Plague disease
-
అమెరికాలో ప్రాణాంతక బుబోనిక్ ప్లేగు వ్యాధి కలకలం
అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో అరుదైన వ్యాధి నమోదయ్యింది. అక్కడ ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు(Bubonic Plague) సోకినట్లు గుర్తించారు. పెంపుడు పిల్లి నుంచి ఆ వ్యాధి వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. బుబోనిక్ ప్లేగు వల్ల ఒకప్పుడు యూరోప్‌లో భారీ నష్టం జరిగింది. మధ్యయుగంలో యూరోప్‌లో సోకిన ఆ ప్లేగు వల్ల సుమారు మూడవ వంతు జనాభా మృతి చెందింది. ఇప్పుడు మళ్లీ ఓరేగాన్‌లోని డిసెచూట్స్ కౌంటీలో తాజాగా అలాంటి కేసునే గుర్తించారు. అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నామని అధికారులు చెప్పారు. బాధితుడి సమీపంలో ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తికి చెందిన పెంపుడు పిల్లికి కూడా చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ రిచర్డ్ వాసెట్ తెలిపారు. అయితే ఈ వ్యాధి జంతువు లేదా ఈగకు సోకిన ఎనిమిది రోజుల తర్వాత మానువుల్లో ఈ ప్లేగు లక్షణాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. దీని లక్షణాలు జ్వరం, వికారం, బలహీనత, చలి, కండరాల నొప్పులు తదితరాలు వస్తాయని అన్నారు. ముందుగా రోగ నిర్థారణ చేయకపోతే గనుక ఈ వ్యాధి రక్తప్రవాహంలోకి వ్యాపించి అక్కడ నుంచి ఊపిరితిత్తులను ప్రభావితం చేసి.. న్యూమోనిక్ ప్లేగుగా మారి పరిస్థితి విషమిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఇక్కడ అదృష్టవశాత్తు ముందుగానే ఈ వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స అందించగలిగామని అన్నారు. అందువల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదని భరోసా ఇచ్చారు. సదరు వ్యక్తి ఉన్న ఒరెగాన్ ప్రాంతంలో అందుకు సంబంధించిన కేసులు ఏమీ నమోదు కాలేదన్నారు. నిజానికి ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధులు చాలా అరుదని చెబుతున్నారు. చివరిగా 2015లో దీనికి సంబంధించిన కేసు నమోదయ్యింది. ఎలుకలు, పెంపుడు జంతువుల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి 14వ శతాబ్దంలో ఐరోపాలో విలయం సృష్టించింది. నాటి సంక్షోభం కాల క్రమంలో ‘బ్లాక్ డెత్’ అన్న పేరు స్థిరపడింది. (చదవండి: హోలోగ్రామ్ వరుడు.. ప్రపంచంలోనే తొలి AI మ్యారేజ్!!) -
మీకు తెలుసా? ఆ వ్యాధి వస్తే..నాన్‌స్టాప్‌గా డ్యాన్సే..డ్యాన్స్
ఎన్నో వింత వింత వ్యాధులు గురించి విన్నాం. ఈ వ్యాధి గురించి మాత్రం వినే ఛాన్సే లేదు. అసలు విని ఉండరు. చూసి ఉండరు. అత్యంత అరుదైన వింత వ్యాధి. ఆ వ్యాధి వస్తే మనిషి అనియంత్రంగా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడట. అది కూడా నాన్‌స్టాప్‌గా చేస్తారట. ఏంటీ ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా! అని షాకవ్వకండి. ఎందుకంటే ఇది నిజం. ఈ వ్యాధి వందలమందికి సోకిందట కూడా. వివరాల్లోకెళ్తే..ఫ్రాన్స్‌లో అల్సాస్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరంలో ఈ వింత వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వస్తే ఆ వ్యక్తికి నృత్యం చేయాలనే కోరిక పుడుతుందట. దీంతో ఆ వ్యక్తి ఆపకుండా భయానకంగా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడట. ఈ ఘటన ఫ్రాన్స్‌లో 1518లో జూలైలో జరిగిందని చరిత్రకారుల చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని స్టాస్బర్గ్ వీధుల్లో ట్రోఫీ అనే మహిళ మొదటగా నృత్యం చేస్తూ కనిపించింది. ప్రజలు దీన్ని అప్పుడు అంతగా సీరియస్‌గా తీసుకోలేదు కూడా. ఐతే ఆమె ఏకాంతంగ అదేపనిగా నృత్యం చేస్తుందనే విషయం ఊరంతా దావానలంలా వ్యాపించింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇద్దరు, ముగ్గురు.. ఆమెలానే చేయడం జరిగింది. ఇక రోజులు గడిచిన కొద్ది ఆ సంఖ్య కాస్తా వందల సంఖ్యకు చేరుకుంది. ఉన్మాదపూరితంగా సుమారు 400 మంది దాక నాన్‌స్టాప్‌గా నృత్యం చేయడం ప్రారంభించారు. అలా వారంతా కుప్పకూలిపోయి పడిపోయేంత వరకు చేశారట. చివరికి శరీరం మూర్చపోయి మెలికలి తిరిగి పడిపోయేవారని చరిత్రాకారులు పేర్కొన్నారు. వారిని నృత్యం చేయకుండా ఆపడం ఎవరితరం అయ్యేది కాదట. ఐతే నృత్యం చేస్తున్నవాళ్లు కూడా వాళ్లు సంతోషంతో చేస్తున్నట్లు కనిపించలేదని, ఏదో హింసాత్మకంగానూ, నిరాశ నిస్ప్రుహలతో చేస్తున్న విలయ తాండవంలా ఉందట. దీంతో ఈ వ్యాధిని ఎలా నిర్వచించాలలో నాటి పండితులకు అర్థం కాలేదు. ఆపుకోలేని నృత్య కోరికే ఈ వ్యాధి లక్షణం కాబట్టి దీనిని వారంతా కలిసి 'డ్యాన్స్ ప్లేగు' వ్యాధి అని పిలిచారు. ఇది ప్రజల రోజువారి జీవితాన్ని గందరగోళంలో పడేసింది. ఏం చేయాలో పాలిపోక అధికారులు ఆవ్యాధి సోకిన వాళ్ల కోసం ప్రత్యేక హాల్ ఏర్పాటు చేశారు. అందులో వారు సొమ్మసిల్లేంత వరకు డ్యాన్స్ చేసుకుంటారు. పైగా ఎవరికి సోకదని భావించారు. కానీ ఈ డ్యాన్స్ ప్లేగు వ్యాధికి మూల కారణం ఏమిటో ఎవ్వరికి తెలియలేదు. ఐతే కొందరూ దీన్ని హిస్టీరియా లక్షణం అని, ఆర్థిక కష్టాలు, రాజకీయ ఒత్తిడిలతో ఇలా చేస్తున్నారని, మానవుని విపరీతమైన ప్రవర్తనకు సంబంధించినదని, మరికొందరూ సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించడం వల్ల ఇలా జరిగిందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. నృత్య శాస్త్రంలో కూడా దీని గురించి ఉందని, అక్కడ నుంచి సాముహిక నృత్యం వచ్చిందని ఐరోపా వాసులు విశ్వసిస్తారు. ఏదీఏమైన ఈ అంతుపట్టని 'డ్యాన్స్ ప్లేగు' అనే వ్యాధి ఎందుకు వచ్చిందనేది ఇప్పటికీ అంతుపట్టిని మిస్టరీలా ఉండిపోయింది. (చదవండి: కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా? వర్షాకాలంలోనే ఇవి వస్తాయా?) -
వణికిపోతున్న ప్రజలు.. పొంచిఉన్న ముప్పు.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితేంటి?
లండన్: బ్రిటన్ ప్రజలు ఇప్పుడు ఎలుకల పేరు చెబితేనే వణికిపోతున్నారు. వీధుల్లో చెత్తకుండీల వద్ద కుప్పలుకుప్పలుగా కన్పిస్తున్న మూషికాలను చూసి హడలిపోతున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో 20-30 కోట్ల ఎలుకలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పొరపాటున బ్రిటన్ను చుట్టుముట్టి ప్లేగు వ్యాధిని వ్యాపింపజేస్తే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులు మారుతున్న కొద్ది బ్రిటన్ ప్రజలు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఫాస్ట్‌ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఫుడ్‌ను ఇష్టపడుతుత్నారు. బేకరీలు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో కస్టమర్లు తినివదిలేసిన ఆహారం చెత్తకుండీల్లో పడేస్తున్నారు. వీటిని ఆరగించేందుకు ఎలుకలు డస్ట్బిన్ల వద్ద కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి అటువైపు వెళ్లే వాళ్లు జడుసుకుంటున్నారు. (చదవండి: కొత్త జంటపై విధి చిన్న చూపు.. పెళ్లై గంటలు గడవకముందే ఊహించని ప్రమాదం) కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాలు తిని బ్రిటన్‌లో ఎలుకలు ఫ్యాటీగా తయారవుతున్నాయి. కొవ్వు పదార్థాలు అధికమై ఊబకాయం బారినపడుతున్నాయి. దీంతో వాటి పరిమాణం చిన్నసైజు కుక్క స్థాయికి పెరిగిపోతుంది. వీటిని చూస్తేనే హడలిపోయేలా కన్పిస్తున్నాయి. ఊబకాయంతో విషం తట్టుకునే శక్తి.. ఎలుకలు ఫ్యాటీగా తయారు కావడంతో వాటిని చంపేందుకు మందుపెట్టి విషప్రయోగం చేసినా అవి తట్టుకుంటున్నాయి. బ్రిటన్‌లో మూషికాలను చంపేందుకు 1950 నుంచి ఉపయోగిస్తున్న పెస్ట్ కంట్రోల్‌ను ప్రయోగించినా అవి చావడం లేదని పారిశుద్ధ్య నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 78 శాతం ఎలుకలు విషాన్ని సైతం తుట్టుకునే నిరోధక శక్తి కలిగి ఉన్నాయని వాపోతున్నారు. అయితే ఎలుకల సంఖ్య గణనీయంగా పెరగడానికి పారిశుద్ధ్య ప్రమాణాలు, పరిశుభ్రత సరిగ్గా పాటించకపోవడమూ ఓ కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. వాటిని ఎప్పుడో నియంత్రించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. లండన్ గ్రీన్విచ్ యూనివర్శిటీలోని నేచురల్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్లో ఎకాలజీ ప్రొఫెసర్ స్టీవ్ బెల్మైన్ ఎలుకల సంఖ్య గురించి మాట్లాడుతూ.. 'ఇక్కడ కనీసం 200 నుంచి 300 మిలియన్ల(సుమారు 30 కోట్లు) ఎలుకలు ఉన్నాయని నేను ఊహించగలను' అని అన్నారు. వ్యాధి ప్రాబల్యాన్ని పరీక్షించడానికి నార్ఫోక్, ఎసెక్స్‌లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఎలుకలను బోణుల ద్వారా ట్రాప్ చేస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్‌లో 2018లో బోర్న్మౌత్ పెస్ట్ హంటర్ పట్టుకున్న ఓ ఎలుక 21 అంగుళాల పొడవు ఉంది. అంటే ఇది చిన్న కుక్క సైజులో ఉంటుందన్నమాట. బ్రిటన్‌లో అప్పటివరకు పట్టుకున్న ఎలుకల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. అయితే ఇప్పుడు ఎలుకల పరిమాణం ఇంకా పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా.. 2021 లెక్కల ప్రకారం బ్రిటన్ జనాభా సుమారు 7 కోట్లు. చదవండి: ప్రాణులకు ప్లాస్టికోసిస్ ముప్పు -
ఆస్ట్రేలియాకు వింత సమస్య.. సాయం చేయనున్న భారత్
సిడ్నీ: ప్రపంచం మొత్తం కరోనాతో సతమతమవుతుంటే ఆస్ట్రేలియాకు మాత్రం అనుకోని సమస్య వచ్చిపడింది. ప్రస్తుతం అక్కడ ఎలుకలు పెద్ద సమస్యగా మారాయి. పెద్ద గుంపుగా ఏర్పడి పంట పొలాలపై దాడి చేస్తు సర్వనాశనం చేస్తున్నాయి. వివరాలు.. గత కొన్ని రోజులుగా న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రంలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా పెరిగిపోయిన వీటి సంతతి అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేయడమేగాక ఇళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా ఎక్కడ చూసిన ఎలుకలే దర్శనమిస్తుండడంతో ఏం చేయాలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్లేగు వ్యాది ప్రబలే అవకాశం కూడా ఉంది.ఈ నేపథ్యంలో ఎలుకల సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ను సాయం కోరింది. భారత్‌లో ఎలుకల నివారణకు బ్రోమాడియోలోన్ అనే విషపదార్థాన్ని వాడేవారు. ప్రస్తుతం ఈ మందు భారత్‌లో నిషేధంలో ఉంది. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి దాదాపు 5వేల లీటర్ల బ్రోమాడియోలోన్ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే భారత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కాగా న్యూ సౌత్‌వేల్స్ ప్రభుత్వం ఎలుకలను నివారించేందుకు రూ. 3,600 కోట్లు నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. భారత్ నుంచి బ్రోమాడియోలోన్ మందు రాగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతితో ఎలుకలను చంపేందుకు కార్యచరణ మొదలుపెట్టనున్నారు. చదవండి: మూసేసిన స్కూల్లో 215 మంది పిల్లల అస్థిపంజరాలు లభ్యం -
భయపెట్టే వార్త చెప్పిన చైనా!
బీజింగ్: కరోనా కరాళ నృత్యంతో వణికిపోతున్న ప్రపంచ దేశాలకు చైనా మరోసారి భయపెట్టే వార్త చెప్పింది. చైనా సరిహద్దుల్లో ఉన్న మంగోలియాలోని ఖోవ్డ్ ప్రావిన్స్‌లో ఇటీవల రెండు బుబోనిక్ ప్లేగ్ వ్యాధి కేసులు బయటపటపడ్డాయని ఆ దేశ అధికారిక మీడియా జింగ్వా ఆదివారం వెల్లడించింది. అడవి ఉడుత (మర్మోట్) మాంసం అమ్మే వ్యక్తి (27), అతని తమ్మునికి జూలై 1న ప్లేగ్ నిర్ధారణ అయిందని తెలిపింది. వారిద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. వారితో కాంటాక్ట్ అయిన 146 మందిని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారని వెల్లడించింది. (చదవండి: గులాబీ రంగు మంచు.. పర్యాటకుల ఆందోళన) ఇక బుబోనిక్ ప్లేగ్‌పై మంగోలియా అలర్ట్ అయింది. తమ దేశంలోని బయన్నూర్ పట్టణంలో గత శనివారం ఒక ప్లేగ్ కేసు నమోదైందని తెలిపిన అక్కడి ప్రభుత్వం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లెవల్ 3 హెచ్చరికలు జారీ చేసింది. ప్లేగ్ నియంత్రణ, నివారణకు 2020 చివరి వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని తెలిపింది. కాగా, బుబోనిక్ ప్లేగ్ వ్యాధి అడవి ఎలుకలు, ఉడుతల్లో ఉండే బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఈ బ్యాక్టీరీయా కీటకాల ద్వారా ఇతర జంతువులు, మనుషులకు వ్యాప్తిస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధి అని, సరైన వైద్యం అందకుంటే 24 గంటల్లోనే రోగి మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం తెలుస్తోంది. ఇదిలాఉండగా..గతేడాది మంగోలియాలోని బయాన్ ఉల్గీ ప్రాంతంలో అడవి ఉడుత పచ్చి మాంసం తిని బుబోనిక్ ప్లేగ్ బారినపడ్డ ఇద్దరు మరణించడం గమనార్హం. ఇక కరోనా విషయంలో ప్రపంచాన్ని అలర్ట్ చేయలేదనే విమర్శల నేపథ్యంలో చైనా ఇటీవల పందుల నుంచి వ్యాపించే జీ4 వైరస్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ కొత్త వైరస్ ప్రస్తుతానికి మనుషులకు సోకే అవకాశం లేకున్నా.. భవిష్యత్తులో ఇది కరోనా మాదిరే మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వుహాన్‌లో నియంత్రణలో ఉన్న కరోనా, బీజింగ్‌లో అధికమవుతోంది. అక్కడ కొత్తగా 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (భవిష్యత్ మహమ్మారి జీ4..!) -
ఆ రోజుల్లో స్పానిష్ ఫ్లూ, ప్లేగ్ మహమ్మారి పంజా
సాక్షి, సిటీబ్యూరో: ప్లేగ్ పాస్‌పోర్టు.. ఇప్పుడు ఈ పదం వినడానికి కొద్దిగా ఆశ్చర్యంగానే అనిపించినా ఆ రోజుల్లో విదేశీయులు హైదరాబాద్‌లో కొంతకాలం ఉండాలంటే తప్పనిసరిగా ప్లేగ్ పాస్‌పోర్టు ఉండి తీరాల్సిందే. ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ రోజుల్లో స్పానిష్ ఫ్లూ, ప్లేగ్ వంటి మహమ్మారులు ప్రజలను కబలిస్తున్నాయి. అలాంటి సమయంలో బ్రిటీష్ పాలిత ప్రాంతాల నుంచి హైదరాబాద్ రాజ్యానికి వచ్చే వారికి ప్లేగ్ పాస్‌పోర్టులను అందజేసేవారు. రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం ఉండేది. విజయవాడ, మద్రాస్ వైపు నుంచి వచ్చే ప్రయాణికులకు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో వైద్యులు అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాత వారిని హైదరాబాద్‌లోకి అనుమతించేవారు. (క్వారంటైన్లో యువకుడి ఆత్మహత్య) ఈ పరీక్షల అనంతరం వారికి హైదరాబాద్‌లో తిరిగేందుకు ఈ ప్లేగ్ పాస్‌పోర్టు లభించేది. అప్పటికి హైదరాబాద్ పూర్తిగా ఒక స్వతంత్రమైన దేశం కావడంతో బ్రిటీష్ ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా దీనిని తీసుకోవాల్సి వచ్చేది. అంతేకాదు, తమ సొంత కరెన్సీని నిజాం కరెన్సీలోకి మార్చుకునేందుకు కూడా రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేక సదుపాయం ఉండేది. అలా 1915 నుంచే ప్లేగ్ వంటి మహమ్మారులు విజృంభిస్తున్న రోజుల్లో ఈ ప్లేగ్ పాస్‌పోర్టును కూడా తప్పనిసరి చేశారు. (తల్లి ప్రాణం తీసిన కొడుకు క్రికెట్ గొడవ) క్వారెంటైన్ కూడా ఆ రోజుల్లోనే.. ఆ రోజుల్లో ఎలుకల ద్వారా ప్లేగు వ్యాధి ప్రబలింది. విదేశాల నుంచి వచ్చే నౌకల ద్వారా ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి చెందినట్లు చరిత్ర చెబుతోంది. ఇటలీలో ఇలాంటి నౌకల్లో వచ్చేవారిని 40 రోజుల పాటు ఊళ్లోకి రాకుండా నౌకలోనే ఉంచేవారు. ఆ స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో నిజాం నవాబు స్పానిష్ ఫ్లూ మహమ్మారిని అరికట్టేందుకు క్వారంటైన్ పద్ధతిని పాటించారు. అప్పట్లో నగర శివార్లలో ఉన్న ఎర్రన్నగుట్టపై గుఢారాలు వేసి వ్యాధిగ్రస్తులను అక్కడికి తరలించి చికిత్స అందించారు. స్పానిష్ ఫ్లూ బాగా వ్యాప్తి చెందుతున్న రోజుల్లో సికింద్రాబాద్ సీతాఫల్మండి, ముషీరాబాద్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఐసొలేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. (మైనర్ గర్భం తొలగింపుకు హైకోర్టు అనుమతి ) 1915లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్ ఆస్పత్రి 1923 వరకు ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్‌కు ఎదురుగా ఉన్న ఎర్రన్నగుట్ట మీదే ఉండేది. ఈ ప్రాంతం ఆ రోజుల్లో హైదరాబాద్ నగరానికి చాలా దూరంగా ఉన్నట్లే లెక్క, 1923లో ఎర్రన్నగుట్ట పైన ఉన్న క్వారెంటైన్ ఆసుపత్రిని ప్రస్తుతం ఫీవర్ ఆసుపత్రికి మార్చారు. అలా క్వారంటైన్ కోసం ఉపయోగించడం వల్ల దీన్ని క్వారంటైన్ ఆస్పత్రి అనేవారు. కాలక్రమంలో కోరంటి దవాఖానాగా, ఆ తర్వాత ఫీవర్ ఆస్పత్రిగా ప్రాచూర్యంలోకి వచి్చంది. సమగ్ర వివరాలతో జారీ.. సమగ్ర వివరాలతో జారీ.. ఈ పాస్‌పోర్టులో సందర్శకుడి పూర్తి వివరాలను నమోదు చేసేవారు. అప్పట్లో హైదరాబాద్‌ను సందర్శించిన ప్రముఖ చరిత్రకారుడు రాబర్ట్ చావెలో ఇందుకు సంబంధించిన తన అనుభవాలను ఆయన 1921లో రాసిన ’మిస్టీరియస్ ఇండియా’ అనే పుస్తకంలో వెల్లడించారు. హైదరాబాద్‌లో తాను తిరిగిన ప్రాంతాలు, అనుభవాలను తెలియజేశారు. ‘రాత్రి 7 గంటల సమయంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాను. ఒక పోలీస్ అధికారి వచ్చి ప్రశ్నించారు. తాను ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని రోజులు హైదరాబాద్‌లో ఉండేది, ఎక్కడెక్కడకు వెళ్లాల్సి ఉంది వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. అంతేకాదు.. తనకు మొదటి రౌండ్ ప్లేగు పరీక్ష పూర్తయినా రెండో దఫా స్క్రీనింగ్, శానిటేషన్ టెస్ట్ కోసం పంపారు.’ అని పేర్కొన్నారు. (కరోనాపై విచారణకు భారత్ ఓకే ) అప్పటికే తాను హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్లేగ్ పాస్‌పోర్టు కలిగి ఉండటం వల్ల దాన్ని పరీక్షించి తదుపరి వైద్య పరీక్షల కోసం సివిల్ హాస్పిటల్‌కు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించినట్లు చావెలో తన పుస్తకంలో ప్రస్తావించారు. అప్పట్లో ప్రతి ప్రయాణికుడిని స్క్రీనింగ్ చేసి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, సమగ్రమైన వివరాలతో ప్లేగ్ పాస్‌పోర్టు ఇచ్చేవారు. ఇదిలేని వారిని హైదరాబాద్‌లోకి అనుమతించేవారు కాదని ఇంటాక్ కన్వీనర్ అనురాధారెడ్డి తెలిపారు. -
భయపెట్టిన వ్యాధులు..వరదలు
సాక్షి సిటీబ్యూరో: భాగ్యనగరం.. ప్రేమ పునాదులపై నిర్మితమైన మహానగరం.. చరిత్ర పుటలు తిరిగేస్తే అనేక వ్యాధులను ఎదుర్కొని మహోన్నతంగా ఎదిగింది. 15వ శతకంలో ప్లేగు వ్యాధి నివారణ సూచికగా నిర్మించిన చార్మినార్ చరిత్రకు సజీవ సాక్షిగా నిలిచింది. 4 శతాబ్దలుగా విపత్తులు, వరదలను, వ్యాధులను తట్టుకొని నేటికీ సజీవంగా నిలిచింది. ఇదిలా ఉండగా భాగ్యనగర పొలిమేరల్లోకి మహమ్మారి వ్యాధులు జొరపడటం కొత్తేమీ కాదు.! కలరా (గత్తర), ప్లేగు, మశూచి వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు నగరాన్ని గతంలో చుట్టుముట్టాయి. నగరం ఏర్పాటు నుంచి నేటికి వచ్చిన వరదలు, వ్యాధులు, విపత్తుల నివారణకు తీసుకున్న చర్యలపై సాక్షి ప్రత్యేక కథనం.. భయపెట్టిన వ్యాధులు..వరదలు 1631, 1831, 1903, 1908 సంవత్సరాల్లో భారీ వరదలు.. వ్యాధులు నగరాన్ని చిగురుటాకులా ఒణికించాయి. అందులో ప్లేగు, కలరా ప్రధానమైనవి. 1911లో కలరా మహమ్మారి నగర ప్రజలను తీవ్రస్థాయిలో నష్టం కల్గించింది. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన ఇన్ ఫ్లూ ఎంజా వ్యాధి ప్రబలింది. 1919లో ఫ్లూతో కొన్నివందల మంది మంచం పట్టారు. వ్యాధులు సోకినప్పుడల్లా ప్రభుత్వం అప్పటి వైద్య విధానంతో వైద్యం చేసి వందల మంది ప్రాణాలను కాపాడింది. ఆ రోజుల్లో తాగునీరు కోసం నగరమంతా చేదుడు బావుల మీదే ఆధారపడాల్సిన స్థితి. దాంతో సులువుగా కలరా, ప్లేగు అంటు వ్యాధులు ఒకరినుంచి మరొకరికి సులువుగా ప్రబలేవని చారిత్రక పుస్తకాల ద్వారా తెలుస్తుంది. నగర మొదటి ఆసుపత్రి హైదరాబాద్ పునాదులు పడ్డాక దశాబ్దకాలంలోపే ఈ నేలపై ‘‘దారుషిఫా’ యునాని ఆస్పత్రి పురుడుపోసుకుంది. రెండు అంతస్తుల ఆస్పత్రి భవనంలో మశూచి, క్షయ ప్రాణాంతక రోగాలకూ చికిత్స అందించేవారని చారిత్రక ఆధారాల ద్వారా వెల్లడవుతుంది. అప్పటి ఇరాన్, పర్షియా, యూరోపిన్, అరేబియన్ వైద్య విధానం ద్వారా అన్ని రకాల వ్యాధులకు నివారణ జరిగేదని ప్రముఖ చరిత్రకారులు అల్లామా ఏజాజ్ ఫరూఖీ తెలిపారు. ఈ ఆసుపత్రిలో ఔట్పేషంట్స్తో పాటు ఇన్‌పేషంట్స్ సౌలభ్యం ఉండేవి. వివిధ దేశాల నుంచి వైద్యులు వచ్చి ఈ ఆసుపత్రిలో రోగాల నివారణకు ప్రయోగాలు చేసేవారని చరిత్రకారులు చెబుతారు. మూఢనమ్మకాల నివారణకు అవగాహన ప్రజల ప్రాణాలను తీస్తున్న మహమ్మారి రోగాలు పోవాలంటే జంతు బలులు, యజ్ఞాలు వంటి కార్యక్రమాలను చాలామంది నిర్వహించేవారు. వాటితో నగరంలో చెత్త, చెదారం పెరిగి గాలి, నీరు కలుషితం మరింత ఎక్కువ కలుషితం అయ్యేవి. తద్వారా వ్యాధులు మరింత పెరుగుతాయని ప్రచారం చేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వం ద్వారా విశేష కృషి చేశారు. గాలి, నీరుతో అంటువ్యాధులు అత్యంత సులువుగా సోకే రోజులవి. మనుషులు పిట్టల్లా రాలుతోన్న కాలమది.! ప్లేగుతో కన్నుమూసిన వ్యక్తి భౌతిక కాయాన్ని సొంత కుటుంబ సభ్యులే తాకేందుకు భయపడే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే, ఆ రోజుల్లో కొన ఊపిరితో ఉన్న రోగులను ఇంటికి దూరంగా వదిలేసేంత కాఠిన్యం. అలాంటి స్థితిలో సామాజిక స్పృçహ ఉన్న కొందరు యువకులను పోగు చేశారు. వారంతా కలిసి అనాథ శవాలకు దహనసంస్కారాలు నిర్వహించారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో భాగంగా జనావాసాలమధ్య చెత్త, చెదారాలను తొలగించారు. రోడ్డుకి ఇరువైపులా బ్లీచింగ్ పౌడర్ ను చల్లించారు. నగరానికి దర్వాజాలు.. హైదరాబాద్ నగరం ఏర్పాటు అనంతరం 1734లో రెండో నిజాం నిజాం అలీఖాన్ పాలనలో నగరం రక్షణ కోసం నగరం చుట్టూ 12 దర్వాజాలతో ప్రహరీ కట్టారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రాకపోకల కోసం దర్వాజాలు తెరిచి రాత్రి వేళల్లో దర్వాజాలు మూసివేసేవారు. నగరంలో అంటు వ్యాధులు, ఫ్లూలు ప్రబలినప్పుడు నగర దర్వాజాలు మూసి వేసేవారు. నగర ప్రజలకు వేరే ప్రాంతాలకు వెళ్లనిచ్చే వారు కాదు, వేరే ప్రాంతాల వారిని నగరంలో రాకుండా నివారించే వారు. వ్యాధులు ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకునేవారు. ఫలితంగా రోగం తగ్గుముఖం పట్టడమే కాదు, రోగుల్లోనూ తమకేమీ కాదనే కొండంత ధైర్యం. ఉచిత వైద్య శిబిరాలు 1925లోనూ నగరంలో ప్లేగు ప్రబలిన సందర్భంలో ప్రభుత్వం సహకారంతో పలు స్వచ్చంద సంస్థలు రోగులకు అసాధారణమైన సేవలు అందించింది. ఉచితంగా వైద్య శిబిరాలనూ నిర్వహించారు. ఉచితంగా మందులనూ పంచారు. కలరా, ప్లేగు బాధితుల కోసం ఉచిత సహాయ కేంద్రాలను నెలకొల్పారు. రోగులకు శుశ్రూష చేస్తూ, ఉచితంగా వైద్య సేవలను అందించారు. బాధితులకు సాయంచేయడంలో నిమగ్నమైన సాటి మనిషికి సాయం చేయడమే మనిషితత్వం అని విశ్వసించిన. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ప్లేగు వ్యాధిగ్రస్తుల సేవలో నిమగ్నమయ్యారు. పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు చాలామంది యువకులు చురుగ్గా పాల్గొన్నారు. ఫ్లూపై సమరం సలిపిన మెడికల్ వలెంటీర్లను అప్పటి నిజాం ప్రభుత్వం బంగారు, వెండి నాణేలతో సత్కరించింది. గోల్కొండ నిర్మాణం గోల్కొండ కోట కుతుబ్‌షాహీల అధీనంలో ఉండేది. కోటలో జనజీవనం విపరీతంగా పెరగడంతో ప్రజలు ప్లేగ్ వ్యాధి బారినపడ్డారు. 1589లో 5వ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు. ఈ నగరాన్ని మూసీ నది దక్షిణ ఒడ్డున నిర్మించాలని నిర్ణయం జరిగింది. గోల్కొండ రాజ్యంలో ప్లేగు వ్యాధి తగ్గినందుకు సంతోషంతో ప్రసిద్ధి చెందిన చార్మినార్ కట్టడాన్ని 1592లో నిర్మించారు. అనంతరం కోటను వదలిన ప్రజలు చార్మినార్ చుట్టుపక్కల నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. -
శతాబ్దానికో మహమ్మారి!
ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల శతాబ్దానికో అంటువ్యాధి ప్రబలుతుందనేది ఓ నమ్మిక. గత ఘటనలను ఒకసారి అవలోకనం చేసుకుంటే ఇది నిజమేనని నమ్మేందుకు తగిన ఆధారాలున్నాయి. ప్రస్తుతం కోవిడ్(కరోనా వైరస్) మాదిరిగానే 1720, 1820, 1920లలో కూడా ప్రపంచాన్ని అంటువ్యాధులు కుదిపేశాయి. వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నాయని పరిశోధకులంటున్నారు. దీనిని బట్టి చూస్తే, స్వార్థం కోసం ఎవరైనా కావాలనే వీటిని సృష్టించి జనంపైకి వదులుతున్నారా? అనే అనుమానం కూడా వస్తుంది. ఇంకా మున్ముందు ఎలాంటి వ్యాధులు వస్తాయోననే భయం కలగకమానదని ‘ఏలియన్ న్యూస్’ అనే వెబ్ మీడియా పేర్కొంది. 1720లో ప్లేగు 1720లలో యూరప్ ప్రజలను బ్యుబోనిక్ ప్లేగ్ కలవరపెట్టింది. ఫ్రాన్సులోని మర్సెయిల్స్లో బయటపడిన ఈ వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50వేల మందిని బలి తీసుకుంది. మొత్తమ్మీద ఫ్రాన్సు వ్యాప్తంగా లక్ష మంది ఈ వ్యాధితో చనిపోయారు. 1820లో కలరా యూరప్‌ను అతలాకుతలం చేసిన ప్లేగుకు వందేళ్లు పూర్తవుతుండగానే కలరా ఆసియా దేశాలను కబళించింది. ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాల్లో ఈ వ్యాధి కూడా లక్ష మంది ఉసురుతీసింది. కలరా బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారినపడ్డారు. 1920లో స్పానిష్ ఫ్లూ ఇటీవల కాలంలో ప్రపంచానికి బాగా పరిచయమైన పేరు స్పానిష్ ఫ్లూ. 100 కోట్ల మంది ఈ బారినపడగా ఒక కోటి మంది మృత్యువాతపడ్డారు. మానవ జాతి చరిత్రలోనే పెనువిషాదం మిగిల్చిన భయంకర వ్యాధి ఇది. 2020లో కోవిడ్ స్పానిష్ ఫ్లూ వచ్చిన వందేళ్ల తర్వాత చైనాలో కరోనా వైరస్ విజృంభించింది. రోజులు గడిచేకొద్దీ ఈ వ్యాధి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. -
ప్లేగు వ్యాధితో 40 మంది మృతి!
అంటానానారివో: ప్లేగు మహమ్మారి సోకడంతో భారీ ప్రాణ నష్టం వాటిల్లిన సంఘటన మడగాస్కర్ లో సంభవించింది. ఈ అంటువ్యాధితో 40 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు చివర్లో సిరోనోమానిడిడీ జిల్లాలో తొలిసారి వెలుగు చూసిన ఈ ప్లేగు వ్యాధి క్రమేపి విస్తరించడంతో భారీ సంఖ్యలు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాధికి ముందుగా చికిత్స చేసినట్లయితే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుతం అక్కడ రెండు శాతంగా ఉన్న ప్లేగు వ్యాధి అత్యంత వేగంగా వ్యక్తి నుంచి మరో వ్యక్తి సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో నివారణ చర్యలు చేపట్టాలని తెలిపింది. ఒకవేళ జనాభా అధికంగా గల నగరాల్లో ఈ వ్యాధి సోకితే ప్రాణం నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.