పెళ్లి బరాత్ (ఊరేగింపు) అనగానే చెవులు చిల్లులు పడే భయానక సౌండ్స్, చుట్టుపక్కల వాళ్లకు కలిగే డిస్ట్రబెన్స్ గుర్తుకు వస్తాయి. అసలు సౌండ్ లేకుండా బరాత్ ఉంటే ఎలా ఉంటుంది? ‘అదెలా సాధ్యమండీ?’ అనే వాళ్లకు ఈ పెళ్లి బరాతే సమాధానం. ఈ పెళ్లి బరాత్‌లో పాటలు ఉన్నాయి.
ధూమ్‌ధామ్ డ్యాన్స్‌లు ఉన్నాయి. అయితే అన్నీ సైలెంట్‌గానే. ‘డ్యాన్సులంటే సైలెంట్‌గా చేయవచ్చు. మరి పాటలను ఎలా సైలెంట్‌గా ప్లే చేస్తారు?’ అనే డౌట్ రావచ్చు. అసలు విషయమేమిటంటే బరాత్‌లో పాల్గొన్న వారికి హెడ్‌ఫోన్‌లు అందించారు.
దీంతో ఎవరి పాటలకు వారు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ సైలెంట్ డిస్కోకు ప్రేరణ హిందీ సినిమా ‘ఏ దిల్ హై ముష్కిల్’ లోని బ్రేకప్ సాంగ్. ‘శబ్ద కాలుష్యంతో భయపెట్టే బరాత్‌లను గుర్తు తెచ్చుకున్నప్పుడు... ఈ వీడియో చూస్తుంటే హాయిగా అనిపించింది. నైస్ ఐడియా’ అంటూ నెటిజనులు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment