నయీం నేర చరిత్రపై వర్మ సినిమా | Varma Movie on Gangster Nayeem Crime History | Sakshi
Sakshi News home page

నయీం నేర చరిత్రపై వర్మ సినిమా

Published Tue, Aug 23 2016 12:26 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

నయీం నేర చరిత్రపై వర్మ సినిమా

నయీం నేర చరిత్రపై వర్మ సినిమా

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రతీ సంఘటనను తన సినిమాకు కథా వస్తువుగా స్వీకరించే వర్మ, మరో రియల్ క్రైం స్టోరిని వెండితెర మీద ఆవిష్కరించనున్నాడు. ఇప్పటికే మాఫీయా నేపథ్యంలో పలు చిత్రాలను తెరకెక్కించిన ఈ వివాదాస్పద దర్శకుడు ఇప్పుడు హైదరాబాద్ వేదిక తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన డాన్ నయీం జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

అనంతపురం ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన రక్తచరిత్ర సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించిన వర్మ ఇప్పుడు నయీం కథను మూడు భాగాలుగా రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. ' నయీముద్దీన్కు సంబందించిన చాలా అంశాలను తెలుసుకున్నాను. ఇన్నేళ్ల అతని నేర చరిత్ర వింటుంటూ రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి. నయీం నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా మారటం తరువాత అండర్ వరల్డ్ డాన్గా ఎదగటం లాంటి అంశాలు భయం కలిగిస్తాయి. ఇంత విషయం ఉన్న కథను ఒక్క సినిమాలో చెప్పటం కష్టం. అందుకే నయీం కథను మూడు భాగాలుగా తెరకెక్కిస్తా', అంటూ వర్మ ప్రకటించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement