ఇంటికి న్యూ లుక్
అందమైన ఇల్లు అంటే అందరికీ ఇష్టమే. లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ నిర్మించినా ఇంటిలో సరైన ఫర్నిచర్ లేకుంటే అసంతృప్తే. ఏదో మిస్ అయ్యామన్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ప్రతి ఇంటికీ అందాన్నే కాదు... సౌకర్యాన్నీ అందించే ఫర్నిచర్‌ను అందించేందుకు నగరంలో బడాబడా షోరూమ్‌లు వెలుస్తున్నాయి.డిఫరెంట్ మోడల్స్, క్వాలిటీ, మన్నిక, ధరతో పాటు నయా లుక్ కూడా ఉండాలి. ఇదే ఇప్పుడు నగరవాసుల ప్రాధాన్యమంటున్నారు ఫర్నిచర్ వ్యాపారులు. ఇటువంటి వారికోసం విదేశాల నుంచి ప్రత్యేక డిజైన్ల ఫర్నిచర్‌ను విక్రయిస్తోంది నగరానికి చెందిన ‘బాంటియా ఫర్నిచర్’. 65 ఏళ్లుగా హైదరాబాదీల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఫర్నిచర్‌లో నయా మోడల్‌లను అందిస్తూ వస్తోంది ఈ షాపు.
సికింద్రాబాద్‌లోని సిఖ్‌విలేజ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న బాంటియా ఫర్నిచర్... కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, జూబ్లీహిల్స్, కొంపల్లి, అత్తాపూర్‌లలో కూడా అవుట్‌లెట్‌లు తెరిచింది. కస్టమర్లు తమపై ఉంచిన విశ్వాసంవల్లే ఈ స్థాయికి చేరుకోగలిగామని బాంటియా ఫర్నిచర్ మేనేజింగ్ డెరైక్టర్ సురేందర్ బాంటియా తెలిపారు. ‘కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నాణ్యతను పాటిస్తున్నాం. సరసమైన ధరలకు ఫర్నిచర్ అందుబాటులో ఉంచుతున్నాం. 90 శాతం మంది నగరవాసులు రెడీమేడ్ ఫర్నిచర్‌కే ఓటేస్తున్నారు. త్వరలో సికింద్రాబాద్ షాపును 90 వేల చదరవు అడుగులకు విస్తరిస్తున్నాం’ అని బాంటియా చెప్పారు.
ఇంటర్నేషనల్ బ్రాండ్స్...
‘విదేశాల నుంచి దిగుమతి అయిన సోఫాలు, డైనింగ్ టేబుల్‌లు, సెంటర్ టేబుల్స్, బెడ్స్, రీక్లయినర్స్, మాట్రిస్సెస్, షూ రాక్స్, టీవీ యూనిట్స్, ఆఫీసు టేబుల్స్, ఎగ్జిక్యూటివ్ చైర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. టీక్‌వుడ్, రబ్బర్‌వుడ్, ఎండీఎఫ్, స్టీల్, స్టెయిన్‌లెస్ స్టీల్, గ్లాస్, మార్బల్‌తో తయారైన ఫోర్ సీటర్స్ నుంచి టెన్ సీటర్స్ వరకు డైనింగ్ టేబుల్‌లు రూ.4 వేలు నుంచి 1.5 లక్షల విలువ చేసే బెడ్స్ ఉన్నాయి. కస్టమర్ల కోరిక మేరకు ఫర్నిచర్‌ను సులభ వాయిదాల్లో కూడా అందజేస్తున్నాం. 040-2784562/63/65 ఫోన్ నంబర్లలో మమ్మల్ని సంప్రదించవచ్చు’ అన్నారు బాంటియా. - వీఎస్