
గోండా(యూపీ): ప్రధాని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలైన ఓ ముస్లిం మహిళ తన నవజాత శిశువుకి ‘నరేంద్ర దామోదర్ దాస్ మోదీ’అని పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇక్కడి పర్సాపూర్ మహరార్ గ్రామానికి చెందిన మైనాజ్ బేగం లోక్‌సభ ఫలితాలు వెల్లడై నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో గెలిచిన రోజే తన బిడ్డకు ఆయన పేరు పెట్టాలనే ఆలోచనకు వచ్చింది. ‘మేమందరం ఆమె అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నించాం. కానీ ఆమె తన ఆలోచనను అస్సలు మార్చుకోలేదు.
ఇదే విషయాన్ని దుబాయిలో ఉన్న తన భర్త ముస్తాక్ అహ్మద్‌కు తెలుపగా ఆయన కూడా ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఆమె ఎంతకీ వినకపోవడంతో చివరికి ఆమె కోరిక మేరకే పేరు పెట్టేందుకు ఒప్పుకున్నాడు’అని మైనాజ్ బేగం మామ ఐద్రీస్ తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడి పేరుతో పుట్టిన తేదీ సర్టిఫికెట్ పొందడానికి ఆ జిల్లా మెజిస్ట్రేట్‌లో అఫిడవిట్ దాఖలు చేసి, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (పంచాయతీ) ఘనశ్యామ్ పాండేకు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment