barat dance
-
ష్... సైలెన్స్ డ్యాన్స్
పెళ్లి బరాత్ (ఊరేగింపు) అనగానే చెవులు చిల్లులు పడే భయానక సౌండ్స్, చుట్టుపక్కల వాళ్లకు కలిగే డిస్ట్రబెన్స్ గుర్తుకు వస్తాయి. అసలు సౌండ్ లేకుండా బరాత్ ఉంటే ఎలా ఉంటుంది? ‘అదెలా సాధ్యమండీ?’ అనే వాళ్లకు ఈ పెళ్లి బరాతే సమాధానం. ఈ పెళ్లి బరాత్‌లో పాటలు ఉన్నాయి. ధూమ్‌ధామ్ డ్యాన్స్‌లు ఉన్నాయి. అయితే అన్నీ సైలెంట్‌గానే. ‘డ్యాన్సులంటే సైలెంట్‌గా చేయవచ్చు. మరి పాటలను ఎలా సైలెంట్‌గా ప్లే చేస్తారు?’ అనే డౌట్ రావచ్చు. అసలు విషయమేమిటంటే బరాత్‌లో పాల్గొన్న వారికి హెడ్ఫోన్లు అందించారు. దీంతో ఎవరి పాటలకు వారు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ సైలెంట్ డిస్కోకు ప్రేరణ హిందీ సినిమా ‘ఏ దిల్ హై ముష్కిల్’ లోని బ్రేకప్ సాంగ్. ‘శబ్ద కాలుష్యంతో భయపెట్టే బరాత్‌లను గుర్తు తెచ్చుకున్నప్పుడు... ఈ వీడియో చూస్తుంటే హాయిగా అనిపించింది. నైస్ ఐడియా’ అంటూ నెటిజనులు స్పందించారు. -
బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు
సాక్షి, నిర్మల్: పెళ్లి రిసెప్షన్ బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడికక్కడే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుని వివాహం శుక్రవారం బైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. శనివారం పార్డి(కే)లో రిసెప్షన్ నిర్వహించారు. వేడుకలో భాగంగా బరాత్‌లో పెళ్లి కుమారుని సమీప బంధువు, మిత్రుడు ముత్యం(19) డ్యాన్స్ చేశాడు. ఈక్రమంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు యువకుడిని లేపి పరిశీలించగా అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో హుటహూటిన వైద్య కోసం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ముత్యం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని సమాచారం. ఈ యువకుడిది మహారాష్ట్రలోని శివుని గ్రామం. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికే తరలించారు. చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
బారాత్‌లో గత్తర లేపిన జవాన్!
కులం, మతం, జాతి ఏదైనా సరే.. పెళ్లి బారాత్‌లలో మైమరిచిపోయి ఆడామగా తేడాలేకుండా చిందులేయడం ఈ గడ్డకే చెందుతుంది. అందునా ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. రీసెంట్గా ఓ వ్యక్తి చేసిన డ్యాన్సులు ఇంటర్నెట్లో ఈలలు వేయిస్తోంది. అందునా అతని నేపథ్యం ఆసక్తికరంగా ఉండడంతో అది ఇంకా స్పెషల్‌గా మారింది. ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా గురువారం ఉదయం ట్విటర్లో ఒక వీడియోను ఉంచారు. గంటల వ్యవధిలోనే అది విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. అందుకు కారణం.. ఆ వీడియోలో ఉంది ఓ జవాన్ కావడం?!. తన శిక్షణ పూర్తి చేసుకున్న ఆ జవాన్.. నేరుగా స్నేహితుడి పెళ్లి బారాత్‌కు చేరుకుని అలా మైమరిచిపోయి చిందులేశాడు. అయితే అవి తీన్మార్ స్టెప్పులనుకుంటే పొరపాటే. తన మార్క్ చూపించాడు కాబట్టే ఆ జవాన్ వీడియోలో లైకులు, షేర్లలతో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇది ఎక్కడ జరిగింది? ఆ జవాన్ వివరాలేంటన్నది దీపాన్షు చెప్పలేదు. దీంతో అసలు అతను నిజంగానే జవానేనా? అనే అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ट्रेनिंग खत्म होते ही दोस्त की बारात में पहुंचा जवान. 😅 pic.twitter.com/Vh7BqQokaZ — Dipanshu Kabra (@ipskabra) April 21, 2022 చదవండి: ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా! -
పెళ్లిళ్లలో హిజ్రాల వీరంగం.. నిరాకరిస్తే నగ్నంగా డ్యాన్స్
సాక్షి, జగిత్యాలక్రైం: పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక. దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరిపించాలని అనుకుంటారు. కానీ హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన భీమయ్య కుమారుడి వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిపించారు. రాత్రి బరాత్ జరుగుతున్న సమయంలో హిజ్రాలు వచ్చి, వీరంగం సృష్టించారు. పెళ్లి కుమారుడిని డబ్బులు డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో రెచ్చిపోయి, నగ్నంగా డ్యాన్స్ చేయడంతో అక్కడున్నవారు పారిపోయారు. రెండు రోజుల కిందట జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన రమణ కుమారుడి పెళ్లి స్థానిక ఓ ఫంక్షన్‌హాలులో జరిగింది. హిజ్రాలు వేదికపైకి వెళ్లి, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. డబ్బులివ్వాలంటూ అసభ్య పదజాలం వాడారు. దీంతో ఆయన రూ.5 వేలు ఇచ్చి, పంపించారు. చదవండి: (ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి.. ) రూ.50 వేల వరకు వసూలు జగిత్యాల జిల్లాలోని అన్ని ఫంక్షన్‌హాళ్లలో హిజ్రాలు హల్చల్ చేస్తున్నారు. ఒక్కో పెళ్లికి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ముందు హేళన కావొద్దని వా రు అడిగినంత ముట్టజెబుతున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలి తంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు, కుటు ంబ సభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అందరూ జంకుతున్నారు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) హిజ్రాల ఆగడాలను అరికట్టాలి జిల్లాలో వివాహ వేడుకలకు వచ్చి, హిజ్రాలు మామూళ్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో ఫంక్షన్‌కు వచ్చిన వారంతా భయపడుతున్నారు. పోలీసులు స్పందించి, హిజ్రాల ఆగడాలను అరికట్టాలి. – మారు గంగారెడ్డి, జాబితాపూర్ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం హిజ్రాలు మామూళ్ల కోసం డిమాండ్ చేస్తే బాధితులు 100 డయల్‌కు కాల్ చేయాలి. ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శుభకార్యాల్లో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, డబ్బులివ్వాలని వేధిస్తే హిజ్రాలను కఠినంగా శిక్షిస్తాం. – రత్నపురం ప్రకాశ్, డీఎస్పీ, జగిత్యాల -
‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యాసలో వచ్చిన వినసొంపైన పాట ‘బుల్లెట్టు బండి’ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్ చేసి భర్తను సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పాట జనాల్లో మార్మోగుతోంది. ఏ వేడుక జరిగినా.. ఏ శుభకార్యం జరిగినా ‘బుల్లెట్టు బండి’ పాట లేనిది జరగడం లేదు. అంతగా ట్రెండింగ్ అయిన ఆ పాటను రాసిన రచయిత గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పాట రాసింది లక్ష్మణ్ అని తెలుసు కానీ.. ఆయన ఎక్కడి వ్యక్తో... ఏం చేస్తుంటాడో తెలుసుకోండి. చదవండి: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ పాటల రచయిత కాటికె లక్ష్మణ్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లి గ్రామం. వీరిది పేద కుటుంబం. లక్ష్మణ్‌తో పాటు రామ్ కూడా జన్మించాడు. అంటే వీరిద్దరూ కవల పిల్లలు. వీరిద్దరినీ రామ్‌లక్ష్మణ్‌గా పేర్కొంటారు. రామ్ గాయకుడిగా గుర్తింపు పొందగా లక్ష్మణ్ రచయితగా రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జానపద పాటల ఆల్బమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. తెలంగాణ యాసలో ఎంతో ఆకట్టుకునేలా రాయడం లక్ష్మణ్ ప్రత్యేకం. సినిమా రంగంపై ఆసక్తితో రామ్ లక్ష్మణ్ హైదరాబాద్‌కు వచ్చారు. ఉపాధి కోసం ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్, జానపద పాటలు పాడారు. లక్ష్మణ్ ఇప్పటివరకు దాదాపు 300 వరకు పాటలు రాశాడు. ఆ పాటలను రామ్ పాడాడు. ఆ పాటలు కొన్ని సినిమాల్లో కూడా వచ్చాయి. ‘నువ్వంటే పిచ్చి, గాయపడిన మనసు’ ఆల్బమ్స్‌తో ఈ సోదరులు ఎంతో గుర్తింపు పొందారు. అచ్చమైన పల్లె భాషలో రాయాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. అయితే ఒకరోజు ప్రముఖ గాయని మోహన భోగరాజు లక్ష్మణ్‌కు ఓ పాట రాయమని అడిగింది. అడిగిన కొన్ని రోజుల్లోనే ‘బుల్లెట్టు బండి’ రాసి ఇచ్చాడు. ఆ పాటను మోహన భోగరాజు పాడి యూట్యూబ్‌లో విడుదల చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్‌తో సోషల్ మీడియానే ట్రెండింగ్‌లోకి వచ్చింది. చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు ఈ పాట తర్వాత ఆ ఇద్దరి సోదరులకు భారీగా అవకాశాలు వచ్చాయంట. మున్ముందు కూడా మరిన్ని మంచి పాటలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం. 8వ తరగతి నుంచి పాటలు రాస్తున్నాడు. చంద్రబోస్, గోరటి వెంకన్న, అందెశ్రీ పాటలు వింటూ అభిరుచి పెంచుకున్నా. ఈ పాటతో 22 రోజుల్లో ఈ పాట రాసినట్లు లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. తాను చూసిన అక్కాచెల్లెళ్లను చూస్తూ ఆ పాట రాసినట్లు తెలిపారు. ఆ నవ వధువుకు శుభకాంక్షలు తెలిపాడు. -
ట్రెండ్ సృష్టించిన నవ వధువు
-
ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు
సాక్షి, మంచిర్యాల: మెట్టినింటికి వెళ్లేటప్పుడు అప్పగింతల్లో కొత్తగా పెళ్లయిన వధువు కన్నవారిని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఈ సీన్ ఎక్కడైనా చూస్తాం. కానీ ఈ వధువు మాత్రం కాస్త డిఫరెంట్. కట్టుకున్న భర్తతో జీవితాంతం సంతోషంగా ఉంటాననే ఆనందంతో స్టెప్పులేసింది. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన నవవధువు సాయి శ్రీయ అప్పగింతల్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఇటీవల బాగా హిట్ అయిన ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లోని గాయని మోహన భోగరాజు పాడిన ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..’ పాటకు కట్టుకున్న భర్త ముందు ఆడి కొత్త జీవితంలోకి భర్తను మనసారా ఆహ్వానించింది. పాటలోని పదాలకు అనుగుణంగా స్టెప్పులేస్తూ నూతన వరుడిని ఆకట్టుకుంది. ‘పట్టుచీరనే గట్టుకున్నా.. గట్టుకున్నుల్లో గట్టుకున్నా’అంటూ తన సింగారాన్ని ఒలకపోసింది. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..’అంటూ చేతిని తన భర్తకందించింది. ‘నువ్వు నన్నేలుకున్నావురో దండ మెల్లోన ఏస్తానురో.. నేను నీ యేలు వట్టుకోని మల్లె జల్లోన ఎడతానురో’అంటూ తన ఆనందం వ్యక్తపరిచింది. ‘మంచి మర్యాదలు తెలిసినదాన్ని.. మట్టి మనుషుల్లోనా పెరిగినదాన్ని’అంటూ నిష్కపటత్వాన్ని ఆవిష్కరించింది. ‘నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో.. మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో.. ఏడు గడపలల్ల ఒక్కదాన్నిరయ్యో.. మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో, నేను ప్రాణమయ్యో..’అంటూ తన కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని తన భర్తకు వివరించింది. ‘ఎన్ని మారాలు జేస్తు ఉన్నా నన్ను గారాలు జేసుకొని.. చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను’అంటూ తాను ఎంత గారాబంగా పెరిగిందో చెప్పుకొచ్చింది. డ్యాన్స్ చేస్తున్న పెళ్లి కూతురు సాయి శ్రీయ ‘నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా వెట్టినంకుల్లో, వెట్టినంకా.. సిరిసంపద సంబురం గల్గునింకా గల్గునింకుల్లో, గల్గునింకా’అంటూ తాను అడుగు పెడితే అత్తవారింటికి ఐశ్వర్యాలే అంటూ పాటలోని చరణాలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పెళ్లి కూతురు భలేగా డ్యాన్స్ చేసిందంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. బయట కూడా ఈ డ్యాన్స్ గురించే చర్చించుకుంటున్నారు. కొత్త దంపతులు ఇలాగే జీవితాంతం సంతోషంగా ఉండాలంటూ కామెంట్లు పెడుతూ విష్ చేస్తున్నారు. ట్రెండ్ సృష్టించిన వధువు: ఈ నెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయను రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం జరిపించారు. అప్పగింతల సమయంలో వధువు చేసిన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, గత రెండు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఒక్క రోజులోనే యూట్యూబ్‌లో 3.5 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. కుటుంబసభ్యులు, వధూవరులు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సరదాగా చేసిన డ్యాన్స్ ఇంత ప్రాచుర్యం పొందుతుందని అనుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు. సాయి శ్రీయ ప్రస్తుతం విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. వరుడు అశోక్ జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. (చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్ .. భర్త ఫిదా) ఐఏఎస్ ఆఫీసర్ ట్వీట్.. కరీంనగర్‌కు చెందిన మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి పి.నరహరి ఈ పాటపై స్పందించారు. ‘పెళ్లి కూతురు.. పెళ్లికొడుకు కోసమే డ్యాన్స్ చేసింది. సంతోషంగా అతన్ని తన జీవితంలోకి ఆహ్వానిస్తోంది. నిజమైన ప్రేమ.. అతడి బుల్లెట్టు బండిపై సవారీ చేయాలనుకుంటోంది’అని ట్వీట్ చేశారు. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ చదవండి: ప్రధాని మోదీకి ప్రత్యేక ఆలయం.. ఎక్కడో తెలుసా? -
బరాత్ ఆలస్యం: మరో యువకుడితో పెళ్లి!
లక్నో : పెళ్లి బరాత్ ఆలస్యమైన నేపథ్యంలో ఘర్షణ తలెత్తి ఓ వధువు కుటుంబ సభ్యులు ఆమెను మరొక యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో భంగపడిన వరుడు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వివరాలు.. బిజ్నూర్లోని నంగల్‌జాట్ గ్రామానికి చెందిన ఓ యువతికి సామూహిక వివాహ వేడుకల్లో భాగంగా అక్టోబరులో ఓ యువకుడితో పెళ్లి జరిగింది. అయితే డిసెంబరు 4న మరోసారి ఈ జంటకు శాస్త్రోక్తంగా పెళ్లి చేయాలని ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు. దీంతో ధంపూర్ పట్టణానికి చెందిన వరుడు బిజ్నూర్కు బయల్దేరాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం రెండు గంటలకే అక్కడికి చేరుకోవాల్సి ఉండగా... రాత్రి వరకు అతడు రాకపోవడంతో వధువు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కట్నం విషయమై కూడా గొడవ జరిగింది. దీంతో వధువు బంధువులు వరుడి తరఫు వాళ్లను ఓ గదిలో బంధించి తాళం వేశారు. వాళ్ల నుంచి విలువైన వస్తువులు లాక్కొని.. దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాళ్లను విడిపించారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పోలీసుల సమక్షంలో రాజీకి వచ్చాయి. అయితే వధువు మాత్రం వరుడిని మరోసారి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించిన గ్రామ పెద్దలు వధువు కోరుకున్న యువకుడితో పెళ్లి జరిపించారు. -
జేసీబీ డోజర్‌లో వధూవరుల బరాత్
సంగెం (పరకాల): సాధారణంగా పెళ్లి పూర్తయ్యాక వధూ వరులతో కారు లేదా జీపు.. ఇంకా ఆసక్తి ఉంటే గుర్రాల బగ్గీపై బరాత్ నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం తనకు బతుకుదెరువు ఇచ్చిన జేసీబీపైనే బరాత్ ఏర్పాటు చేసుకున్నాడు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురానికి చెందిన ఉడుతబోయిన రాకేష్ చిన్నప్పటి నుంచి వాహనాలను ఇష్టపడేవాడు. తండ్రితో కలసి స్వయం ఉపాధి కోసం జేసీబీ తీసు కుని నడుపుకుంటున్నాడు. ఇదే మండలంలోని లోహిత గ్రామానికి చెందిన సుప్రియతో ఈనెల 8న రాకేష్ వివా హం జరిగింది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి తన జేసీబీ డోజర్‌ను అందంగా అలంకరించి దాని తొట్టెలో సుప్రియతో కలసి కూర్చుని బరాత్ నిర్వహించుకున్నాడు. దీనికి గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. -
బరాత్ డ్యాన్స్‌ల్లో మారణాయుధాలు వద్దు
చార్మినార్: ఫంక్షన్ హాళ్ల వద్ద అర్దరాత్రి వరకు బరాత్‌ల పేరుతో మారణాయుధాలు తిప్పుతూ ప్రమాదకర డ్యాన్స్‌లు చేయటం ఘర్షణలకు దారి తీస్తున్నాయని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఈ డ్యాన్స్‌లపై నిబంధన విధించినట్లు చెప్పారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శనివారం సాయంత్రం పురానీహవేలీలోని దక్షిణ మండలం డీసీపీ కార్యాలయ సమావేశ మందిరంలో పాతబస్తీలోని వివిధ ఫంక్షన్ హాల్స్ యజమానులు, నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని... హాళ్లను అద్దెకు తీసుకుంటున్న వారిని వారించలేకపోతున్నారన్నారు. పెద్ద ఎత్తున ఆర్కెస్ట్రా వినియోగించడం, బ్యాండ్ బాజాలతో పాటు డీజేలను అనుమతించడం తదితర కార్యక్రమాలతో ఆయా ప్రాంతాల ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దక్షిణ మండలం అదనపు డీసీపీ బాబురావు మాట్లాడుతూ... ఇప్పటికే కొంతమంది ఫంక్షన్ హాల్స్ నిర్వాహకుల వ్యవహార శైలిపై తాము నిఘా పెట్టామని, సరైన ఆధారాల దొరికితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పదే పదే చెబుతున్నా వినకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.