ఆమ్స్టర్డామ్: సాధారణంగా శునకానికి, పిల్లికి మధ్య జాతీ వైరముంటుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, చాలా అరుదుగా కుక్కలు, పిల్లులు ఒక చోట ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఈ క్రమంలో.. కొన్నిచోట్ల యజమానులు చిన్నప్పటి నుంచి వాటిని ఒక దగ్గర పెంచితే.. అవి తమ జాతీ వైరాన్ని మరిచిపోతాయి. కుక్కలు, పిల్లులు ఒక దగ్గర ఉన్నప్పుడు ఫన్నీగా ఆడుకోవడం, ఒక్కొసారి పరస్పరం దాడిచేసుకోవడం వంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే.
తాజాగా, ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో సదరు యజమాని కుక్కని, పిల్లిని ఒక దగ్గర పెంచుకుంటున్నాడు. కుక్క హయిగా ఇంట్లోని సోఫాలో మంచిగా కాలు జాపుకొని హయిగా పడుకొని ఉంది. అప్పుడు పిల్లి అక్కడికి వచ్చి చూసింది. బహుషా.. కుక్క నిద్రపోవడం చూసి దానికి ఈర్ష్యపుట్టిందో.. దాన్ని డిస్టర్బ్ చేయాలనుకుందో ఏమో గానీ.. మెల్లగా దాని దగ్గరకు వెళ్లింది.
ఆ తర్వాత తన కాళ్లతో కుక్కను మెల్లిగా తట్లిలేపింది. వెంటనే సోఫా కింద దాక్కుంది. పాపం.. ఏదో అలికిడి వినిపించడంతో కుక్క అటూ ఇటూ చూసింది. దానికి ఏం కనిపించక పోవడంతో మళ్లి పడుకుంది. పిల్లి మరోసారి కుక్క నిద్రను డిస్టర్బ్ చేసింది. ఈ సారి కూడా కుక్కకు ఎవరు కనిపించలేదు. అలానే అటు ఇటూ అమాయకంగా చూసింది. అయితే, పిల్లి మాత్రం సోఫా కింద మెల్లిగా నక్కి నేను మాత్రం కాదన్నట్లు దాక్కుంది. కుక్కను పదేపదే డిస్టర్బ్ చేసింది.
దీన్ని బ్యూటింజిబిడెన్ అనే యూజర్ ట్వీటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ వీడియో చూస్తుంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాం..’, ‘నా ప్లేస్లో నువ్వు ఎలా పడుకుంటావ్.. అనుకుందేమో పాపం.. పిల్లి..’, ‘ ఈ రోజు ఒక మంచి సరదా వీడియోను చూశా..’ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Can’t stop laughing.. 😅 pic.twitter.com/bt3COZ7oUb
— Buitengebieden (@buitengebieden_) January 23, 2022
చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment