ఏప్రిల్ 1న ఎటాక్ | Manchu Manoj, ramgopal varma attack releasing on april 1st | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 1న ఎటాక్

Published Tue, Mar 22 2016 10:22 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

ఏప్రిల్ 1న ఎటాక్

ఏప్రిల్ 1న ఎటాక్

మంచు మనోజ్ హీరోగా రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఎటాక్. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వివిధ కారణాలతో విడుదల వాయిదాపడుతూ వస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో ఇక వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్న నిర్మాతలు... ఏప్రిల్ 1న ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావటానికి ప్లాన్ చేస్తున్నారు.

వర్మకు బాగా పట్టున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన సినిమా కావటంతో రిలీజ్కు ముందు నుంచే ఎటాక్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ లాంటి భారీ తారాగణంతో రూపొందటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. మంచు ఫ్యామిలీతో రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రౌడీ' ఘనవిజయం సాధించటంతో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement