ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన
ఎటావా/సీతాపూర్: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలను పక్కనపెట్టి, కేవలం సొంత కుటుంబాల బాగు కోసమే ఆరాటపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. రాబోయే తరాల కోసం మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి తాను శ్రమిస్తున్నానని చెప్పారు. తనకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బిడ్డలు లేరని, ప్రజల బిడ్డల శ్రేయస్సు కోసం తాము తపన పడుతున్నామని వివరించారు.ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా, దౌరాహ్రాలో సార్వత్రిక
ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే 1,000 సంవత్సరాల పాటు భారత్ శక్తివంతమైన దేశంగా కొనసాగడానికి పునాది రాయి వేస్తున్నానని ప్రకటించారు. తాను ఉన్నా, లేకున్నా భారతదేశం ఉంటుందని, అందుకే దేశాన్ని శక్తివంతంగా మార్చాలని సంకలి్పంచానని స్పష్టం చేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టల నాయకులు కేవలం సొంత భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కోసమే ఎన్నికల్లో నెగ్గాలనుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నేతలు వారి కుటుంబాలకు, ఓటు బ్యాంక్‌కు మాత్రమే లబ్ధి చేకూర్చాలని తహతహలాడుతున్నారని మండిపడ్డారు. బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే...
మోదీ వారసత్వం అంటే ఇదే..
‘‘వారసత్వ పార్టీల నేతలు సాధించేదేమిటి? కార్లు, బంగళాలు, రాజకీయ పలుకుబడి సంపాదించుకోవడం తప్ప వారికి ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఏం తెలుసు? ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి, కన్నౌజ్, ఎటావా లోక్‌సభ స్థానాలను కొందరు వారి సొంత సామ్రాజ్యాలు అనుకుంటున్నారు. మరికొందరు ఆమేథీ, రాయ్‌బరేలీని వారి సొంత జాగీర్లుగా భావిస్తున్నారు. నా వారసత్వం ప్రజలందరికీ చెందుతుంది.
2047లో పేద ప్రజల కుమారులు, కుమార్తెలు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కావాలన్నదే నా కోరిక. రాజకుటుంబాల వారసులు మాత్రమే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యే దుష్ట సంప్రదాయాన్ని ఈ చాయ్‌వాలా బద్ధలు కొట్టాడు. సమాజంలో దురాచారాలపై నిషేధం కోసం పోరాడిన రాజారామ్ మోహన్ రాయ్‌ను ఇప్పటికీ స్మరించుకుంటున్నాం. పాత సంప్రదాయానికి చరమగీతం పాడేసి, పేదల బిడ్డలు సైతం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేసిన ప్రధానమంత్రి ఉండేవాడు, ఆయన ఒక చాయ్‌వాలా అని భవిష్యత్తు తరాలు చెప్పుకొనే రోజు వస్తుంది. మోదీ వారసత్వం అంటే పేదలకు పక్కా ఇళ్లు, కోట్లాది మంది మహిళలకు మరుగుదొడ్లు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు విద్యుత్, గ్యాస్ కనెక్షన్, కుళాయి నీళ్లు.
ఓటు బ్యాంక్ కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మట్లేదు
కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి తమను పావులుగా వాడుకుంటున్నాయని ముస్లింలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వారు విపక్షాలకు దూరంగా ఉంటున్నారు. ఓటు బ్యాంక్ కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మడం లేదు. ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రభుత్వ పథకాలతో మైనార్టీలూ లబ్ధి పొందుతున్నారు. దూరమవుతున్న ముస్లిం ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు కొత్త ఆట మొదలుపెట్టాయి. బుజ్జగింపు వ్యవహారాలకు దిగుతున్నాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని బాబా సాహెబ్ అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ స్పష్టం చెప్పారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని మొండిగా వాదిస్తున్నాయి.
కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా?
కాంగ్రెస్ రాజకుమారుడు ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో ఆలయాల చుట్టూ తిరిగాడు. కోటుపై జంధ్యం కూడా ధరించాడు. ఈసారి మాత్రం ఆయన ఆలయాలకు వెళ్లడం మానేశారు. అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత ఆలయం నిర్మించుకున్నాం. దేశ ప్రజలంతా సంతోíÙంచారు. రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరు కావాలంటూ ఆహ్వానం పంపిస్తే కాంగ్రెస్ నాయకులు తిరస్కరించారు. నేను ద్వారకలో సముద్రగర్భంలో కృష్ణుడికి పూజలు చేయడాన్ని కాంగ్రెస్ రాజకుమారుడు విమర్శించాడు. కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా?’’ అని ప్రధాని మోదీ ఆక్షేపించారు.
అయోధ్య బాలరాముడి సేవలో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఆలయ ప్రాణప్రతిష్ట తర్వాత బాలరాముడిని మోదీ దర్శించుకోవడం ఇదే మొదటిసారి. అనంతరం అయోధ్యలో రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment