వర్మకు క్లాస్ తీసుకున్న కళ్యాణ్ | Ram Gopal Varma Speech at Attack Audio Launch | Sakshi
Sakshi News home page

వర్మకు క్లాస్ తీసుకున్న కళ్యాణ్

Published Wed, Mar 23 2016 11:32 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

వర్మకు క్లాస్ తీసుకున్న కళ్యాణ్

వర్మకు క్లాస్ తీసుకున్న కళ్యాణ్

మీరు చూసినా చూడకపోయినా నాకు నచ్చిందే తీస్తాననే వర్మకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందట. తను చెప్పింది వేరేవాళ్లు వినాలేగాని తను ఎవ్వరి మాట వినను అన్ని గట్టిగా చెప్పే వర్మ, ఓ నిర్మాత చెప్పిన మాటలతో పూర్తిగా మారిపోయానని చెపుతున్నాడు. తన సినిమా రిలీజ్ సమయంలో ఎదో ఒక వ్యాఖ్యతో వార్తల్లో ఉండాలని ప్రయత్నించే వర్మ తాజాగా ఎటాక్ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మంగళవారం ఎటాక్ ఆడియో రిలీజ్ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆ సినిమా డైరెక్ట్ చేయటం వెనుక కారణాలను వివరించాడు. ఐస్ క్రీం, ఐస్ క్రీం 2 సినిమాల తరువాత వర్మను కలిసిన నిర్మాత సి కళ్యాణ్, నువ్వు చేయాల్సింది ఇలాంటి సినిమాలు కాదు.., అంటూ హితోపదేశం చేశాడట. వెంటనే జ్ఞానోదయం అయిన వర్మ ఎటాక్ సినిమాను రూపొందించినట్టుగా చెప్పాడు. సాధారణంగా తాను ఎవరి మాట వినని బహిరంగంగానే చెప్పే వర్మ, సి కళ్యాణం చెప్పిన మాటలతో నేను మారాను అనటం అంత నమ్మశక్యంగా లేదంటున్నారు సినీ జనాలు.

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఎటాక్ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదల ఆలస్యం అయ్యింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ లాంటి స్టార్స్ నటించడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 1న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement