International Brands
-
ఇక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో ప్రాముఖ్యత ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 జిల్లాలకు 13 ఉత్పత్తులను ఎంపిక చేసి.. వాటిని మేడిన్ ఆంధ్రా పేరుతో బ్రాండింగ్ కల్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్లో భాగంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా వన్ డి్రస్టిక్ట్ – వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో సర్వే నిర్వహించి, విశేష ప్రాచుర్యం ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల ప్రాముఖ్యాన్ని ప్రతిబింబించడంతో పాటు స్థానికులకు అత్యధికంగా ఉపాధి కల్పించే ఉత్పత్తులను ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. హస్తకళలు, చేనేత, ఆహారం, వ్యవసాయం, ఖనిజాలు, బొమ్మల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఓడీఓపీ సెల్ నాణ్యమైన స్థానిక ఉత్పత్తులను విక్రయించడం ద్వారా బ్రాండ్ ఏపీ పేరు ఇనుమడించే విధంగా చేయడం కోసం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం ముడి పదార్థం ఎంపిక దగ్గర నుంచి తుది ఉత్పత్తి విక్రయించే వరకు ఉత్పత్తిదారులకు సహకరించేలా అన్ని మౌలిక వసతులు, ప్రత్యేక క్లస్టర్లు, ఉమ్మడి సౌకర్యాల వేదికలను అభివృద్ధి చేయనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో అధిక ఉత్పత్తి సాధించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం సిడ్బీ, స్ఫూర్తి వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓడీఓపీ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. కేంద్రం సహకారాన్ని కోరాం వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 స్థానిక ఉత్పత్తులను ఎంపిక చేశాం. ఈ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడానికి సహకారం అందించాల్సిందిగా కేంద్రాన్ని ఇప్పటికే కోరాం. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వదావన్లతో ఈమేరకు మాట్లాడాము. – గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి ఆన్లైన్ మార్కెట్‌పై దృష్టి బ్రాండ్ ఏపీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రాచుర్యం కల్పించేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తద్వారా ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త రకాలను రూపొందించే విధంగా నిఫ్ట్ వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. సంస్థలకు ఆరి్థక సహకారం అందించడానికి సిబ్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. చూడగానే ఆకర్షించేలా ఉత్పత్తులను తీర్చిదిద్దడానికి ప్యాకేజింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమైన మానవ వనరులను అందుబాటులో ఉంచే విధంగా ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏపీ బ్రాండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
అప్పుచేసి కొన్న కెమెరా.. అందల మెక్కించింది..
నాన్న రైల్వేలో చిరుద్యోగి. ప్రభుత్వ బడిలో చదువు ఒంటపట్టలేదు. మరి ఆ కుర్రాడు ఏం చేశాడు? స్టడీస్‌లో రాణించలేకపోయినా స్టడీ కామ్‌తో రాణించాడు. ఇంటర్ దాటలేకపోయినా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మెచ్చిన ఫొటోగ్రాఫర్ అయ్యాడు. ఒకనాడు అప్పు చేసి కెమెరా కొన్న ఈ మల్కాజిగిరి యంగ్‌స్టర్... ఇప్పుడు సిటీ నుంచి ముంబయికి తరచూ రాకపోకలు జరిపే టాప్ లెవల్ యాడ్ మేకర్. మనవాళ్లు యాడ్ డెరైక్టర్ల కోసం ముంబయి బాట పడుతుంటే.. ముంబయిలోనూ ఆఫీసు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిన రాజేష్ జర్నీ గురించి తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి ‘మల్కాజిగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను సర్. మా ఇంట్లో, చుట్టాల్లో అందరూ మంచిగ చదువుకున్నోళ్లే. మనకే అబ్బలేదు’ అంటూ నవ్వేశాడు రాజేష్ వలబోజు. అయితే అబ్బని చదువు ఇంట గెలిపించలేకపోయినా, అబ్బిన ఫొటోగ్రఫీ రచ్చ గెలిపించింది. హైదరాబాద్ నుంచి దేశీయంగా సక్సెసైన అతి తక్కువ మంది యాడ్ ఫిలిం మేకర్స్‌లో ఈ యువకుడిని ఒకడిగా నిలిపింది. అప్పు తప్పన్నా.. వినలేదు.. ‘చిన్నప్పటి నుంచి ఫొటోలంటే చాలా ఇష్టం. తెలిసిన వారి ఇంట్లో ఏ శుభకార్యమైనా ఫొటో ఆల్బమ్స్ చూసినవే చూస్తుండేంత ఇష్టం. టీనేజ్‌లో ఫ్రెండ్స్ అంతా ఫొటోలు దిగాలని ఉబలాటపడుతుంటే నేను తీయాలని ఆరాట పడేవాడ్ని. ఆ ఇష్టమే నన్ను అధిక వడ్డీకి రూ.5వేలు అప్పుచేసి కెమెరా కొనేలా చేసింది’ అంటూ గుర్తు చేసుకున్న రాజేష్.. ఆ సమయంలో ఇంట్లోవాళ్లు తనని వారించినా వినలేదని, చాన్నాళ్లు ఆ మొత్తానికి వడ్డీ కడుతూ వచ్చి ఒక పెళ్లి ఆర్డర్ రావడంతో ఆ అప్పు తీర్చేశానని చెప్పాడు. కెమెరా పనితనంతో చుట్టాలు, బంధువుల్లో కాస్త పేరు రావడం, వేడుకల ఆర్డర్స్ రావడం ఫొటోగ్రాఫర్‌గా రాజేష్‌ని బిజీగా మార్చాయి. మెరుగులద్దిన మోడలింగ్.. ‘రెండు దశాబ్దాల క్రితం.. అప్పట్లో హైదరాబాద్ ఫ్యాషన్ రంగం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. అప్పట్లోనే నా స్నేహితుల్లో కొంత మంది అందమైన యువతీ యువకులు మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం నాకు ఉపకరించింది. మోడల్స్‌కి పోర్ట్ ఫోలియోలు తయారు చేసే ఫొటోగ్రాఫర్‌గా నగరంలో పేరొచ్చేలా చేసింది’ అని చెప్పిన రాజేష్... ప్రస్తుత సిటీ టాప్ మోడల్స్ చాలా మందికి తొలి దశలో ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్‌గా ఘనత దక్కించుకున్నాడు. మోడల్స్ షూట్స్‌ను అనుసరిస్తూ కొన్నేళ్లలోనే యాడ్ షూట్స్ అవకాశాలు రాజేష్‌ని వెతుక్కుంటూ వచ్చాయి. నగరంలో పేరొందిన బ్రాండ్స్ తమ ప్రకటనల కోసం అవసరమైన ఫొటోలను తీసేందుకు రాజేష్‌ని ఎంచుకున్నాయి. ‘తొలి రోజుల్లో నా ఫొటోలు పెద్ద పెద్ద హోర్డింగ్స్ మీద కనబడుతున్నప్పుడు పొందిన ఆనందం, అవి మా పేరెంట్స్‌కి బంధు మిత్రులకి చూపించి మురిసిపోయిన సంతోషం ఇప్పటికీ మరచిపోలేను’అంటాడు రాజేష్. యాడ్ ఫిలిం మేకర్‌గా.. ఫొటోగ్రాఫర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఏడెనిమిదేళ్ల తర్వాత... తొలి యాడ్ ఫిలిం అవకాశం రాజేష్‌కు లభించింది. దానికి ప్రశంసలు రావడంతో అతనికి అక్కడి నుంచి వెనుదిరిగి చూసే అవసరం లేకుండా పోయింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి పాన్ అమెరికా బ్రాండ్ వరకూ, భారతి సిమెంట్, చెన్నై సిల్క్స్, కళామందిర్, నీరూస్... వంటి అందరికీ తెలిసినవే కాకుండా అనేక ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు సైతం వర్క్ చేశాడు రాజేష్. ‘తొలుత సిటీలోని వెస్ట్ మారేడ్‌పల్లి, యూసఫ్గూడల్లో స్టూడియో నిర్వహించాను. పెద్ద బ్రాండ్స్ వర్క్ ఎక్కువ కావడంతో అడ్వర్టయిజింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ముంబయిలోనూ మా ఎస్ఎల్ఎన్ స్టూడియో మెయిన్ ఆఫీస్‌ను పదేళ్ల క్రితం ప్రారంభించాం. ఇప్పటికి 50 వరకు యాడ్ కమర్షియల్స్ రూపొందించాం. ఇండియా, ఇంటర్నేషనల్ స్థాయిలో దాదాపు 100 మంది మోడల్స్‌ని నా కెమెరా షూట్ చేసింది. మా ప్రొడక్షన్ హౌజ్‌లో సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్, డెరైక్టర్స్, విఎఫ్ఎక్స్-ఆర్టిస్ట్స్... ఇలా రెగ్యులర్‌గా 15 మంది.. వర్క్ ఉన్నప్పుడు ఒక్కోసారి 100 మంది వరకూ నా ఆధ్వర్యంలో పనిచేస్తుంటారు. టీవీ కమర్షియల్స్, కార్పొరేట్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోస్...6 వంటివన్నీ రూపొందించగల సత్తా మా టీమ్‌కు ఉంది’ అంటూ సగర్వంగా చెప్పాడు రాజేష్. పరిసరాలే పాఠ్యాంశాలుగా, అందివచ్చిన అవకాశమే పరీక్షగా, అనుభవమే శిక్షణగా ఒక్కో మెట్టు ఎక్కుతోన్న ఈ సిటీ ఫొటోగ్రాఫర్.. ఏనాటికైనా భారీ బడ్జెట్‌తో రూపొందే బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించడమే తన జీవితాశయం అంటున్నాడు. తోటి నగరవాసులమై అతడి ఆశ నెరవేరాలని కోరుకోకుండా ఎలా ఉంటాం.. ఆల్ ది బెస్ట్ టూ యూ రాజేష్. -
ఇంటికి న్యూ లుక్
అందమైన ఇల్లు అంటే అందరికీ ఇష్టమే. లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ నిర్మించినా ఇంటిలో సరైన ఫర్నిచర్ లేకుంటే అసంతృప్తే. ఏదో మిస్ అయ్యామన్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ప్రతి ఇంటికీ అందాన్నే కాదు... సౌకర్యాన్నీ అందించే ఫర్నిచర్‌ను అందించేందుకు నగరంలో బడాబడా షోరూమ్‌లు వెలుస్తున్నాయి.డిఫరెంట్ మోడల్స్, క్వాలిటీ, మన్నిక, ధరతో పాటు నయా లుక్ కూడా ఉండాలి. ఇదే ఇప్పుడు నగరవాసుల ప్రాధాన్యమంటున్నారు ఫర్నిచర్ వ్యాపారులు. ఇటువంటి వారికోసం విదేశాల నుంచి ప్రత్యేక డిజైన్ల ఫర్నిచర్‌ను విక్రయిస్తోంది నగరానికి చెందిన ‘బాంటియా ఫర్నిచర్’. 65 ఏళ్లుగా హైదరాబాదీల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఫర్నిచర్లో నయా మోడల్లను అందిస్తూ వస్తోంది ఈ షాపు. సికింద్రాబాద్‌లోని సిఖ్‌విలేజ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న బాంటియా ఫర్నిచర్... కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, జూబ్లీహిల్స్, కొంపల్లి, అత్తాపూర్‌లలో కూడా అవుట్లెట్లు తెరిచింది. కస్టమర్లు తమపై ఉంచిన విశ్వాసంవల్లే ఈ స్థాయికి చేరుకోగలిగామని బాంటియా ఫర్నిచర్ మేనేజింగ్ డెరైక్టర్ సురేందర్ బాంటియా తెలిపారు. ‘కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నాణ్యతను పాటిస్తున్నాం. సరసమైన ధరలకు ఫర్నిచర్ అందుబాటులో ఉంచుతున్నాం. 90 శాతం మంది నగరవాసులు రెడీమేడ్ ఫర్నిచర్‌కే ఓటేస్తున్నారు. త్వరలో సికింద్రాబాద్ షాపును 90 వేల చదరవు అడుగులకు విస్తరిస్తున్నాం’ అని బాంటియా చెప్పారు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్... ‘విదేశాల నుంచి దిగుమతి అయిన సోఫాలు, డైనింగ్ టేబుల్లు, సెంటర్ టేబుల్స్, బెడ్స్, రీక్లయినర్స్, మాట్రిస్సెస్, షూ రాక్స్, టీవీ యూనిట్స్, ఆఫీసు టేబుల్స్, ఎగ్జిక్యూటివ్ చైర్స్కు మంచి డిమాండ్ ఉంది. టీక్వుడ్, రబ్బర్‌వుడ్, ఎండీఎఫ్, స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్, గ్లాస్, మార్బల్‌తో తయారైన ఫోర్ సీటర్స్ నుంచి టెన్ సీటర్స్ వరకు డైనింగ్ టేబుల్లు రూ.4 వేలు నుంచి 1.5 లక్షల విలువ చేసే బెడ్స్ ఉన్నాయి. కస్టమర్ల కోరిక మేరకు ఫర్నిచర్‌ను సులభ వాయిదాల్లో కూడా అందజేస్తున్నాం. 040-2784562/63/65 ఫోన్ నంబర్లలో మమ్మల్ని సంప్రదించవచ్చు’ అన్నారు బాంటియా. - వీఎస్