
సాక్షి, నిర్మల్: పెళ్లి రిసెప్షన్ బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడికక్కడే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుని వివాహం శుక్రవారం బైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. శనివారం పార్డి(కే)లో రిసెప్షన్ నిర్వహించారు. వేడుకలో భాగంగా బరాత్‌లో పెళ్లి కుమారుని సమీప బంధువు, మిత్రుడు ముత్యం(19) డ్యాన్స్ చేశాడు. ఈక్రమంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఇది గమనించిన స్థానికులు యువకుడిని లేపి పరిశీలించగా అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో హుటహూటిన వైద్య కోసం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ముత్యం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని సమాచారం. ఈ యువకుడిది మహారాష్ట్రలోని శివుని గ్రామం. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికే తరలించారు.
చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి..
Comments
Please login to add a commentAdd a comment