రామ్‌గోపాల్‌ వర్మను అరెస్ట్‌ చేయండి | rayalaseema leaders demands to arrest the ram gopal varma | Sakshi
Sakshi News home page

రామ్‌గోపాల్‌ వర్మను అరెస్ట్‌ చేయండి

Published Sun, Dec 17 2017 7:31 PM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

rayalaseema leaders demands to arrest the ram gopal varma - Sakshi

సాక్షి, అనంతపురం‌: ప్రశాంతంగా ఉన్న రాయలసీమను ‘ఫ్యాక‌్షన్‌’  ప్రాంతంగా చిత్రీకరిస్తూ ‘కడప’ టైటిల్‌తో వెబ్‌ సిరీస్‌ను తీసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను అరెస్ట్‌ చేయాలని రాయలసీమ విమోచన సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం అనంతపురం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆర్ట్స్‌ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 

సమితి కన్వీనర్‌ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ‘కడప’ వెబ్‌ సిరీస్‌ను వదిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘ఫ్యాక‌్షన్‌’ ఉన్నట్లు చూపడం ద్వారా రాయలసీమకు పెట్టుబడులు ఆగి అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్మపై కోర్టులో పిల్‌ కూడా వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘం నాయకులు భార్గవ, భాస్కర్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement