ఇంటర్నేషనల్ ఫర్నిచర్ హబ్ బ్రాండ్స్ సిటీ | International Furniture Hub brands City | Sakshi
Sakshi News home page

ఇంటర్నేషనల్ ఫర్నిచర్ హబ్ బ్రాండ్స్ సిటీ

Published Sat, Aug 9 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

ఇంటర్నేషనల్ ఫర్నిచర్ హబ్  బ్రాండ్స్ సిటీ

ఇంటర్నేషనల్ ఫర్నిచర్ హబ్ బ్రాండ్స్ సిటీ

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇటాలియన్ మాస్టర్ ఫర్నీచర్ నటుజీతో పాటు ఫర్నీచర్ రారాజులు ఎర్బా, ఆల్నో, ఇగో డిజైన్, సాంటారోజా వంటి బ్రాండ్స్ సిటీ మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంటి అందాన్ని ఇనుమడింపజేసే ఫర్నీచర్ పై హైదరాబాదీలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సోఫా, మంచాలు, కి చెన్‌తో పాటు ఇతర ఆర్టిస్టిక్ ఫర్నీచర్ విదేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి.
 
 ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌తో  ఫర్నీచర్ షాపులు వెలుస్తున్నాయి. కస్టమర్లు, ఆర్కిటెక్ట్స్ కోరిన విధంగా డిజైనర్ ఫర్నీచర్‌ను అందిస్తున్నారు. ఇటలీలో స్థిరపడ్డ అఖిల్ కుమార్ ఇటీవలే తల్లిదండ్రులకోసం హైదరాబాద్‌లో ఇల్లు కొన్నాడు. ఇటలీలోని తన ఇంటిని నటుజీ ఫర్నీచర్‌తో అందంగా తీర్చిదిద్దుకున్నాడు. తల్లిదండ్రుల ఇంటికి అలాంటి ఫర్నీచరే హైదరాబాద్‌లో దొరకడం అఖిల్ ఆశ్చర్యానికి కారణమైంది.
 
 నగరవాసుల శ్రమ తప్పించడానికి దక్షిణాదిలోని లగ్జరీ ఫర్నీచర్ ఎలివేట్ జూబ్లీహిల్స్‌లో ఎస్టాబ్లిష్ అయింది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో తమ అవుట్ లెట్స్ ఏర్పాటు చేయనుంది. దేశీయ, విదేశీ బ్రాండ్లు ఇక్కడ దొరుకుతాయి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఎలివేట్‌తో కలిసి లగ్జరీ ఫర్నీచర్‌ను అందుబాటులో ఉంచామని నటుజీ కంట్రీ మేనేజర్ నితిన్ బాల్ చెబుతున్నాడు. నటుజీ ఎడిషన్స్‌పై కొనుగోలుపై ఆగస్టు 9 నుంచి 30 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. ఇంకేం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఉన్న ది ఎలివేట్ ఫర్నీచర్స్‌ను సందర్శిస్తే సరి. ఆన్‌లైన్‌లో చెక్ చేయాలనుకుంటే లాగాన్ టు www.theelevate.in, Contact : 04030014001

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement