raktha charithra
-
ఆ సినిమాతో రూ. 40 వేలు కాస్త రూ. 40 లక్షలు అయింది: అభిమన్యు
‘గబ్బర్‌సింగ్’ సినిమాలో సిద్దప్పనాయుడిగా అభిమన్యు సింగ్ భయపెట్టాడు. భయపెడుతూ భయపెడుతూనే... నవ్వకుండానే నవ్వించాడు. అలా ఆయనకు తెలుగులో భారీగా ఛాన్సులు దక్కించుకున్నాడు. రామ్‌గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ సినిమాతో ఆయన టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. అందులో బుక్కారెడ్డిగా వణుకు పుట్టించాడు. ‘రక్తచరిత్రలో’ బుక్కారెడ్డి పాత్రను భయంకరంగా పండించి ‘ఉత్తమ విలన్’ అని అభిమన్యు నిరూపించకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.. తన రెమ్యునరేషన్‌తో పాటు పలు విషయాలను పంచుకున్నాడు.2001లోనే అభిమన్యు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, 2010లో ఆర్జీవీ తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమాతోనే ఆయనకు గుర్తింపు వచ్చింది. రక్తచరిత్రలో ఆయన పాత్ర చాలా ఇంపాక్ట్ చూపుతుంది. సినిమా చూసే వారిలో భయాన్ని నెలకొలుపుతుంది. అలా తన నటనతో దుమ్మురేపాడు. ఆపై 2017లో అతను ఏకంగా శ్రీదేవితో కలిసి మామ్ చిత్రంలో నటించాడు. హిందీ చిత్రాలలో కనిపించడమే కాకుండా, ఆయన తమిళం, తెలుగు భాషా చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం పవన్ ఓజీలో చాలా కీలక పాత్రలో అభిమన్యు ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.మొదటి రెమ్యునరేషన్'నేను నటించిన మొదటి సినిమా (అక్స్) కోసం తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 12 వేలు మాత్రమే. చాలా ఏళ్ల పాటు ఒక సినిమాకు రూ. 20 వేల లోపే ఇచ్చేవారు. కానీ, రక్తచరిత్ర సినిమాకు రూ. 40 వేలు ఇచ్చారు. ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీలో నటించాను కాబట్టే పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్‌లో ఛాన్స్ వచ్చింది. నేను డబ్బును నమ్ముకోలేదు. అందువల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వచ్చాను. గబ్బర్ సింగ్ కోసం రూ. 40 లక్షలు ఇచ్చారు. దీంతో లైఫ్ మొత్తం మారిపోయింది. అలా 2010లో తొలిసారి ఎక్కిన కార్వాన్ 2025 వచ్చినా సరే నేను ఇంకా దిగలేదు. ఆ రెండు సినిమాలు నా జీవితంలో అంతలా ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఓజీలో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాను. ఇప్పుడు కూడా మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు.' అని తెలిపాడు.చీపురుతో ఫ్లోర్లు ఊడ్చేవాడుఅభిమన్యుసింగ్ స్వస్థలం బిహార్‌రాజధాని పట్నా. ‘బాలీవుడ్’ కలలతో ముంబైకి చేరుకున్నాడు. నిర్మాతల ఆఫీసుల చుట్టూ బొంగరంలా తిరిగాడు. కొంచెం కూడా ఫలితం కనిపించలేదు. ‘థియేటర్’ రూట్ నుంచి వెళితే...ప్రయాణం కాస్త సులువవుతుంది అనుకొని మకరంద్ దేశ్‌పాండే థియేటర్ గ్రూప్ ‘అంశ్’లో చేరాడు. ‘‘నటన అంటే ఇదీ’’ అని చెప్పలేదు మకరంద్. ‘‘చీపురు అంటే ఇదీ’’ అన్నట్లుగా మూలకు ఉన్న చీపురును అభిమన్యుకు చూపి...ఫ్లోర్ ఊడ్చమన్నాడు. ‘నేను వచ్చింది నటన నేర్చుకోవడం కోసం. ఊడ్చడం కోసం కాదు’ అభిమన్యులో కోపం కెరటమై లేచింది. అయితే నటన మీద ప్రేమ... ఆ కోపాగ్నిపై నీళ్లు చల్లింది. అలా....చీపురుతో ఫ్లోర్ ఊడ్చాడు అభిమన్యు. ‘ఇగో మెల్టింగ్’ పూర్తయ్యాక... అభిమన్యుకు నటనలో ఓనమాలు దిద్దించాడు మకరంద్. ‘అంశ్’ థియేటర్ గ్రూప్‌లో కె.కె. మీనన్, అనురాగ్ కశ్యప్‌లు అభిమన్యుకు సీనియర్లు. ‘బాగా నటిస్తున్నాడు’ అని పేరైతే వచ్చిందిగానీ... సినిమాల్లో అవకాశాలేవీ రావడం లేదు. తన రూమ్‌లో ఒంటరిగా ఏడ్చిన రోజులెన్నో ఉన్నాయి. పట్నాలో ఉన్నప్పుడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది. కట్ చేస్తే... రాకేష్ మెహ్ర ‘అక్స్’లో పోలీస్ పాత్ర పోషించే అవకాశం దక్కింది. అలా ‘రక్తచరిత్ర’తో దక్షిణాది సినిమాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. చెడు పాత్రలను ‘ఎంత మంచిగా చేశాడు’ అనిపించుకోవడం అంత తేలికేమీకాదు... అందుకే అభిమన్యు సింగ్ ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు. -
నయీం పోస్టర్‌ను ట్వీట్ చేసిన వర్మ!
దేశంలోని సంచలన సంఘటనలు, నేరచరితులపై సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా వెండితెరపై మరో రియల్ క్రైం స్టోరీని వండివారుస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అనంతపురం ఫ్యాక్షన్ ముఠాకక్షల నేపథ్యంలో ’రక్తచరిత్ర’, ’రక్తచరిత్ర-2’ సినిమాలను వర్మ తెరకెక్కించాడు. అలాగే, ముంబై మాఫియా నేపథ్యంతో ’సత్య’ వంటి సంచలన చిత్రాన్ని అందించాడు. ఇప్పుడు హైదరాబాద్ వేదిక తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన కిరాతక డాన్ నయీం కథతో సినిమా తీస్తానని ప్రకటించాడు. ప్రకటన అయితే చేశాడుగానీ ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు ఎంతమేరకు కొనసాగుతున్నాయో తెలియదు. కానీ తాజాగా వర్మ తన ట్విట్టర్ పేజీలో ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను పెట్టాడు. ’నయీం’ టైటిల్‌తో పైన రాంగోపాల్ వర్మ పేరుతో రూపొందిన పోస్టర్ ఇది. ఈ పోస్టర్లో నయీంలోని కిరాతక లక్షణాలైన క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్, గూండా, గ్యాంగ్‌స్టర్ వంటి పదాలతో టైటిల్‌ను సృజనాత్మకంగా రూపొందించారు. ఇది ఎవరు రూపొందించారో తెలియదు కానీ, ఇది నచ్చడంతో తాను ట్వీట్ చేశానని వర్మ చెప్పుకొన్నారు. Someone made this very innovative design of capturing Nayeem' s deeds in his own name ..look closely at the letters pic.twitter.com/CgDXnKFIP1 — Ram Gopal Varma (@RGVzoomin) 31 August 2016 -
నయీం నేర చరిత్రపై వర్మ సినిమా
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రతీ సంఘటనను తన సినిమాకు కథా వస్తువుగా స్వీకరించే వర్మ, మరో రియల్ క్రైం స్టోరిని వెండితెర మీద ఆవిష్కరించనున్నాడు. ఇప్పటికే మాఫీయా నేపథ్యంలో పలు చిత్రాలను తెరకెక్కించిన ఈ వివాదాస్పద దర్శకుడు ఇప్పుడు హైదరాబాద్ వేదిక తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన డాన్ నయీం జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అనంతపురం ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన రక్తచరిత్ర సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించిన వర్మ ఇప్పుడు నయీం కథను మూడు భాగాలుగా రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. ' నయీముద్దీన్‌కు సంబందించిన చాలా అంశాలను తెలుసుకున్నాను. ఇన్నేళ్ల అతని నేర చరిత్ర వింటుంటూ రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి. నయీం నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా మారటం తరువాత అండర్ వరల్డ్ డాన్‌గా ఎదగటం లాంటి అంశాలు భయం కలిగిస్తాయి. ఇంత విషయం ఉన్న కథను ఒక్క సినిమాలో చెప్పటం కష్టం. అందుకే నయీం కథను మూడు భాగాలుగా తెరకెక్కిస్తా', అంటూ వర్మ ప్రకటించాడు. Just gathered entire information on Nayeemuddin from multiple sources..His crimes over the years are full of truly hair rising details — Ram Gopal Varma (@RGVzoomin) 23 August 2016 Nayeemuddin's transformation from a naxalite to a police informant to a underworld gangster to become an all time Criminal no.1 is scary — Ram Gopal Varma (@RGVzoomin) 23 August 2016 Nayeemuddin's story is so complex and with so much of content that it's impossible to justify it by telling it in only one feature film — Ram Gopal Varma (@RGVzoomin) 23 August 2016 Am going to make a 3 part film on the Nayeem story ..Rakthacharitra had only two parts..Nayeem will have 3 parts — Ram Gopal Varma (@RGVzoomin) 23 August 2016 -
ఎటాక్ ట్రైలర్ విడుదల
-
ఎటాక్ ట్రైలర్ విడుదల
మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఎటాక్'. ఈ సినిమా చాలా కాలం క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్న మనోజ్ పెళ్లి తో పాటు ఇతర కారణాల వల్లవాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మనోజ్ తో పాటు జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్, అభిమన్యూ సింగ్ లు ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ట్రైలర్ తో పాటు ఈ సినిమా రిలీజ్ ను కూడా అనౌన్స్ చేశాడు వర్మ. నవంబర్ మొదటి వారంలో 'ఎటాక్' సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. గతంలో అనంతపురం ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో 'రక్త చరిత్ర' సీరీస్ ను తెరకెక్కించిన వర్మ. ఆ సినిమాలో కేవలం ఒక్క సీన్ లో కనిపించిన బుక్కా రెడ్డి హత్యను పూర్తి స్థాయి సినిమాగా ఎటాక్ పేరుతో వర్మ వెండి తెరపై తెరకెక్కించాడు.