
నయీం పోస్టర్‌ను ట్వీట్ చేసిన వర్మ!
దేశంలోని సంచలన సంఘటనలు, నేరచరితులపై సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా వెండితెరపై మరో రియల్ క్రైం స్టోరీని వండివారుస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అనంతపురం ఫ్యాక్షన్ ముఠాకక్షల నేపథ్యంలో ’రక్తచరిత్ర’, ’రక్తచరిత్ర-2’ సినిమాలను వర్మ తెరకెక్కించాడు. అలాగే, ముంబై మాఫియా నేపథ్యంతో ’సత్య’ వంటి సంచలన చిత్రాన్ని అందించాడు.
ఇప్పుడు హైదరాబాద్ వేదిక తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన కిరాతక డాన్ నయీం కథతో సినిమా తీస్తానని ప్రకటించాడు. ప్రకటన అయితే చేశాడుగానీ ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు ఎంతమేరకు కొనసాగుతున్నాయో తెలియదు. కానీ తాజాగా వర్మ తన ట్విట్టర్ పేజీలో ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను పెట్టాడు. ’నయీం’ టైటిల్‌తో పైన రాంగోపాల్ వర్మ పేరుతో రూపొందిన పోస్టర్ ఇది. ఈ పోస్టర్‌లో నయీంలోని కిరాతక లక్షణాలైన క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్, గూండా, గ్యాంగ్‌స్టర్ వంటి పదాలతో టైటిల్‌ను సృజనాత్మకంగా రూపొందించారు. ఇది ఎవరు రూపొందించారో తెలియదు కానీ, ఇది నచ్చడంతో తాను ట్వీట్ చేశానని వర్మ చెప్పుకొన్నారు.
Someone made this very innovative design of capturing Nayeem' s deeds in his own name ..look closely at the letters pic.twitter.com/CgDXnKFIP1
— Ram Gopal Varma (@RGVzoomin) 31 August 2016