అమీర్పేట బస్తీలను దత్తత తీసుకుంటారా..? | ramgopal varma comments on village adoptation | Sakshi
Sakshi News home page

అమీర్పేట బస్తీలను దత్తత తీసుకుంటారా..?

Published Tue, Sep 22 2015 9:18 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

అమీర్పేట బస్తీలను దత్తత తీసుకుంటారా..? - Sakshi

అమీర్పేట బస్తీలను దత్తత తీసుకుంటారా..?


సినిమాలతోనే కాదు తన ట్విట్టర్ కామెంట్లతో కూడా సంచలనాలు సృష్టించే రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెరతీశాడు. శ్రీమంతుడు సినిమా ప్రేరణతో గ్రామాలను దత్తత తీసుకుంటున్న సినీతారలను టార్గెట్ చేస్తూ తన మార్క్ కామెంట్స్ చేశాడు. గ్రామాలను దత్తత తీసుకోవటం అంటే వారిని అవమానించటమే అంటూ కొత్త లాజిక్ను తెర మీదకు తీసుకొచ్చాడు. వర్మ చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి...

'సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకోవటం అంటే వారిని అవమానించటమే, ఆత్మగౌరవం ఉన్న ఏ గ్రామస్థులూ ఈ దత్తతను అంగీకరించరు. ఏ హాలీవుడ్ నటుడైనా భారత్ను వెనుకబడిన దేశం అంటూ దత్తత తీసుకోవడానికి ముందుకొస్తే అది ఎంత అవమానకరంగా ఉంటుంది. దత్తత తీసుకోవడానికి గ్రామాలేమైనా వికలాంగులా, అనాథలా.? ఆత్మాభిమానం ఉన్న గ్రామస్థులు ఈ చర్యలను వ్యతిరేకించాలి.

గ్రామాలే దేశానికి బలం అని చెప్పేవారు. అలాంటి గ్రామాలు ఒకరి దయ, జాలితో బతుకుతున్నాయని అవమానించటం ఏంటి..? మామూలు తారలే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటుంటే, పెద్ద హీరోలు ఎన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలి..? గ్రామాలు గౌరవప్రదంగా ఎదిగి నగరాలుగా మారాలి. దత్తత తీసుకోవటం అనే సాంప్రదాయం వల్ల మరోసారి రాజరిక వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. దత్తత తీసుకున్న గ్రామాలకు తమను తాము వాళ్లు మహారాజులుగా భావిస్తారు.

ఏ సెలబ్రిటీ అయినా హైదరాబాద్లో అమీర్పేట వెనుక ఉన్న బస్తీలను దత్తత తీసుకోవడానికి ముందుకొస్తారా..? ఇక్కడ గ్రామాల్లో ఉన్నవారి కంటే నిరుపేదలు ఉన్నారు. గ్రామాల్లో కనీసం పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి ఉన్నాయి. ఇక్కడి ప్రజలకు అవి కూడా లేవు. ఈ బస్తీలను ఎవరు దత్తత తీసుకుంటారు. గ్రామాలను దత్తత తీసుకున్నామని చెప్పుకోవటం అందంగా ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అంతేకానీ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేంత మంచి హృదయం మన తారలకు ఉందని నేను అనుకోవటం లేదు' అంటూ ఘూటుగా విమర్శించాడు వర్మ. వర్మ చేస్తూ ఈ కామెంట్స్ను ఫిలిం సెలబ్రిటీస్ పెద్దగా పట్టించుకోకపోయినా అభిమానులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement