాతో దర్శకురాలిగా మారారు. 2017లో మొదటి భర్త అశ్విన్ రామ్‌కుమార్ నుంచి విడాకులు తీసుకున్న సౌందర్య.. 2019లో నటుడు, వ్యాపారవేత్త విషగన్ వనంగమూడిని రెండో వివాహం చేసుకున్నారు. తాజాగా వీరిద్దరికి తొలి సంతానంగా నిన్న(ఆదివారం) వీర్ జన్మించాడు. With gods abundant grace and our parents blessings 🙏🏻😇Vishagan,Ved and I are thrilled to welcome Ved’s little brother 💙💙💙 VEER RAJINIKANTH VANANGAMUDI today 11/9/22 #Veer #Blessed 😇🥰thank you to our amazing doctors @sumana_manohar Dr.Srividya Seshadri @SeshadriSuresh3 🙏🏻 pic.twitter.com/a8tXbqmTxf — soundarya rajnikanth (@soundaryaarajni) September 11, 2022 -
AP: చిన్నారి ప్రాణం నిలబెట్టిన నియోనాటాల్ అంబులెన్స్
సాక్షి, బొమ్మలసత్రం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన అత్యాధునిక నియోనాటాల్ అంబులెన్స్‌తో ఓ నవజాత శిశువు ప్రాణం నిలబడింది. నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన ఓ పసికందును అంబులెన్స్ సిబ్బంది వైద్యం అందిస్తూ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేర్చారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన అంజలి కాన్పు కోసం ఆదివారం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. సోమవారం ఉదయం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కాగా శిశువుకు శ్యాస సంబంధిత సమస్యతో ఊపిరి తీసుకోవటం కష్టంగా మారింది. వాహనంలో చికిత్స పొందుతున్న పసికందు అక్కడి వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. వెంటిలేటర్ మీదనే తరలించాల్సి రావడంతో నియోనాటాల్ అంబులెన్స్ వాహనంలో తీసుకెళ్లారు. వాహనంలోని వెంటిలేటర్, ఇన్ఫూసియన్ పంప్, సిరంజ్ పంప్‌ల సహకారంతో ఈఎంటీలు మహేష్, రియాజ్ పసికందుకు చికిత్స అందిస్తూ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నవజాత శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అత్యాధునిక వసతులు ఉన్న అంబులెన్స్ ద్వారా తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టారని తల్లి అంజలి సంతోషం వ్యక్తం చేసింది. AP: క్యార్‌మనగానే..కేర్ -
AP: క్యార్‌మనగానే..కేర్
కాకినాడ సిటీ: నవజాత శిశువుల ప్రాణరక్షణలో 108 అంబులెన్స్ ఆపద్బాంధవిగా నిలుస్తోంది. అత్యవసర వేళ అపర సంజీవనిలా ప్రత్యక్షమవుతోంది. నిలబెడుతోంది. అనార్యోగంతో ఉన్న పసికందును ఆగమేఘాలపై ఆస్పత్రికి చేరుస్తోంది. ప్రాణాపాయం తప్పించి తల్లితండ్రులకు ఆనందాన్ని పంచుతోంది. ఆస్పత్రి పడక నుంచి ఆరోగ్యంతో అమ్మ పొత్తిళ్లకు చేరి హాయిగా నిద్రపోతోంది. సకల వైద్య సౌకర్యాలతో దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన నియోనేటల్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు ఆరోగ్య రథాలు (108 అంబులెన్స్) జిల్లాలో సత్ఫలితాలనిస్తున్నాయి. చిన్నారుల మరణాల కట్టడిలో కీలక భూమిక పోషిస్తున్నాయి. మారుమూల పల్లెలకు సైతం దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేలకు పైబడి శిశువుల ప్రాణాలను ఈ వాహనాల ద్వారా కాపాడగలిగాయి. జగన్ సర్కారు చొరవ పసిబిడ్డల ఆరోగ్యరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. పుట్టిన తర్వాత ఏర్పడే అనారోగ్య సమస్యలు ఎక్కువ మంది పసిపిల్లలకు ప్రాణసంకటంగా పరిణమిస్తుంటాయి. సకాలంలో వైద్యమందించకపోతే ప్రాణాలు కోల్పోతారు. ఈ పరిస్థితులకు పరిష్కారం గుర్తిస్తూ నవజాత శిశువుల ప్రాణరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా అంబులెన్స్‌లోనే సకల వైద్య సదుపాయాలను కల్పించింది. కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచి్చంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో దేశంలోనే మొదటి సారిగా అంబులెన్స్ వైద్య సేవలు ప్రవేశపెట్టారు. ఇవి సత్పలితాలను ఇస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో రెండు నియోనేటల్ అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. నవజాత శిశువులను సంరక్షించేందుకు అన్ని వసతులు 108లోనే ఉంచిన దృశ్యం ఆధునాతన సేవలతో.. నియోనేటల్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు అంబులెన్స్‌లు కాకినాడ కేంద్రంగా ఒకటి, రంపచోడవరం కేంద్రంగా మరొకటి అందుబాటులో ఉన్నాయి. బేబీ వార్మర్స్, పీడియాట్రిక్ వెంటిలేటర్, ఇంక్యుబేటర్, నిరంతర ఆక్సిజన్ సరఫరా వంటి అత్యవసరమైన అన్ని రకాల పరికరాలు వాహనంలో ఉన్నాయి. నియోనేటల్ ఇంటెన్సివ్‌కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో లభించే అన్ని సదుపాయాలూ ఉండటం ఈ వాహన ప్రత్యేకత. అత్యవసర వైద్య సేవలు అవసరమైతే ఈ అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు అంబులెన్స్‌లోనే ప్రాథమికంగా చర్యలు చేపడుతున్నారు. ఆసుపత్రులతో అనుసంధానం జిల్లాలో అత్యధిక ప్రసవాలు జరిగే ప్రభుత్వ ఆసుపత్రులు 9 ఉన్నాయి. అత్యవసర వైద్య సేవలకు కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రుల్లో స్పెషల్ నియోనేటల్ ఇంటెన్సీవ్‌కేర్‌యూనిట్లు (ఎస్ఎన్సీయూ)లు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలు పని చేసే ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సామాజిక కేంద్రాల్లో కాన్పు అనంతరం పుట్టిన బిడ్డకు సమస్య వస్తే కాకినాడ లేదా రాజమహేంద్రవరం తరలిస్తున్నారు. దీనివల్ల గతంలో కాలహరణంతో మార్గ మధ్యలో చిన్నారులు మరణిస్తున్న సంఘటనలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ఎస్ఎన్సీయూ ఉన్న ఆసుపత్రులు, ఎస్ఎన్సీయూ లేకుండా కాన్పులు జరిగే ఆసుపత్రులతో 108 అంబులెన్స్‌లు అనుసంధానంగా సేవలందిస్తున్నాయి. వాహనంలోనే కొంత వైద్యం ప్రారంభిస్తూ ఊపిరిపోస్తున్నాయి. సేవలను వినియోగించుకోవాలి పేద పిల్లల అత్యవసర వైద్య సేవలకు ప్రభుత్వం కల్పించిన 108 అంబులెన్స్ సదుపాయాన్ని అవసరమైన వారు వినియోగించుకోవచ్చు. మెరుగైన వైద్య సేవల కోసం ఆసుపత్రికి తరలించేలోగా అన్ని రకాల అత్యవసర సేవలను అందజేస్తున్నాం. అత్యాధునిక వైద్య పరికరాలు అంబులెన్స్‌లో ఉన్నాయి. పసి బిడ్డల ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ అంబులెన్సులను ప్రవేశపెట్టారు. – సిహెచ్ అవినాష్, 108 జిల్లా మేనేజర్ -
వింత: శిశువు కాలికి తొమ్మిది వేళ్లు
సాక్షి, బళ్లారి: కాలికి తొమ్మిది వేళ్లతో శిశువు జన్మించిన అరుదైన ఘటన హొసపేటెలో చోటు చేసుకుంది. హొసపేటె తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి కాన్పు కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. బుధవారం ఆమె మగబిడ్డకు జన్మ ఇచ్చింది. అయితే శిశువు ఎడమ కాలికి తొమ్మిది వేళ్లు ఉండటం వైద్యులను ఆశ్చర్యపరిచింది. ఇలా తొమ్మిది వేళ్లతో జన్మించిన బాలురు ప్రపంచంలో 20 మంది ఉన్నారని వైద్యులు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
ఎందుకిలా చేశావమ్మా..!?
‘అమ్మా.. రోజులు మారిపోతున్నాయ్. అమ్మో.. ఆడపిల్ల అనుకుని మమ్మల్ని కనిపెంచడానికి మీరు ఎందుకు బెదిరిపోతున్నారో.. పురిట్లోనే ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదమ్మా. ఈ కాలంలో ఆడపిల్ల అన్నింట్లో ముందుంటుంది. మహాలక్ష్మీకి మారుపేరుగా మీ ఇంటి ముంగిట్లో సిరులు చిందిస్తోంది. ఇదివరకు ఆడపిల్లను కనడానికి మీలాంటి తల్లులు వెనకంజ వేసిన అనర్థం ఫలితంగా ఇప్పటికే కొన్ని సామాజిక వర్గాల్లో ఎదురు కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకునే సంస్కృతి వచ్చేసింది. కాస్త ఊపిరినిచ్చి.. ఊతమివ్వండి చాలమ్మా.. మమ్మల్ని మేము తీర్చిదిద్దుకుంటాం. ఈకాలం ఆడపిల్ల మీకు భారం కాదని నిరూపిస్తాం.. అమ్మా..కాస్త కనికరించండి..కని పెంచండి’.. పదిరోజుల వ్యవధిలో జగిత్యాల జిల్లాలోని రెండు చోట్ల పురిట్లోనే తల్లి పొత్తిళ్ల నుంచి ముళ్ల పొదల పాలైన ఆడశిశువుల ఆక్రందనకు ఇది అక్షరరూపం. కోరుట్ల(కరీంనగర్) : జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో ఈ నెల 1వ తేదీన వేకువజామున ఆడశిశువును చంపి వదిలేసిన సంఘటను మరవకముందే కోరుట్లలో ఓ ఆడశిశువును పురిట్లోనే ముళ్ల పొదల్లో వదిలేసిన సంఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్‌లోని రామకృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అక్కడ ఉండే స్థానికుల కు శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన ఆడశిశువును వదిలేసి వెళ్లిన వైనం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకుడు కస్తూరి లక్ష్మీనారాయణ అక్కడికి వచ్చి వెంటనే శిశువును స్థానిక పిల్లల ఆసుపత్రికి పంపించారు. డాక్టర్ దిలీప్‌రావు శిశువుకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం బాగానే ఉందని నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరుట్ల ఎస్సై రాజునాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆసుపత్రిలో ఉన్న శిశువును ఐసీడీఎస్ సీడీపీవో తిరుమలదేవి, సూపర్వైజర్ ప్రేమలత కు అప్పగించారు. అక్కడి నుంచి శిశువును కరీంనగర్‌లోని శిశుగృహాకు తరలించారు. కన్నతల్లిని గుర్తించారు.. ఆడశిశువు దొరికిన వైనం కోరుట్లలో కలకలం రేపగా కోరుట్ల సీఐ సతీష్‌చందర్‌రావు అధ్వర్యంలో ఎస్సై రాజునాయక్ శిశువును తీసుకువచ్చి వదిలేశారన్న విషయాన్ని ఆరా తీశారు. సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన తర్వాత ఝాన్సీరోడ్‌లోనే నివాసముండే బాణాల రేఖ అనే మహిళ శిశువును వదిలేసి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. ఆ వెంటనే పోలీసులు ఆమెను ప్రశ్నించి ఆసుపత్రికి తరలించారు. బాణాల రేఖ భర్త కృష్ణ కొడిమ్యాలలో ట్రాన్స్‌కో లైన్మెన్గా పనిచేస్తున్నారు. రేఖతో పాటు ఆమె అక్కను బాణాల కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. కృష్ణ మొదటి భార్యకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు. రెండో భార్య రేఖకు ఇద్దరు ఆడశిశువులు ఉన్నారు. ఈ క్రమంలో మరో ఆడశిశువును పెంచడం భారంగా భావించి వదిలేసేందుకు నిశ్చయించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న కృష్ణకు ఈ మధ్యే కొడిమ్యాలకు బదిలీ అయినట్లు సమాచారం. కోరుట్లలో ఇల్లు ఖాళీ చేసి ఇద్దరు భార్యలతో కలిసి కొడిమ్యాలలో అద్దె ఇల్లు తీసుకుని ఉండేందుకు యత్నిస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి ఆడశిశువును వదిలేసిన సంఘటన కోరుట్లలో కలకలం రేపింది. పోలీసులు ఆడశిశువును వదిలేసిన తల్లి రేఖపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముస్లిం చిన్నారికి ‘నరేంద్ర మోదీ’ పేరు
గోండా(యూపీ): ప్రధాని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలైన ఓ ముస్లిం మహిళ తన నవజాత శిశువుకి ‘నరేంద్ర దామోదర్ దాస్ మోదీ’అని పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇక్కడి పర్సాపూర్ మహరార్ గ్రామానికి చెందిన మైనాజ్ బేగం లోక్‌సభ ఫలితాలు వెల్లడై నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో గెలిచిన రోజే తన బిడ్డకు ఆయన పేరు పెట్టాలనే ఆలోచనకు వచ్చింది. ‘మేమందరం ఆమె అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నించాం. కానీ ఆమె తన ఆలోచనను అస్సలు మార్చుకోలేదు. ఇదే విషయాన్ని దుబాయిలో ఉన్న తన భర్త ముస్తాక్ అహ్మద్‌కు తెలుపగా ఆయన కూడా ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఆమె ఎంతకీ వినకపోవడంతో చివరికి ఆమె కోరిక మేరకే పేరు పెట్టేందుకు ఒప్పుకున్నాడు’అని మైనాజ్ బేగం మామ ఐద్రీస్ తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడి పేరుతో పుట్టిన తేదీ సర్టిఫికెట్ పొందడానికి ఆ జిల్లా మెజిస్ట్రేట్‌లో అఫిడవిట్ దాఖలు చేసి, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (పంచాయతీ) ఘనశ్యామ్ పాండేకు సమర్పించారు. -
అట్టపెట్టెలో మృతశిశువు
బూర్గంపాడు : బూర్గంపాడు–కుక్కునూరు రహదారిలో కిన్నెరసాని బ్రిడ్జి సమీపంలో ఓ అట్టపెట్టెలో మృతశిశువును స్థానికులు గురువారం ఉదయం గమనించారు. వారిచ్చిన సమాచారంతో బూర్గంపాడు పోలీసులు అక్కడకు వెళ్లారు. ఆ ప్రాంతం ఏపీలో విలీనమైనదిగా గుర్తించి, కుక్కునూరు పోలీసులకు సమాచారమిచ్చారు. మృత శిశువును ఎవరో బూర్గంపాడు నుంచి తీసుకెళ్లి ఇక్కడ ఇలా పెట్టారని స్థానికంగా చర్చ సాగుతోంది. బుధవారం రాత్రి బూర్గంపాడు నుంచి ఓ వ్యక్తి అట్టపెట్టెతో నడుచుకుంటూ వెళుతుండడాన్ని చూసినట్టుగా కొందరు చెబుతున్నారు. -
బిడ్డకు ‘విమానం’ పేరు
కాన్బెర్రా: ఆస్ట్రేలియాకు చెందిన జెట్‌స్టార్ విమానంలో గురువారం ఒక మహిళ ప్రసవించింది. సిబ్బంది సహాయానికి గుర్తుగా ఆ బిడ్డకు తల్లి విమానయాన సంస్థ పేరే పెట్టింది. జెట్‌స్టార్ విమానయాన సంస్థ నాలుగు గంటల కన్నా తక్కువ సమయం పట్టే ప్రయాణాలకు గర్భిణులను 40వ వారం వరకు అనుమతిస్తుంది. సింగపూర్ నుంచి మయన్మార్‌కు వెళ్తున్న విమానమెక్కిన ఆ మహిళకు ప్రయాణం మధ్యలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో విమానంలో ముగ్గురు వైద్యులున్నారు. వారి సహాయంతో విమాన సిబ్బంది ప్రసవానికి ఏర్పాట్లు చేశారు. పిల్లాడికి మహిళ ‘జెట్‌స్టార్’ అని పేరు పెట్టింది. -
కసాయి తల్లిదండ్రులు
గుంటూరు: గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కనిగండ్లలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు రోదనను విని, వెళ్లి చూడగా ప్లాస్టిక్ కవర్లో పసిగుడ్డు కనిపించింది. దీంతో వారు శిశువును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, సమాచారం అందించారు. (పెదకూరపాడు)