రోజూ తగినన్ని నీళ్లు తాగుతున్నా, తరచూ నిస్సత్తువ, జబ్బుల బారిన పడితే ‘సైలెంట్ డీహైడ్రేషన్’ బారినపడ్డట్లే అంటున్నారు వైద్యులు. తెలంగాణా సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లక్షల మంది ఈ సైలెంట్ డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు.కొద్దిపాటి జాగ్రత్త, ముందుచూపుతో ఈ సమస్యను అధిగమించడం చాలా సులువు అంటున్నారు నిపుణులు.
ఆహారంతో పాటు శరీరానికి తగినంత నీరు కూడా అవసనం, నీటితోపాటే శరీరానికి అవసరమైన లవణాలు కొన్నింటిని జోడిస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... దాహమేస్తే నీళ్లు తాగుతాం కానీ... ఖనిజ, లవణాలు తగ్గిపోతే ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందుకే దీన్ని ‘సైలెంట్ డీహైడ్రేషన్’ అంటారు దీన్ని. శరీరంలో నీటి మోతాదు, ఇతర లవణాలు తగ్గిపోవడం, అతిసారం వంటి వ్యాధుల వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.
హైదరాబాద్ నగరంలో ఏటికేడాదీ కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, మొత్తం వ్యాధిగ్రస్తుల్లో 10 - 15 శాతం మందికి సైలెంట్ డీహైడ్రేషనే కారణమని గాంధీ వైద్య కళాశాల మాజీ అధ్యాపకులు, పీడియాట్రిక్స్ విభాగాధిపత్రి డాక్టర్ సి.సురేశ్‌కుమార్ తెలిపారు. పరిస్థితి చేయి దాటకముందే ఈ సైలెంట్ డీహైడ్రేషన్‌ను గుర్తించాలనీ, ముఖ్యంగా ద్రవ సమతౌల్యం కోసం ఎలక్ట్రోలైట్లు కచ్చితంగా కావాలి. నాడీ, కండరాల పనితీరును నియంత్రించేందుకు, కణాల్లో జరిగే జీవక్రియల కోసం ఈ ఎలక్ట్రోలైట్లు కీలకం. పైగా... సైలెంట్ డీహైడ్రేషన్‌కు దారితీసే పరిస్థితుల్లో (అతిసారం కాకున్నా) శరీరానికి చాలా ఎక్కువ శక్తి అవసరమవుతుందన్నది గుర్తించాలన్నారు.
డబ్ల్యూహెచ్‌ఓ ఓఆర్‌ఎస్‌తో లాభం...
శరీరంలో ద్రవ సంతులనాన్ని కాపాడుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసే ఓఆర్‌ఎస్ ఎంతో ఉపయోగపడుతుందని, డీహైడ్రేషన్, అతిసారం రెండింటి నియంత్రణకు వాడుకోవచ్చునని డాక్టర్ సి.సురేశ్ కుమార్ తెలిపారు. సైలెంట్ డీహైడ్రేషన్‌కు దారితీసే పరిస్థితుల నుంచి కోలుకునేందుకు కూడా ఓఆర్‌ఎస్‌లోని ఎలక్ట్రోలైట్లు బాగా ఉపయోగపడతాయన్నారు.
జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక‌్షన్, వేడి కారణంగా వచ్చే జబ్బులు, వాంతులు లాంటి ఇతర సందర్భాల్లో తగినన్ని నీళ్లు, ఎలక్ట్రోలైట్లు తీసుకోవడం మంచిదని, పిల్లలు, వృద్ధులు ఈ విషయంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని కోరారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చాలామంది వడదెబ్బ కారణంగా ఏర్పడ్డ డీహైడ్రేషన్‌తో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, హైదరాబాద్‌లో పిల్లలు కూడా బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అధ్యాపకులు డాక్టర్ ఎన్.ఎల్.శ్రీధర్ మాట్లాడుతూ ‘‘సైలెంట్ డీహైడ్రేషన్‌పై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పిల్లలు, వృద్ధుల్లో ఇది చాలా త్వరితగతిలో ముదిరిపోతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకూ దారితీయవచ్చు’’ అని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment