'హెచ్సీయూ ఘటనపై కేసీఆర్ ఎందుకు స్పందించరు' | 'why kcr silent on hcu incident' questioned batti vikramarka | Sakshi
Sakshi News home page

'హెచ్సీయూ ఘటనపై కేసీఆర్ ఎందుకు స్పందించరు'

Published Thu, Jan 21 2016 2:56 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'why kcr silent on hcu incident' questioned batti vikramarka

హైదరాబాద్: ఓ వైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) అట్టుడుకుతోంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రశ్నించారు. సీఎం వైఖరి రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారికి వత్తాసు పలుకుతున్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు.

మిషన్ భగీరథ అద్భుతమని ఇటీవల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించడంపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్టులో జరుగుతున్న వేలకోట్ల రూపాయల అవినీతిని కూడా పరిశీలించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు అంచనాలను ఉన్నతమైన సాంకేతిక సంస్థలతో సమీక్షించి, అవినీతి లేదని నిర్ధారించుకున్న తర్వాతే నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement