లండన్: బ్రిటన్ ప్రజలు ఇప్పుడు ఎలుకల పేరు చెబితేనే వణికిపోతున్నారు. వీధుల్లో చెత్తకుండీల వద్ద కుప్పలుకుప్పలుగా కన్పిస్తున్న మూషికాలను చూసి హడలిపోతున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో 20-30 కోట్ల ఎలుకలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పొరపాటున బ్రిటన్‌ను చుట్టుముట్టి ప్లేగు వ్యాధిని వ్యాపింపజేస్తే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోజులు మారుతున్న కొద్ది బ్రిటన్ ప్రజలు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఫాస్ట్‌ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఫుడ్‌ను ఇష్టపడుతుత్నారు. బేకరీలు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో కస్టమర్లు తినివదిలేసిన ఆహారం చెత్తకుండీల్లో పడేస్తున్నారు. వీటిని ఆరగించేందుకు ఎలుకలు డస్ట్‌బిన్ల వద్ద కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి అటువైపు వెళ్లే వాళ్లు జడుసుకుంటున్నారు.
(చదవండి: కొత్త జంటపై విధి చిన్న చూపు.. పెళ్లై గంటలు గడవకముందే ఊహించని ప్రమాదం)
కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాలు తిని బ్రిటన్‌లో ఎలుకలు ఫ్యాటీగా తయారవుతున్నాయి. కొవ్వు పదార్థాలు అధికమై ఊబకాయం బారినపడుతున్నాయి. దీంతో వాటి పరిమాణం చిన్నసైజు కుక్క స్థాయికి పెరిగిపోతుంది. వీటిని చూస్తేనే హడలిపోయేలా కన్పిస్తున్నాయి.
ఊబకాయంతో విషం తట్టుకునే శక్తి..
ఎలుకలు ఫ్యాటీగా తయారు కావడంతో వాటిని చంపేందుకు మందుపెట్టి విషప్రయోగం చేసినా అవి తట్టుకుంటున్నాయి. బ్రిటన్‌లో మూషికాలను చంపేందుకు 1950 నుంచి ఉపయోగిస్తున్న పెస్ట్ కంట్రోల్‌ను ప్రయోగించినా అవి చావడం లేదని పారిశుద్ధ్య నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 78 శాతం ఎలుకలు విషాన్ని సైతం తుట్టుకునే నిరోధక శక్తి కలిగి ఉన్నాయని వాపోతున్నారు. అయితే ఎలుకల సంఖ్య గణనీయంగా పెరగడానికి పారిశుద్ధ్య ప్రమాణాలు, పరిశుభ్రత సరిగ్గా పాటించకపోవడమూ ఓ కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. వాటిని ఎప్పుడో నియంత్రించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.
లండన్ గ్రీన్‌విచ్ యూనివర్శిటీలోని నేచురల్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎకాలజీ ప్రొఫెసర్ స్టీవ్ బెల్‌మైన్ ఎలుకల సంఖ్య గురించి మాట్లాడుతూ.. 'ఇక్కడ కనీసం 200 నుంచి 300 మిలియన్ల(సుమారు 30 కోట్లు) ఎలుకలు ఉన్నాయని నేను ఊహించగలను' అని అన్నారు. వ్యాధి ప్రాబల్యాన్ని పరీక్షించడానికి నార్ఫోక్, ఎసెక్స్‌లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఎలుకలను బోణుల ద్వారా ట్రాప్ చేస్తున్నట్లు తెలిపారు.
బ్రిటన్‌లో 2018లో బోర్న్‌మౌత్ పెస్ట్ హంటర్ పట్టుకున్న ఓ ఎలుక 21 అంగుళాల పొడవు ఉంది. అంటే ఇది చిన్న కుక్క సైజులో ఉంటుందన్నమాట. బ్రిటన్‌లో అప్పటివరకు పట్టుకున్న ఎలుకల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. అయితే ఇప్పుడు ఎలుకల పరిమాణం ఇంకా పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా.. 2021 లెక్కల ప్రకారం బ్రిటన్ జనాభా సుమారు 7 కోట్లు.
చదవండి: ప్రాణులకు ప్లాస్టికోసిస్ ముప్పు
Comments
Please login to add a commentAdd a comment