Omega Seiki Mobility rolls out e-autorickshaw for urban markets - Sakshi
Sakshi News home page

ఒమేగా సీకి ఎలక్ట్రిక్‌ ఆటో.. ఒక్క చార్జ్‌తో 80 కిలోమీటర్లు

Published Wed, Jun 21 2023 10:09 AM | Last Updated on Wed, Jun 21 2023 10:22 AM

Omega Seiki Mobility rolls out e autorickshaw - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న ఒమేగా సీకి మొబిలిటీ తాజాగా ప్యాసింజర్‌ వెహికిల్స్‌ విభాగంలోకి ప్రవేశించింది. స్ట్రీమ్‌ సిటీ ఏటీఆర్‌ ధర ఎక్స్‌షోరూంలో రూ.1.85 లక్షలు. వాహనం నుంచి బ్యాటరీని విడదీయవచ్చు. ఒకసారి చార్జింగ్‌తో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. స్ట్రీమ్‌ సిటీ 8.5 ధర రూ.3.01 లక్షలు. ఫిక్స్‌డ్‌ బ్యాటరీతో రూపొందింది. ఒకసారి చార్జింగ్‌తో 117 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

తయారీ సామర్థ్యాన్ని అయిదింతలు పెంచినట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 యూనిట్ల ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలను విక్రయించాలన్నది కంపెనీ లక్ష్యం. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, ఫోర్‌ వీలర్లను సైతం ఒమేగా సీకి మొబిలిటీ తయారు చేస్తోంది. దేశవ్యాప్తంగా సంస్థకు 175కుపైగా డీలర్‌షిప్‌ కేంద్రాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement