ఎటాక్ ట్రైలర్ విడుదల | ramgopal varam released attack second official trailer | Sakshi
Sakshi News home page

ఎటాక్ ట్రైలర్ విడుదల

Published Wed, Oct 7 2015 2:34 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

ఎటాక్ ట్రైలర్ విడుదల

ఎటాక్ ట్రైలర్ విడుదల

మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఎటాక్'. ఈ సినిమా చాలా కాలం క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్న మనోజ్ పెళ్లి తో పాటు ఇతర కారణాల వల్లవాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో అఫీషియల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు.

మనోజ్ తో పాటు జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్, అభిమన్యూ సింగ్ లు ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ట్రైలర్ తో పాటు ఈ సినిమా రిలీజ్ ను కూడా అనౌన్స్ చేశాడు వర్మ. నవంబర్ మొదటి వారంలో 'ఎటాక్' సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

గతంలో అనంతపురం ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో 'రక్త చరిత్ర' సీరీస్ ను తెరకెక్కించిన వర్మ. ఆ సినిమాలో కేవలం ఒక్క సీన్ లో కనిపించిన బుక్కా రెడ్డి హత్యను పూర్తి స్థాయి సినిమాగా ఎటాక్ పేరుతో వర్మ వెండి తెరపై తెరకెక్కించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement