ప్లేగు వ్యాధితో 40 మంది మృతి! | Plague kills 40 in Madagascar | Sakshi
Sakshi News home page

ప్లేగు వ్యాధితో 40 మంది మృతి!

Published Sat, Nov 22 2014 10:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

Plague kills 40 in Madagascar

అంటానానారివో: ప్లేగు మహమ్మారి సోకడంతో భారీ ప్రాణ నష్టం వాటిల్లిన సంఘటన మడగాస్కర్ లో సంభవించింది. ఈ అంటువ్యాధితో 40 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు చివర్లో సిరోనోమానిడిడీ జిల్లాలో తొలిసారి వెలుగు చూసిన ఈ ప్లేగు వ్యాధి క్రమేపి విస్తరించడంతో భారీ సంఖ్యలు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాధికి ముందుగా చికిత్స చేసినట్లయితే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని స్పష్టం చేసింది.

 

ప్రస్తుతం అక్కడ రెండు శాతంగా ఉన్న ప్లేగు వ్యాధి అత్యంత వేగంగా వ్యక్తి నుంచి మరో వ్యక్తి సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో నివారణ చర్యలు చేపట్టాలని తెలిపింది. ఒకవేళ జనాభా అధికంగా గల నగరాల్లో ఈ వ్యాధి సోకితే ప్రాణం నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement