హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా ఏస్ మినీ ట్రక్‌ను ఎలక్ట్రిక్ వేరియంట్‌లో ప్రవేశపెట్టింది. ఈవోజెన్ పవర్‌ట్రైన్‌తో 27 కిలోవాట్ (36 హెచ్‌పీ) మోటార్‌ను పొందుపరిచింది.
ఒకసారి చార్జింగ్ చేస్తే 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 39,000 యూనిట్ల ఏస్ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరాకు ఇప్పటికే ఆర్డర్ దక్కించుకుంది.
అమెజాన్, బిగ్‌బాస్కెట్, సిటీ లింక్, డాట్, ఫ్లిప్‌కార్ట్, లెట్స్ ట్రాన్స్‌పోర్ట్, మూవింగ్, యేలో ఈవీ కంపెనీలకు ఏస్ ఎలక్ట్రిక్‌ను సరఫరా చేయనుంది. కాగా, ఏస్ మినీ ట్రక్‌ను కంపెనీ 2005లో భారత్‌లో పరిచయం చేసింది. 20 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించింది.
చదవండి👉తగ్గేదేలే..! ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా మోటార్స్ దూకుడు..!
Comments
Please login to add a commentAdd a comment