disturbance
-
ష్... సైలెన్స్ డ్యాన్స్
పెళ్లి బరాత్ (ఊరేగింపు) అనగానే చెవులు చిల్లులు పడే భయానక సౌండ్స్, చుట్టుపక్కల వాళ్లకు కలిగే డిస్ట్రబెన్స్ గుర్తుకు వస్తాయి. అసలు సౌండ్ లేకుండా బరాత్ ఉంటే ఎలా ఉంటుంది? ‘అదెలా సాధ్యమండీ?’ అనే వాళ్లకు ఈ పెళ్లి బరాతే సమాధానం. ఈ పెళ్లి బరాత్‌లో పాటలు ఉన్నాయి. ధూమ్‌ధామ్ డ్యాన్స్‌లు ఉన్నాయి. అయితే అన్నీ సైలెంట్‌గానే. ‘డ్యాన్సులంటే సైలెంట్‌గా చేయవచ్చు. మరి పాటలను ఎలా సైలెంట్‌గా ప్లే చేస్తారు?’ అనే డౌట్ రావచ్చు. అసలు విషయమేమిటంటే బరాత్‌లో పాల్గొన్న వారికి హెడ్ఫోన్లు అందించారు. దీంతో ఎవరి పాటలకు వారు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ సైలెంట్ డిస్కోకు ప్రేరణ హిందీ సినిమా ‘ఏ దిల్ హై ముష్కిల్’ లోని బ్రేకప్ సాంగ్. ‘శబ్ద కాలుష్యంతో భయపెట్టే బరాత్‌లను గుర్తు తెచ్చుకున్నప్పుడు... ఈ వీడియో చూస్తుంటే హాయిగా అనిపించింది. నైస్ ఐడియా’ అంటూ నెటిజనులు స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో బీభత్సం: కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరి, రచ్చ..రచ్చ!
పుట్టినరోజు సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసిన వారిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పటాకులు పేల్చి, కరెన్సీ నోట్లకు గాల్లోకి విసరడమే కాకుండా, స్థానికులతో అభ్యంతరకరంగా ప్రవర్తించి అసభ్యకరంగా దూషించి ఘటన కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్‌గ్రామ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) రవి కుమార్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం ముగ్గురు వ్యక్తులు పుట్టిన రోజు వేడుకల్లో బీభత్సం సృష్టించారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోపల కారు పైకప్పుపై నిలబడి విచ్చల విడిగా బాణా సంచా కాల్చడంతోపాటు కరెన్సీని గాల్లోకి విసిరి గలాటా సృష్టించారు. అంతేకాదు దీన్నిప్రశ్నించిన అపార్ట్మెంట్ వాసులను దుర్భాషలాడారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అపార్ట్మెంట్ ఓనర్స్ సంఘం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. @ghaziabadpolice @DCPCityGZB #Ghaziabad pic.twitter.com/Q97dZabFch — Ajnara Integrity AOA (@integrityaoa) October 29, 2023 https://t.co/Nlf6IPi1Le — DCP CITY COMMISSIONERATE GHAZIABAD (@DCPCityGZB) October 29, 2023 -
శునకం నిద్రను డిస్టర్బ్ చేసిన పిల్లి.. వైరల్ వీడియో
ఆమ్స్టర్డామ్: సాధారణంగా శునకానికి, పిల్లికి మధ్య జాతీ వైరముంటుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, చాలా అరుదుగా కుక్కలు, పిల్లులు ఒక చోట ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఈ క్రమంలో.. కొన్నిచోట్ల యజమానులు చిన్నప్పటి నుంచి వాటిని ఒక దగ్గర పెంచితే.. అవి తమ జాతీ వైరాన్ని మరిచిపోతాయి. కుక్కలు, పిల్లులు ఒక దగ్గర ఉన్నప్పుడు ఫన్నీగా ఆడుకోవడం, ఒక్కొసారి పరస్పరం దాడిచేసుకోవడం వంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో సదరు యజమాని కుక్కని, పిల్లిని ఒక దగ్గర పెంచుకుంటున్నాడు. కుక్క హయిగా ఇంట్లోని సోఫాలో మంచిగా కాలు జాపుకొని హయిగా పడుకొని ఉంది. అప్పుడు పిల్లి అక్కడికి వచ్చి చూసింది. బహుషా.. కుక్క నిద్రపోవడం చూసి దానికి ఈర్ష్యపుట్టిందో.. దాన్ని డిస్టర్బ్ చేయాలనుకుందో ఏమో గానీ.. మెల్లగా దాని దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత తన కాళ్లతో కుక్కను మెల్లిగా తట్లిలేపింది. వెంటనే సోఫా కింద దాక్కుంది. పాపం.. ఏదో అలికిడి వినిపించడంతో కుక్క అటూ ఇటూ చూసింది. దానికి ఏం కనిపించక పోవడంతో మళ్లి పడుకుంది. పిల్లి మరోసారి కుక్క నిద్రను డిస్టర్బ్ చేసింది. ఈ సారి కూడా కుక్కకు ఎవరు కనిపించలేదు. అలానే అటు ఇటూ అమాయకంగా చూసింది. అయితే, పిల్లి మాత్రం సోఫా కింద మెల్లిగా నక్కి నేను మాత్రం కాదన్నట్లు దాక్కుంది. కుక్కను పదేపదే డిస్టర్బ్ చేసింది. దీన్ని బ్యూటింజిబిడెన్ అనే యూజర్ ట్వీటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ వీడియో చూస్తుంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాం..’, ‘నా ప్లేస్‌లో నువ్వు ఎలా పడుకుంటావ్.. అనుకుందేమో పాపం.. పిల్లి..’, ‘ ఈ రోజు ఒక మంచి సరదా వీడియోను చూశా..’ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. Can’t stop laughing.. 😅 pic.twitter.com/bt3COZ7oUb — Buitengebieden (@buitengebieden_) January 23, 2022 చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో -
ఆన్లైన్ క్లాసులో అనామకుడి అల్లరి చేష్టలు..
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా.. ఓ అనామకుడు మధ్యలోకి వచ్చి అంతరాయం కలిగించడంతో అంబర్‌పేట సిస్టర్ నివేదిత స్కూల్ ప్రిన్సిపాల్ లతాకుమారి బుధవారం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐడీ ద్వారా ఆన్లైన్ క్లాసులోకి లాగిన్ అయి విద్యార్థుల పేర్లు మార్చడం వంటి అల్లరి చేష్టలు చేశాడు. దీనిపై విద్యార్థులు ఆందోళన చెందడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని లతా కుమారి బుధవారం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: కోవిడ్‌తో మరణించిన జర్నలిస్టులకు రూ.2 లక్షలు -
ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో గందరగోళం
-
కలవరపెడుతున్న రోడ్డు ప్రమాదాలు
♦ పది రోజుల్లో ఐదుగురి మృత్యువాత ♦ కనిపించని హెచ్చరిక బోర్డులు ♦ పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు యాలాల: రోడ్డు ప్రమాదాలు కలవరానికి గురిచేస్తున్నాయి. మండల పరిధిలో పది రోజుల్లో జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మృతుల కుటుంబీకుల్లో కొందరు పెద్ద దిక్కును కోల్పోగా, మరికొంతమంది జీవనాధారాన్ని కోల్పోయారు. ఇంకొందరి చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసిన పాపాన పోవడం లేదు. మండల పరిధిలో తాండూరు- కొడంగల్ అంతర్ జిల్లా రహదారి ఉంది. తాండూరు నుంచి కొడంగల్ వరకు 18 కి.మీ. దూరం ఉండగా, మండల పరిధిలో సుమారు 12 కి.మీ. వరకు ఉంది. దౌలాపూర్, తిమ్మాయిపల్లి, బండమీదిపల్లి, తాండూరు కాగ్నా బ్రిడ్జి సమీపంలో మూల మలుపులు ఉన్నాయి. దీనికితోడు మధ్యలో హెచ్చరిక బోర్డులు లేని కల్వర్టులు, స్పీడ్ బ్రేకర్లు చాలానే ఉన్నాయి. గతనెల 30న రాత్రివేళ ఆగిఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు కర్ణాటకవాసులు మృతి చెందారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో ఓ కల్వర్టు ఉంది. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డు లేకపోవడంతో రాత్రి పూట గమనించని వారు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన జరిగిన సరిగ్గా పది రోజుల తరువాత ఎలాంటి హెచ్చరిక బోర్డు లేని ఇరుకు కల్వర్టు వద్ద శనివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. తాండూరు-హైదరాబాద్ ప్రధాన మార్గం కావడంతో ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. శనివారం రాత్రి ఓ పాదచారుడిని బైక్ ఢీకొన్న ఘటనలో మృతిచెందిన సంఘటన అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఇన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న ఆర్అండ్బీ అధికారులు ఆయా ప్రాంతాల్లో సూచిక, హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గుంతలో పడి గాయాలపాలవుతున్నా.. తాండూరు-కొడంగల్ ప్రధాన రోడ్డుపై గుంత ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా ఆర్అండ్బీ అధికారుల పట్టించుకోవడం లేదు. మండలంలోని దౌలాపూర్ సబ్‌స్టేషన్ సమీపంలోని మూలమలుపు వద్ద ఓ గుంత ఏర్పడింది. మలుపులో గుంత ఉండడంతో గమనించని చాలామంది ద్విచక్రవాహనదారులు కిందపడి గాయాలపాలయ్యారు. ఈ విషయమై ఇటీవల ఓ ప్రొబెషనరీ ఎస్ఐ స్వయంగా ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న కల్వర్టులు, డేంజర్ జోన్లు, మూలమలుపుల వద్ద రేడియంతో కూడిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి..
నగరంలో బెంబేలెత్తిస్తున్న వానర సైన్యం ఆందోళనలో మహా నగర వాసులు గ్రేటర్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల నడుమ సమన్వయ లోపం కాంట్రాక్టర్‌కు రూ.4లక్షల బిల్లుల చెల్లింపులో జాప్యం వరంగల్ అర్బన్ : అడవుల శాతం తగ్గిపోవడంతో ఊర్లలోకి కోతులు వచ్చేశాయి.. అయితే, వచ్చిన కోతులు ఊరికే ఉంటాయా? నగరంలోని పలు ఇళ్లను పీకి పందిరేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందలాది కోతులు నగరంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతులు పట్టే పని అప్పగించిన కాంట్రాక్టర్‌కు బిల్లులు మాత్రం చెల్లించకపోవడంతో చేతులెత్తేశాడు. ఫలితంగా నెల రోజుల నుంచి కోతుల కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహా నగర పాలక సంస్థ పరిధిలో ఒక కోతిని పట్టుకున్నందుకు గాను రూ. 450 చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. పొరుగు రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి కోతులు, కుక్కలను పట్టే కాంట్రాక్టు తీసుకున్నారు. దీనికోసం సదరు కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వారు బాగా సమస్య ఉన్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటుచేసి అందులో అరటి పండ్లు, పల్లీలు ఎరగా వేస్తారు. వరుసగా రెండు రోజులపాటు వీటిని తినేందుకు కోతులు వస్తాయి. మూడోరోజు బోనులో కోతులు చిక్కుతాయి. ఇలా పట్టుకున్న కోతులను వారానికికోసారి నగరానికి దూరంగా భూపాలపల్లి, కాళేశ్వరం, ఏటూరునాగారం, పాఖాల కొత్తగూడెం అడవుల్లోకి తరలిస్తారు. అందుకోసం బల్దియా ప్రత్యేకంగా వాహనాన్ని సమకూరుస్తుంది. ఎప్పటికప్పుడు ఆ కాంట్రాక్టర్ కోతికి రూ.450 చొప్పున బల్దియా నుంచి బిల్లులు చెల్లించాలి. కానీ కొన్నిరోజులుగా బిల్లులు చెల్లించని కారణంగా సమస్య మళ్లీ మెుదటికొచ్చింది.] నాలుగు నెలలు.. 900 కోతులు గత నాలుగు నెలల కాలంలో పదమూడు వందల కోతులు పట్టుకున్నట్లు బల్దియా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో గత రెండు నెలల కాలంగా 900 పైగా కోతులు పట్టుకున్నట్లు వివరాలు ఉన్నాయి. ఒక కోతిని పట్టుకుని బల్దియా వాహనంలో ఏటూరునాగారం అడవుల్లో వదిలేసినందుకు కాంట్రాక్టర్‌కు రూ.450 చొప్పన చెల్లిస్తున్నారు. గత రెండు నెలలుగా 900 కోతులకు సంబంధించిన రూ.4.05లక్షల సొమ్మును సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించలేదు. దీంతో నెల రోజులుగా ఆ కాంట్రాక్టర్ కోతులు పట్టుకోవడం మానేశారు. దీంతో నగరంలో కోతుల సమస్య జఠిలంగా తయారైంది. ఇది పక్కన పెడితే కోతులను ఎప్పటికప్పుడు అడవుల్లో వదిలేస్తుండగా.. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తున్నారు. అయినా, మళ్లీ కోతులు పెద్దసంఖ్యలో ఎలా వస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా ఉన్నతాధికారులు సమస్యల మూలాలపై దృష్టి సారించడంతో పాటు కాంట్రాక్టర్‌కు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ కోతుల బెడద నుంచి తమను రక్షించాలని నగర వాసులు కోరుతున్నారు. ఏ కాలనీలో చూసినా కోతుల గుంపులే... వానర సేనలు గుంపులు గుంపులుగా నగరంలో సంచరిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు కోతుల భయంతో వణికిపోతున్నారు. బజారుకు వెళ్లి కూరగాయలు, పండ్లు తీసుకుని వచ్చే సమయంలో మీద పడి చేతుల్లో ఉన్న కవర్లు, సంచులను లాక్కుంటున్నాయని నగర వాసులు వాపోతున్నారు. ఒకటో, రెండో కాకుండా పదుల సంఖ్యలో వానరాలు ప్రత్యక్షమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కోతులు ఆకలి, దప్పిక సమయాల్లో ఇళ్లల్లోకి చొరబడి ఇంటిలో ఉన్న పండ్లు, కూరగాయల తదితర సామాగ్రిలు ఎత్తుకుపోతున్నాయని చెబుతున్నారు. ఎక్కడెక్కడ అంటే.. ట్రైసిటీ పరిధిలో కోతుల సమస్య తీవ్రంగా ఉంది. వరంగల్‌లోని గిర్మాజీపేట, గోవిందరాజుల గుట్ట, చౌర్బౌళి, పిన్నవారి వీధి, రామన్నపేట, పాపయ్యపేట చమన్, పోచమ్మమైదాన్, ఎల్బీ నగర్, కాశిబుగ్గ, క్రిస్టియన్ కాలనీ, గాంధీనగర్, అబ్బనికుంట, చింతల్, ఏ.సీ.రెడ్డి నగర్, శివనగర్, పెరకవాడ, ఖిలా వరంగల్, కరీమాబాద్, ఎస్ఆర్ఆర్.తోట, ఉర్సు, రంగశాయిపేట, వరంగల్ రైల్వేస్టేçÙన్, ఎల్లంబజార్, ప్రాంతాల్లో కోతుల బెడద విపరీతంగా ఉంది. ఇంకా హన్మకొండలోని కాకాజీ కాలనీ, పింజర్ల వీధి, శ్రీనివాస కాలనీ, లక్ష్మీపురం, బ్రాహ్మణవాడ, పద్మాక్ష్మి కాలనీ, న్యూశాయంపేట, దీన్‌దయాళ్ నగర్, నాగేంద్ర నగర్, రాయపురతో పాటు కాజీపేట రైల్వే స్టేషన్, విష్ణుపురి, సిద్ధార్థనగర్ తదితర ప్రాంతాల్లో కోతులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజులుగా పట్టుకోవడం లేదు.. కాంట్రాక్టర్‌కు బిల్లుచెల్లింపులో జాప్యమైన విషయం వాస్తవమే. దీంతో సదరు కాంట్రాక్టరు గత పక్షం రోజులుగా కోతులను పట్టుకోవడం లేదు. దీంతో ఫిర్యాదులు పెరిగాయి. నాలుగైదు రోజుల్లో కాంట్రాక్టర్‌కు రూ.4లక్షల చెక్కు ఇప్పిస్తాం. ఆ వెంటనే కోతులు పట్టుకునేలా చర్యలు వేగవంతం చేస్తాం. – బాలముని, బల్దియా ఈఈ -
మన్యంలో కలకలం
ఇన్ఫార్మర్ నెపంతో పాస్టర్ హత్య చింతూరు: అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్న మావోయిస్టులు రెండోరోజే ఇన్ఫార్మర్ నెపంతో ఒకరిని హతమార్చి మన్యంలో కలకలం సృష్టించారు. చింతూరు మండలం లచ్చిగూడెం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ వుయికా మారయ్య(35)ను మావోయిస్టులు శుక్రవారం అర్థరాత్రి గొంతుకోసి హతమార్చారు. దాంతో మన్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆగస్టు 3 వరకు జరిగే అమరవీరుల వారోత్సవాల్లో మావోయిస్టులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతారో అని అందరిలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వారు ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ల పేరుతో హత్యలు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నందునే తాము హత్యలకు పాల్పడుతున్నట్టు మావోయిస్టులు పేర్కొంటున్నారు. గతేడాది ఏప్రిల్ 25వ తేదీన చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీలోని అల్లివాగు గ్రామానికి చెందిన వలస గిరిజనుడు పొడియం నడుగును మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో హతమార్చారు. అదే నెలలో ఎటపాక మండలం కామన్‌తోగు గ్రామానికి చెందిన మడివి జోగయ్య, సోయం చుక్కయ్యలను హతమార్చారు. మే 4వ తేదీన చింతూరు మండలం బుర్కనకోగ గ్రామానికి చెందిన కుంజా బ్రహ్మయ్య, కుంజా సీతారామయ్య అనే అన్నదమ్ములను మావోయిస్టులు హతమార్చారు. 2014లో చింతూరు మండలం దొంగల జగ్గారం, నర్శింగపేట, అల్లిగూడెం, తుమ్మల గ్రామాలకు చెందిన పలువురిని మావోయిస్టులు ఇన్ఫార్మర్ల నెపంతో హతమార్చారు. అలాగే గతేడాది చింతూరు మండలం పేగ గ్రామానికి చెందిన సుమారు 50 మందిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత క్షేమంగా విడిచిపెట్టారు. ఇదే క్రమంలో గతేడాది ఎటపాక మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ కన్నయ్య కొడుకు ఇసాక్‌తో పాటు కొంతమంది పాస్టర్లను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మారయ్య లక్ష్మీపురం చర్చి పాస్టర్ కన్నయ్య సోదరుడే. రంగంలోకి ఖమ్మం జిల్లా కమిటీ? విలీన మండలాల్లో గతేడాది వరకు మావోయిస్టు శబరి ఏరియా కమిటీ క్రియాశీలకంగా పనిచేసేది. గతేడాది డిసెంబర్లో కమిటీ కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్ నగేష్ ఎన్కౌంటర్లో మృతిచెందడంతో కమిటీ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఈ కమిటీకి కొత్త కార్యదర్శిని నియమించారని పలుపేర్లు వినబడినప్పటికీ పోలీసులు దానిని ధృవీకరించలేదు. ఇటీవల వరుసగా మందుపాతర్ల సంఘటనలు, ప్రస్తుతం మారయ్య హత్య నేపధ్యంలో విలీన మండలాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు ఖమ్మం జిల్లా కమిటీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సంఘటన స్థలంలో లభ్యమైన లేఖలో ఇదే కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరు వుండడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. పద్ధతి మారకుంటే ఇదేగతి చింతూరు మండలంలోని పేగ, అల్లిగూడెం గ్రామాలకు చెందిన చాలామంది పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని మారయ్య మృతదేహం వద్ద మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి పేరుతో ఉంచిన లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. వారు తమ పద్ధతిని మార్చుకోకుంటే ఇదేగతి పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. పేగ గ్రామానికి చెందిన 17 మంది, అల్లిగూడెం గ్రామానికి చెందిన 14 మంది, వినాయకపురం గ్రామానికి చెందిన ఐదుగురి పేర్లను ఆ లేఖలో పేర్కొన్నారు. లక్ష్మీపురం చర్చి పాస్టర్ కన్నయ్య అక్రమ పద్ధతుల్లో ఆస్తులు కూడగట్టాడని, అతనిని పలుమార్లు హెచ్చరించినా వినకుండా తమనుంచి తప్పించుకు తిరుగుతున్నాడని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. అతని బాటలోనే అతని సోదరుడు మారయ్య కూడా నడుస్తుండడంతో అతనిని కూడా హెచ్చరించామన్నారు. అయినప్పటికీ అతని తీరు మారక పోవడంతో ప్రజాకోర్టులో శిక్షించినట్టు లేఖలో పేర్కొన్నారు.