'సైలెంట్'గా రామ్గోపాల్ వర్మ సినిమా | Ramgopal varam next movie silent with raj tarun | Sakshi
Sakshi News home page

'సైలెంట్'గా రామ్గోపాల్ వర్మ సినిమా

Published Sun, Oct 25 2015 8:37 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

'సైలెంట్'గా రామ్గోపాల్ వర్మ సినిమా

'సైలెంట్'గా రామ్గోపాల్ వర్మ సినిమా

హిట్ ఫ్లాప్లతో సంబందం లేకుండా తనకు నచ్చినట్టుగా సినిమాలు తీసుకుంటూ వెళుతున్న రామ్గోపాల్ వర్మ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు మాఫియా, ఫ్యాక్షన్, హర్రర్ సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్న ఈ క్రియేటివ్ జీనియస్, త్వరలో ఓ మూకీ సినిమా తీయనున్నాడట. ఇప్పటికే ఈ సినిమా సంబందించిన వర్క్ కూడా మొదలెట్టేశాడన్న టాక్ వినిపిస్తోంది.

గతంలో కమల్హాసన్, సింగీతం శ్రీనివాస్ల కాంబినేషన్లో వచ్చిన 'పుష్పక విమానం' తరహాలోనే ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు వర్మ. అయితే ఇటీవల కాలం తన సినిమా కంటెంట్ విషయంలో పెద్దగా క్వాలిటీ చూపించలేకపోతున్న వర్మ, ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో అని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ లాంటి వరుస హిట్స్తో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్, ఈ సినిమాలో హీరోగా నటించే చాన్స్ ఉందంటున్నారు. మూకీ సినిమా కావటంతో పాటు వర్మ సినిమా అంటే తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి రాజ్ తరుణ్ కూడా ఈ సినిమాలో చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాకు 'సైలెంట్' అనే టైటిల్ ను ఫైనల్ చేశాడు వర్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement