ORS Packets
-
సైలెంట్ డీహైడ్రేషన్ అంటే ఏంటి?ఎలక్ట్రోలైట్ల ప్రాధాన్యత ఎంత?
రోజూ తగినన్ని నీళ్లు తాగుతున్నా, తరచూ నిస్సత్తువ, జబ్బుల బారిన పడితే ‘సైలెంట్ డీహైడ్రేషన్’ బారినపడ్డట్లే అంటున్నారు వైద్యులు. తెలంగాణా సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లక్షల మంది ఈ సైలెంట్ డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు.కొద్దిపాటి జాగ్రత్త, ముందుచూపుతో ఈ సమస్యను అధిగమించడం చాలా సులువు అంటున్నారు నిపుణులు.ఆహారంతో పాటు శరీరానికి తగినంత నీరు కూడా అవసనం, నీటితోపాటే శరీరానికి అవసరమైన లవణాలు కొన్నింటిని జోడిస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... దాహమేస్తే నీళ్లు తాగుతాం కానీ... ఖనిజ, లవణాలు తగ్గిపోతే ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందుకే దీన్ని ‘సైలెంట్ డీహైడ్రేషన్’ అంటారు దీన్ని. శరీరంలో నీటి మోతాదు, ఇతర లవణాలు తగ్గిపోవడం, అతిసారం వంటి వ్యాధుల వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.హైదరాబాద్ నగరంలో ఏటికేడాదీ కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, మొత్తం వ్యాధిగ్రస్తుల్లో 10 - 15 శాతం మందికి సైలెంట్ డీహైడ్రేషనే కారణమని గాంధీ వైద్య కళాశాల మాజీ అధ్యాపకులు, పీడియాట్రిక్స్ విభాగాధిపత్రి డాక్టర్ సి.సురేశ్‌కుమార్ తెలిపారు. పరిస్థితి చేయి దాటకముందే ఈ సైలెంట్ డీహైడ్రేషన్‌ను గుర్తించాలనీ, ముఖ్యంగా ద్రవ సమతౌల్యం కోసం ఎలక్ట్రోలైట్లు కచ్చితంగా కావాలి. నాడీ, కండరాల పనితీరును నియంత్రించేందుకు, కణాల్లో జరిగే జీవక్రియల కోసం ఈ ఎలక్ట్రోలైట్లు కీలకం. పైగా... సైలెంట్ డీహైడ్రేషన్‌కు దారితీసే పరిస్థితుల్లో (అతిసారం కాకున్నా) శరీరానికి చాలా ఎక్కువ శక్తి అవసరమవుతుందన్నది గుర్తించాలన్నారు.డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్తో లాభం...శరీరంలో ద్రవ సంతులనాన్ని కాపాడుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసే ఓఆర్ఎస్ ఎంతో ఉపయోగపడుతుందని, డీహైడ్రేషన్, అతిసారం రెండింటి నియంత్రణకు వాడుకోవచ్చునని డాక్టర్ సి.సురేశ్ కుమార్ తెలిపారు. సైలెంట్ డీహైడ్రేషన్‌కు దారితీసే పరిస్థితుల నుంచి కోలుకునేందుకు కూడా ఓఆర్ఎస్లోని ఎలక్ట్రోలైట్లు బాగా ఉపయోగపడతాయన్నారు.జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, వేడి కారణంగా వచ్చే జబ్బులు, వాంతులు లాంటి ఇతర సందర్భాల్లో తగినన్ని నీళ్లు, ఎలక్ట్రోలైట్లు తీసుకోవడం మంచిదని, పిల్లలు, వృద్ధులు ఈ విషయంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని కోరారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చాలామంది వడదెబ్బ కారణంగా ఏర్పడ్డ డీహైడ్రేషన్‌తో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, హైదరాబాద్‌లో పిల్లలు కూడా బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అధ్యాపకులు డాక్టర్ ఎన్.ఎల్.శ్రీధర్ మాట్లాడుతూ ‘‘సైలెంట్ డీహైడ్రేషన్‌పై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పిల్లలు, వృద్ధుల్లో ఇది చాలా త్వరితగతిలో ముదిరిపోతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకూ దారితీయవచ్చు’’ అని ఆయన తెలిపారు. -
జర జాగ్రత్త.. అవి ఓఆర్ఎస్లు కాదు.. ప్యాకేజ్డ్ జ్యూస్‌లే!
సాక్షి, హైదరాబాద్: వేసవిలో చాలా మందికి ఎదురయ్యే సమస్య డీహైడ్రేషన్. అయితే దీని చికిత్సకు తక్షణ పరిష్కారంగా బాధితులు మెడికల్ షాపుల నుంచి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ఓఆర్ఎస్)ను పోలిన వాటిని వాడుతూ మరింత అనారోగ్యం పాలవుతున్న ఉదంతాలు హైదరాబాద్‌లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య మరింతగా కనిపిస్తోంది. దీనికి కారణం బాధితులు వినియోగించినవి నిజమైన ఓఆర్ఎస్లు కాకపోవడమేనని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం నగరవాసులు వినియోగిస్తున్న వాటిలో అనేకం నిజానికి ఓఆర్ఎస్లు కావని... అవి కేవలం ప్యాకేజ్డ్ పండ్ల రసాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. అవగాహన లేమితో వాటిని వినియోగించడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయమే.. ఆకస్మిక అనారోగ్యం తద్వారా నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల శరీరం నుంచి లవణాలు,నీరు అధికంగా కోల్పోవడాన్నే డీహైడ్రేషన్‌గా పేర్కొంటారు. ఈ పరిస్థితి ఏర్పడడం వల్ల శరీరంలో రక్తసరఫరా తగ్గిపోతుంది. అది అనంతరం ఫిట్స్ రావడానికి లేదా కిడ్నీ ఫెయిల్ కావడం వంటి తీవ్ర సమస్యలకు కూడా దారితీయొచ్చు. ఈ ప్రమాదాల్ని నివారించడానికి బాధితులకు వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వాలని వైద్యులు సూచిస్తుంటారు. డీహైడ్రేషన్ ద్వారా మనం కోల్పోయిన నీటిని, లవణాలను భర్తీ చేసేదే ఓఆర్ఎస్. అలవాటులో పొరపాటుగా... కానీ భాగ్యనగరంలో అనేక మంది డీహైడ్రేషన్‌కు గురవగానే ఓఆర్ఎస్లుగా భావించి వాటిని పోలిన పేర్లతో ఉండే వాటిని వినియోగిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో కనిపించే వాటిని ఓఆర్ఎస్ఎల్ అని, రీబ్యాలెన్స్ విట్ ఓఆర్ఎస్ మొదలైన పేర్లతో కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అయితే వీటిని ఓఆర్ఎస్గా వాడకూడదని చిన్న అక్షరాల్లో ఓ మూలకు రాస్తుండటంతో చాలా మంది వాటిని గమనించక ఓఆర్ఎస్గా భావించి వాడుతున్నారు. రివర్స్ రిజల్ట్... పండ్ల రసాలను ఓఆర్ఎస్గా భ్రమింపజేసేలా లేబుల్ అతికించి విక్రయించడంపై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఎపి) వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి అధిక చక్కెరను కలిగి ఉంటాయని, అతిసారాన్ని తగ్గించే బదులు మరింత పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. చక్కెర శాతం అధికంగా ఉండే జ్యూస్‌ల వాడకం వల్ల మనం ఏ ప్రయోజనం ఆశించి వాటిని తీసుకుంటున్నామో వాటికి పూర్తి వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అంటే విరేచనాలు, వాంతులు మరింతగా పెరుగుతాయని వివరిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా కీలకం... కేవలం డబ్ల్యూహెచ్ఓ ఫార్ములాను అనుసరించి తయారైన ఓఆర్‌ఎస్‌లనే వాడాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఓపీ) వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం తయారైన ఓఆర్ఎస్లో సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాíÙయం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ మాత్రమే ఉంటాయని... కాచి చల్లార్చిన లీటర్ నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి 24 గంటల వ్యవధిలో తాగితే డయేరియా వల్ల కలిగే నిర్జలీకరణాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అవగాహన కల్పించాలి.. ఈ సమస్యపై కొన్నేళ్లుగా రకరకాల వేదికలపై పోరాడుతున్నా. అసలైన ఓఆర్ఎస్ను పోలిన లేబుల్స్‌తో ఉన్న ప్యాకేజ్డ్ జ్యూస్‌లను వాడటం వల్ల చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. దీనిపై వినియోగదారుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలు -
Dilip Mahalanabis: ‘అతిసార’ బాధితులకు జీవామృత ప్రదాత
దిలీప్ మహాలనోబిస్ పేరు చాలా తక్కువమంది వినుంటారు. కానీ అక్టోబర్ 16న మరణించిన ఈయన కొన్ని వేల ప్రాణాలు... మరీ ముఖ్యంగా పసిపిల్లల ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర పోషించాడని తెలిస్తే మాత్రం ప్రజారోగ్య రంగంలో ఓ గొప్ప వైద్యుడిని కోల్పోయామని అనిపించక మానదు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను జనాభా స్థాయిలో ఒక చికిత్సా పద్ధతిగా అందుబాటులోకి తీసుకురావడంలో మహాలనోబిస్ది చాలా ముఖ్యమైన పాత్ర. ఈ ఓఆర్ఎస్ పుణ్యమా అని అతిసార, కలరా వంటి వ్యాధుల నుంచి వేగంగా కోలుకోగలుగుతున్నారు. ఇలా కొన్ని వేల మంది ప్రాణాలను ఓఆర్ఎస్ కాపాడగలిగింది. ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ (ఓఆర్టీ) అంటే.. నీటికి సూక్ష్మ మోతాదుల్లో చక్కెరలు, లవణాలు కలిపి ఇవ్వడమే. లవణాల్లో ముఖ్యంగా సోడియం, పొటాషియంలు ప్రధానంగా ఉంటాయి. అతిసార వల్ల శరీరంలోని ద్రవాల మోతాదు తగ్గడానికి విరుగుడుగా ఈ ఓఆర్ఎస్ పనిచేస్తుంది. ఐక్య రాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు భారత ఉప ఖండం అందించిన అతి గొప్ప ఆయుధం ఈ ఓఆర్టీ అని ‘కరెంట్ సైన్స్’ పత్రిక పేర్కొంది. ఓఆర్ఎస్ అందుబాటులోకి వచ్చేంతవరకూ కలరా వంటి వ్యాధుల చికిత్సలో రక్తనాళాల ద్వారా ద్రవాలను శరీ రానికి అందించడమే ప్రధానంగా ఉండేది. పొట్టకు విశ్రాంతి కలిగించే పేరుతో కలరా వ్యాధిగ్రస్థులకు ఆహారం ఇచ్చేవారు కాదు. నీళ్లు కూడా కొద్దికొద్దిగా తాగించే వాళ్లు. దీంతో పౌష్టి కాహార లోపం ముదిరి సమస్య జటిలమయ్యేది. ఓఆర్టీ దీనికి పూర్తి విరుద్ధమైనది. 1978–2008 మధ్యకాలంలో ఓఆర్టీ వల్ల కోట్లమంది అతిసారతో మరణించకుండా నివా రించగలిగామని గణాంకాలు చెబుతున్నాయి. తీవ్రమైన అతిసార వ్యాధికి చికిత్స చేసేందుకు 1960 లలోనే ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అందుబాటులోకి వచ్చింది. అత్యధికుల ప్రాణాలు తీస్తున్న అతిసారకు ‘ఓఆర్ఎస్’ చాలా సులువైన, సమర్థమైన చికిత్స. అయితే అప్పట్లో వైద్యులు చాలామంది దీన్ని ప్రతిఘటించారు. దాదాపు ఈ సమయంలోనే ప్రపంచం కలరా మహమ్మారి గుప్పిట్లో ఉండేది. 1961లో ఇండోనేసియాలో మొదలై 1963కల్లా బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్)కు వ్యాపించి, 1964లో భారత్ లోకి వచ్చింది. ఓఆర్ఎస్పై అప్పటికే పరిశోధనలు జరుగు తున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ 1970 నాటికి గానీ ఇంట్రా వీనస్ ఫ్లూయిడ్లను భారీ ఎత్తున పంపిణీ చేయడం ద్వారా మేల్కోలేదు. ఈ సమయంలోనే ఢాకా కేంద్రంగా కలరా రీసెర్చ్ లాబొరేటరీ టీకా తయారీకి పరిశోధనలు చేస్తూండేది. దక్షిణాసియాలో ఉన్న అమెరికా సైనికులను కాపాడుకునేందుకు ఈ టీకా ఉపయోగపడుతుందని అనుకునేవారు. 1971లోనే తూర్పు పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్‌గా అవతరించింది. అనేక సమస్యల కారణంగా కలరా రీసెర్చ్ లాబొరేటరీ... కలరా టీకాతోపాటు ఓఆర్టీ ప్రయోగాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. దిలీప్ మహాలనోబిస్ 1966లో కలకత్తాలోని ‘జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్’లో పని చేస్తూ ఉండేవారు. ఈ సంస్థ ద్వారా కలరా రీసెర్చ్ ప్రోగ్రామ్‌లోనూ పని చేస్తూండేవారు. పశ్చిమ బెంగాల్లో సుమారు 3.5 లక్షల మంది బంగ్లాదేశ్ శరణార్థులున్న ‘బనగాన్’ శిబిరంలో కలరా బాధితులకు చికిత్స అందిస్తూండేవారు. ఒక దశలో అందుబాటులో ఉన్న ఇంట్రా వీనస్ ఫ్లూయిడ్లు పూర్తిగా ఖర్చయి పోయాయి. ఓఆర్ఎస్ను వాడేందుకు ఇదే తగిన సమయమని మహాలనోబిస్ అనుకున్నారు. అయితే ప్యాకెట్లేవీ అందుబాటులో లేవు. దీంతో వారు చక్కెర, ఉప్పు తీసుకొచ్చి డ్రమ్ముల్లో ద్రావణాన్ని సిద్ధం చేశారు. క్యాంపుల్లో ఉన్న కలరా వ్యాధిగ్రస్థులకు ఇవ్వడం మొదలుపెట్టారు. జాన్ హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్లోని గ్రంథాలయం కాస్తా ఓఆర్ఎస్ ఫ్యాక్టరీగా మారింది. అనుమతులున్న చికిత్స పద్ధతి కాక పోవడంతో మహాలనోబిస్ చాలా రిస్క్ చేశారు. రెండు మూడు వారాల్లోనే తమ నిర్ణయం తప్పేమీ కాదని స్పష్టమైంది. ఎందుకంటే ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకున్న వారికి స్వస్థత చేకూరింది. శిక్షణ పొందిన సిబ్బంది లేకపోయినా కార్యకర్తల ద్వారానే ఈ ఓఆర్ఎస్ను అందించ వచ్చునని అర్థమైంది. బనగాన్ శిబిరంలో ఓఆర్ఎస్ ద్రావణం ఇచ్చిన తరువాత ఏం జరిగిందో విశ్లేషించినప్పుడు మరణాల రేటు గణ నీయంగా తగ్గినట్లు స్పష్టమైంది. ఈ తగ్గుదల ఐదు శాతం నుంచి 40 శాతం వరకూ ఉన్నట్లు గుర్తించారు. మహాల నోబిస్ బృందం ఈ ఓఆర్ఎస్కు ‘ఓరల్ సెలైన్’ అని పేరు పెట్టింది. ఓఆర్ఎస్ను తయారు చేసుకునే పద్ధతులను వివ రిస్తూ పాంప్లెట్ల ద్వారా సరిహద్దుల్లో పంచిపెట్టారు. ఈ విషయాన్ని అందిపుచ్చుకున్న బంగ్లాదేశ్ రేడియో స్టేషన్ కూడా ఓఆర్ఎస్ తయారీ ప్రక్రియ వివరాలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. అయినా చాలా సైన్స్ పత్రికలు మహాల నోబిస్ పరిశోధనా ఫలితాల ప్రచురణకు తిరస్కరించాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థలో అప్పట్లో బ్యాక్టీరియా వ్యాధుల విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న ధీమన్ బారువాకు మహాలనోబిస్ సమర్పించిన సమాచారం నమ్మదగిందిగానే అనిపించింది. అదే విషయాన్ని ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థలోనూ వివరించారు. ఫలితంగా 1978లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓఆర్టీపై ప్రపంచ స్థాయిలో ప్రచారం మొదలుపెట్టింది. మహాలనోబిస్ పనులకు గుర్తింపుగా అదే ఏడాది జూలై 29న ‘పోలెన్ పీడియాట్రిక్ రీసెర్చ్ ప్రైజ్’ను అందించారు. ఈ రోజునే ప్రపంచ ఓఆర్ఎస్ దినంగా జరుపుకుంటున్నారు. 2006లో ‘ప్రిన్స్ మహీడాల్’ అవార్డు కూడా మహాలనోబిస్కు లభించింది. ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయంలో అతిసార వ్యాధి నియంత్రణ కార్యక్రమానికి అధ్య క్షుడిగానూ వ్యవహరించారు. 1990లో ‘మహాలనోబిస్ సొసైటీ ఫర్ అప్లైడ్ స్టడీస్’ను పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేసి నాణ్యమైన జీవితం, మెరుగైన ఆరోగ్యం అందరికీ అందాలన్న లక్ష్యంతో పనిచేశారు. ముఖ్యంగా తన వారసత్వాన్ని కొనసాగించగల యువ శాస్త్రవేత్తలనూ సిద్ధం చేశారు. (క్లిక్ చేయండి: కరోనా మరోసారి విజృంభించడానికి సిద్ధమవుతోంది...) – రజీబ్ దాస్‌గుప్తా, సెంటర్ ఫర్ సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్, జేఎన్‌యూ, ఢిల్లీ -
కోట్లాదిమందికి ప్రాణదాత, ఓఆర్ఎస్ సృష్టికర్త ఇకలేరు
కోలకతా: ప్రముఖ వైద్యుడు, ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ థెరపీకి) ఆద్యుడు డాక్టర్ దిలీప్ మహలనాబిస్ (87) ఇకలేరు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఇతర వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. (క్రికెట్ వైరల్ వీడియో: ఆనంద్ మహీంద్ర ట్వీట్, నెటిజన్ల నోస్టాల్జియా) ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ అపూర్బా ఘోష్ మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో కలరా , ఎంటెరిక్ వ్యాధుల చికిత్సలో మహలనాబిస్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాగే అతని రచనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఘోష్ పేర్కొన్నారు. శిశువైద్యునిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో, పశ్చిమ బెంగాల్‌లోని బంగావ్‌లోని శరణార్థి శిబిరంలో పనిచేస్తున్నప్పుడు కలరా వ్యాప్తి చెందినపుడు డాక్టర్ దిలీస్ ఓఆర్ఎస్ ద్రావణంతో వేలాది మంది ప్రాణాలను రక్షించి వార్తల్లో నిలిచారు. కాగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు నివారించడానికి ఓఆర్ఎస్ ద్రావణానికి మించిన ప్రత్యామ్నాయం లేదు. ఈ థెరపీ శరీరంలోని ఉప్పు, చక్కెర, ఇతర ద్రవాల మొత్తాన్ని సమతుల్యం చేస్తుంది. ఒక విధంగా ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తూ ప్రపంచంలోని కోట్లాది మంది ప్రాణాలను కాపాడింది. గతంలో కోలకతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అభివృద్ధికి మహలనాబిస్ దంపతులు కోటి విరాళాన్ని అందించడం గమనార్హం. (5జీ సేవలు: ప్రధాన ప్రత్యర్థులతో జియో కీలక డీల్స్) -
‘ఓఆర్ఎస్’ అమ్మకాలపై కౌంటర్ వేయండి
సాక్షి, హైదరాబాద్: శక్తినిచ్చే ఓఆర్ఎస్ పేరిట పలు సంస్థలు నకిలీ పానీయాలు విక్రయిస్తున్నాయని దాఖలైన కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఆహార భద్రతా సంస్థ జారీ చేసిన నిబంధనలను పాటించకుండా పలు సంస్థలు ఓఆర్ఎస్ విక్రయాలు చేస్తున్నా చర్యలు తీసుకోవలేవడం లేదంటూ హైదరాబాద్ మణికొండలోని ల్యాంకోహిల్స్‌కు చెందిన డాక్టర్ ఎం.శివరంజని సంతోష్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. చదవండి: జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్! దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిల్‌కు అభ్యంతరం తెలిపిన హైకోర్టు రిజిస్ట్రీని.. నంబర్ కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. అనారోగ్యంగా ఉన్న వారికి ఓఆర్ఎస్ ఎంతగానో ఉపయోగపడుతుందని, డ్రగ్ అండ్ కాస్మోటిక్ చట్టంలోని నిబంధనలను పలు సంస్థలు పాటించడం లేదని పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నారు. చక్కెర, ఉప్పు అధిక మోతాదుల్లో ఉన్న డ్రింక్స్‌ను ఓఆర్ఎస్ పేరిట అమ్మేస్తున్నాయని నివేదించారు. ఇవి తాగితే ఆస్పత్రి కావాల్సి వస్తుందని, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదని వెల్లడించారు. నిబంధలు పాటించకుండా.. బహిరంగంగా విక్రయాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వాదనల విన్న ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది. -
వడదెబ్బ నుంచి తప్పించుకోండి ఇలా..
ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే తగ్గడం లేదు. దీనికితోడు ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపానికి జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంట్లో ఏసీలు, కూలర్లు 24 గంటల పాటు వినియోగించాల్సి వస్తోంది. అయితే అందరూ ఇంట్లో ఉంటే కుదరదు కదా? అలాగని ఎండ బారిన పడితే వచ్చే అనర్థాలను తట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర విపత్తుల నివారణ, వైద్య ఆరోగ్య శాఖలు తెలిపాయి. – డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) జాగ్రత్తలు.. ► ఆరుబయట పని చేసే వారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ► తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే ముందు నుంచి నీళ్లు వెంట తీసుకెళ్లాలి. ► ఎక్కువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. ► అవసరాన్ని బట్టి ఓఆర్ఎస్ ద్రవణం తీసుకోవాలి. పండ్ల రసాలు, గంజి, మజ్జిగ, జావ వంటివి ఎక్కువగా తీసుకుంటే మేలు. ► తెలుపు లేత రంగుల్లో ఉన్న పలుచని కాటన్ దుస్తులు ధరించాలి. ► లకు ఎండ తగలకుండా టోపీ, రుమాలు చుట్టుకోవాలి. వడదెబ్బ ప్రమాదం ► ఎండలు, వడగాడ్పుల సమయంలో బయట తిరగడం వల్ల వడదెబ్బకు గురవుతారు. ► తక్కువగా నీరు తాగడం, ద్రవపదార్థాలు తీసుకోకపోవడం, చల్లదనం ఇవ్వని దుస్తులు ధరించడం, చెమటను పీల్చని దుస్తులు, మద్యం సేవించడం వల్ల వడదెబ్బ సోకుతుంది. ► వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వైద్యు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ► శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104.9 డిగ్రీల వరకు పెరిగిపోయి, దానిని నియంత్రించే శక్తి కోల్పోవడమే వడదెబ్బగా పరిగణిస్తారు. దీనిని చాలా మంచి జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. లక్షణాలు.. ► రక్తప్రసరణ తగ్గి బీపీ డౌన్ అవుతుంది ► శరీరంతో పాటు పెదాలు, గోర్ల రంగు మారుతుంది. ► ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. ► కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. ► నరాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ► స్పృహ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది ► మాటల్లో స్పష్టత తగ్గుతుంది. ► ఇతరులు చెప్పే మాటలను కూడా వినలేకపోతారు ► కొంత మంది కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది ► విపరీతమైన తలనొప్పి రావడం, హృదయ స్పందన బాగా పెరగడం, శ్వాస తీసుకోవడం కష్టమవడం, చర్మం బాగా కందిపోయి మంటగా ఉండటం, బుగ్గలు, మెడ, గొంతు, మోచేతులు, ఛాతి బాగాలు ఎరుపెక్కడం మొదలైనవి.. నివారణ చర్యలు.. ► తక్షణమే శరీర ఉష్ణోగ్రతను తగ్గించే చర్యలు చేపట్టకపోతే అవయవాలు శాశ్వతంగా పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ► వారిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చే వరకు అలానే చేయాలి. ► చల్లని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణాగ్రత తగ్గుముఖం పడుతుంది. బాత్‌టబ్‌లో ఐదు నుంచి పది నిమిషాలు గడపాలి. లేదా చల్లని దుప్పటిని శరీరమంతా కప్పాలి. ఆ తరువాత ఐస్ ముక్కలలతో శరీరమంతా అద్దాలి. ఇలా చేస్తే శరీరం వణుగు తుగ్గుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ► తీవ్రతను బట్టి ఆలస్యం చేయకుండా వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. వెంటనే చికిత్స ప్రారంభం అయితే ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు. ఏం తినాలి.. వడదెబ్బ సోకిన వారు ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, అదనంగా ద్రవపదార్థాలు, పండ్ల రసాలు, శక్తినిచ్చే శీతలపానీయాలు, మజ్జిగ తాగాలి. అలాగే చిరుధానాయలు తీసుకోవాలి. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి. తద్వారా వడదెబ్బ తీవ్రతను తగ్గిస్తాయి. -
Photo Feature: ఓఆర్ఎస్ కుండ.. ఎండలో అండ
ఖమ్మం వైద్యవిభాగం: ఎండాకాలం వచ్చిందంటే సహజంగా ఎక్కడైనా దాహార్తి తీర్చడానికి కుండలు.. లేదా మంచి నీటిని అందుబాటులో ఉంచుతారు. కానీ ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది వినూత్నంగా ఆలోచించారు. చల్లని నీటితో దాహార్తి తీరుతుందే తప్ప శక్తి రాదన్న ఉద్దేశంతో...ఆస్పత్రికి వచ్చే వారి కోసం ఓఆర్ఎస్ నీరు అందుబాటులో ఉంచారు. ఓఆర్ఎస్ పౌడర్ కలిసిన నీటిని మట్టికుండలో పోసి పెట్టారు. ఆస్పత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సిబ్బంది ఈ కుండను ఏర్పాటు చేయగా.. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న గర్భిణులు, చిన్నారులకు ఉపశమనం లభిస్తోంది. -
ఆవిరవుతున్న ప్రాణాలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత తో ఉపాధి హామీ కూలీలకు ప్రాణసంకటం గా మారింది. పనులకు వెళ్తున్న వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే గ్యారంటీ లే కుండా పోయింది. నెల రోజుల్లో ఇద్దరు కూలీలు ఎండదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఉష్ణాగ్రతలు 44 డిగ్రీలు దాటుతుండగా.. ఎలాంటి రక్షణ, వసతులు లేకుండా నే కూలీలు ఉపాధిహామీ పనులను చేయా ల్సి వస్తోంది. జిల్లాలో 394 గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం జాబ్ కార్డులు 2,59,338 ఉండగా, ఇందులో 5,32,044 మంది కూలీలుగా నమోదై ఉన్నారు. అప్పుడప్పుడూ పనులకు వస్తున్న కూలీలతో కలిపి 2,16,819 మంది ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే పనులకు వస్తున్న వారి సంఖ్య 90 వేలు దాటడం లేదు. చాలా మంది వడదెబ్బతో అస్వస్థతకు గురవుతూ పనులకు వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో కూలీల హాజరు శాతం తక్కువగా నమోదవుతోంది. హాజరు శాతం పెంచాలనే ఉద్దేశంతో పనులు కల్పిస్తున్న అధికారులు మండుటెండలో అవస్థలు పడుతున్న కూలీలకు మాత్రం ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. తాగునీరు, టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో కనిపించడం లేదు. కూలీలే వారి వెంట తాగునీటిని తెచ్చుకుంటున్నారు. 11 గంటల వరకు పనుల్లోనే.. వాస్తవానికి ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పని వేళలను ప్రభుత్వం మార్చింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు పని చేయించాలని అధికారులకు సూచించింది. అయితే ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్ర రూపాన్ని దాల్చుతున్నాడు. 9 గంటల నుంచి 11 గంటల వరకు 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. చెరువుల్లో పనులు చేయిస్తున్నందున అక్కడ అధిక ఉష్ణోగ్రతతో కూలీలు పనులు చేయలేకపోతున్నారు. ఇచ్చిన కొలతల ప్రకారం గుంతను తవ్విన తరువాతే ఇంటికి వెళ్లాలని ఫీల్డ్ అసిస్టెంట్లు చెప్పడంతో ఎండలో కూడా కూలీలు పనులు చేయాల్సి వస్తోంది. ఎండాకాలం కావడంతో నేల గట్టిగా ఉండటం కారణం చేత పని త్వరగా జరగడం లేదు. దీంతో ఒక్కో సారి మధ్యాహ్నం 12 గంటలు కూడా దాటుతోంది. పత్తాలేని టెంట్లు, మెడికల్ కిట్లు.. వేసవిలో పనిచేసే కూలీలు సేద తీరడానికి ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం టెంట్లు అందజేసింది. వీటిని గ్రూపునకు ఒకటి చొప్పున మేట్లకు అందజేశారు. కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలుగా ఉన్న సమయంలో టెంట్లను అందజేశారు. అవి కూడా అందరికి సరిపడా ఇవ్వలేదు. ఒక్కో టెంటును రూ.540 చొప్పున టెండరు ద్వారా 29,129 కొనుగోలు చేశారు. ఇప్పుడా టెంట్లు కొన్ని చోట్ల కనిపిస్తున్నా, చాలా చోట్ల వాటి ఆచూకీ లేదు. వాటిని ఎప్పుడో మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా మేట్లు పనికి వచ్చే సమయంలో వెంట తేవడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు. అలాగే ఎండలో పని చేస్తున్న కూలీలు డిహైడ్రేషన్కు గురి కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాల్సి ఉండగా, కొంత మేరకే సరఫరా అవుతున్నట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపారు. ఒక్కో గ్రూపునకు రెండు, మూడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారని, ప్రస్తుతం అవి కూడా అయిపోయాయన్నారు. ప్రాథమిక చికిత్సను అందించడానికి ప్రభుత్వం గతేడాది సరఫరా చేసిన మెడికల్ కిట్లూ కనిపించడం లేదు. మందుల గడువు తేదీ ముగియడంతో వాటిని వినియోగించడం లేదు. మండల పీహెచ్‌సీల నుంచి మందులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఎండలో పని చేసే సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలపై కూలీలకు డ్వామా అధికారులు అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. -
వడదెబ్బపై అప్రమత్తం
♦ ఉన్నతాధికారులతో వైద్య మంత్రి లక్ష్మారెడ్డి అత్యవసర చర్చ ♦ ఆసుపత్రుల్లో వడదెబ్బ చికిత్సలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం ♦ మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేయండి ♦ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన సాక్షి, హైదరాబాద్: మండే ఎండలకు రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారి జనం వడదెబ్బ బారిన పడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలకు ముందస్తుగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. వడదెబ్బ లక్షణాలతో వచ్చే వారికి వెంటనే చికిత్స అందేలా చూడాలని అన్ని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. కొన్నేళ్లలో ఎన్నడూ లేనట్టుగా ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నతాధికారు లతో గురువారం చర్చించారు. వడదెబ్బ లక్షణాలతో వచ్చేవారికి చికిత్స అందించేం దుకు అవసరమైన మందులు, గ్లూకోజ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సెలైన్లు సిద్ధంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఏయే ఆసుపత్రుల్లో కొరత ఉందో తెలుసుకుని వెంటనే అందుబా టులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా తెలియజెప్పాలని పేర్కొన్నారు. అప్రమత్తతే శ్రీరామరక్ష.. సాధారణంగా 35–36 డిగ్రీల ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకోగలుగుతామని, ప్రస్తుతం 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని తెలిపారు. ‘37 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే శరీరంలో వేడిని తట్టుకోవడానికి గుండె, రక్తనాళాలు, స్వేద గ్రంథులు సాధారణం కంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, నాలుక తడారిపోతుండటం, శరీరంలో నీటి శాతం బాగా తగ్గిపోవడం, పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితికి చేరడం వంటి లక్షణాలు వడదెబ్బకు సూచికలు. చెమట వల్ల శరీరం ఉప్పు శాతాన్ని కోల్పోయి తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, వాంతులు వంటివి సంభవిస్తాయి. కొంతమందిలో ఒంటి నొప్పులు, తిమ్మిర్లు కూడా ఏర్పడతాయి. శరీరం వేడెక్కినా, రక్తపోటు తగ్గినా, మానసిక గందరగోళానికి గురైనా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి’ అని తెలిపారు. ఈ మేరకు మంత్రి లక్ష్మారెడ్డి పలు సూచనలు చేశారు. ఇవీ పాటించాల్సిన సూచనలు.. ♦ వడదెబ్బకు గురైన వారిని వెంటనే చల్లటి ప్రాంతానికి తరలించాలి. శరీరాన్ని తడి బట్టతో తుడుస్తూ చల్లబడేలా చేయాలి. ♦ ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్లూకోస్, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగించాలి. ♦ ఇలా ప్రథమ చికిత్స చేసిన వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. ♦ ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకపోవటమే ఉత్తమం. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకునే వెళ్లాలి. ♦ గొడుగు, టోపీ వంటివి వినియోగించాలి. ముదురు రంగు దుస్తులు ధరించవద్దు. వీలైనంత వరకు కాటన్ వస్త్రాలే ధరించాలి. ♦ వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు ఎండలోకి వెళ్లకపోవడమే మంచిది. ♦ కాఫీ, టీ, ఆల్కహాలుకు దూరంగా ఉంటే మంచిది. ♦ కూలీలు ఎండ సమయంలో పనులకు వెళ్లవద్దు. ఉపాధి హామీ పనుల్లో ఉండేవారు ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు చేయాలి. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరోవైపు గురువారం పలు జిల్లా కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యా యి. ఆదిలాబాద్, నల్లగొండల్లో అత్యధికంగా 43 డిగ్రీలు రికార్డయ్యాయి. నిజామాబాద్, మెదక్‌లలో 43 డిగ్రీలకు కాస్త తక్కువగా, రాజధాని హైదరాబాద్‌లో 42 డిగ్రీలు నమోద య్యాయి. దీంతో జనం రోడ్లపైకి రావడానికే జంకారు. మధ్యాహ్నం వేళ ప్రధాన రహదారు లన్నీ జనసంచారం లేక పూర్తిగా బోసిపోయా యి. కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వందల మంది వడ దెబ్బకు గురవుతున్నారు. మరో రెండు రోజుల పాటు వడగాడ్పుల ప్రభావం తీవ్రంగానే ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. -
ప్రభుత్వ మందులు పారేశారు
మంచాల: ప్రజారోగ్యానికి పంపిణీ చేయాలని ప్రభుత్వం మందులను సమకూరిస్తే వాటిని అటవీప్రాంతంలో పారేసిన వైనం వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళితే జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు మండలంలోని పాఠశాలల్లో ఆరోగ్యం-పరిశుభ్రత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈక్రమంలో విద్యార్థులకు బలాన్నిచ్చే ఫోలిక్ఆసిడ్ మందు బిళ్లలను ఇవ్వాలి. డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రతి ఇంటికి పంచాలి. కాని గ్రామాల్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. అయితే ప్రజలకు పంచాల్సిన ఈ మందులు బుధవారం జాపాల్-రంగాపూర్ అటవీ ప్రాంతంలోని చెట్లపొదల్లో పెద్దమొత్తంలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఒక్కచోటే కాకుండా అక్కడకక్కడ విసిరేసినట్లుగా కనిపించాయి. ఇవి ప్రభుత్వం మాత్రమే సరఫరా చేసే మందులు కావడంతో వైద్యారోగ్య సిబ్బ ంది పారేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్య క్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలకు వెళితే మందు లు లేవని, బయట తీసుకోవాలని చిట్టీలు రాస్తున్నారు. ఇక్కడ చూస్తే విలువైన మందులు అటవీపాలయ్యా యి. ఘటనపై ఆరుట్ల ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ కిరణ్‌ను వివరణ కోరగా.. సదరు మందులను గ్రామా ల్లో ప్రజలకు పంచాలని ఏఎన్ఎంలు, ఆశవర్కర్లకు ఇచ్చామని, ఘటనపై విచారణ జరుపుతామని చెప్పారు.