కడప దర్గాను సందర్శించిన రామ్‌చరణ్‌ | Ram Charan Visited Ameen Peer Dargah In Kadapa, Photo Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Ram Charan: కడప దర్గాను దర్శించుకున్న రామ్‌చరణ్‌.. మాట నిలబెట్టుకోవడం కోసం!

Published Mon, Nov 18 2024 8:36 PM | Last Updated on Tue, Nov 19 2024 8:59 AM

Ram Charan Visited Ameen Peer Dargah in Kadapa

ప్రముఖ హీరో రామ్‌చరణ్‌ కడప అమీన్‌పీర్‌ దర్గాను సందర్శించాడు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆయన సోమవారం నాడు పెద్ద దర్గాను దర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాడు. అలాగే ముషాయిరా (కవి సమ్మేళనం) కార్యక్రమంలోనూ ముఖ్య అతిథిగా పాల్గొననున్నాడు.

ఇకపోతే కడప పెద్ద దర్గా ఉత్సవాలకు సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ క్రమం తప్పకుండా వెళ్తుంటారు. ఈ ఏడాది జరిగే 80వ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌లో ఏఆర్‌ రెహమాన్‌ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారట! దీనికి చరణ్‌ను ఆహ్వానించగా తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చినట్లు సమాచారం. ఈ మాట నిలబెట్టుకోవడానికే చరణ్‌ నేడు కడపకు వెళ్లినట్లు తెలుస్తోంది.

చరణ్‌ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరగా ఆచార్యలో కీలక పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement