Electric Auto
-
కొత్త సెగ్మెంట్లోకి టీవీఎస్ ఎలక్ట్రిక్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలో సుస్థిర స్థానం దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ త్రీ–వీలర్స్ సెగ్మెంట్లోకి ఈ ఏడాదే ఎంట్రీ ఇస్తోంది. కంపెనీ ఇప్పటికే పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీతో నడిచే మూడు రకాల ప్యాసింజర్, ఒక కార్గో రకం త్రిచక్ర వాహనాలను కింగ్ పేరుతో పలు వేరియంట్లలో విక్రయిస్తోంది.భారత త్రిచక్ర వాహన విపణిలో సెప్టెంబర్‌లో అన్ని కంపెనీలవి కలిపి 1,06,524 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2,009 యూనిట్ల విక్రయాలతో టీవీఎస్ వాటా 1.89 శాతం నమోదైంది. 2023 సెప్టెంబర్‌లో ఇది 1.34 శాతంగా ఉంది. మూడవ ఈ–టూ వీలర్.. సంస్థ నుంచి మూడవ ఈ–టూ వీలర్ మోడల్‌ను మార్చికల్లా ప్రవేశపెట్టనున్నట్టు టీవీఎస్ ప్రకటించింది. 2024 ఆగస్ట్ వరకు ఈ–టూ వీలర్స్ అమ్మకాల్లో భారత్‌లో రెండవ స్థానంలో కొనసాగిన టీవీఎస్ మోటార్.. సెప్టెంబర్‌లో మూడవ స్థానానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అర్ధ భాగంలో కంపెనీ నుంచి దేశవ్యాప్తంగా 1.27 లక్షల యూనిట్ల ఈ–స్కూటర్స్ రోడ్డెక్కాయి. 2023 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఈ సంఖ్య 96,191 యూనిట్లు నమోదైంది. దీర్ఘకాలంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం, సాంకేతికతలలో పెట్టుబడులు, రిటైల్ విస్తరణపై దృష్టిసారించింది.భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని టీవీఎస్ యాజమాన్యం ఇప్పటికే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200–1,400 కోట్ల మూలధన వ్యయం చేయాలని టీవీఎస్ నిర్ణయించింది. ఇందులో 70 శాతం ఈవీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) విభాగాలలో నూతన ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అభివృద్ధికి, అలాగే డిజిటల్ సామర్థ్యాలను నిర్మించడానికి ఖర్చు చేస్తారు. ఇవీ ప్రస్తుత ఈ–టూ వీలర్ మోడళ్లు.. ప్రస్తుతం కంపెనీ ఖాతాలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. టీవీఎస్ ఎక్స్ మోడల్ ఈ–స్కూటర్‌ను రూ.2,49,990 ఎక్స్‌షోరూం ధరలో విక్రయిస్తోంది. ఒకసారి చార్జింగ్‌తో ఇది 140 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని 2.6 సెకన్లలో అందుకుంటుంది. అలాగే టీవీఎస్ ఐక్యూబ్ ఈ–స్కూటర్‌ను రూ.89,999 నుంచి రూ.1,85,373 వరకు ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. వేరియంట్‌నుబట్టి ఒకసారి చార్జింగ్‌తో 75–150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. -
Project Gagan: అయిదేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ ఆటోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ జీరో21 తాజాగా ప్రాజెక్ట్ గగన్‌ను ప్రారంభించింది. దీని కింద వచ్చే అయిదేళ్లలో 1 లక్ష ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ఆవిష్కరించాలని నిర్దేశించుకుంది. సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలను రెట్రో ఫిట్టింగ్ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్‌కి మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్సే్చంజ్ చేయడం ద్వారా దీన్ని సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కన్వర్షన్ కిట్‌ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు రాణి శ్రీనివాస్ తెలిపారు. దీనితో ఏదైనా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో (ఐసీఈ) నడిచే త్రీ–వీలర్లను కేవలం నాలుగు గంటల్లోనే ఎలక్ట్రిక్ వాహనంగా మార్చవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గి, డ్రైవర్లకు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనం లభించగలవని శ్రీనివాస్ వివరించారు. ప్రధానంగా ఆటో రిక్షా యజమానులు, ఫ్లీట్ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ గగన్‌ను చేపట్టినట్లు ఆయన చెప్పారు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ)ని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలతో వాయు, ధ్వని కాలుష్యం తగ్గగలదని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే జీరో21 సంస్థ ప్యాసింజర్, లోడ్ క్యారియర్ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను తయారు చేస్తోంది. అలాగే రెట్రోఫిట్ కిట్లను కూడా అందిస్తోంది. -
బజాజ్ చేతక్ ప్రీమియం బైక్ వచ్చేస్తోంది.. ఎలా ఉందో చూశారా?
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ శుక్రవారం చేతక్ అర్బేన్, ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయనుంది. అయితే ఈ బైక్ ధరలు ప్రస్తుతం ఈవీ మార్కెట్లో లీడింగ్‌లో ఉన్న ఓలా, ఎథేర్ ఈవీ స్కూటర్ల కంటే తక్కువేనని తెలుస్తోంది. ఓలా ఎస్1 ప్రో (రూ1,47,499), ఎథేర్ 450 ఎక్స్ (రూ.1,37,999) ధరలు ఇలా ఉండగా చేతక్ అర్బేన్ ధర రూ.1.15లక్షలు, చేతక్ ప్రీమియం ఎక్స్ షోరూం ధర రూ.1.35లక్షలుగా ఉంది. బజాజ్ సంస్థ 2019లో తొలిసారి చేతక్ ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది. నాటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 140 నగరాల్లో లక్షకు పైగా వెహికల్స్‌ను అమ్మింది. ఇక తాజాగా విడుదల చేయనున్న రెండు వేరియంట్లలో 3.2 కేడబ్ల్యూ బ్యాటరీతో రానుంది. 127 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణించచ్చు. అదనంగా చేతక్ ప్రీమియంలో 800 డబ్ల్యూ ఛార్జర్‌తో రానుంది. ఈ సదుపాయంతో చేతక్ ను 30 నిమిషాల్లో 15.6 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించవచ్చు. టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు వరకు ప్రయాణించ్చు. ఇక ఈ బైక్‌లో బ్లూటూత్, యాప్ కనెక్టివిటీ, నోటిఫికేషన్ అలెర్ట్‌ల కోసం కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. కొత్త టీఎఫ్టీ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీ, యాప్ ఆధారిత టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్/మ్యూజిక్ అలర్ట్‌లు, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్)ని అనుసంధానం చేస్తుందని భావిస్తున్నారు. కాగా ఈవీ మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో, ఎథేర్ 450 ఎక్స్, సింపుల్ వన్లు.. బజాజ్ చేతక్‌తో పోటీ పడనున్నాయి. -
ఒమేగా సీకి ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్క చార్జ్‌తో 80 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న ఒమేగా సీకి మొబిలిటీ తాజాగా ప్యాసింజర్ వెహికిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. స్ట్రీమ్ సిటీ ఏటీఆర్ ధర ఎక్స్‌షోరూంలో రూ.1.85 లక్షలు. వాహనం నుంచి బ్యాటరీని విడదీయవచ్చు. ఒకసారి చార్జింగ్‌తో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. స్ట్రీమ్ సిటీ 8.5 ధర రూ.3.01 లక్షలు. ఫిక్స్డ్ బ్యాటరీతో రూపొందింది. ఒకసారి చార్జింగ్‌తో 117 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తయారీ సామర్థ్యాన్ని అయిదింతలు పెంచినట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 యూనిట్ల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలను విక్రయించాలన్నది కంపెనీ లక్ష్యం. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లను సైతం ఒమేగా సీకి మొబిలిటీ తయారు చేస్తోంది. దేశవ్యాప్తంగా సంస్థకు 175కుపైగా డీలర్షిప్ కేంద్రాలు ఉన్నాయి. -
చిన్న మున్సిపాల్టిలకు ఈ–ఆటోలు.. నేడు ప్రారంభించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృడ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెడుతున్నారు. తద్వారా ఆ మున్సిపాల్టి లకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించనున్నారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది. త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రూ.157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు నిరి్మస్తున్నారు. 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్ టు కంపోస్ట్, నాలుగు బయో మిథనేషన్ ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 టీపీఐఎస్‌లు, లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీల్లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా చిన్న మున్సిపాలిటీల్లో ఈ–ఆటోలు ప్రవేశపెడుతున్నారు. -
మార్కెట్లో కి కొత్త సూపర్ ఆటో అబ్బురపరిచే ప్రత్యేకతలు..!
-
ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఆటోలు.. ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మురుగప్ప గ్రూప్‌లో భాగమైన మోట్రా ఎలక్ట్రిక్ సూపర్ ఆటో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో తమ వాహనాలను ప్రవేశపెట్టింది. విజయవాడ, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో ఇవి టెస్ట్ రైడ్లకు అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ కేకే పాల్ తెలిపారు. దీని ధర రూ. 3.02–3.45 లక్షల వరకు (సబ్సిడీ అనంతరం ఎక్స్ షోరూం రేటు) ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలోని ఖమ్మం, మంచిర్యాలలో కూడా వీటిని అందుబాటులోకి తెచి్చనట్లు చెప్పారు. సింగిల్ చార్జితో ప్రామాణికంగా 197 కి.మీ., సాధారణ పరిస్థితుల్లో 160 కి.మీ. ఈ సూపర్ ఆటోల రేంజి ఉంటుందని ఆయన వివరించారు. ఇవి గరి ష్టంగా గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. 3 ఏళ్లు / 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో పాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 2 ఏళ్ల ఎక్స్టెండెడ్ వారంటీ మొదలైన ఆప్షన్లు ఉంటాయి. ఆసక్తి గల వారు స్వల్ప రిఫండబుల్ మొత్తాన్ని చెల్లించి ప్రీ–బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది -
ఐక్యతా విగ్రహం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం!
అహ్మదాబాద్: గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఉన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. స్టాచ్యు ఆఫ్ యూనిటీ పరిసరాల్లో టూరిస్టులను తిప్పే 15 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో మంటలు చెలరేగాయి. అయితే, ఛార్జింగ్ చేస్తుండగానే మంటలు అంటుకున్నట్లు వస్తున్న వార్తలను స్టాచ్యు ఆఫ్ యూనిటీ ఏరియా డెవలప్మెంట్, టూరిజం గవర్నెన్స్ అథారిటీ తిరస్కరించింది. ఛార్జింగ్ పాయింట్‌కు 35 అడుగుల దూరంలో ఉన్నాయని స్పష్టం చేసింది. ఐక్యతా విగ్రహం వద్దకు వచ్చే టూరిస్టుల కోసం 90 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. వాటికి స్థానిక ట్రైబల్ మహిళలు డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. ‘గురువారం తెల్లవారుజామున కెవాడియా గ్రామం సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్ వద్ద నిలిపి ఉంచిన 15 ఆటో రిక్షాలల్లో మంటలు చెలరేగాయి. అందుకు గల కారణాలు తెలియరాలేదు. ఛార్జింగ్ స్టేషన్‌కు 35 అడుగుల దూరంలో వాటిని నిలిపి ఉంచారు. దాంతో ఛార్జింగ్ చేస్తుండగా మంటలు వచ్చాయనేందుకు సరైన ఆధారాలు లేవు.’ అని ఓ ప్రకటన జారీ చేసింది ఎస్ఓయూఏడీటీజీఏ. మంటలపై సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఇతర వాహనాలకు వ్యాపించకముందే మంటలను ఆర్పివేసింది. ఈ సంఘటనపై ఆటో రిక్షాలను నిర్వహిస్తోన్న ప్రైవేటు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
టాటా ఎలక్ట్రిక్ వెహికల్,లాంచ్ చేసిందో లేదో.. హాట్ కేకుల్లా బుకింగ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా ఏస్ మినీ ట్రక్‌ను ఎలక్ట్రిక్ వేరియంట్లో ప్రవేశపెట్టింది. ఈవోజెన్ పవర్‌ట్రైన్‌తో 27 కిలోవాట్ (36 హెచ్‌పీ) మోటార్‌ను పొందుపరిచింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 39,000 యూనిట్ల ఏస్ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరాకు ఇప్పటికే ఆర్డర్ దక్కించుకుంది. అమెజాన్, బిగ్‌బాస్కెట్, సిటీ లింక్, డాట్, ఫ్లిప్‌కార్ట్, లెట్స్ ట్రాన్స్పోర్ట్, మూవింగ్, యేలో ఈవీ కంపెనీలకు ఏస్ ఎలక్ట్రిక్‌ను సరఫరా చేయనుంది. కాగా, ఏస్ మినీ ట్రక్‌ను కంపెనీ 2005లో భారత్‌లో పరిచయం చేసింది. 20 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించింది. చదవండి👉తగ్గేదేలే..! ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా మోటార్స్ దూకుడు..! -
హైదరాబాద్: మెట్రో ప్రయాణికులకు శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి చేరుకునేందుకు మెట్రో రైడ్ పేరుతో ఈ– ఆటో సేవలు ప్రారంభమయ్యాయి. గురువారం పరేడ్‌గ్రౌండ్ స్టేషన్ పార్కింగ్‌లో హెచ్ఎం ఆర్ఎల్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో రైల్ సీఈవో ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రోరైడ్ కో–ఫౌండర్ గిరిష్ నాగ్‌పాల్, షెల్ ఫౌండేషన్ ప్రతినిధి తహసీన్ ఆలమ్, డబ్ల్యూ ఆర్ ఐ ఇండియా డైరెక్టర్ పవన్ ములుకుట్లలతో కలిసి ఈ– ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్ చేరుకోవాలంటే ప్రైవేటు ఆటోల కంటే మెట్రో ఆటోల్లో చార్జీలు తక్కువ అని అన్నారు. మొదటి కిలోమీటర్‌కు పది రూపాయలు తర్వాత ప్రతి కిలో మీటరుకు ఆరు రూపాయల చొప్పున చార్జీలు ఉంటాయని చెప్పారు. ఆటోను బుక్ చేసుకునేందుకు మెట్రోరైడ్ ఇండియా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరేడ్ గ్రౌండ్స్, రాయదుర్గం మెట్రో స్టేషన్ల వద్ద 50 ఎలక్ట్రికల్ ఆటలతో ప్రారంభిస్తున్నామని, దశలవారీగా అన్ని మెట్రో స్టేషన్లకు ఈ సేవలు విస్తరిస్తామని చెప్పారు. మెట్రో సంస్థపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని, ఫేజ్– 2లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు సేవలను రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. -
ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త..!
కొత్తగా ఎలక్ట్రిక్ వాహనం కొనాలని చూస్తున్న వారికి ఢిల్లీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద రుణాలపై ఈ-ఆటోల కొనుగోలు చేస్తే వారికి ప్రభుత్వం ఐదు శాతం వడ్డీ రాయితీని అందిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో ఇలాంటి గొప్ప అవకాశాన్ని అందిస్తున్న మొదటి రాష్ట్రం ఢిల్లీ అని తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఇఎస్ఎల్)తో కలిసి వెబ్సైట్(https://www.myev.org.in)ను అభివృద్ధి చేసింది. ఈ వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసేవారికి రూ.25,000 అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గహ్లోట్ మాట్లాడుతూ.. "ఈ వెబ్సైట్ వల్ల ప్రభుత్వం దృవీకరించిన వాహనాలు ప్రజలకు అందడంతో పాటు ఎలక్ట్రిక్ ఆటోల రుణాలపై వడ్డీ రాయితీని అందిస్తున్నట్లు" తెలిపారు. 'మై ఈవీ పోర్టల్' అనేది ఆన్ లైన్ పోర్టల్. ఇది లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ఓఐ) హోల్డర్లు ఈ-ఆటోలను కొనుగోలు చేయడానికి, ఢిల్లీ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలను క్లెయిం చేసుకోవడానికి వీలు కలిపిస్తుంది. ఈ ఆన్లైన్ పోర్టల్ రవాణా శాఖ వెబ్సైట్లో కూడా వినియోగదారులకి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ఆటోలపై అందిస్తున్న ప్రోత్సాహకలను త్వరలో దేశ రాజధానిలోని లిథియం-అయాన్ ఆధారిత ఈ-రిక్షాలు, ఇ-కార్ట్ లు మరియు ఎలక్ట్రిక్ లైట్ గూడ్స్ వాహనాలకి అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా మహీంద్రా ఫైనాన్స్, అకాసా ఫైనాన్స్, మన్నాపురం ఫైనాన్స్, రెవ్ఫిన్, ప్రెస్ట్ రుణ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలపై రుణాలను అందించనున్నాయి. (చదవండి: క్యాబ్ డ్రైవర్‌గా మారిన దిగ్గజ కంపెనీ సీఈఓ.. ఎందుకో తెలుసా?) -
ఈ–వాహనాల వృద్ధి.. పవర్ ఫుల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రమంగా విద్యుత్ (ఈ) వాహనాల సంఖ్య పెరుగుతోంది. వీటి సంఖ్య నాలుగేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. 2017లో ద్విచక్రవాహనాలు, త్రిచక్ర వాహనాలు (ఆటోలు), కార్లు కలిపి విద్యుత్ వాహనాల సంఖ్య 5,653 ఉంటే గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 21,565కు పెరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఎలక్ట్రికల్ ఆటోల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2017తో పాటు 2018 సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఆటోలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి 2,587కు పెరిగింది. విద్యుత్ స్కూటర్ల సంఖ్య కూడా నాలుగేళ్ల నుంచి భారీగానే పెరుగుతోంది. 2017లో 3,195 ఎలక్ట్రికల్ స్కూటర్లున్నాయి. వీటి సంఖ్య గత డిసెంబర్ చివరి నాటికి 14,441. విద్యుత్ కార్ల వినియోగం మాత్రం ఇప్పుడే పెరుగుతోంది. 2017లో 2,452 విద్యుత్ కార్లు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 4,537కు చేరింది. చార్జింగ్ స్టేషన్లు వస్తే ఈ–వాహనాలు మరింత పెరుగుతాయి పెట్రోల్, డీజిల్ బంక్‌లు తరహాలో విరివిగా బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల సంఖ్య మరింత పెరుగుతుందని రవాణాశాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరుగుతోందని చెప్పారు. చార్జింగ్ స్టేషన్లు వస్తే వీటి వినియోగం పెరుగుతుందన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలపై పన్ను లేకపోవడం వల్ల కూడా ఇటీవల వాటి వినియోగం పెరుగుతోందని చెప్పారు. విద్యుత్ కార్ల వినియోగం పుంజుకుంటోందన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. -
అంతర్జాతీయంగా అదరగొడుతున్న హైదరాబాద్ ఈవీ స్టార్టప్ కుర్రాళ్ళు..!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మనదేశంలో కూడా అనేక ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. అందులోనూ మన హైదరాబాద్ నగరానికి చెందిన ఒక సంస్థ.. హైదరాబాద్ నుంచి అమెరికా వరకూ ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఏకంగా, ఇతర భాగస్వాములతో కలిసి అమెరికాలోనే వాహనాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. ఇంకా, ఆ దేశంలో ఐపీఓ వెళ్లేందుకు కూడా సిద్దం అవుతుంది. ఆ కంపెనీ పేరే "గాయం మోటర్ వర్క్స్". ఈ కంపెనీని రాజా గాయం, రాహుల్ గాయం, హర్ష బవిరిసెట్టి ఈ ముగ్గురు కలిసి స్థాపించారు. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఆ స్టార్టప్‌కు తోడుగా ఇతర భాగస్వాములతో కలిసి బిలిటీ ఎలక్ట్రిక్ పేరుతో 2021లో మరొక ఈ-వెహికిల్స్ స్టార్టప్‌ను మొదలుపెట్టారు. త్వరలోనే బిలిటీ ఎలక్ట్రిక్ సంస్థను యూఎస్ షేర్ మార్కెట్లో ఐపీఓ లిస్టింగ్ చేస్తామని సీఓఓ బవిరిసెట్టి చెబుతున్నారు. లక్సెంబర్గ్'కి చెందిన GEM(గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్) నవంబర్ 2021లో బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీలో $400 మిలియన్ పెట్టుబడులు పెట్టారు. ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ గమనించిన హైదరాబాద్ నగరానికి చెందిన ఈ ముగ్గురు యువకులు పర్యావరణానికి మేలు చేసే ఈ-వెహికిల్స్ స్టార్టప్ ప్రారంభించాలని భావించారు. 2010లో గయామ్ సోదరులు జీఎండబ్ల్యూను ఏర్పాటు చేయడానికి తండ్రి కర్మాగారాన్ని పునరుద్ధరించారు. ఇక్కడ వారు ఆటోలను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. "మేము టాటా నానోను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనంగా మార్చాము. దీనిని సుమారు ఒక సంవత్సరం పాటు పరీక్షించాము. కానీ, మొదట ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయడానికి బయట నుంచి వీడి భాగాలను కొనుగోలు చేశాము. దీంతో, వాహన ఖర్చు రూ.7-8 లక్షల వరకు పెరిగింది" అని రాహుల్ చెప్పారు. ఆ తర్వాత తయారీ ఖర్చుని తగ్గించేందుకు వీళ్లే సొంతగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్(ఆర్ అండ్ డీ)ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆటో తయారీకి అవసరమైన పరికరాలను, విడి భాగాలను కావలసిన ప్రమాణాలతో సొంతగా తయారు చేస్తున్నారు. సొంతంగా, ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగలను తయారు చేయడంతో ఈవీ ఖర్చు దాదాపు 50% తగ్గిందని రాజా గాయం పేర్కొన్నారు. వాస్తవానికి, స్వాపబుల్ బ్యాటరీల మొదట ప్రతిపాదించిన వారిలో వీరు ఉన్నారు. 2015లో వారి మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్ సిద్ధమైనప్పుడు ఆ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లడానికి గయామ్ సోదరులు హర్ష బవిరిసెట్టిని సహ వ్యవస్థాపకుడిగా బోర్డులోకి తీసుకొని వచ్చారు. పూర్తిగా సొంత టెక్నాలజీతో తయారు చేసిన ఎలక్ట్రిక్ ఆటోను 2015లో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అదే ఏడాది బిగ్ బాస్కెట్ నుంచి 1,500 ఈవీలకు మొదటి పెద్ద ఆర్డర్ వచ్చింది. దీంతో ఆ కంపెనీ దశ తిరిగిపోయింది. ఆ తర్వాత కంపెనీకి ఆర్డర్ల వర్షం కురిసింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఐకియా, ఉబెర్, ఢిల్లీవెరీ వంటి ఈ-కామర్స్ సంస్థల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వచ్చాయి. ప్యాసింజర్, కార్గో రెండురకాల ఆటోలు తయారు చేసి పలు కంపెనీలకు అందజేశారు. అలాగే ఇప్పుడు యుకె, యుఎస్, యూరప్, జపాన్, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాలలో ఈ కంపెనీకి చెందిన వాహనాలు రోడ్డు మీద నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనలకు డిమాండ్ పెరగడంతో సహవ్యవస్థాపకులు గత ఏడాది తమ కంపెనీని బిలిటి ఎలక్ట్రిక్ పేరుతో అమెరికాలో తమ బ్రాంచ్ అక్కడ ఓపెన్ చేశారు. (చదవండి: అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన న్యూ ఏజ్ బాలెనో కారు..!) -
యూపీ ఎన్నికల తర్వాత మళ్లీ బాదుడే!
సిద్దిపేటజోన్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిజస్వరూపం మళ్లీ బహిర్గతం కానుందని, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను మరో పది రూపాయలు పెంచడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ‘బట్టే బాజ్.. ఝూటే బాజ్ పార్టీ బీజేపీ’అని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రైతులకు ఇచ్చే అన్ని సబ్సిడీలను తగ్గించి వారికి భద్రత లేకుండా చేసిం దని కేంద్రం తీరుపై మండిపడ్డారు. సబ్సిడీ తగ్గడంతో ఎరువుల ధరలు పెరుగుతాయన్నారు. విద్యుత్ చట్టంలో సవరణలు చేయాలని, వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మీటర్లను పెట్టాలని కేంద్రం మెలిక పెట్టిందన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదని, గొంతు లో ప్రాణం ఉన్నంతవరకు వాటిని పెట్టబోమని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పార న్నారు. స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు వడ్లు కేంద్రమే కొన్నదని, కానీ యాసంగిలో వడ్లు కొనబోమని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం చెప్పడం రైతుకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. కేంద్రలో బీజేపీ ప్రభుత్వం వల్ల వాతలు, కోతలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీలేదన్నారు. -
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు 2022లో పండగే..!
మీరు ఈ కొత్త ఏడాదిలో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలని చూస్తున్నారా? అయితే, కొద్ది నెలలు ఓపిక పట్టండి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ కాబోతున్నాయి. ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ఎక్కువ వృద్ధిని కనబరిచిన దేశంగా భారత్ నిలిచింది. మరోవైపు, సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్(ఎస్ఎమ్ఈవీ) భారతదేశంలో ఈ ఏడాది మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు సుమారు 10 లక్షల యూనిట్లుగా ఉంటాయని తెలిపింది. ఈ సంఖ్య గత 15 సంవత్సరాలలో విక్రయించిన దానికి సమానం. 2020లో 1,00,736 యూనిట్లతో పోలిస్తే 2021లో 2,33,971 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయించినట్లు ఎస్ఎమ్ఈవీ ఒక ప్రకటనలో తెలిపింది. సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. "గత 15 సంవత్సరాలలో సుమారు 1 మిలియన్ ఈ2డబ్ల్యు, ఈ-త్రీ వీలర్లు, ఈ-కార్లు, ఈ-బస్సులను విక్రయించాము. జనవరి 2022 నుంచి కేవలం ఒక సంవత్సరంలో 1 మిలియన్ యూనిట్లను విక్రయించే అవకాశం" ఉంది అని అన్నారు. హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్(ఫేమ్ 2) వంటి ప్రభుత్వ విధానాలు ఎలక్ట్రిక్ వాహనాల విపరీతమైన డిమాండ్‌కు ప్రధాన కారణం అని గిల్ పేర్కొన్నారు. 5-6 రెట్లు వృద్ధి ఆకర్షణీయమైన ధరలు, తక్కువ నిర్వహణ, వ్యయ ఖర్చులు వంటి కారణంగా వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుత మార్కెట్ గణాంకాల ప్రకారం గత 12 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల పరంగా భారతదేశం 5-6 రెట్లు వృద్ధిని నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2020లో హైస్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్(ఈ2డబ్ల్యులు) అమ్మకాలు 27,206 యూనిట్లతో పోలిస్తే 2021లో 1,42,829 యూనిట్ల అమ్మకాలు జరుగుతున్నాయని ఎస్ఎమ్ఈవీ పేర్కొంది. 2020తో పోలిస్తే 425 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడించింది. (చదవండి: సామాన్యుడినే కాదు..! డీమార్ట్నుకూడా వదల్లేదు..!) -
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలో వాట్‌కు రూ.15 వేల చొప్పున సబ్సిడీని ప్రభుత్వం అందించనుందని రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జానయ్య వెల్లడించారు. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ తేడా లేకుండా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని చెప్పారు. రూ.10 లక్షల విలువైన వాహనాల వరకూ సబ్సిడీ ఉంటుందన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో నగరంలో నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజాలో ‘గో ఎలక్ట్రిక్’పేరుతో రోడ్ షో నిర్వహించనున్నామని తెలిపారు. రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలు, రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలు విలువ చేసే ఆటోలు, రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల విలువ చేసే కార్లను ఈ రోడ్ షోలో ప్రదర్శనకు ఉంచనున్నామన్నారు. 60 స్టాల్స్, చార్జింగ్ పాయింట్లు ప్రదర్శనకు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్‌లో మరో 118 చార్జింగ్ స్టేషన్లు కాలుష్య నిర్మూలనలో భాగంగా నగరంలో 15 ఏళ్లు నిండిన ఆటోలను రెట్రోఫిట్మెంట్ ద్వారా బ్యాటరీలతో నడిచేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేస్తున్నామని జానయ్య చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో 65 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో మరో 118, కరీంనగర్, వరంగల్‌లో 10 చొప్పున చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు. ప్రైవేటు వ్యక్తులు స్థలాలు లీజుకు ఇస్తే చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి వచ్చే ఆదాయంలో వాటా ఇస్తామని చెప్పారు. (చదవండి: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?) -
ఆనంద్ మహీంద్రా గారూ.. మీ ఆటో సూపరే! కానీ..
వ్యాపారాల్లో పోటీతత్వం ఉంటుందని(ఉండాల్సిందే!), వ్యాపారుల మధ్య వైరం మాత్రమే ఉంటుందని అనుకోవడం సహజం. కానీ, ఈరోజుల్లో మార్కెట్‌ను పెంచుకోవాలన్నా, ప్రొడక్టులను ప్రమోట్ చేసుకోవాలన్నా ‘ఫ్రెండ్లీ నేచర్’ కచ్చితంగా ఉండాలని నిరూపిస్తున్నారు మన వ్యాపార దిగ్గజాలు. ఇందుకు సోషల్ మీడియానే వేదికగా మార్చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సాప్ట్వేర్ ఐటీ కంపెనీ ‘జోహో కార్పొరేషన్’ సీఈవో శ్రీధర్ వెంబు, వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్లు చేశారు. శ్రీధర్ వెంబు(53).. జోహో కార్పొరేషన్ సీఈవో. తంజావూరు(తమిళనాడు)లో పుట్టిన శ్రీధర్.. జోహోతో పేరు ప్రఖ్యాతులు, పద్మశ్రీ అవార్డు సైతం సంపాదించుకున్నారు. అయితే 2019లో టెంకాశీ పరిధిలోని మాతాలంపరై అనే కుగ్రామంలో సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ పోస్ట్‌లన్నింటిని ఆయన ట్విటర్లో షేర్ చేస్తున్నారు. ఈ మధ్య ఆయన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయడమే కాదు.. దానిని ఆయనే స్వయంగా ఆ పల్లెటూరిలో నడిపాడట. ఇంకేం ఆ అనుభవాన్ని ఇంటర్నెట్లో పంచుకోవడమే కాదు.. కంపెనీ యాజమాని ఆనంద్ మహీంద్రాకు కొన్ని ఫ్రెండ్లీ సలహాలు కూడా ఇచ్చారు శ్రీధర్. 1/ Yesterday I got my new@MahindraElctrc Treo electric auto. This one is a serious upgrade - capable of 55 km/hour speed and a range of 125 km on a full charge. That makes it a practical commute vehicle and I love driving it around! I have some suggestions @anandmahindra pic.twitter.com/XyWBLJyv8l — Sridhar Vembu (@svembu) December 6, 2021 ‘‘ఫుల్‌ఛార్జీతో 125కి.మీ. రేంజ్, గంటకు 55 కి.మీ.వేగంతో దూసుకుపోయే ఆటో ఇది. దీనిని నడపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. పల్లెటూరి రోడ్లకు సైతం తగ్గట్లుగా సౌకర్య వంతంగా ఉంది. పైగా సరసమైన ధరలో.. కుటుంబంతో సహా బయటకు వెళ్లడానికి ఎంతో అనుగుణంగా ఉంది ఇది. ఊళ్లో తిరుగుతున్న టైంలో చాలామంది ఇది ఎక్కడ దొరుకుతుందని అడిగారు. అందుకే ఆనంద్ మహీంద్రగారికి కొన్ని సలహాలు ఇవ్వదల్చుకున్నా... 3/ @anandmahindra Please offer a variety of designs and colors on the electric auto line. Offer family and kid friendly options. Come up with a cool marketing campaign to popularize these low-cost electric vehicles. I see great potential for them. I love driving one! 🙏 — Sridhar Vembu (@svembu) December 6, 2021 ఆనంద్ మహీంద్రా గారూ.. Mahindra treoలోనే వెరైటీ డిజైన్లను, కలర్స్‌ను తీసుకు రండి. పిల్లలు, కుటుంబాలకు తగ్గట్లు చిన్న మార్పులు చేయండి. మంచి మార్కెటింగ్‌తో ఈ లోకాస్ట్ ఈవీను ప్రచారం చేస్తే.. కచ్చితంగా వర్కవుట్ అవుతుంది. ఇదే మీకిచ్చే సలహా’ అంటూ ఈ ఉదయం(సోమవారం) ట్వీట్ల ద్వారా సలహాలు ఇచ్చారు శ్రీధర్. అంతేకాదు ఈ ఆటోపై అభ్యంతరాలు వ్యక్తం చేసినవాళ్లకు సమాధానం ఇవ్వడంతో పాటు పలువురి అనుమానాల్ని సైతం ఓపికగా నివృత్తి చేశారాయన. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా, శ్రీధర్ వెంబు ట్వీట్లపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఈవీ ఆటోరిక్షా పూర్తి స్వదేశీ ఉత్పత్తి. ధర 3.5 లక్షల లోపే ఉంది. ఫీచర్లపై ప్రతికూల రివ్యూలు ఉన్నా.. గతుకు రోడ్లు, ఎత్తుపల్లాలపై దూసుకుపోయే కెపాసిటీ ఉందన్న రివ్యూలు దక్కించుకుంది. కిందటి ఏడాది భారత్‌లో ఐదు వేల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది ఏకైక ఈ-ఆటో కూడా ఇదే!. చదవండి: ఇది మరో ప్యాండెమిక్.. వ్యాక్సిన్ కూడా లేదు-ఆనంద్ మహీంద్రా -
కొత్త ఎలక్ట్రిక్ ఆటోపై అదిరిపోయే ప్రారంభ ఆఫర్!
దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. వారానికి ఒక కొత్త ఈవీ మార్కెట్లోకి విడుదల అవుతుంది. తాజాగా మరో కంపెనీ తన త్రీ-వీలర్ కార్గో వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఒమేగా సైకి మొబిలిటీ, బ్యాటరీ-టెక్ స్టార్టప్ లాగ్ 9 మెటీరియల్స్ భాగస్వామ్యంతో నేడు భారతదేశపు అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ Rage+ ర్యాపిడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది. ఈ Rage+ ర్యాపిడ్ ఈవీ రెండు వేరియంట్లలో బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. రూ.10,000 ప్రీ-బుకింగ్ మొత్తాన్ని చెల్లించడం ఎలక్ట్రిక్ ఆటోను సొంతం చేసుకోవచ్చు. Rage+ ర్యాపిడ్ ఈవీ ఓపెన్ క్యారియర్ హాఫ్ ట్రే ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.59 లక్షలు, 140 క్యూబిక్ అడుగుల టాప్ బాడీ కంటైనర్ గల Rage+ ర్యాపిడ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99గా ఉంది. ఈ ఆటోను కొన్న మొదటి వెయ్యి మంది కస్టమర్లకు ప్రారంభ ఆఫర్ కింద రూ.1 లక్ష వరకు తగ్గింపు అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ మొదటి 1,000 వెయ్యి మందికి మాత్రమే వర్తిస్తుంది. ప్రీ-బుకింగ్ ఆఫర్ పొందడం కోసం కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్సైట్ rapidev.liveని సందర్శించవచ్చు. ఆన్లైన్ ప్రీ-బుకింగ్ చేసిన తర్వాత మిగిలిన చెల్లింపు ప్రక్రియ, ఫార్మాలిటీలను పూర్తి చేయడం కోసంఒమేగా సైకి/ లాగ్ 9 బృందం కస్టమర్లతో సంప్రదింపులు జరుపుతారు. (చదవండి: ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!) వాహనం వారి ప్రీ-బుకింగ్ చేసిన తేదీ నుంచి 4-6 వారాలలోపు కస్టమర్‌కు డెలివరీ చేయనున్నారు. ఒమేగా సైకి Rage+ ర్యాపిడ్ ఈవీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ వాహనాలను ఫాస్ట్ చార్జర్ సహాయంతో 35 నిమిషాలలోపు ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 90కిమీల వరకు వెళ్తుంది. లాగ్ 9 ఇన్‌స్టాచార్జ్ టెక్నాలజీ ద్వారా పనిచేసే Rage+ ర్యాపిడ్ ఈవీలు 5 సంవత్సరాలలోపు (కొనుగోలు చేసిన తర్వాత) రూ. 1 లక్ష బైబ్యాక్ గ్యారెంటీతో పాటు వస్తాయి. ఈ బైబ్యాక్ గ్యారెంటీ భారతీయ మార్కెట్లో మొదటిది. అదనంగా, Rage+ ర్యాపిడ్ ఈవీ 5 సంవత్సరాల వాహన వారంటీ, 6 సంవత్సరాల బ్యాటరీ వారంటీని అందిస్తుంది. (చదవండి: ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!)