దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. వారానికి ఒక కొత్త ఈవీ మార్కెట్లోకి విడుదల అవుతుంది. తాజాగా మరో కంపెనీ తన త్రీ-వీలర్ కార్గో వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఒమేగా సైకి మొబిలిటీ, బ్యాటరీ-టెక్ స్టార్టప్ లాగ్ 9 మెటీరియల్స్ భాగస్వామ్యంతో నేడు భారతదేశపు అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ Rage+ ర్యాపిడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది. ఈ Rage+ ర్యాపిడ్ ఈవీ రెండు వేరియంట్‌లలో బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. రూ.10,000 ప్రీ-బుకింగ్ మొత్తాన్ని చెల్లించడం ఎలక్ట్రిక్ ఆటోను సొంతం చేసుకోవచ్చు.
Rage+ ర్యాపిడ్ ఈవీ ఓపెన్ క్యారియర్ హాఫ్ ట్రే ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.59 లక్షలు, 140 క్యూబిక్ అడుగుల టాప్ బాడీ కంటైనర్ గల Rage+ ర్యాపిడ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99గా ఉంది. ఈ ఆటోను కొన్న మొదటి వెయ్యి మంది కస్టమర్లకు ప్రారంభ ఆఫర్ కింద రూ.1 లక్ష వరకు తగ్గింపు అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ మొదటి 1,000 వెయ్యి మందికి మాత్రమే వర్తిస్తుంది. ప్రీ-బుకింగ్ ఆఫర్ పొందడం కోసం కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ rapidev.liveని సందర్శించవచ్చు. ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్ చేసిన తర్వాత మిగిలిన చెల్లింపు ప్రక్రియ, ఫార్మాలిటీలను పూర్తి చేయడం కోసంఒమేగా సైకి/ లాగ్ 9 బృందం కస్టమర్‌లతో సంప్రదింపులు జరుపుతారు.
(చదవండి: ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!)
వాహనం వారి ప్రీ-బుకింగ్ చేసిన తేదీ నుంచి 4-6 వారాలలోపు కస్టమర్‌కు డెలివరీ చేయనున్నారు. ఒమేగా సైకి Rage+ ర్యాపిడ్ ఈవీ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ వాహనాలను ఫాస్ట్ చార్జర్ సహాయంతో 35 నిమిషాలలోపు ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 90కిమీల వరకు వెళ్తుంది. లాగ్ 9 ఇన్‌స్టాచార్జ్ టెక్నాలజీ ద్వారా పనిచేసే Rage+ ర్యాపిడ్ ఈవీలు 5 సంవత్సరాలలోపు (కొనుగోలు చేసిన తర్వాత) రూ. 1 లక్ష బైబ్యాక్ గ్యారెంటీతో పాటు వస్తాయి. ఈ బైబ్యాక్ గ్యారెంటీ భారతీయ మార్కెట్లో మొదటిది. అదనంగా, Rage+ ర్యాపిడ్ ఈవీ 5 సంవత్సరాల వాహన వారంటీ, 6 సంవత్సరాల బ్యాటరీ వారంటీని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment