Sofa
-
Crime News: కామంతో స్నేహితుడి భార్యపై కన్నేశాడు! ఆపై ప్లాన్ చేసి..
డోంబివిలి(థానే.. ముంబై)లో కలకలం రేపిన సుప్రియ ఆంటీ హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. కిరాతకంగా హత్య చేసి.. ఆపై మృతదేహాన్ని సోఫా కమ్ బెడ్లో కుక్కేసి వెళ్లిపోయాడు నిందితుడు. ఈ ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ కేసును చేధించడంలో నిందితుడి చెప్పులే కీలకంగా వ్యవహరించాయి. ముంబై: దావ్ది ఏరియా డొంబివిలో సంచలనం సృష్టించిన 33 ఏళ్ల గృహిణి హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు మాన్‌పాడా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సుప్రియ భర్త క్లోజ్‌ఫ్రెండ్, ఆమె పొరుగింటి వ్యక్తి విశాల్ గెహావత్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసులో దర్యాప్తు కష్టతరంగా మారింది. అయితే ఘటన జరిగిన రోజున(మంగళవారం), అంతకు ముందు రోజు నిందితుడు బాధితురాలి ఇంటి బయట చెప్పులు విడిచాడు. మరో పక్కింట్లో ఉండే మహిళ ఆ చెప్పుల ఆనవాళ్లు వివరించగా.. ఆ చిన్న క్లూతో నిందితుడిని ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. అవి సుప్రియ భర్త కిషోర్ ఫ్రెండ్, పక్కఇంట్లో ఉండే విశాల్‌కి చెందినవిగా తేలడంతో.. తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించారు. దీంతో నిందితుడు నిజం ఒప్పేసుకున్నాడు. లొంగలేదనే కోపంలో.. నిందితుడు విశాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాల్, సుప్రియ భర్త కిషోర్ షిండేలు చాలాకాలం నుంచి స్నేహితులు. కానీ, స్నేహితుడి భార్యపైనే విశాల్ కన్నేశాడు. కావాలనే కిషోర్ వాళ్ల పక్కింట్లోనే అద్దెకు దిగాడు. ఎలాగైనా సుప్రియను లోబర్చుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఆమె అతన్ని పట్టించుకోలేదు. సుప్రియకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఆ వంకతో ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఘటన జరిగిన ముందురోజు కూడా పుస్తకం కోసం సుప్రియ ఇంట్లోకి వెళ్లాడు విశాల్. భర్త కిషోర్, కొడుకుతో సుప్రియ ఆ టైంకి సుప్రియ భర్త ఆఫీసుకి, కొడుకు స్కూల్‌కి వెళ్లడం గమనించాడు. ఆ మరుసటి రోజూ సుప్రియ ఒంటరిగా ఉన్న టైంలో తలుపు తట్టాడు. పుస్తకం కావాలంటూ సుప్రియతో మాటలు కలిపి తన కోరికను బయటపెట్టాడు. దీంతో ఆమె అతని చెంప చెల్లుమనిపించింది. కోపంతో ఆమెను బలవంతం చేయాలని ప్రయత్నించాడు. ప్రతిఘటించేసరికి తల నేలకేసి బాది.. ఆపై నైలాన్ తాడును సుప్రియ మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. ఆపై శవాన్ని సోఫా కమ్ బెడ్లో కుక్కేసి.. అక్కడి నుంచి జారుకున్నాడు. కొడుకును స్కూల్ నుంచి తీసుకెళ్లేందుకు ఆమె ఎంతకీ రాకపోవడంతో.. సుప్రియ కోసం వెతుకులాట మొదలైంది. కుటుంబ సభ్యులంతా సుప్రియ కోసం గాలిస్తున్న టైంలోనూ ఏమీ ఎరగనట్లు కిషోర్ పక్కనే ఉన్నాడు విశాల్. సుప్రియ ఎంతకీ కనిపించకపోయేసరికి కిషోర్‌తో కలిసి మరీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చి వచ్చాడు. ఈ లోపు సోఫా కుషన్ చినిగి ఉండడం అనుమానించిన చుట్టుపక్కల వాళ్లు.. పైకి ఎత్తి చూడగా అందులో నుంచి సుప్రియ షిండే మృత దేహం బయటపడింది. -
శునకం నిద్రను డిస్టర్బ్ చేసిన పిల్లి.. వైరల్ వీడియో
ఆమ్స్టర్డామ్: సాధారణంగా శునకానికి, పిల్లికి మధ్య జాతీ వైరముంటుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, చాలా అరుదుగా కుక్కలు, పిల్లులు ఒక చోట ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఈ క్రమంలో.. కొన్నిచోట్ల యజమానులు చిన్నప్పటి నుంచి వాటిని ఒక దగ్గర పెంచితే.. అవి తమ జాతీ వైరాన్ని మరిచిపోతాయి. కుక్కలు, పిల్లులు ఒక దగ్గర ఉన్నప్పుడు ఫన్నీగా ఆడుకోవడం, ఒక్కొసారి పరస్పరం దాడిచేసుకోవడం వంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో సదరు యజమాని కుక్కని, పిల్లిని ఒక దగ్గర పెంచుకుంటున్నాడు. కుక్క హయిగా ఇంట్లోని సోఫాలో మంచిగా కాలు జాపుకొని హయిగా పడుకొని ఉంది. అప్పుడు పిల్లి అక్కడికి వచ్చి చూసింది. బహుషా.. కుక్క నిద్రపోవడం చూసి దానికి ఈర్ష్యపుట్టిందో.. దాన్ని డిస్టర్బ్ చేయాలనుకుందో ఏమో గానీ.. మెల్లగా దాని దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత తన కాళ్లతో కుక్కను మెల్లిగా తట్లిలేపింది. వెంటనే సోఫా కింద దాక్కుంది. పాపం.. ఏదో అలికిడి వినిపించడంతో కుక్క అటూ ఇటూ చూసింది. దానికి ఏం కనిపించక పోవడంతో మళ్లి పడుకుంది. పిల్లి మరోసారి కుక్క నిద్రను డిస్టర్బ్ చేసింది. ఈ సారి కూడా కుక్కకు ఎవరు కనిపించలేదు. అలానే అటు ఇటూ అమాయకంగా చూసింది. అయితే, పిల్లి మాత్రం సోఫా కింద మెల్లిగా నక్కి నేను మాత్రం కాదన్నట్లు దాక్కుంది. కుక్కను పదేపదే డిస్టర్బ్ చేసింది. దీన్ని బ్యూటింజిబిడెన్ అనే యూజర్ ట్వీటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ వీడియో చూస్తుంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాం..’, ‘నా ప్లేస్‌లో నువ్వు ఎలా పడుకుంటావ్.. అనుకుందేమో పాపం.. పిల్లి..’, ‘ ఈ రోజు ఒక మంచి సరదా వీడియోను చూశా..’ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. Can’t stop laughing.. 😅 pic.twitter.com/bt3COZ7oUb — Buitengebieden (@buitengebieden_) January 23, 2022 చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో -
సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?
ఇస్తాంబుల్ : బద్ధకంతో పని తగ్గించుకోవటానికి లేదా తప్పించుకోవటానికి మనం చేసే పనులు ఒక్కోసారి ఇతరుల ప్రాణాల మీదకు తెస్తాయి. అవతలి వ్యక్తులకు భూమ్మీద నూకలుంటే బ్రతికి బయటపడతారు.. లేకపోతే చచ్చి ఊరుకుంటారు. టర్కీకి చెందిన ఓ వ్యక్తి చేసిన బద్ధకపు పనికి పొరుగింటి అమ్మాయి ప్రాణాలు పోయేవే.. భూమ్మీద నూకలుండబట్టి బతికి బయటపడింది. వివరాల్లోకి వెళితే.. టర్కీలోని ఉస్కుదార్ జిల్లాకు చెందిన మీసట్ దురాన్ కొద్దిరోజుల క్రితం కొత్త సోఫా కొనుక్కున్నాడు. ఈ నేపథ్యంలో తన దగ్గర ఉన్న పాత సోఫా బయట పడేయటానికి నిశ్చయించుకున్నాడు. అపార్ట్మెంట్ బిల్డింగ్ మూడో అంతస్తులో ఉంటున్న అతడు దాన్ని మెట్లగుండా తీసుకుపోవటానికి బద్ధకించాడు. రియర్ విండోలోంచి దాన్ని కిందకు తోసేశాడు. అయితే, అదే సమయంలో మీసట్ దురాన్ పొరిగింటి అమ్మాయి కింద రోడ్డు మీదకు వస్తోంది. బిల్డింగ్‌లోంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె పక్కన ‘ఢాం’ అంటూ సోఫా పడింది. ఆమె కొంచెం పక్కకు జరిగిఉంటే ప్రాణాలు పోయేవి. వీడియో దృశ్యం దీనిపై మీసట్ దురాన్ మాట్లాడుతూ.. ‘‘ నేను కొత్త సోఫా కొన్నాను. కిటిలోంచి కిందకు చూసినపుడు అక్కడ ఎవరూ లేరు. అంతా ఓకే అనుకున్నాకే కిటికీలోంచి సోఫాను పడేశాను. అప్పుడే మా పొరిగింటి అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె చాలా లక్కీగా తప్పించుకుంది. లేకపోతే చనిపోయి ఉండేది. నేను హంతకుడ్ని అయ్యేవాడిని’’ అని అన్నాడు. సెక్యూరిటీ కెమెరాలో రికార్డయిన ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై.. ‘‘ సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?’’.. ‘‘ ఇలాంటి వెధవలు ప్రతీ దేశంలో ఉంటారు’’...‘‘ ఇలాంటి వాళ్లను ఊరికే వదిలేయకూడదు, పోలీసులకు అప్పగించాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
సోఫా కొంటాను రూపాయి పంపమన్నాడు, నిండా ముంచేశాడు
సాక్షి, చందానగర్: ఓఎల్ఎక్స్లో సోఫా అమ్మకం కోసం పెట్టిన వ్యక్తిని మోసగించి రూ.25 వేలు కాజేసిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ అహ్మద్ పాషా కథనం ప్రకారం.. చందానగర్ అపర్ణ లేక్ బ్రిజ్ అపార్ట్మెంట్లో నివాసముండే జోసెఫ్ అంగర్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. అతను ఓఎల్ఎక్స్లో తన సోఫా విక్రయానికి పెట్టగా, ఫోన్ నం. 9090045860 నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. రూ. 15 వేలకు సోఫా కొనుగోలు చేస్తానని, తనకు ఒక రూపాయి క్యూఆర్ కోడ్ ద్వారా పంపించాలని ఓ గుర్తు తెలియని వ్యక్తి కోరారు. జోసెఫ్‌కు క్యూ ఆర్ కోడ్ పంపించాడు. ఆ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన జోసెఫ్ ఒక రూపాయి పంపగా, తిరిగి రూ. 2 వచ్చాయి. అలా ఒకటి, రెండు, ఐదు, పది రూపాయల వరకు పంపగా అవి రెట్టింపు అయ్యి జోసెఫ్‌కు వచ్చాయి. ఇది నిజమని నమ్మిన జోసెఫ్ పేటీఎం అకౌంట్ నుంచి రూ.5 వేలు గుర్తు తెలియని వ్యక్తికి పంపగా, సాంకేతిక కారణాలు చెప్పి జోసెఫ్ నుంచి ఆ కేటుగాడు దఫా దఫాలుగా మొత్తం రూ. 25 వేలు రాబట్టాడు. తనకు డబ్బులు తిరిగి రాకపోగా గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ పేరిట టోకరా చందానగర్: కేవైసీ అప్డేట్ పేరుతో రూ.39,999 కాజేసిన ఘటన చందానగర్ ఠాణా పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన ప్రకారం.. డోయన్స్ టౌన్షిప్ కాలనీలో నివాసముండే చల్లా శ్రీనివాస్‌రెడ్డి ఎల్ఐసీ ఏజెంట్. కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నానని ఓ గుర్తు తెలియని వ్యక్తి అతడికి కాల్ చేశాడు. మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పి లింక్ పంపించాడు. ఆ లింక్‌ను ఓపెన్ చేయగా క్లిక్ సపోర్ట్ అనే యాప్ డౌన్లోడ్ అయ్యింది. మరో లింక్ పంపుతానని గూగుల్ క్రోమ్ ద్వారా దానిని ఓపెన్ చేసి, రీచార్జ్ కోసం ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేయాలని చెప్పాడు. అతడు చెప్పిన విధంగా శ్రీనివాస్‌రెడ్డి చేయగా, అందులో టాప్ హెడ్లైన్ ద్వారా రీఛార్జ్ రూ.32 చేయాలని ఉంది. ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేసిన మరుక్షణమే శ్రీనివాస్‌రెడ్డి అకౌంట్లో ఉన్న మొత్తం రూ.39,999లు డెబిట్ అయినట్లు మెసెజ్ వచ్చింది. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు చందానగర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మేమేం పాపం చేశాం.. మాకెందుకీ కడుపుకోత -
వినసొంపైన సోఫా
సాక్షి, హైదరాబాద్: సోఫాలంటే మనకు తెలిసింది కూర్చోవటానికి, పడుకోవటానికి పనికొచ్చేవే. కానీ, మార్కెట్లో ఆధునికమైన, విలాసవంతమైన సోఫాలు కూడా లభ్యమవుతున్నాయి.ముఖ్యంగా ఇటాలియన్ రకాల సోఫాలకు ఆదరణ పెరుగుతోంది. ►ఆధునిక ఫర్నిచర్‌ను నగరవాసులు అక్కున చేర్చుకుంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ సోఫాల్లో లైట్లు వెలుగుతాయి. స్పీకర్లుంటాయి. దీంతో చక్కని సంగీతాన్ని వినొచ్చు. సెల్ఫోన్లను చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న బార్ కౌంటర్ కూడా ఉంటుంది. మీట నొక్కితే చాలు సోఫా వెనక భాగమంతా వెనక్కి వెళుతుంది. మన అవసరాలకు తగ్గట్టుగా వీటిని ఎంచుకోవచ్చు. అవసరమైతే ఒక్కొక్కటిగా తీసుకోవచ్చు విడివిడిగా కొనుక్కోవచ్చు కూడా. ► ఉన్నత వర్ణాలు, ఐటీ నిపుణులతో బాటు ఇతర నగరాల్లో నివసించేవారంతా ఇటాలియన్ సోఫాలను విశేషంగా ఆదరిస్తున్నారు. ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారు. మాడ్యులర్, రిక్లయినర్, సీక్రెట్ వంటి రకాలకు చక్కటి ఆదరణ వస్తుంది. -
చక్రాలే చెయిర్లైతే...
మనసుండాలే కానీ... మనిషి తెలివికి, ప్రతిభకి ఎలాంటి కొలమానం సరిపోదు. ఎందుకంటారా? ఒకసారి పక్కనున్న ఫొటోలను చూస్తే మీకే అర్థమవుతుంది. మొదటగా టైర్లను అసలు ఎందుకు తయారు చేశారు? వాహనాల కోసం. అవునా, మరి అవి పాడయితే ఎలా? వాటిని ఎలాగూ వాహనాలకు అమర్చలేం.. ఇక్కడే మనిషి తెలివి ఉపయోగపడేది. ఆ పాడైన టైర్లను కుర్చీలు, బల్లలు, సెంటర్ టేబుల్స్‌గా తయారు చేసి వాడుకోవచ్చు. కావలసినవి: పాత టైరు, దళసరి కార్డ్‌బోర్డు, నాలుగు కాళ్ల పీట, జనపనార, గ్లూ తయారీ: ముందుగా సెంటర్ టేబుల్ తయారీకి... కార్డ్‌బోర్డు ముక్క టైరు సెంటర్ హోల్ సైజుకు అనుగుణంగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. తర్వాత గ్లూతో ఆ కార్డ్బోర్డును టైరుకు అతికించాలి. తర్వాత టైరుకు పూర్తిగా గ్లూను పూయాలి. ఇప్పుడు జనపనారను టైరు చుట్టూ చుట్టాలి. గ్లూ రాశాం కాబట్టి.. చుట్లు ఊడిపోవు. తర్వాత ఈ టైరును నాలుగు కాళ్ల పీటపై పెట్టి అతికించాలి. ఇప్పుడు ఈ సెంటర్ టేబుల్‌ను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే జనపనార చుట్టకుండా కూడా వీటికి ఏదైనా రంగు వేసి, వాటిపై కార్డ్‌బోర్డు లేదా గ్లాస్ బోర్డు పెట్టి సెంటర్ టేబుల్‌గా వాడుకోవచ్చు. అంతేనా ఫొటోలో కనిపిస్తున్న విధంగా చెయిర్, సోఫాల్లా మార్చుకోవచ్చు. -
గది విశాలంగా కనిపించాలంటే!
సాక్షి, హైదరాబాద్: చిన్న గది.. ఆ ఇరుకుతనం మనసుకు చికాకును తెప్పిస్తుంది. అలా అని బాధపడక్కర్లేదు. ఎత్తు తక్కువగా ఉన్న వారు పొడవాటి చారలున్న దుస్తువులు వేసుకుంటే ఎలాగైతే పొడుగ్గా కనిపిస్తారో.. ఇల్లూ అంతే! అంటే ఇంట్లోని పరదా, తివారీ, సోఫా కవర్ వంటివి పొడవాటి చారలున్నవి ఎంచుకుంటే సరిపోతుంది. అవే చిన్న గదిని విశాలంటే కనిపించేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని చిట్కాలివిగో.. ♦ ఒకవేళ ఆ గదిలోని కిటికీ చిన్నదయినా సరే.. పరదాలు తప్పనిరైతే మాత్రం అవి పై నుంచి వెడల్పుగా, కిందకు జాలువారేలా ఉండేలా చూసుకోవాలి. గోడల రంగులకు నప్పేట్టు చూసుకుంటే గది వెడల్పుగా కనిపిస్తుంది. ♦ చిన్న గదిలో ఓ గోడకు పెద్ద అద్దాన్ని అమర్చండి. అద్దం కృత్రిమ, సహజ వెలుతురిని ప్రతిబింబిస్తుంది. దీంతో గది ఇంకా ప్రకాశవంతంగా, పెద్దగా కనిపిస్తుంది. ♦ ఇంట్లో అక్కడక్కడ అంతగా ఉపయోగపడని వస్తువులుండటం సర్వసాధారణం. అలా ఉపయోపగపడని వస్తువులను ఎప్పటికప్పుడు తీసేయడం తప్పనిసరి. పత్రికలు, పుస్తకాల్లాంటివి ఎక్కడపడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పడేయకుండా పొందిగ్గా చిన్న అల్మరాలు ఎంచుకుని వాటిలో సర్దుకోవాలి. ♦ గది కాస్త పెద్దదిగా కనిపించాలంటే గోడలకు లేత చాయల్లో పెయింట్లు వేసుకోవాలి. అలాగే ఇంటి పైకప్పు పైనా ఆకట్టుకునే డిజైన్లను పెయింట్‌లా వేయించాలి. లేదంటే వాల్ పేపర్ అయినా అతికించాలి. ఆ గదిలోకి వచ్చేవారి దృష్టి దానిపై పడుతుంది. గది విశాలంటే ఉన్నట్టూ కనిపిస్తుంది. పువ్వుల వాల్‌పేపర్ అయితే అదనపు ఆకర్షణ. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
సోఫాలో సాఫీగా...
హ్యూమర్‌ప్లస్ నేల, బెంచీ, కుర్చీలు కాకుండా సోఫా క్లాసులు కూడా ఉంటాయని హైదరాబాద్ వచ్చాకే తెలిసింది. ఈమధ్య ఒక సినిమాకి వెళ్లాను. బటన్ నొక్కితే సోఫా విచ్చుకుంది. కాళ్లు చాపుకుని పడుకున్నా. పక్కసీటాయన లేపితే లేచా. ‘‘నిద్రపోండి, కానీ గురకపెట్టకండి. నా నిద్ర డిస్టర్బ్ అవుతోంది’’ అన్నాడు. ఈ సోఫా వల్ల సౌలభ్యం ఏమింటే, సినిమా బావున్నా, బాలేకపోయినా నిద్ర మాత్రం గ్యారంటీ. ఈమధ్య మా ఆవిడ సెల్లో రికార్డు చేసిన ఒక విచిత్రమైన సౌండ్ వినిపించింది. కుక్క, పిల్లి, కోతి ఒక బోనులో గొడవపడుతున్నట్టుగా వుంది. ‘‘ఏంటీ శబ్దం?’’ అని కంగారుగా అడిగాను. ‘‘మీ గురక’’ అంది. మగవాళ్ల గురక వల్ల ఆడవాళ్లకి మతి భ్రమణమైనా కలుగుతుంది. లేదా వేదాంతమైనా అబ్బుతుంది. రెంటికీ పెద్ద తేడా లేదు. ఆడవాళ్లు కూడా భారీగా గురకపెడతారు. వయసుని ఒప్పుకోనట్టే, దీన్ని కూడా ఒప్పుకోరు. నా మిత్రుడు ఒకాయన భార్య గురకకి భయపడి హౌస్‌కి వెళ్లకుండా మాన్షన్‌హౌస్ మందు తాగుతున్నాడు. మరక మంచిదే అని సర్ఫ్వాళ్లు అన్నారు కానీ, గురక మంచిదే అని ఎవరైనా అన్నారా? ఈ మధ్య మన సినిమాలు నిద్రకి మంచి మందుగా పనిచేస్తున్నాయి. నా మిత్రుడికి వ్యాపారంలో ఒక స్లీపింగ్ పార్టనర్ ఉన్నాడు. ఆయన సినిమాకెళితే టైటిల్స్ వస్తున్నప్పుడు నిద్రపోయి, రోలింగ్ టైటిల్స్‌లో లేస్తాడు. మధ్యలో ఏం జరిగినా ఆయనకి అనవసరం. ఈమధ్య సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకి వెళ్లి చిరాకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ ప్రతి ఐదు నిముషాలకి ఒసారి తుపాకీతో కాల్చి నిద్రపట్టకుండా చేశాడట! డైలాగుల కంటే తుపాకి గుళ్లే ఎక్కువగా పేలాయట. కాల్చడం మొదలుపెడితే పవన్ ఎవరి మాటా వినడు. నిద్రలో బోలెడు రకాలుంటాయి. కునుకు, దొంగనిద్ర, కలత నిద్ర, గాఢనిద్ర, యోగనిద్ర, దీర్ఘనిద్ర. చివరిదాన్ని ఎవడూ తప్పించుకోలేడు. వెనుకటికి ప్రధానిగా ఉన్నప్పుడు దేవెగౌడ కునుకు వేయకుండా ఏ సమావేశమూ ముగించేవాడు కాదు. దొంగనిద్ర ఎలా పోవాలో శ్రీకృష్ణుడికి బాగా తెలుసు. అందుకే కురుక్షేత్రం నడిపించాడు. విజయ్‌మాల్యాకి అప్పులిచ్చినవాళ్లంతా అనుభవిస్తుండేది కలతనిద్ర. గాఢనిద్ర పసి పిల్లల ఆస్తి. స్కూల్లో చేరిన తరువాత ఆ ఆస్తిని పోగొట్టుకుని అప్పులపాలవుతాం. ఇతరుల దుఃఖాన్ని తమదిగా భావించే మహాయోగులకి అబ్బేది యోగనిద్ర. అది మనకు చేతకాదు. నిద్ర పట్టని వాళ్లుంటారు. నిద్రపోయేవాళ్లని చూస్తే వీళ్లకు జెలసీ. వీళ్లు ఆఫీస్‌లో బాస్‌లైతే మనం చచ్చినా నిద్రపోలేం. నిద్రలో నడిచేవాళ్లుంటారు. నా చిన్నప్పుడు ఒకాయనుండేవాడు. డిటెక్టివ్ పుస్తకాలు తెగ చదివేవాడు. నిద్రలో నడుస్తూ ‘‘మిస్టర్ ఏజెంట్ త్రిబుల్వన్, నీ ఆటలు డిటెక్టివ్ యుగంధర్ వద్ద సాగవు’’ అని అరుస్తూ వీధిలో వాళ్ళందరికీ జేమ్స్‌బాండ్ సినిమాలు చూపించేవాడు. నిద్రలో కలలొస్తే వరం. పీడకలలొస్తే కలవరం. జర్నలిస్ట్‌లకి సరిగా నిద్ర వుండదు కాబట్టి కలలు కూడా సరిగా రావు. జర్నలిస్ట్‌గా వున్నప్పుడు ఏది కలో, ఏది మెలకువో తెలిసేది కాదు. జర్నలిజమే ఒక వైష్ణవమాయ. తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు ఆఫీస్‌లో కొందరు నిద్రపోతూ పనిచేసేవాళ్లు. పనిచేస్తూ నిద్రపోయేవాళ్లు. ఈ నిద్రావస్థలో ఒకసారి మునిసిపల్ చైర్మన్ ఫోటోకి బదులు గజదొంగ ఫోటో పెట్టారు. జనం పెద్ద తేడా తెలుసుకోలేకపోయారు. చైర్మన్ కూడా తన మొహాన్ని గుర్తుపట్టలేకపోయాడు. (మనల్ని మనం గుర్తుపట్టడమే అన్నిటికంటే కష్టం). గజదొంగ పేపర్ చదవడు కాబట్టి, మా స్లీపింగ్ సబ్ఎడిటర్లు వాడికిచ్చిన గౌరవాన్ని గుర్తించలేకపోయారు. మనుషులే కాదు, ప్రభుత్వాలు కూడా నిద్రపోయి గురకపెడతాయి. మన ప్రభుత్వాలకి వున్న మంచి లక్షణాల్లో ఇదొకటి. నిద్రపోవడం మన హక్కు. నిద్రని నేను గౌరవిస్తాను కానీ, గురక మాత్రం ఇతరుల హక్కుల్ని హరించడమే! - జి.ఆర్. మహర్షి