హరియాణాలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ధ్వజం
చండీగఢ్: విపక్ష కాంగ్రెస్ రాజకీయాలు తప్పుడు హామీలకే పరిమితం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. బీజేపీ రాజకీయాలు మాత్రం ప్రజా శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేసేలా ఉంటాయని అన్నారు. నిస్వార్థమైన శ్రమపై, ఫలితాలపై తాము దృష్టి పెట్టామని వెల్లడించారు. మంగళవారం హరియాణాలోని పాల్వాల్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో బీజేపీ ప్రభంజనం కనిపిస్తోందన్నారు. తమ ప్రచార సభలకు జనం భారీ సంఖ్యలో హాజరై తమను ఆశీర్వదిస్తుండడం ఆనందంగా ఉందన్నారు.జమ్మూకశ్మీర్‌లో చివరి దశ పోలింగ్‌లో జనం పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, ప్రజాస్వామ్య వేడుకలో పాలుపంచుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఓటర్లంతా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
హరియాణాలో గత పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి కచి్చతంగా గెలుస్తామని ఆశలు పెట్టుకుందని ప్రధాని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోనూ ఇలాగే ఆశలు పెంచుకొని భంగపడిందని గుర్తుచేశారు. రాజస్తాన్‌లో రైతులను, యువతను బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రయతి్నంచిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. హరియాణాలోనూ కాంగ్రెస్‌కు అలాంటి పరాభవం తప్పదని తేలి్చచెప్పారు. ఆ పార్టీని జనం మట్టికరిపిస్తారని స్పష్టం చేశారు.
కష్టపడి పనిచేయాలనే సందేశాన్ని హరియాణా గడ్డపైనుంచి భగవద్గీత తమకు అందిస్తోందని ప్రధాని మోదీ వివరించారు. పని చేయకు, చేయనివ్వకు అనేది కాంగ్రెస్ ఫార్ములా అని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే హరియాణాలో అధికారంలో ఉండడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఈ నెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 8న ఫలితాలు వెలువడుతాయి.
Comments
Please login to add a commentAdd a comment