
ఆదాయం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్యూర్-ప్లే కన్స్యూమర్ హెల్త్ కంపెనీ, ఓఆర్ఎస్ఎల్ (ORSL) ఎలక్ట్రోలైట్ పానీయాల తయారీదారు కెన్‌వ్యూ (Kenvue), నేడు డీహైడ్రేషన్ ఉన్న రోగుల కోసం రెడీ టు డ్రింక్ (RTD) ఫార్మాట్‌లో WHO ORSను ప్రారంభించింది.
ఓఆర్ఎస్ఎల్.. భారతదేశంలోనే నెంబర్ 1 రెడీ-టు-డ్రింక్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ బ్రాండ్. ఇది గత 20 సంవత్సరాలుగా.. ఎలక్ట్రోలైట్లతో మనిషి నీరసించిన సమయంలో శక్తి కోసం ఉపయోగించే ద్రవాలను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దాని వారసత్వంగా తమ రెడీ-టు-డ్రింక్ (RTD) రీహైడ్రేషన్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నారు. ఇది అతిసార వల్ల కలిగే డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న రోగులను లక్ష్యంగా చేసుకుని ORS - WHO ఆమోదించిన ఫార్ములా ప్రారంభించింది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. ప్రతి సంవత్సరం దాదాపు 1.7 బిలియన్ల మంది విరేచనాల వల్ల అతిసారతో బాధపడుతున్నట్లు సమాచారం. ముక్యంగా భారతదేశంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో మరణానికి అతిసార మూడవ ప్రధాన కారణంగా ఉంది. దీనిని నివారించడానికి ఓఆర్ఎస్ ఉపయోగపడుతోంది.
రెడీ టు డ్రింక్ ఓఆర్ఎస్ అనేది రోగులకు ఉపయోగపడే విధంగా డబ్ల్యుహెచ్ఓ మార్గదర్శకాలను పాటిస్తూ తయారైంది. రెడీ టు డ్రింక్ ఫార్మాట్‌లో తీసుకోవడం సులభం.. అంతే కాకుండా విరేచనాలతో పోరాడటానికి రీహైడ్రేషన్‌ను అందిస్తుంది. ఓఆర్ఎస్ మాత్రమే విరేచనాల వల్ల 93 శాతం మరణాలను నివారించగలదని అంచనా. కొత్త డబ్ల్యుహెచ్ఓ ఓఆర్ఎస్ కొత్త ఉత్పత్తి ఆపిల్ & ఆరెంజ్ అనే రెండు రుచికరమైన రుచులలో లభిస్తుంది.