
సాక్షి, హైదరాబాద్: సోఫాలంటే మనకు తెలిసింది కూర్చోవటానికి, పడుకోవటానికి పనికొచ్చేవే. కానీ, మార్కెట్లో ఆధునికమైన, విలాసవంతమైన సోఫాలు కూడా లభ్యమవుతున్నాయి.ముఖ్యంగా ఇటాలియన్ రకాల సోఫాలకు ఆదరణ పెరుగుతోంది.
►ఆధునిక ఫర్నిచర్‌ను నగరవాసులు అక్కున చేర్చుకుంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ సోఫాల్లో లైట్లు వెలుగుతాయి. స్పీకర్లుంటాయి. దీంతో చక్కని సంగీతాన్ని వినొచ్చు. సెల్‌ఫోన్లను చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న బార్ కౌంటర్ కూడా ఉంటుంది. మీట నొక్కితే చాలు సోఫా వెనక భాగమంతా వెనక్కి వెళుతుంది. మన అవసరాలకు తగ్గట్టుగా వీటిని ఎంచుకోవచ్చు. అవసరమైతే ఒక్కొక్కటిగా తీసుకోవచ్చు విడివిడిగా కొనుక్కోవచ్చు కూడా.
► ఉన్నత వర్ణాలు, ఐటీ నిపుణులతో బాటు ఇతర నగరాల్లో నివసించేవారంతా ఇటాలియన్ సోఫాలను విశేషంగా ఆదరిస్తున్నారు. ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారు. మాడ్యులర్, రిక్లయినర్, సీక్రెట్ వంటి రకాలకు చక్కటి ఆదరణ వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment