ఎన్నో వింత వింత వ్యాధులు గురించి విన్నాం. ఈ వ్యాధి గురించి మాత్రం వినే ఛాన్సే లేదు. అసలు విని ఉండరు. చూసి ఉండరు. అత్యంత అరుదైన వింత వ్యాధి. ఆ వ్యాధి వస్తే మనిషి అనియంత్రంగా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడట. అది కూడా నాన్‌స్టాప్‌గా చేస్తారట. ఏంటీ ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా! అని షాకవ్వకండి. ఎందుకంటే ఇది నిజం. ఈ వ్యాధి వందలమందికి సోకిందట కూడా.
వివరాల్లోకెళ్తే..ఫ్రాన్స్‌లో అల్సాస్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరంలో ఈ వింత వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వస్తే ఆ వ్యక్తికి నృత్యం చేయాలనే కోరిక పుడుతుందట. దీంతో ఆ వ్యక్తి ఆపకుండా భయానకంగా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడట. ఈ ఘటన ఫ్రాన్స్‌లో 1518లో జూలైలో జరిగిందని చరిత్రకారుల చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని స్టాస్‌బర్గ్ వీధుల్లో ట్రోఫీ అనే మహిళ మొదటగా నృత్యం చేస్తూ కనిపించింది. ప్రజలు దీన్ని అప్పుడు అంతగా సీరియస్‌గా తీసుకోలేదు కూడా. ఐతే ఆమె ఏకాంతంగ అదేపనిగా నృత్యం చేస్తుందనే విషయం ఊరంతా దావానలంలా వ్యాపించింది.
కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇద్దరు, ముగ్గురు.. ఆమెలానే చేయడం జరిగింది. ఇక రోజులు గడిచిన కొద్ది ఆ సంఖ్య కాస్తా వందల సంఖ్యకు చేరుకుంది. ఉన్మాదపూరితంగా సుమారు 400 మంది దాక నాన్‌స్టాప్‌గా నృత్యం చేయడం ప్రారంభించారు. అలా వారంతా కుప్పకూలిపోయి పడిపోయేంత వరకు చేశారట. చివరికి శరీరం మూర్చపోయి మెలికలి తిరిగి పడిపోయేవారని చరిత్రాకారులు పేర్కొన్నారు. వారిని నృత్యం చేయకుండా ఆపడం ఎవరితరం అయ్యేది కాదట.
ఐతే నృత్యం చేస్తున్నవాళ్లు కూడా వాళ్లు సంతోషంతో చేస్తున్నట్లు కనిపించలేదని, ఏదో హింసాత్మకంగానూ, నిరాశ నిస్ప్రుహలతో చేస్తున్న విలయ తాండవంలా ఉందట. దీంతో ఈ వ్యాధిని ఎలా నిర్వచించాలలో నాటి పండితులకు అర్థం కాలేదు. ఆపుకోలేని నృత్య కోరికే ఈ వ్యాధి లక్షణం కాబట్టి దీనిని వారంతా కలిసి 'డ్యాన్స్ ప్లేగు' వ్యాధి అని పిలిచారు. ఇది ప్రజల రోజువారి జీవితాన్ని గందరగోళంలో పడేసింది.
ఏం చేయాలో పాలిపోక అధికారులు ఆవ్యాధి సోకిన వాళ్ల కోసం ప్రత్యేక హాల్ ఏర్పాటు చేశారు. అందులో వారు సొమ్మసిల్లేంత వరకు డ్యాన్స్ చేసుకుంటారు. పైగా ఎవరికి సోకదని భావించారు. కానీ ఈ డ్యాన్స్ ప్లేగు వ్యాధికి మూల కారణం ఏమిటో ఎవ్వరికి తెలియలేదు. ఐతే కొందరూ దీన్ని హిస్టీరియా లక్షణం అని, ఆర్థిక కష్టాలు, రాజకీయ ఒత్తిడిలతో ఇలా చేస్తున్నారని, మానవుని విపరీతమైన ప్రవర్తనకు సంబంధించినదని, మరికొందరూ సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించడం వల్ల ఇలా జరిగిందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. నృత్య శాస్త్రంలో కూడా దీని గురించి ఉందని, అక్కడ నుంచి సాముహిక నృత్యం వచ్చిందని ఐరోపా వాసులు విశ్వసిస్తారు. ఏదీఏమైన ఈ అంతుపట్టని 'డ్యాన్స్ ప్లేగు' అనే వ్యాధి ఎందుకు వచ్చిందనేది ఇప్పటికీ అంతుపట్టిని మిస్టరీలా ఉండిపోయింది.
(చదవండి: కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా? వర్షాకాలంలోనే ఇవి వస‍్తాయా?)
Comments
Please login to add a commentAdd a comment