ramgopal varam
-
వ్యూహం మూవీ ట్రైలర్ విడుదల
-
పప్పులాంటి అబ్బాయి...
ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను తీయడంలో దర్శక–నిర్మాత రాంగోపాల్ వర్మకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన అందిస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ‘‘ఫ్యాక్షనిజం, రౌడీయిజం, రాజకీయ నేపథ్యాల్లో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన మా సినిమా ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది. ఆదివారం విడుదల చేసిన ‘పప్పులాంటి అబ్బాయి..’ పాట మంచి ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రంలో మొత్తం ఏడు పాటలున్నాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ. -
రామ్‌గోపాల్ వర్మను అరెస్ట్ చేయండి
సాక్షి, అనంతపురం: ప్రశాంతంగా ఉన్న రాయలసీమను ‘ఫ్యాక్షన్’ ప్రాంతంగా చిత్రీకరిస్తూ ‘కడప’ టైటిల్‌తో వెబ్ సిరీస్‌ను తీసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలని రాయలసీమ విమోచన సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సమితి కన్వీనర్ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ‘కడప’ వెబ్ సిరీస్‌ను వదిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘ఫ్యాక్షన్’ ఉన్నట్లు చూపడం ద్వారా రాయలసీమకు పెట్టుబడులు ఆగి అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్మపై కోర్టులో పిల్ కూడా వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘం నాయకులు భార్గవ, భాస్కర్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు. -
నాగ్‌తో సరేన్
హీరోయిన్ అనుష్కను సెలక్ట్ చేశారట. కాదు... హీరోయిన్గా స్నేహా ఆల్మోస్ట్ కన్ఫార్మ్! కాదు.. కాదు... వేరే సీనియర్ హీరోయిన్ ఆల్రెడీ సైన్ కూడా చేసేశారట. ఇదిగో.. ఇలాంటి చర్చలే నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఫిమేల్ లీడ్ గురించి జరిగాయి. ఆ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెట్టారు రామ్‌గోపాల్ వర్మ. ‘‘నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్న విషయంపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవన్నీ తప్పు. హీరోయిన్గా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి. తన పేరు మైరా సరీన్’’ అని పేర్కొన్నారాయన. అంతేకాదు మైరా సరీన్ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే మైరా సరీన్ గురించి ‘సాక్షి’ రామ్‌గోపాల్ వర్మను సంప్రదించినప్పుడు ‘‘సరీన్ ఇప్పటివరకు నటించలేదు. నటనకు కొత్త. తనకిదే ఫస్ట్ సినిమా’’ అని చెప్పారాయన. నాగ్‌తో సినిమా.. పైగా వర్మలాంటి సెన్సేషనల్ డైరెక్టర్.. అడగ్గానే ఎగిరి గంతేసి, మైరా సరీన్... ‘సరేన్’ అని ఉంటారని ఊహించవచ్చు. -
వర్మ వెనక్కి తగ్గాడు
ఎవరేం అనుకున్నా తను అనుకున్నది చేసుకుంటూ పోయే రాంగోపాల్ వర్మ, వంగవీటి సినిమా విషయంలో వెనక్కి తగ్గక తప్పలేదు. విజయవాడ రౌడీయిజం, రాజకీయాల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా వంగవీటి. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తున్నారు. అంతే కాదు సినిమా మొదలైన సమయంలోనే కమ్మ కాపు అంటూ రిలీజ్ చేసిన సాంగ్ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో విజయవాడ చరిత్రను వక్రీకరించారంటూ కొంత మంది కోర్టును ఆశ్రయించారు. విజయవాడలో ముఖ్యంగా కుల విద్వేశాలను రెచ్చగొట్టేవిధంగా ఉన్న కమ్మ కాపు పాటను సినిమాను నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు చిత్ర దర్శకుడు రాం గోపాల్ వర్మ తో పాటు, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వరాదని సెన్సార్ బోర్డ్ ను ఆదేశించింది. డిసెంబర్ 23న ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్న చిత్రయూనిట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వివాదాన్ని మరింత పెంచుకోవటం కరెక్ట్ కాదని భావించి వెనక్కు తగ్గింది. వివాదానికి కారణమైన పాటను సినిమా నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో అనుకున్నట్టుగా రాంగోపాల్ వర్మ వంగవీటి డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ శనివారం ఈ చిత్ర ఆడియోను విజయవాడలోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు వర్మ. -
'సైలెంట్'గా రామ్‌గోపాల్ వర్మ సినిమా
హిట్ ఫ్లాప్‌లతో సంబందం లేకుండా తనకు నచ్చినట్టుగా సినిమాలు తీసుకుంటూ వెళుతున్న రామ్‌గోపాల్ వర్మ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు మాఫియా, ఫ్యాక్షన్, హర్రర్ సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్న ఈ క్రియేటివ్ జీనియస్, త్వరలో ఓ మూకీ సినిమా తీయనున్నాడట. ఇప్పటికే ఈ సినిమా సంబందించిన వర్క్ కూడా మొదలెట్టేశాడన్న టాక్ వినిపిస్తోంది. గతంలో కమల్‌హాసన్, సింగీతం శ్రీనివాస్‌ల కాంబినేషన్లో వచ్చిన 'పుష్పక విమానం' తరహాలోనే ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు వర్మ. అయితే ఇటీవల కాలం తన సినిమా కంటెంట్ విషయంలో పెద్దగా క్వాలిటీ చూపించలేకపోతున్న వర్మ, ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో అని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ లాంటి వరుస హిట్స్‌తో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్, ఈ సినిమాలో హీరోగా నటించే చాన్స్ ఉందంటున్నారు. మూకీ సినిమా కావటంతో పాటు వర్మ సినిమా అంటే తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి రాజ్ తరుణ్ కూడా ఈ సినిమాలో చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాకు 'సైలెంట్' అనే టైటిల్ ను ఫైనల్ చేశాడు వర్మ. -
ఎటాక్ ట్రైలర్ విడుదల
మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఎటాక్'. ఈ సినిమా చాలా కాలం క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్న మనోజ్ పెళ్లి తో పాటు ఇతర కారణాల వల్లవాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మనోజ్ తో పాటు జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్, అభిమన్యూ సింగ్ లు ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ట్రైలర్ తో పాటు ఈ సినిమా రిలీజ్ ను కూడా అనౌన్స్ చేశాడు వర్మ. నవంబర్ మొదటి వారంలో 'ఎటాక్' సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. గతంలో అనంతపురం ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో 'రక్త చరిత్ర' సీరీస్ ను తెరకెక్కించిన వర్మ. ఆ సినిమాలో కేవలం ఒక్క సీన్ లో కనిపించిన బుక్కా రెడ్డి హత్యను పూర్తి స్థాయి సినిమాగా ఎటాక్ పేరుతో వర్మ వెండి తెరపై తెరకెక్కించాడు. -
అమీర్‌పేట బస్తీలను దత్తత తీసుకుంటారా..?
సినిమాలతోనే కాదు తన ట్విట్టర్ కామెంట్లతో కూడా సంచలనాలు సృష్టించే రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెరతీశాడు. శ్రీమంతుడు సినిమా ప్రేరణతో గ్రామాలను దత్తత తీసుకుంటున్న సినీతారలను టార్గెట్ చేస్తూ తన మార్క్ కామెంట్స్ చేశాడు. గ్రామాలను దత్తత తీసుకోవటం అంటే వారిని అవమానించటమే అంటూ కొత్త లాజిక్‌ను తెర మీదకు తీసుకొచ్చాడు. వర్మ చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి... 'సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకోవటం అంటే వారిని అవమానించటమే, ఆత్మగౌరవం ఉన్న ఏ గ్రామస్థులూ ఈ దత్తతను అంగీకరించరు. ఏ హాలీవుడ్ నటుడైనా భారత్‌ను వెనుకబడిన దేశం అంటూ దత్తత తీసుకోవడానికి ముందుకొస్తే అది ఎంత అవమానకరంగా ఉంటుంది. దత్తత తీసుకోవడానికి గ్రామాలేమైనా వికలాంగులా, అనాథలా.? ఆత్మాభిమానం ఉన్న గ్రామస్థులు ఈ చర్యలను వ్యతిరేకించాలి. గ్రామాలే దేశానికి బలం అని చెప్పేవారు. అలాంటి గ్రామాలు ఒకరి దయ, జాలితో బతుకుతున్నాయని అవమానించటం ఏంటి..? మామూలు తారలే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటుంటే, పెద్ద హీరోలు ఎన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలి..? గ్రామాలు గౌరవప్రదంగా ఎదిగి నగరాలుగా మారాలి. దత్తత తీసుకోవటం అనే సాంప్రదాయం వల్ల మరోసారి రాజరిక వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. దత్తత తీసుకున్న గ్రామాలకు తమను తాము వాళ్లు మహారాజులుగా భావిస్తారు. ఏ సెలబ్రిటీ అయినా హైదరాబాద్‌లో అమీర్‌పేట వెనుక ఉన్న బస్తీలను దత్తత తీసుకోవడానికి ముందుకొస్తారా..? ఇక్కడ గ్రామాల్లో ఉన్నవారి కంటే నిరుపేదలు ఉన్నారు. గ్రామాల్లో కనీసం పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి ఉన్నాయి. ఇక్కడి ప్రజలకు అవి కూడా లేవు. ఈ బస్తీలను ఎవరు దత్తత తీసుకుంటారు. గ్రామాలను దత్తత తీసుకున్నామని చెప్పుకోవటం అందంగా ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అంతేకానీ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేంత మంచి హృదయం మన తారలకు ఉందని నేను అనుకోవటం లేదు' అంటూ ఘూటుగా విమర్శించాడు వర్మ. వర్మ చేస్తూ ఈ కామెంట్స్‌ను ఫిలిం సెలబ్రిటీస్ పెద్దగా పట్టించుకోకపోయినా అభిమానులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. I find this whole thing of celebs adopting villages very insulting to villages..No self respecting village will allow itself to be adopted — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Imagine how insulting we will feel if a Hollywood star would want to adopt india reminding us that we are an under developed country — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Do People who adopt think villages are orphans or beggars or handicapped or what? If villages have any self respect they should protest — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Any village who is willing to be adopted is actually admitting that its depending on left over morsels thrown at it by the rich and famous — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 They say villages are the strength of the country and then they insult them by telling the whole world the villages live on their mercy — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 If Normal stars also are adopting a village should very powerful stars adopt many many many villages ? — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 I think it's a conspiracy of government to incite the rich and the famous to adopt villages so that it itself doesn't need to do anything — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Villages should try to become cities and not depend on charity of people who adopt them ..Then only they will respectfully develop — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Adoptation will lead to kingdom culture as celeb who adopted village wil think himself as king of village bcos village depended on his mercy — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Celebrities adopting villages is primarily about satisfying their alter ego in bragging to others that the village depends on their mercy — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 I wonder if any celebrity will adopt the back lanes of Ameerpet in Hyderabad.I think there are more poor people there than in many villages — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Villages atleast have so called green fields and supposedly pure air ..Dirty back lanes in cities don't have that too ..who will adopt them? — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Celebs will prefer villages to adopt because villages sound nicely exotic and poetic and Dhoolpet sounds dirty — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 I don't think any celeb will have a heart enough to adopt the people living along side the dirtiest place on the planet ..The Musi River — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Rich people are individuals and poor people are only a number and rich people adopt poor people to see that they forever remain a number — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Poor villagers if they have self respect should rebel against the charity giving rich people and work hard to become rich people themselves — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015