silent
-
అందుకే మన్మోహన్ సైలెంట్‌గా ఉండేవారట!
విషయం వీక్‌గా ఉన్నప్పుడే.. పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందనేది ఓ నానుడి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విషయంలో అది పూర్తి వ్యతిరేకంగా. స్టేట్స్ మన్‌గా సెన్సేషన్సలిజానికి వీలైనంత దూరంగా ఉండేవారాయన. ఆయన వస్తున్నారంటే.. మీడియా కూడా పెద్దగా హడావిడి చేసేది కాదు. దీనిని అలుసుగా తీసుకునే ప్రతిపక్షాలు ఆయన వ్యక్తిత్వాన్ని మరోలా ప్రొజెక్ట్ చేశాయి. ఆయన్ని రకరకాలుగా నిందించాయి. అయితే ఆయన మౌనం వెనుక కారణాలు లేకపోలేదు.. ‘‘మన్మోహన్ అనే వ్యక్తి ఓ సైలెంట్ పీఎం.. దేశానికి డమ్మీ పీఎం. ఆయనకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడమంటే భయం. మన్మోహన్ సింగ్ కాదు.. ఆయన మౌనమోహన్ సింగ్. అధిష్టానం చేతిలో ఆయనొక కీలు బొమ్మ. జన్‌పథ్ నుంచే దేశ పాలన అంతా సాగుతోంది’’.. యూపీఏ రెండు టర్మ్‌ల పాలనలో ప్రతిపక్షాలు తరచూ ఈ విమర్శలు చేసేవి. కానీ.. ప్రధానిగా ఆయన ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చారు. వాటిని నిశితంగా విశ్లేషిస్తే.. ఆయన ప్రెస్మీట్లో అనవసర అంశాలు కనిపించవు. దేశ, అంతర్జాతీయ, ఆర్థిక సంబంధిత అంశాలపై అలవోకగా మాట్లాడేవారు. అలాగే పాలనాపరమైన నిర్ణయాలను ప్రకటించేవారు. మైకుల ముందు మన్మోహన్ సింగ్(Manmohan Singh) ముక్కుసూటిగా మాట్లాడేవారు. విషయం ఏది ఉన్నా.. నిర్దిష్టంగా, స్పష్టంగా చెప్పేవారు. రాజకీయ విమర్శలు చేయడం అత్యంత అరుదుగా ఉండేది. అయితే.. నెమ్మదిగా మాట్లాడడం ఆయనకంటూ ఓ మైనస్ అయ్యింది.ఇక.. డిజిటల్ మీడియా ఆయన హయాంగా ఉన్న టైంలోనే అభివృద్ధి చెందింది. కానీ, సమకాలీన రాజకీయ నేతల్లో సోషల్ మీడియాను పరిమితంగా ఉపయోగించారాయన. సంప్రదాయ మీడియా మీదే ఆయన దృష్టంతా ఉండేది. మన్మోహన్ తన పుస్తకం ‘‘ఛేజింగ్ ఇండియా’’లోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా తన నాయకత్వ లక్షణాలను సమర్థించుకున్నారు కూడా.‘‘ఆ టైంలో మీడియా ఫోకస్ అంతా వేరేలా ఉండేది. ఆయన ప్రెస్ మీట్ అంటే పెద్ద హడావిడి ఉండేది కాదు. ఆయన సూచన మేరకే అలా జరిగేది!. తనను ప్రధానిగా కూడా ప్రమోట్ చేసుకోవడానికి అంతగా ఆయన ఆసక్తి చూపించేవారు కాదు. అందుకు రాజకీయ పరమైన కారణాలూ ఉండొచ్చు. ఇప్పుడున్నట్లు సోషల్ మీడియా ఉండి ఉంటే.. ఆయన ఎంతటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తో.. హుషారైన వ్యక్తో ప్రతీ ఒక్కరికీ తెలిసి ఉండేది’’ అని ఓ సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ఆయన నిష్క్రమణ తర్వాత మరికొందరు జర్నలిస్టులు ఆయనతో ఇంటెరాక్షన్ సమయంలో అనుభవాల్ని పంచుకోవడమూ చూస్తున్నాం.పదేళ్లపాటు.. 2004-2014 మధ్య యూపీఏ తరఫున ప్రధానిగా ఆయన 117సార్లు మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. మీడియా సమావేశాలు, విదేశీ పర్యటనల్లో విలేకరులతో ఇంటెరాక్షన్, దేశీయ పర్యటనలు, వార్షిక సమావేశాలు, రాజకీయ.. ఎన్నికల ప్రచారాలు మొత్తం కలిపి ఉన్నాయి. ప్రత్యేకించి విదేశీ పర్యటనలో.. తిరుగు ప్రయాణాల్లో.. ఆయన విమానాల్లోనే జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే అవి విమర్శలకు సైతం తావిచ్చాయి కూడా. అలాగే మీడియా ముందుకు వచ్చేందుకు ఏనాడూ ఆయన తటపటాయించేవారు కాదు.. అది ఎంత పెద్ద అంశమైనా అనర్గళంగా మాట్లాడేవారు. మీడియా ముఖంగా ఆయన కఠినంగా మాట్లాడింది లేదు. అయితే ఈ మృదు స్వభావమే ఆయన్ని మీడియాలో పెద్దగా హైలెట్ చేయలేకపోవడానికి ప్రధాన కారణమైంది. అదే సమయంలో.. డిగ్నిఫైడ్ లీడర్‌గా ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టింది.మన్మోహన్.. పుట్టిపెరిగిన పరిస్థితులు కూడా ఆయన రిజర్వ్డ్ నేచర్‌కు మరో కారణం. బ్రిటిష్ ఇండియాలో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించిన మన్మోహన్.. విభజన తర్వాత భారత్‌కు వలస వచ్చారు. అయితే బాల్యంలో ఆయన అల్లరి మాములుగా ఉండేది కాదట. ఈ విషయాన్ని ఆయన బాల్య స్నేహితుడు రాజా ముహ్మద్ చాలా ఏళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మన్మోహన్ తండ్రి డ్రైఫ్రూట్స్ వ్యాపారి. దీంతో ఆయన తన జేబులో ఏవో ఒకటి తీసుకుని వచ్చేవారట. వాటి కోసం జరిగిన అల్లరి అంతా ఇంతా కాదని చెప్పారాయన.మన్మోహన్ ప్రధాని అయ్యాక.. తన బాల్య స్నేహితుడిని చూసేందుకు నేరుగా ఆయన నివాసానికే వెళ్లారు రాజా ముహ్మద్. ఇక తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో నాయనమ్మ దగ్గరే పెరిగారాయన. ఆ టైంలోనే ఆయనలోని అల్లరి మరుగున పడింది. ఆమె సంరక్షణలో ఆయన ఎంతో క్రమశిక్షణ అలవర్చుకున్నారు. కరెంట్ లేని ఓ గ్రామంలో కిరోసిన్ దీపపు వెలుగులోనే చదువుకునేవారు. స్నేహితులతో కలిసి ఆయన బయటకు వెళ్లడం.. ఆడడం అరుదుగా ఉండేవి. ఉన్నత విద్య సమయంలో.. ఆర్వాత ఉన్నత పదవులు అధిరోహించిన టైంలోనే ఆయన ఒద్దికగా ఉన్నారు. ప్రధానిగా దిగిపోయాక.. రాజకీయాలకు ఆ కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది!. పైగా చిన్నప్పటి నుంచి ఆయన ఓ విషయాన్ని అలవర్చుకున్నారు. ఎక్కువ వినడం.. ఎక్కువగా అర్థం చేసుకోవడం.. తక్కువగా మాట్లాడం.. వెరసి మౌనమునిగా బతకడం. ఇదే ఆయన తుదిశ్వాస విడిచేవరకు పాటిస్తూ వచ్చారు. మేధావులు మౌనం వహించినప్పుడు.. మూర్ఖుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం::నెల్సన్ మండేలాఒక మూర్ఖుడి ఆవేశం కన్నా ఒక మేధావి మౌనం ఈ దేశానికి చాలా ప్రమాదకరం:::నేతాజీ సుభాష్ చంద్రబోస్ -
సైలెంట్ డీహైడ్రేషన్ అంటే ఏంటి?ఎలక్ట్రోలైట్ల ప్రాధాన్యత ఎంత?
రోజూ తగినన్ని నీళ్లు తాగుతున్నా, తరచూ నిస్సత్తువ, జబ్బుల బారిన పడితే ‘సైలెంట్ డీహైడ్రేషన్’ బారినపడ్డట్లే అంటున్నారు వైద్యులు. తెలంగాణా సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లక్షల మంది ఈ సైలెంట్ డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు.కొద్దిపాటి జాగ్రత్త, ముందుచూపుతో ఈ సమస్యను అధిగమించడం చాలా సులువు అంటున్నారు నిపుణులు.ఆహారంతో పాటు శరీరానికి తగినంత నీరు కూడా అవసనం, నీటితోపాటే శరీరానికి అవసరమైన లవణాలు కొన్నింటిని జోడిస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... దాహమేస్తే నీళ్లు తాగుతాం కానీ... ఖనిజ, లవణాలు తగ్గిపోతే ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందుకే దీన్ని ‘సైలెంట్ డీహైడ్రేషన్’ అంటారు దీన్ని. శరీరంలో నీటి మోతాదు, ఇతర లవణాలు తగ్గిపోవడం, అతిసారం వంటి వ్యాధుల వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.హైదరాబాద్ నగరంలో ఏటికేడాదీ కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, మొత్తం వ్యాధిగ్రస్తుల్లో 10 - 15 శాతం మందికి సైలెంట్ డీహైడ్రేషనే కారణమని గాంధీ వైద్య కళాశాల మాజీ అధ్యాపకులు, పీడియాట్రిక్స్ విభాగాధిపత్రి డాక్టర్ సి.సురేశ్‌కుమార్ తెలిపారు. పరిస్థితి చేయి దాటకముందే ఈ సైలెంట్ డీహైడ్రేషన్‌ను గుర్తించాలనీ, ముఖ్యంగా ద్రవ సమతౌల్యం కోసం ఎలక్ట్రోలైట్లు కచ్చితంగా కావాలి. నాడీ, కండరాల పనితీరును నియంత్రించేందుకు, కణాల్లో జరిగే జీవక్రియల కోసం ఈ ఎలక్ట్రోలైట్లు కీలకం. పైగా... సైలెంట్ డీహైడ్రేషన్‌కు దారితీసే పరిస్థితుల్లో (అతిసారం కాకున్నా) శరీరానికి చాలా ఎక్కువ శక్తి అవసరమవుతుందన్నది గుర్తించాలన్నారు.డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్తో లాభం...శరీరంలో ద్రవ సంతులనాన్ని కాపాడుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసే ఓఆర్ఎస్ ఎంతో ఉపయోగపడుతుందని, డీహైడ్రేషన్, అతిసారం రెండింటి నియంత్రణకు వాడుకోవచ్చునని డాక్టర్ సి.సురేశ్ కుమార్ తెలిపారు. సైలెంట్ డీహైడ్రేషన్‌కు దారితీసే పరిస్థితుల నుంచి కోలుకునేందుకు కూడా ఓఆర్ఎస్లోని ఎలక్ట్రోలైట్లు బాగా ఉపయోగపడతాయన్నారు.జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, వేడి కారణంగా వచ్చే జబ్బులు, వాంతులు లాంటి ఇతర సందర్భాల్లో తగినన్ని నీళ్లు, ఎలక్ట్రోలైట్లు తీసుకోవడం మంచిదని, పిల్లలు, వృద్ధులు ఈ విషయంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని కోరారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చాలామంది వడదెబ్బ కారణంగా ఏర్పడ్డ డీహైడ్రేషన్‌తో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, హైదరాబాద్‌లో పిల్లలు కూడా బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అధ్యాపకులు డాక్టర్ ఎన్.ఎల్.శ్రీధర్ మాట్లాడుతూ ‘‘సైలెంట్ డీహైడ్రేషన్‌పై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పిల్లలు, వృద్ధుల్లో ఇది చాలా త్వరితగతిలో ముదిరిపోతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకూ దారితీయవచ్చు’’ అని ఆయన తెలిపారు. -
నా టార్గెట్ అమరావతే..
-
సైలెంట్ లేఆఫ్‌లు.. 20 వేల మంది టెకీలు ఇంటికి..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ గత కొంత కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. లేఆఫ్‌ల పేరుతో లక్షలాది మంది ఉద్యోగులను కంపెనీలు అధికారికంగా తొలిగించాయి. అప్రకటింతగానూ వేలాదిగా ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. దేశంలోని ఐటీ పరిశ్రమలో 2023 క్యాలెండర్ సంవత్సరంలో దాదాపు 20 వేల మంది ‘సైలెంట్’గా ఉద్యోగాలు కోల్పోయారు.ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐటీఈయూ) వెల్లడించిన వివరాల ప్రకారం 2023 క్యాలెండర్ ఇయర్లో దేశ ఐటీ రంగం దాదాపు 20,000 మంది టెకీలను ‘సైలెంట్ లేఆఫ్’ విధానంలో తొలగించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ తొలగింపులు చిన్నా పెద్ద అన్ని ఐటీ కంపెనీలలో జరిగాయని, వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఏఐటీఈయూ భావిస్తోంది.ఇలా అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల్లో ప్రముఖంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ-మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఒక్క హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అప్రకటిత పద్ధతిలో ఉద్యోగులను తొలగించే పరిస్థితిని "సైలెంట్ లేఆఫ్" సూచిస్తుంది. అంటే కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం, పని గంటలను తగ్గించడం, ముందస్తు పదవీ విరమణకు పురిగొల్పడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటివి. -
ష్... సైలెన్స్ డ్యాన్స్
పెళ్లి బరాత్ (ఊరేగింపు) అనగానే చెవులు చిల్లులు పడే భయానక సౌండ్స్, చుట్టుపక్కల వాళ్లకు కలిగే డిస్ట్రబెన్స్ గుర్తుకు వస్తాయి. అసలు సౌండ్ లేకుండా బరాత్ ఉంటే ఎలా ఉంటుంది? ‘అదెలా సాధ్యమండీ?’ అనే వాళ్లకు ఈ పెళ్లి బరాతే సమాధానం. ఈ పెళ్లి బరాత్‌లో పాటలు ఉన్నాయి. ధూమ్‌ధామ్ డ్యాన్స్‌లు ఉన్నాయి. అయితే అన్నీ సైలెంట్‌గానే. ‘డ్యాన్సులంటే సైలెంట్‌గా చేయవచ్చు. మరి పాటలను ఎలా సైలెంట్‌గా ప్లే చేస్తారు?’ అనే డౌట్ రావచ్చు. అసలు విషయమేమిటంటే బరాత్‌లో పాల్గొన్న వారికి హెడ్ఫోన్లు అందించారు. దీంతో ఎవరి పాటలకు వారు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ సైలెంట్ డిస్కోకు ప్రేరణ హిందీ సినిమా ‘ఏ దిల్ హై ముష్కిల్’ లోని బ్రేకప్ సాంగ్. ‘శబ్ద కాలుష్యంతో భయపెట్టే బరాత్‌లను గుర్తు తెచ్చుకున్నప్పుడు... ఈ వీడియో చూస్తుంటే హాయిగా అనిపించింది. నైస్ ఐడియా’ అంటూ నెటిజనులు స్పందించారు. -
Silent walking: మనతో మనం మాత్రమే
మార్నింగ్ వాక్కు గుంపుగా బయలుదేరుతారు కొందరు. తోడు లేనిదే కదలరు కొందరు. ఒంటరిగా బయలుదేరితే పాటలు వింటూ నడుస్తారు కొందరు. లేదా ఫోన్లు మాట్లాడుతూ ఉభయతారకంగా నడుస్తారు ఇక మనతో మనం ఉండేది ఎప్పుడు? ఇప్పుడు ‘సైలెంట్ వాకింగ్’ ట్రెండింగ్‌లో ఉంది. అంటే ఫోన్లు, సాటి మనుషులు ఎవరూ లేకుండా ఒక్కరే మనతో మనం ఉంటూ నడవడం. దీనివల్ల మానసికంగా, భౌతికంగా ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. ఉదయం ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తారు రిటైర్డ్ టీచర్ విశ్వనాథం. ఆయన తన అపార్ట్మెంట్లో ఉన్న ముగ్గురు నలుగురితో కలిసి ఉదయాన్నే వాకింగ్‌కు వెళతారు. ఫోన్ తీసుకువెళతారు. ఆ ముగ్గురు నలుగురు కలవగానే ఇక కబుర్లు మొదలు. నవ్వులు, పరిహాసాలు ఎలా ఉన్నా ఎంతలేదన్నా రాజకీయాలు చర్చకు వస్తాయి. ఆ తర్వాత ఇంట్లో సమస్యలు చర్చకు వస్తాయి. ఏవో పాత గొడవలు గుర్తుకు వస్తాయి. చిన్నపాటి వాదనలు జరుగుతాయి. ఈలోపు మెసేజ్‌లు, ఫేస్బుక్ చెకింగు, ఒక ఫోన్ కాల్ ఎవరిదో మాట్లాడటం... ఉదయాన్నే మనసు, శరీరం తేలిక కావాల్సింది పోయి బరువైపోతాయి. ఐ.టి. ఫీల్డ్‌లో పని చేసే అవివాహిత చందన సాయంత్రం ఇల్లు చేరుకుని వాకింగ్‌కు బయలుదేరుతుంది. హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటూ నడుస్తుంటుంది. ఆ పాటల్లో పూర్తిగా లీనం కాకుండా మెసేజ్‌లు, కాల్సూ వస్తూనే ఉంటాయి. పాటలు కూడా విన్నవే వినడం వల్ల కొత్త అనుభూతి కలగదు. పాటలు వినాలి కాబట్టి వింటున్నానా అనే సందేహం వస్తుంది. గృహిణి సుభాషిణి సాయంత్రం వీలు చూసుకుని ఎలాగో వాకింగ్‌కు బయలుదేరుతుంది. కాని ఆమె వాకింగ్‌కు బయలుదేరిన వెంటనే ఊళ్లో ఉన్న తల్లికి ఫోన్ చేయాలి. అది తల్లి ఆమెతో చేసుకున్న అగ్రిమెంట్. కూతురితో మాట్లాడకపోతే ఆమెకు తోచదు. సుభాషిణి వాకింగ్ మొదలెట్టి తల్లికి కాల్ చేయగానే తల్లి ఏవేవో విషయాలు ఏకరువు పెడుతుంది. కొన్ని ఫిర్యాదులు, కొడుకు మీద అభ్యంతరాలు, ఇంకేవో ఇరుగు పొరుగు గాసిప్... ఎంత లేదన్నా అలజడి కలిగిస్తాయి. ఇదా వాకింగ్ అంటే. ► సైలెంట్ వాకింగ్ విరుగుడు టిక్‌టాక్ ఇన్ఫ్లూయెన్సర్ మాడీ మాయో మొన్నటి సెప్టెంబర్‌లో ఈ ‘సైలెంట్ వాకింగ్’ను ప్రతిపాదించింది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, స్మార్ట్ వాచీలతో సహా అన్ని లంపటాలను వదిలి ఎవరితోనూ వాగుడు పెట్టుకోకుండా హాయిగా మౌనంగా మనతో మనం ఉంటూ నడవడం చాలా బాగుంది అని ఆమె పెట్టిన ఒక పోస్టు ఆమెను ఫాలో అయ్యే యువతకు నచ్చింది. అప్పటి నుంచి సైలెంట్ వాకింగ్ మెల్లమెల్లగా ప్రచారం పొందింది. ► మన గురించి ఆలోచిస్తున్నామా? మన గురించి మనం ఆలోచించుకోవడానికి, మన ఆలోచనలు పదును పెట్టుకోవడానికి, మన లక్ష్యం వైపు దృష్టి నిలపడానికి ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు అడ్డం పడుతూనే ఉన్నాయి. ఆఖరుకు నడకలో కూడా ఏదో ఒక అంతరాయం. ఇంటి నుంచి బయటకు వచ్చినా ఇంటి నుంచి ఫోన్ వస్తే ఇక ఇంట్లో ఉన్నట్టే తప్ప బయట ఉన్నట్టు అనిపించదు. ‘సైలెంట్ వాకింగ్ రెండు పనులు చేస్తుంది. ఒకటి మన ఆలోచనలు మనల్ని వినేలా చేస్తుంది... రెండు ప్రకృతిని విని స్పందించేలా చేస్తుంది’ అని ఒక సైలెంట్ వాకర్ చెప్పింది. మరో స్టూడెంట్ అయితే ‘ఫోన్లు పారేసి హాయిగా అరగంట సేపు నడిస్తే నాకు చాలా స్వేచ్చతో ఉన్నట్టు అనిపిస్తోంది. అదీగాక నా చదువు మీద దృష్టి నిలుస్తోంది’ అని చెప్పింది. ► వొత్తిడి తగ్గుతుంది భవ బంధాలు తెంచుకున్నట్టుగా ఏ కమ్యూనికేషన్ లేకుండా కనీసం రోజులో 30 నిమిషాలు ఒక రకమైన ఏకాంత సమయం గడపడమే సైలెంట్ వాకింగ్. దీని వల్ల యాంగ్జయిటీ వంటివి తగ్గి మానసికంగా ఒక ప్రశాంతత వస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఐదు నిమిషాలు ఫోన్ కనపడకపోతే కంగారు పడేవారు అరగంట ఫోన్‌ను ఇంట్లో పడేసి బయట పడి నడిస్తే ఆ స్వేచ్ఛ మనసుకు దొరుకుతుంది. ఈ అరగంటలో కొంపలేమీ మునిగిపోవు అని తెలుస్తుంది. మన గుప్పిట్లో ఫోన్ ఉన్నంత సేపు మెడ మీద కత్తి వేళ్లాడుతున్న భావనే... ఎప్పుడు ఎవరు ఏ విధంగా డిస్ట్రబ్ చేస్తారో తెలియదు కదా. ధ్యానంలో కూడా మనల్ని మనం పరిశీలించుకోవడం, ఆలోచనలను పరిశీలించుకోవడం ముఖ్యం అంటారు. సైలెంట్ వాకింగ్‌లో నడుస్తూ అలాంటి పనే చేస్తాం. క్రిక్కిరిసిన జీవితంలో మనవైన ఆలోచనలకు చోటు ఇచ్చి, పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ముందుకు పోయేందుకు దోహదం చేసేదే సైలెంట్ వాకింగ్. మౌన మునులుగా మారి రేపటి నుంచి మౌన నడకకు బయలుదేరండి. -
ఆ పార్కులో మాట్లాడుకోడాల్లేవ్! అంతా సైలెంట్..
పెద్దగా మాటలుండవు. ఒక పదీ పదిహేనుమందివచ్చి పార్కులో కలుస్తారు. అందరి చేతుల్లో వారికి నచ్చిన పుస్తకాలు ఉంటాయి. తలా ఒకచోట కూచుని పుస్తకాన్ని నిశ్శబ్దంగా చదువుకుంటారు. వీడ్కోలుకు ముందు కాసిన్ని కబుర్లు... ఒక చాయ్... ఒకరి పుస్తకం మరొకరికి అరువు...ఒక ఆరోగ్యకరమైన వ్యాపకం ఆరోగ్యకరమైన బృందం...సెల్ఫోన్ల కాలుష్యంలోముంబైలో తాజా ట్రెండ్ ‘సైలెంట్ రీడింగ్‘. శనివారం సాయంత్రం 5 గంటలు. ముంబైలోని జుహూలో కైఫీ ఆజ్మీ పార్క్. మెల్లమెల్లగా కొంతమంది నడుచుకుంటూ వచ్చి ఒకచోట జమయ్యారు. వారి చేతుల్లో పుస్తకాలు, చాపలు, దుప్పట్లు, చిరుతిండ్లు ఉన్నాయి. ఒక్కొక్కరు వారికి నచ్చినచోట దుప్పటి పరిచి పుస్తకం తెరిచి కూచున్నారు. దూరం నుంచి చూస్తే ఒక పదిహేను ఇరవై మంది శిలల్లా కూచుని చేతుల్లో పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. మంచి ప్రకృతిలో, మంచి సమయంలో, నచ్చిన పుస్తకాన్ని, తమలా పుస్తకాలను ఇష్టపడేవారి సమక్షంలో చదువుకోవడం ఎంత బాగుంటుంది? పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. పుస్తకాలను చదివేవారితో స్నేహానికి మించింది లేదు. అందుకే ఇప్పుడు ముంబైలో ‘సైలెంట్ రీడింగ్’ అనేది ఒక ట్రెండ్‌గా మారింది. కొత్త స్నేహితులను పరిచయం చేస్తోంది. సైలెంట్ రీడింగ్ ఎందుకు? పుస్తకాభిమానులు బుక్ రిలీజ్ ఫంక్షన్లకు వెళ్లినా, ఆథర్ టాక్‌కు వెళ్లినా ఏదో రణగొణధ్వని. పుస్తకం గురించి తక్కువ... మెరమెచ్చులు ఎక్కువ. అంతేకాదు, కొంతమంది పుస్తకాన్ని తప్ప దానిని రాసినవారిని కలవాలనుకోరు. మరికొంతమంది ఇంట్రావర్ట్‌లు తాము నిశ్శబ్ద స్నేహితులుగా ఉండాలనుకుంటారు. ఇలాంటి వారంతా ఏ గోలా లేని ‘సైలెంట్ రీడింగ్’ని ఇష్టపడుతున్నారు. ఈ సైలెంట్ రీడింగ్ గ్రూపుల్లో వాగుడుకాయలకు ప్రవేశం లేదు. హాయిగా నిశ్శబ్దంగా చదువుకోవడమే. మంచి పుస్తకాన్ని ఒకరితో మరొకరు పంచుకోవడమే. బెంగళూరులో మొదలు బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో శ్రుతి షా, హర్ష్ స్నేహాన్షు ఇద్దరు పుస్తక ప్రేమికులు ‘కబ్బన్ రీడ్స్’ పేరుతో ‘సైలెంట్ రీడింగ్’ని 2022 డిసెంబర్లో మొదలెట్టారు. కబ్బన్ పార్క్‌లో పుస్తక ప్రేమికులు విశేషంగా వచ్చి వారానికి ఒకసారి పుస్తకాలు చదువుకుని వెళ్లడం అందరినీ ఆకర్షించింది. దాని ప్రభావంతో ముంబైలోని జుహూలో దియా సేన్‌గుప్తా, రచనా మల్హోత్రా అనే ఇద్దరు స్నేహితురాళ్లు ‘జుహూ రీడ్స్’ పేరుతో ఈ సంవత్సరం మేలో ‘సైలెంట్ రీడింగ్’ను మొదలెట్టారు. వెంటనే జుహూలోని పుస్తక ప్రేమికులను ఇది ఆకర్షించింది. అన్ని వయసుల వాళ్లు ఇక్కడికి వచ్చి కూచుని ప్రశాంతంగా పుస్తకాలు చదవసాగారు. అంతేనా? వీల్‌చైర్‌లో ఉండేవారు కూడా వచ్చి పుస్తకంలో, పుస్తకాన్ని ఇష్టపడేవారి సమక్షంలో ఓదార్పు పొందసాగారు. ‘సెల్ఫోన్లు వచ్చాక పుస్తకం చదివే అలవాటు తగ్గింది. మనుషులు సెల్ చూసుకుంటూ కనిపించడమే అందరికీ తెలుసు. కాని ఒకప్పుడు పుస్తకం చదువుతూ కనిపించేవారు. సైలెంట్ రీడింగ్ వల్ల పుస్తకం చదువుకుంటూ కనిపించేవారు అందరినీ ఆకర్షిస్తున్నారు. దానివల్ల పుస్తకాలు చదవాలన్న అభిలాష పెరుగుతోంది. మేము ఆశిస్తున్నది అదే’ అని జుహూ రీడ్స్ నిర్వాహకులు అన్నారు. దేశ, విదేశాల్లో... బెంగళూరు కబ్బన్ పార్క్‌తో మొదలైన సైలెంట్ రీడింగ్ ఉద్యమం ఇప్పుడు ముంబైలో బాంద్రా, దాదర్, కొలాబా లాంటి ఐదారు చోట్లకు విస్తరించింది. ఇక మన దేశంలోని ఢిల్లీ, పూణె, చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌లకు కూడా వ్యాపించింది. సోషల్ మీడియా ద్వారా కబ్బన్ రీడ్స్ గురించి తెలుసుకున్న వారు న్యూయార్క్, లండన్, దుబాయ్, మెల్బోర్న్లలో కూడా సైలెంట్ రీడింగ్ సమూహాలను తయారు చేస్తున్నారు. ‘ఈ రీడింగ్స్‌కు వచ్చినవారు మంచి స్నేహితులుగా మారుతున్నారు. బిజీ లైఫ్‌లో మనిషి ఒంటరితనాన్ని ఫీలవుతున్నాడు. ఆ ఒంటరితనం పోగొట్టేందుకు సైలెంట్ రీడింగ్ గ్రూపులు సాయం చేస్తున్నాయి’ అని నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నారు. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే నానా చెత్త ప్రభావంలో పడి అనవసర భావోద్వేగాలకు లోను కావడం కన్నా వికాసం, జ్ఞానం, జీవితానుభవం, ఆహ్లాదం పంచే పుస్తకాన్ని అక్కున చేర్చుకోవడం నేటి తక్షణావసరం. పుస్తకాలు చదివే వారితోనే నాగరిక సమాజం ఏర్పడుతుంది. ఆ విధంగా సైలెంట్ రీడింగ్ గ్రూపులు సమాజాన్ని మరింత అర్థవంతం చేస్తున్నాయి. ఇలాంటి ఉద్యమాల్ని పుస్తకాభిమానులు ఎక్కడికక్కడ అందుకోవాల్సిన అవసరం ప్రతి ఊళ్లో, పట్టణంలో ఉంది. (చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..) -
ప్రపంచంలోని 10 అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశాలు
-
గుట్టుచప్పుడుగా ‘గుండెపోటు’.. ఇలా గుర్తుపట్టొచ్చు
అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న మనిషి.. ఆరోగ్యంగా ఉన్నాడే అనిపించే మనిషి.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు ఈమధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే.. ఇలాంటి మరణాల్లో సైలెంట్ హార్ట్ ఎటాక్ కేసులు కూడా ఉంటాయని చెప్తున్నారు వైద్యులు. అంటే.. గుట్టుచప్పుడు కాకుండానే గుండె పోటు వచ్చి ఆ వ్యక్తి అక్కడికక్కడే హఠాన్మరణం చెందుతారన్న మాట. అయితే.. సైలెంట్ హార్ట్ ఎటాక్.. చాలా నాటకీయ పరిణామాల నడుమ జీవితాల్ని ముగిస్తుంటుంది. గుండె పోటు కంటే చాలా చాలా భిన్నంగా ఉంటుంది నిశబ్ధ గుండె పోటు. కొన్ని కొన్ని సందర్భాలలో అసలు నొప్పి కూడా రాదు. అలాంటప్పుడు దానిని గుర్తించడం కొంచెం కష్టమే. అదే సమయంలో.. మనిషిని గందరగోళానికి గురి చేసి.. ప్రాణానికి ముప్పు కలిగిస్తుంటుంది కూడా!. నిశ్శబ్ద గుండెపోటు అంటే.. ఏ ఇతర గుండెపోటు మాదిరిగానే, సైలెంట్ అటాక్ కూడా గుండెకు రక్తసరఫరాను నిలిపివేస్తుంది. దీనివల్ల గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ధమనులలో, చుట్టుపక్కల కొవ్వు, కొలెస్ట్రాల్‌తో కూడిన ఫలకం ఏర్పడినట్లయితే గనుక.. ఆక్సిజన్ అధికంగా ఉండే రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. నిశ్శబ్ద దాడి ప్రమాద ఘంటికలు సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు స్పష్టమైన సంకేతాలు, లక్షణాల గుర్తింపు లేవు. కాబట్టే సైలెంట్ హార్ట్ ఎటాక్.. ప్రాణాంతకమైందని, అంత్యంత ప్రమాదకరమైందని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అయితే.. కొన్ని ప్రమాద ఘంటికల ద్వారా రాబోయే ముప్పు స్థితిని పసిగట్ట గలిగే మార్గాలు ఉన్నాయని సూచిస్తున్నారు. ఛాతీపై ఒత్తిడి: సాధారణంగా గుండెపోటు సమయంలో.. ఛాతీలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే సైలెంట్ హార్ట్ ఎటాక్‌లో మాత్రం.. ఛాతీ మధ్యలో తేలికపాటి నొప్పి లేదంటే అసౌకర్యంగా మాత్రమే అనిపిస్తుంటుంది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే.. ఛాతిని పిండేసినట్లు, ఒత్తిడి అనుభూతి కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు. ఈ లక్షణాలు.. దాదాపుగా గుండెలో మంట, అజీర్ణం తరహా లక్షణాలను పోలి ఉంటాయి. కాబట్టే, చాలాసార్లు ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నారు. ఇతర భాగాల్లోనూ అసౌకర్యం సైలెంట్ హార్ట్ ఎటాక్‌లో ఛాతీ భాగంతో పాటు వీపు భాగం, చేతులు, పొట్ట, మెడ, దవడ.. ఇలా ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపెడుతుంది. ఉన్నట్లుండి ఆయా భాగాల్లో విపరీతమైన నొప్పి కలుగుతుంటుంది. ఇలాంటి సందర్భంలో వైద్యులు సంప్రదించడం మంచిది. శ్వాస ఇబ్బంది సైలెంట్ హార్ట్ ఎటాక్‌తో బాధపడుతుంటే గనుక.. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడతారని వైద్యులు చెబుతున్నారు. మైకం, ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోవచ్చు కూడా. ఈ లక్షణాలు కొనసాగితే.. వైద్యుడిని సంప్రదించాలి. సరైన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. చల్లనిచెమటలు.. సైలెంట్ హార్ట్ ఎటాక్స్‌కు చాలా సాధారణ లక్షణం ఇది. జ్వరంలాగా అనిపించినప్పటికీ.. సైలెంట్ హార్ట్ ఎటాక్‌లో ఈ స్థితి చాలా తక్కువ టైం ఉంటుంది. అలాగే జ్వరంలాగా కాకుండా చల్లని చెమట్లు పట్టి, త్వరగతిన ఎండిపోతుంది. కాబట్టి, ఇలాంటి స్థితి ఎదురైనా వెంటనే.. డాక్టర్‌ను సంప్రదించడం ద్వారా ముప్పును ముందే పసిగట్టొచ్చు.. ప్రాణాన్ని నిలబెట్టుకోవచ్చు!. -
మసూద్‌పై చర్యలుంటాయా? పాక్ ప్రధాని రియాక్షన్ ఏంటంటే..
సమర్ఖండ్: పాకిస్తాన్ బుద్ధి మరోసారి.. అదీ అంతర్జాతీయ వేదికగా బయటపడింది. గ్లోబల్ టెర్రరిస్ట్, జైషే ముహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సుకు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ హాజరయ్యారు. అయితే.. అంతర్జాతీయ మీడియాతో ముఖాముఖి సందర్భంగా ఆయన్ని ఇరకాటంలో పడేశాడు భారత జర్నలిస్ట్ ఒకరు. భారత్‌కు చెందిన ఓ మీడియా జర్నలిస్ట్.. ‘షరీఫ్ సాబ్.. మసూద్ అజార్ మీద ఒక చిన్నప్రశ్న. అతనికి వ్యతిరేకంగా మీ చర్యలు ఉంటాయా?’ అని ప్రశ్నించారు. అయితే.. దానికి సమాధానం ఇవ్వకుండా పక్కనే ఉన్న తన ప్రతినిధితో మాట్లాడుకుంటూ ముందుకెళ్లారు. అయితే అక్కడే ఉన్న ఆయన సిబ్బంది సదరు జర్నలిస్ట్‌ను మళ్లీ ఆ ప్రశ్న అడగకుండా నిలువరించే యత్నం చేశారు. ఇకచాలూ.. దయచేసి ఆపండి అంటూ సిబ్బందిలోని ఓ వ్యక్తి సదరు జర్నలిస్ట్‌కు సూచించారు కూడా. ఇదిలా ఉంటే.. భారత్ సహా పలుదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన జైషే ముహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఐక్యరాజ్య సమితి గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించింది. అయితే.. ఈమధ్యే మసూద్ అఫ్గన్‌లో ఉన్నాడంటూ పాక్ ఆరోపించగా.. అలాంటి ఉగ్రసంస్థలను ఆదరించే ఘనత కేవలం పాక్‌కే ఉంటుందంటూ తాలిబన్లు సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: మళ్లీ అక్కడ శవాల దిబ్బలే దర్శనమిస్తున్నాయి -
అమెరికాలో సైలెంట్‌గా...
‘బాహుబలి’ తర్వాత అనుష్క నెక్ట్స్ సినిమా పట్ల చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఏ సినిమా చేస్తున్నారో చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ‘సైలెంట్’ అనే బహుభాషా చిత్రం అంగీకరించారు. మాధవన్, అనుష్క జంటగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నిశ్శబ్దం’. అంజలి, షాలినీ పాండే, హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడిసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అమెరికాలోని సీటెల్ ప్రాంతంలో ప్రారంభమైంది. చాలా శాతం షూటింగ్ అక్కడే జరుపుకోనుంది. సైలెంట్ థ్రిల్లర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి ‘గూఢచారి’ ఫేమ్ షానీ డియోల్ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. -
హాలీవుడ్ టచ్
హారర్ చిత్రం ‘భాగమతి’ తర్వాత ‘సైలెంట్’ అనే మూకీ థ్రిల్లర్‌లో కనిపించనున్నారు అనుష్క. మాధవన్ హీరోగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కోన వెంకట్ నిర్మాణంతో పాటు రచయితగానూ వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. క్రాస్ఓవర్ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. అంటే కేవలం కొంతమంది మన భాష నటులు మిగతా అంతా వేరే భాష నటులు కనిపిస్తారు. ఇందులో హాలీవుడ్ నటుల టచ్ ఎక్కువగానే కనిపించనుంది. ‘కిల్‌బిల్’లాంటి క్లాసిక్ హిట్ చిత్రంలో నటించిన మైఖెల్ మేడ్సన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ‘కిల్ బిల్ ఫస్ట్ పార్ట్’తోపాటు ‘ఫారెస్ట్ ఆఫ్ లివింగ్ డెడ్, ఫ్రీ విల్లీ 2’ చిత్రాల్లో కనిపించారు మైఖెల్. మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలోనే జరుపుకోనుంది. ఈ చిత్రం కోసం అనుష్క బరువు తగ్గి, కొత్త లుక్‌లో కనిపించనున్నారని కోన వెంకట్ పేర్కొన్నారు. -
ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం
సురే్ధపల్లి(నేలకొండపల్లి) : ప్రేమించానన్నాడు... పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. చెట్టాపట్టాలు వేసుకుని తిప్పాడు.. తీరా తనకు సంబంధం లేదని నెట్టేస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. నేలకొండపల్లి మండలంలోని సురే్ధపల్లి గ్రామానికి చెందిన నాగుల్‌మీరా అనే యువతికి అదే గ్రామానికి చెందిన తోళ్ల ఉపేందర్ అనే యువకుడుకి గత ఏడేళ్ల క్రితం ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఇటీవల ఇద్దరు బైక్‌పై భద్రాచలం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో నాగుల్‌మీరా గాయపడింది. అప్పట్లో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొమ్మని అడుగగా తాను చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో సదరు యువతి తనకు న్యాయం చేయాలని ఆదివారం ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటంకు ది గింది. తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పింది. విషయం తెలుసుకుని స్థానిక పోలీ సులు సంఘటనా స్థలంకు చేరుకుని బాధితురాలితో పాటు అబ్బాయి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. -
నానా పటేకర్ ఏడ్చిన వేళ..
అహ్మద్ నగర్/మహారాష్ట్ర: తమ చుట్టుపక్కల కనిపిస్తున్న దుర్భర పరిస్థితులు చూసి కూడా గొంతెత్తి చెప్పకపోవడం నేరం అవుతుందని ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ అన్నారు. మహారాష్ట్ర కరువు పరిస్థితులపై మీడియాతో మాట్లాడుతూ పటేకర్ కంటతడి పెట్టారు. పేదరికం, కరువు పీడిత రైతులు, వ్యవసాయ సంక్షోభం గురించి కాస్తంత భావోద్వేగంగానే మాట్లాడే పటేకర్ ఈసారి మాత్రం మహారాష్ట్రలో నెలకొన్న కరువు పరిస్థితిపై, రైతులు అనుభవిస్తున్న బాధలపై తీవ్ర ఆవేదన చెందుతూ కళ్లు చెమర్చారు. 'మహారాష్ట్రలోని చాలా కుటుంబాలు సిటీలకు వలస క్యూలు కడుతున్నాయి. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను.. ఎవరైనా మీ కారు అద్దాలను తట్టి చేతులు జోడిస్తే వారిని భిక్షగాళ్లలాగా చూడకండి. వారంతా రైతులు, నిస్సహాయులు. వారికి ఆహారం, నీళ్లు కావాలి. టాయిలెట్లకు డబ్బు చెల్లించాలి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని వారిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోండి' అని ఆయన చెప్పారు. నీటి కరువు నేపథ్యంలో మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించకూడదని బాంబే కోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద ఊరటనిస్తుందని, కరువును పారద్రోలుతుందని అనుకోనని, అయితే అది ఒక మంచి ముందడుగు అని చెప్పారు. 'వచ్చే రెండు నెలలు మరింత భయంకరంగా ఉండనున్నాయి. మనం ముందే తేరుకుని ఉంటే అసలు వాటర్ ట్రైన్ పంపించాల్సిన అవసరం ఉండేదికాదు. ప్రజలుగా మనం విఫలమయ్యాం. నాయకులుగా వారు విఫలమయ్యారు. అంతా ఇక్కడి పరిస్థితిని చూసి బాధపడుతున్నారు. కానీ ఎవరూ ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదు. రండి వ్యవస్థను ప్రశ్నించండి. అలా మౌనంగా ఉండటం పెద్ద నేరం' అని పటేకర్ చెప్పారు. -
'హెచ్‌సీయూ ఘటనపై కేసీఆర్ ఎందుకు స్పందించరు'
హైదరాబాద్: ఓ వైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) అట్టుడుకుతోంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రశ్నించారు. సీఎం వైఖరి రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారికి వత్తాసు పలుకుతున్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. మిషన్ భగీరథ అద్భుతమని ఇటీవల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించడంపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్టులో జరుగుతున్న వేలకోట్ల రూపాయల అవినీతిని కూడా పరిశీలించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు అంచనాలను ఉన్నతమైన సాంకేతిక సంస్థలతో సమీక్షించి, అవినీతి లేదని నిర్ధారించుకున్న తర్వాతే నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
ప్రియుడి కోసం చైనా యువతి మౌనపోరాటం
-
'సైలెంట్'గా రామ్‌గోపాల్ వర్మ సినిమా
హిట్ ఫ్లాప్‌లతో సంబందం లేకుండా తనకు నచ్చినట్టుగా సినిమాలు తీసుకుంటూ వెళుతున్న రామ్‌గోపాల్ వర్మ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు మాఫియా, ఫ్యాక్షన్, హర్రర్ సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్న ఈ క్రియేటివ్ జీనియస్, త్వరలో ఓ మూకీ సినిమా తీయనున్నాడట. ఇప్పటికే ఈ సినిమా సంబందించిన వర్క్ కూడా మొదలెట్టేశాడన్న టాక్ వినిపిస్తోంది. గతంలో కమల్‌హాసన్, సింగీతం శ్రీనివాస్‌ల కాంబినేషన్లో వచ్చిన 'పుష్పక విమానం' తరహాలోనే ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు వర్మ. అయితే ఇటీవల కాలం తన సినిమా కంటెంట్ విషయంలో పెద్దగా క్వాలిటీ చూపించలేకపోతున్న వర్మ, ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో అని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ లాంటి వరుస హిట్స్‌తో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్, ఈ సినిమాలో హీరోగా నటించే చాన్స్ ఉందంటున్నారు. మూకీ సినిమా కావటంతో పాటు వర్మ సినిమా అంటే తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి రాజ్ తరుణ్ కూడా ఈ సినిమాలో చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాకు 'సైలెంట్' అనే టైటిల్ ను ఫైనల్ చేశాడు వర్మ. -
మోదీ మౌనంపై మండిపడ్డ రాహుల్
-
బాబు వ్యవహారంపై స్పందించరెందుకు..?
-
రేవంత్ విషయంలో నోరువిప్పని బాబు
-
ఉమన్ విత్ నో మనీ..!
స్ఫూర్తి ఒక్కసారిగా ప్రపంచ ‘ఆర్థిక వ్యవస్థ’ కుప్పకూలితే... అసలు ద్రవ్యమానం అనే దానికి చెల్లుబడి లేకుండా పోతే.. ఏదీ కొనే పరిస్థితి, అమ్మే పరిస్థితి లేకపోతే... అప్పుడు మనిషి ఎలా బతుకుతాడు, కొనడం, అమ్మడం అనే ప్రక్రియ లేకపోతే మనిషి జీవితం ఎలా ఉంటుంది? అనే సందేహం వచ్చింది 30 ఏళ్ల గ్రేటా టౌబర్ట్కు. అయితే గొప్ప ఆర్థికవేత్తలతో సహా అనేక మంది ఆమెకు వచ్చిన సందేహానికి సమాధానాన్ని చెప్పలేక నీళ్లు నమిలారు. దాంతో తనే సొంతంగా ఆ అంశం గురించి అధ్యయనం చేయాలనుకొంది గ్రేటా. డబ్బు లేకపోతే... అనేది తన సందేహం కాబట్టి... తను దేన్నీ డబ్బుతో ‘కొనకూడదు’ అని నిర్ణయించుకొంది. అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకూ అవి నిత్యావసరాలు అయినా... అత్యవసరాలు అయినా... దేనినీ కొనకూడదు! వీలైతే తయారు చేసుకోవడం, లేకపోతే సెలైంట్‌గా ఉండటం. ఈ ప్లాన్ ప్రకారం బతకాలని ప్రణాళిక రచించుకొంది. అందుకు తగ్గట్టుగా సెకండ్ హ్యాండ్ బట్టలమ్మే ఒక షాప్‌ను సందర్శించి, వాళ్లకు తను తయారు చేసిన కాంపోస్టు ఎరువును ఇచ్చి బట్టలు తెచ్చుకొంది. అలాగే టూత్ పేస్ట్‌ల దగ్గర నుంచి ఫేస్‌క్రీమ్‌ల వరకూ అన్నింటినీ అందుబాటులో ఉన్న వాటితోనూ, వస్తుమార్పిడి ద్వారా కొనుక్కోదగిన వాటితోనూ సమకూర్చుకుంది. ఈ విధంగా ఏడాది పాటు గడిపేసిందామె. డబ్బు అనేది ఖర్చు చేయకుండా ఆమె కొనసాగించిన జీవనశైలిని, పైసా ఖర్చు చేయకుండానే తూర్పు జర్మనీలోని తన ఊరి నుంచి 1,700 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి బార్సిలోనా చేరుకొన్న విధానం గురించి పూర్తి వివరాలను గ్రంథస్థం చేసింది.‘అపోకలిప్స్ జెట్జ్’ పేరుతో ఆ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇదిగాక ఏడాది పాటు అందరికీ భిన్నంగా గడపడం ద్వారా సాధించింది ఏమిటి? అని ప్రశ్నిస్తే.. ‘‘ఎన్నో పాఠాలు’’ అని చెబుతుందామె. ఈ ప్రయాణంలో తన మదిలో జరిగిన చింతనతో ఆహార వృథాపై ఆందోళన తలెత్తిందని ఆమె చెబుతోంది. ఆర్థికమాంద్యంతో అల్లాడుతున్న దేశాలు కూడా ఇంకా ఆహార వృథాను అరికట్టడం లేదని, ప్రపంచానికి ఇదే పెనుప్రమాదం అవుతుందని అభిప్రాయపడింది. ఆమె చెప్పిన మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం సమాజంలో డబ్బు ఖర్చు పెట్టకుండా బతకడం అనేది చాలా కష్టమైన పని, అలా ‘రాడికల్’గా బతకడం ఎక్కువ కాలం సాధ్యమయ్యే పని కాదు... వృథా ఖర్చు, ఆ ఖర్చు ద్వారా వనరులను వృథా చేయకుండా మాత్రం జీవితాంతం బతకగలనని విశ్వాసం వ్యక్తం చేసింది! -
ఎంత ఇష్టమైతే మాత్రం...?!
విచిత్రం సినిమా హీరోలను ఇష్టపడటం, పిచ్చిగా ఆరాధించడం చాలామంది చేస్తారు. కానీ డానియెల్లె డేవిస్ అంతటితో ఆగి పోలేదు. తన అభిమాన నటుడితో కలిసి బతకాలను కుంది. అందుకో విచిత్రమైన మార్గం ఎంచుకుంది. న్యూజెర్సీకి చెందిన డానియెల్లె (39)కి హాలీవుడ్ నటుడు బ్రాడ్లీ కూపర్ అంటే చచ్చేంత ఇష్టం. ఎంత ఇష్టమంటే... అతడితో కలిసి జీవించాలని నిర్ణయించుకునేంత! అయితే అది కుదరదని తనకూ తెలుసు కాబట్టి అతడి బొమ్మతో కాపురం మొదలుపెట్టింది. కార్డ బోర్డుతో డానియెల్లె నిలువెత్తు బొమ్మను తయారు చేయించుకుంది. ఎక్కడికి వెళ్లినా దాన్ని తీసుకుని వెళ్తుంది. తినేటప్పుడు, తాగేటప్పుడు, వంట చేసేటప్పుడు, చివరకు నిద్రపోయేటప్పుడు కూడా పక్కన అతగాడి బొమ్మ ఉండాల్సిందే. ఇవన్నీ చదివి డ్యానియెల్లె పెళ్లి కాని అమ్మాయి అయి ఉంటుంది అనుకునేరు. ఆమెకి పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వాళ్లెవరికీ ఈమె ఇలా చేయడంలో అభ్యంతరం లేదట. తనకు అలా ఉండటం ఇష్టం, మనమేం చేయగలం అంటూ లైట్‌గా తీసిపారేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. చివరికి కూపర్ బొమ్మని మంచం మీద తన పక్కనే ఉంచుకుని నిద్రపోతున్నా అభ్యంతరం చెప్పడం లేదు. అలా ఎలా ఉంటారు అని అంటే... ‘‘మా వాళ్లందరికీ నేనంటే చాలా ప్రేమ. నాకు కూపర్ అంటే ఎంత ఇష్టమో వాళ్లకు తెలుసు. నాకిష్టమైనదాన్ని వాళ్లు కాదనరు’ అంటోంది నవ్వుతూ. కూపర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ మరీ ఇంత వెర్రి ఏమిటి అని అంటున్నారు కొందరు. కాని డానియెల్లెకి మాత్రం అవేమీ బుర్రకెక్కడం లేదు! -
వివరం: నిశ్శబ్దాన్ని వినేవాళ్లు
కంటి ద్వారా చూసే ప్రపంచం వాళ్లది. దృశ్యాన్ని శబ్దంలోకి తర్జుమా చేసుకునే నేర్పు వాళ్లది. మౌనాన్ని అనుభవిస్తూ, శరీరపు కదలికలను అనుభూతిస్తూ, ఒళ్లంతా చెవులు చేసుకుంటూ, తమ లోపల మరో మనోలోకాన్ని నిర్మించుకుంటూ, కొన్నిసార్లు వ్యక్తీకరిస్తూ, కొన్నిసార్లు వెల్లడి కాలేక... వారిదో ప్రపంచం! ఒక నిశ్శబ్దపు ప్రపంచం!! మౌఖిక భాష అనే అగాధాన్ని సంకల్పపు గెంతుతో దాటుతూ వాళ్లు సాధించింది, ప్రపంచానికి అందించింది ఎవరికీ తక్కువ కాదు. సెప్టెంబర్ చివరి ఆదివారం నుంచి ‘ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్’ (వినికిడి శక్తి లేనివాళ్ల అంతర్జాతీయ వారోత్సవాలు) సందర్భంగా చరిత్రలో కొందరు చెవిటి విజేతల గురించిన ప్రత్యేక కథనం. మనిషి తొలి సమాచార మార్పిడి సంజ్ఞలతో చేసుకున్నాడు. సామాన్య జనానికి ఎప్పుడోగానీ అవసరం కాని ఈ మూగసైగలు చెవుడు బారిన పడ్డవాళ్లకు జీవితాంతం అత్యావశ్యాలు. ఆ లెక్కన వారు చేసేది భాషాపోరాటం. దేహాన్ని, చేతుల్ని కదిలిస్తూ, తల కదలికలు, కవళికల ద్వారా తమ లోపలిది ఎదుటివారితో పంచుకుంటూ వాళ్లకు కావాల్సింది తిరిగి పొందుతూ చేయాల్సిన జీవనసమరం మామూలుది కాదు. అలాగని చెవుడు ఉన్న ప్రతివాళ్లూ మాట్లాడలేరని కాదు. మాటను వినకపోవడం వల్ల వాటిని ఎలా వాడుకోవాలో వారికి తెలియదు. ముఖ్యంగా పుట్టుచెవుడు ఉన్నవాళ్లు. అంతేతప్ప వారి స్వర పేటికల్లో ఏ లోపమూ ఉండదు. అంటే చెవుడు ఉన్నవారు బదిరులయ్యే ప్రమాదం ఉంది; అంతేతప్ప చెవుడు ఉన్నవాళ్లందరూ బదిరులు కాదు. మేమూ సమానమే! ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచజనాభాలో ఇది 5.3 శాతం. వెయ్యి మంది శిశువుల్లో 0.5-5 మందికి పుట్టుకతోనే చెవుడు ఉండటమో, శిశుప్రాయంలోనే దాని బారిన పడటమో జరుగుతోంది. తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్లు, అకస్మాత్తుగా దాడిచేసే అనారోగ్యాలు, మందులు కలిగించే ప్రతికూల ప్రభావాలతో పాటు వంశపారంపర్యంగా కూడా చెవుడు సోకే ప్రమాదం ఉంది. 75-80 శాతం మందికి తల్లిదండ్రుల్లో, పూర్వుల్లో అణిచివేయబడి ఉండిన జన్యువుల ద్వారా సంక్రమిస్తుంది. అంటే, పెద్దవాళ్లలో ఇది బయటపడకపోయినా, పిల్లలకు రావొచ్చన్నమాట! మ్యూజిక్, వినోద సాధనాల ద్వారా ఉత్పన్నం అవుతున్న శబ్ద కాలుష్యం కూడా కౌమారపు పిల్లల్లో వినికిడి లోపం తలెత్తడానికి కారకమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్ల హియరింగ్ ఎయిడ్ వాడకందారులు ఉన్నారని అంచనా! అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని చాలామందికి ఇవి కూడా అందుబాటులో లేవు. చెవుడు దానికదే ఒక సమస్య అయినా, దానివల్ల శక్తి సామర్థ్యాలకు లోటుండదు. వాళ్లు కూడా అందరిలాంటివాళ్లే. అందరితో సమానమే! ఈ థీమ్‌తోనే ఈ ఏడాది ‘డెఫ్ వీక్’ జరుగుతోంది. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి కేంద్రంగా ఉన్న ‘ద వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్’ దీన్ని జరుపుతోంది. 1958లో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మొదట ‘డే’గా ఉండేవి. తర్వాత వీక్(వారం)గా పాటిస్తున్నారు. భాష, సంస్కృతి, కళ, రాజకీయ, సామాజిక రంగాల్లో వినికిడిలోపం ఉన్నవారి విస్మరించలేని పాత్రను తలుచుకోవడమే ఈ ఏడాది థీమ్. ఆ అంశం ప్రాతిపదికన చరిత్రలో ఎన్నదగిన పాటవం కనబరిచిన కొందరిని తలుచుకుందాం. దేవుడే ఆమెకు చెవివొగ్గాడు! 15వ శతాబ్దానికి చెందిన స్పెయిన్ సన్యాసిని థెరెసా డె కార్టజీనా. రెండు పదుల వయసులో ఆమె తన వినికిడి శక్తిని కోల్పోయారు. మనోశక్తిని కాదు. ధార్మిక రచనలు చేశారు. గ్రోవ్ ఆఫ్ ద ఇన్ఫర్మ్, వండర్ ఎట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఆమె స్పానిష్ రచనలకు ఇంగ్లీషు పేర్లు. తీవ్రమైన శోకం నన్ను చుట్టుముట్టినప్పుడు, లోతైన దురదృష్టపు సముద్రంలో దారీతెన్నూ లేక కొట్టుకుపోతున్నప్పుడు నాకు చెవివొగ్గింది దేవుడే, అన్నారామె. స్త్రీవాద రచనలకు తొలితరపు ప్రతినిధిగా ఆమెను ఇప్పుడు గౌరవిస్తున్నారు. ఫ్రెంచ్ భాషనే సంస్కరించాడు! చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నారు ఫ్రాన్స్‌కు చెందిన జొయాచిమ్ డు బెల్లే (1522-60). దాంతో సరైన బాల్యం అనుభవించలేకపోయారు. పైగా యౌవనప్రాయంలో తలెత్తిన అనారోగ్యంతో చెవుడు బారిన కూడా పడ్డారు. ప్రపంచం మూగబోయినా, అతడి లోపలి హృదయం పలికింది; బతికిన అచిరకాలంలోనే గొప్ప కవిగా ఎదిగారు. ఫ్రాన్స్ పునరుజ్జీవన కాలపు మరో ఇద్దరు కవులు పియరే డె రొన్సార్డ్, జీన్ ఆంటోనీ డె బా... తో కలిసి ‘లె ప్లీయాడె’ నెలకొల్పారు. ఇప్పటి ఆధునిక ఫ్రెంచ్ భాష సంస్కరణలకు కారణం కాగలిగిన బృందం అది! తనువు లోపలి సంగీతం లుడ్విగ్ వ్యాన్ బీతోవెన్ (1770-1827) గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ప్రకృతిలోకన్నా, తన తనువు నదిలోనే సంగీతం విన్నారేమో! పాశ్చాత్య క్లాసిక్ సంగీతానికి మకుటం లేని మహారాజు లాంటి బీతోవెన్ దురదృష్టం ఏమిటంటే, ఆయన సృష్టించే శబ్దసౌందర్యాన్ని ఆయన వినలేకపోవడం! తన సంగీతానికి ముగ్ధులై కొట్టే ప్రశంసాపూర్వక చప్పట్లు తన చెవి పట్టకపోవడం! జర్మనీలో జన్మించిన బీతోవెన్ తన రుగ్మతని జయిస్తూ, తన అంతర్జ్వాల మొత్తాన్నీ సంగీతంగా పలికించారు. 9 సింఫనీలు (సింఫనీ=స్వరసమ్మేళనం), 5 పియానో కన్సెర్టోలు (పియానో ప్రధాన వాద్యంగా గల ఆర్కెస్ట్రాలు), 32 పియానో సొనాటాలు (సొనాటా= పాడేది కాదు, పలికించాల్సిందని అర్థం), 16 స్ట్రింగ్ క్వాటెట్స్ (నలుగురి బృందంతో కూడిన వయోలిన్ లాంటి తీగవాద్యాల సమ్మేళనం)... ప్రపంచం చెవులారా వినడానికి ఆయన అందించిపోయిన సంగీత నిధి. వెలిగిన మనసుదీపం! అమెరికా శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్(1847-1931) ఎడమ చెవి వినబడేది కాదు; కుడిది కష్టంగా వినబడేది. 80 శాతం చెవుడు. చిన్నప్పుడు వచ్చిన స్కార్లెట్ ఫీవర్ దీనికి కారణమంటారు. ఆ సమస్య ఆయనకు ఫోనోగ్రాఫ్(సంగీతం వినడానికి ఉద్దేశించిన రికార్డ్ ప్లేయర్; 1877) కనిపెట్టడంలోగానీ, విద్యుత్ బల్బును వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవడంలోగానీ (1879)అడ్డంకి కాలేదు. తన స్వదేశంలో 1,093 పేటెంట్లు పొందారాయన. మాటలు వచ్చి చెత్త మాటలతో పొద్దు పుచ్చేకన్నా , చెవిటివాడిగా ఉండి పుస్తకం చదువుకోవడం మేలన్న అభిప్రాయం ఆయనది. దృఢమైన మనసు మామూలు శబ్దాలు వినబడకపోయినా, రాతిలో శబ్దాన్ని వినగలిగే మృదుస్వభావి డగ్లస్ టిల్డెన్ (1861-1935). అమెరికా గొప్ప శిల్పిగా పేరు మోసిన టిల్డెన్ శిల్పాలు శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా నగర వాసులకు ప్రేరణనిస్తూ ఉంటాయి. ఆయన శిల్పాలు మెకానిక్స్ మాన్యుమెంట్, బేర్ హంట్, ఫుట్‌బాల్ ప్లేయర్స్, అడ్మిషన్ డే మాన్యుమెంట్ ఆ నగరాల్లో ప్రతిష్టించారు. టిల్డెన్ శిల్పాల్లో మగవాళ్లు కండలు తిరిగిన దేహంతో ఉంటారు. హోమోఎరోటిసిజం ఉంటుందని ఫిర్యాదు. మగస్నేహితుల బంధాన్ని చెక్కడానికి ఎక్కువగా ఇష్టపడతాడని ఒక వివరణ! వినికిడి లోపం గల పిల్లల కోసం ప్రపంచంలో తొలి పాఠశాల నెలకొల్పిన అబ్బే చార్లెస్ మైకేల్ డె ఈపీ స్వాతంత్య్రానంతర భారతీయ చిత్రకళను ప్రభావితం చేసిన సతీష్ గుజ్రాల్ ఫాదర్ ఆఫ్ ద డెఫ్ వినికిడి లోపం గురించి మాట్లాడుకునేప్పుడు విధిగా స్మరించుకోవాల్సిన పేరు అబ్బే చార్లెస్ మైకేల్ డె ఈపీ (24 నవంబర్ 1712- 23 డిసెంబర్ 1789). ఫ్రాన్స్‌లో జన్మించిన చార్లెస్ చెవిటి పిల్లల కోసం ప్రపంచంలోనే తొలి పాఠశాల(1760) నెలకొల్పిన మహనీయుడు. అందుకే ‘ఫాదర్ ఆఫ్ ద డెఫ్’ అంటారాయన్ని. అలాంటి పిల్లల కోసం సైగల భాషను రూపుదిద్దించుకోవాలన్న ఆలోచన చేసిన తొలివ్యక్తుల్లో ఆయనొకరు. దానివల్లే వారికి అక్షరాస్యత కల్పించి, స్వతంత్రుల్ని చేయగలమని భావించారు. కొత్త విధాన రూపకల్పన కోసం తపించినా, అంత్యదశలో మాత్రం నిర్మాణాత్మక సంకేత విధానం పనికిరాదన్నారు. ఎవరి సైగల భాష వాళ్లు రూపొందించుకోవడమే ఉచితమన్న అభిప్రాయంతో కన్నుమూశారు. అందుకే, ప్రపంచంలో ఏ ఒక్కటో ప్రామాణికమైన సంకేత భాష అంటూ లేదు. కొన్ని వందల సంకేత భాషలున్నాయి. అన్నీ ఆయా స్థానిక బృందాలు వాటికవే అభివృద్ధి చేసుకున్నవే.