కులం, మతం, జాతి ఏదైనా సరే.. పెళ్లి బారాత్‌లలో మైమరిచిపోయి ఆడామగా తేడాలేకుండా చిందులేయడం ఈ గడ్డకే చెందుతుంది. అందునా ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. రీసెంట్‌గా ఓ వ్యక్తి చేసిన డ్యాన్సులు ఇంటర్నెట్‌లో ఈలలు వేయిస్తోంది. అందునా అతని నేపథ్యం ఆసక్తికరంగా ఉండడంతో అది ఇంకా స్పెషల్‌గా మారింది.
ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా గురువారం ఉదయం ట్విటర్‌లో ఒక వీడియోను ఉంచారు. గంటల వ్యవధిలోనే అది విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. అందుకు కారణం.. ఆ వీడియోలో ఉంది ఓ జవాన్ కావడం?!.
తన శిక్షణ పూర్తి చేసుకున్న ఆ జవాన్.. నేరుగా స్నేహితుడి పెళ్లి బారాత్‌కు చేరుకుని అలా మైమరిచిపోయి చిందులేశాడు. అయితే అవి తీన్మార్ స్టెప్పులనుకుంటే పొరపాటే. తన మార్క్ చూపించాడు కాబట్టే ఆ జవాన్ వీడియోలో లైకులు, షేర్లలతో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇది ఎక్కడ జరిగింది? ఆ జవాన్ వివరాలేంటన్నది దీపాన్షు చెప్పలేదు. దీంతో అసలు అతను నిజంగానే జవానేనా? అనే అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు కొందరు.
ट्रेनिंग खत्म होते ही दोस्त की बारात में पहुंचा जवान. 😅 pic.twitter.com/Vh7BqQokaZ
— Dipanshu Kabra (@ipskabra) April 21, 2022
చదవండి: ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా!
Comments
Please login to add a commentAdd a comment