
సింధులోయ నాగరికతలో బంగారాన్ని ఆభరణాలుగానే కాకుండా వ్యాపారం కోసం ఉపయోగించారు. అందుకే సింధు ప్రజలు బంగారాన్ని అపురూపమైనదిగా కాకుండా నిరంతర వస్తువుగానే చూసేవారు. ఇకపోతే హీరోయిన్ కియారా అద్వాణీ కూడా సింధి అమ్మాయే!

నోటితో మాట్లాడకుండా తాను సింధి అమ్మాయినని ఎలా చెప్తానో చూడు అంటూ కియారా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఆమె వాష్‌రూమ్‌లో అద్దం ముందు బ్రష్ పట్టుకుని ఉంది. అది మామూలు బ్రష్ కాదు, బంగారపు టూత్ బ్రష్. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

'బ్రష్ చూస్తుంటే తోముకున్నట్లే లేదు.. అది ఊరికే షో ఆఫ్‌కేనా?', 'మూడునెలలకోసారి బ్రష్ మార్చాలంటారు.. మరి ఈ గోల్డ్ బ్రష్‌ను నువ్వు మారుస్తావా? లేదా ఏళ్లతరబడి ఇదే వాడుతున్నావా?' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కియారా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
చదవండి: దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్'
Comments
Please login to add a commentAdd a comment